pakistan

18:08 - September 19, 2018

పాకిస్థాన్ : ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వస్తే దేశంలో భారీగా మార్పులు జరుగుతాయని నమ్మిన పాక్ ప్రజలకు ఇమ్రాన్ ఖాన్ ఝలక్ ఇచ్చాడు. దీంతో వంట గ్యాస్ సెగకు పాక్ ప్రజలు అంతకంటే ఎక్కువగా మండిపతున్నారు. పాక్ ప్రజలకు కొత్త పాకిస్థాన్ ను చూపిస్తానంటు భీరాలు పలికి ఇమ్రాన్ ఖాన్ పై ప్రజలు మండిపడుతున్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం చెబుతున్న ‘నయా పాకిస్థాన్‌’ను ఆ దేశ ప్రజలు  ప్రశ్నిస్తున్నారు. గ్యాస్‌ ధరలను ఏకంగా 143 శాతం మేర పెంచుతున్నట్లు పిడుగులాంటి నిర్ణయాన్ని సర్కారు ప్రకటించటంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వినియోగదారుల నుంచి రూ.9400 కోట్లను వసూలు చేసే చర్యలో భాగంగా ఈ చర్యను చేపట్టింది. సబ్సిడీలకు మంగళం పలికే దిశగా అడుగులు మొదలుపెట్టింది. గృహ, వాణిజ్య వినియోగదారులందరిపైనా పెంపు భారాన్ని ప్రభుత్వం మోపింది. క్యాబినెట్‌ ఆర్థిక సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి గులాం సర్వార్‌ ఖాన్‌ తాజాగా పేర్కొన్నారు. గృహ వినియోగదారుల్లోని దిగువ శ్లాబ్‌లో 10 శాతం మేర, ఎగువ శ్లాబ్‌లో 143 శాతం మేర పెంచినట్లు  వివరించారు. అక్టోబర్‌ నెల గ్యాస్‌ బిల్లుల్లో ఈ పెంపు అమల్లోకి వస్తుందన్నారు. ఈ నిర్ణయం వల్ల 94 లక్షల మంది గృహ వినియోగదారులపై పెను భారం పడుతుంది. వీరిలో 36 లక్షల మంది దిగువ ఆదాయ శ్లాబ్‌లో ఉన్నారు. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై 30 నుంచి 57 శాతం మేర వడ్డింపు జరిగింది. దీనివల్ల ఎరువులు, విద్యుదుత్పత్తి, సిమెంట్‌, సీఎన్‌జీ తదితరాల ధరలకు రెక్కలు రానున్నాయి. ప్రభుత్వ రంగ గ్యాస్‌ కంపెనీలు ఆదాయ లోటుతో నడుస్తున్నాయని మంత్రి గులాం సర్వార్‌ చెప్పారు. ప్రస్తుత ధరలను కొనసాగించడం సాధ్యం కాదన్నారు.

16:26 - September 12, 2018

ఫూణే: పాకిస్థాన్ భూభాగంలోని 15 కి.మీ అవతల భారత ఆర్మీ విజయవంతంగా పూర్తి చేసిన సర్జికల్ స్ట్రైక్ లో సైనికులు చిరుత పులుల మల, మూత్రాలను ఉపయోగించి అక్కడ ఉన్న కుక్కల దాడులనుంచి తప్పించుకున్నట్టు మాజీ సైనికాధికారి ఒకరు బుధవారం తెలిపారు. 

నగ్రొటా  కార్ప్స్ కమాండర్ గా లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్ర నిమ్ బోర్కర్ సర్జికల్ స్ట్రైక్ లో పాల్గొన్నారు. సర్జికల్ స్ట్రైక్ లో ఆయన చేసిన సేవలకు గాను పూణేలోని థొర్లే బాజీరావు పేష్వే ప్రతిష్టాన్ అనే సంస్థ రాజేంద్ర నింబోర్కర్ ను సన్మానించింది. ఆ సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషీ పాల్గొన్నారు.

నౌషేరా సెక్టార్ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కూలంకుషంగా పరిశీలించిన బ్రిగేడర్ కమాండర్ రాజేంద్ర కుక్కలను తరచూ చిరుతలు వేటాడం గమనించారు. చిరుతల దాడి నుంచి తప్పించుకోవడానికి రాత్రివేళల్లో మాత్రమే శునకాలు ఆ ప్రాంతంలో సంచరించేవి. 

సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు సైనికులు గ్రామాలు దాటి వెళ్లేందుకు కుక్కలు అరిచి గోలచేసే ప్రమాదం ఉందని గమనించి భారత సైనికులు చిరుత పులుల మల, మూత్రాలను తమతోపాటుగా తీసుకువెళ్లి.. వాటిని గ్రామ పొలిమారల్లో చల్లి కుక్కలు తమవైపు రాకుండా జాగ్రత్తపడ్డారని రాజేంద్ర చెప్పారు. ఈ ప్రయోగం చక్కటి ఫలితాలను ఇచ్చిందని కమాండర్ రాజేంద్ర వెల్లడించారు.

ఈ దాడి అత్యంత గోప్యంగా ఉంచారని.. తమకు ఒక వారం క్రితమే ఈ సమాచారం అప్పటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారిక్కర్ తెలియచేశారని రాజేంద్ర వెల్లడించారు. ఈ విషయాన్ని తమ ట్రూప్ సభ్యులకు ఒక వారం ముందుగా తెలియచేసినా.. ఏ ప్రాంతమో ఒక రోజు ముందు చెప్పినట్టు రాజేంద్ర గుర్తుచేసుకున్నారు.

15:31 - September 7, 2018

పాకిస్థాన్ : పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీని స్థాపించి పాక్ లో అధికారంలోకి వచ్చారు. కాగా పాకిస్థాన్ లో అధ్యక్షుడు ఎవరైనా..ముఖ్యమంత్రి ఎవరైనా అధికారం మాత్రం సైన్యానిదే. సైన్యం కనుసన్నల్లోని అన్నీ జరుగుతుంటారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ అధికారంలోకి వచ్చాక పాక్ విధి విధానాలు మారతాయనే అందరు ఊహించారు. కానీ సదా మామూలుగానే పాత పద్ధతిలోనే పాక్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆ దేశ సైన్యం తీరు మాత్రం మారలేదు. ఇండియాను రెచ్చగొట్టేలా పాక్ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో తమ సైనికులను చంపితే... అంతకంత ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న కశ్మీర్ ప్రజలకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు. పాకిస్థాన్ లో జరిగిన డిఫెన్స్ డే ఫంక్షన్ లో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ప్రజలకు తాము మద్దతుగా ఉంటామని చెప్పారు. కశ్మీర్ సోదరులు, సోదరీమణులు చేస్తున్న త్యాగాలు చాలా గొప్పవని అన్నారు. 

17:37 - August 20, 2018

పాకిస్తాన్‌ : ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రధాని అధికారిక నివాసంలో తాను ఉండబోనని... మిలటరీ సెక్రటరీలో ఓ మూడు పడకల గదుల ఇంట్లో ఉంటానని తెలిపారు. తన సొంత ఇల్లు బెనిగలాలోనే ఉండాలనుకున్నప్పటికీ భద్రతా కారణాల వల్ల సెక్యూరిటీ ఏజెన్సీ ఒప్పుకోవడం లేదన్నారు. ప్రధాని అధికార నివాసంలో 524 మంది పనివాళ్లు, 80 కార్లు, 33 బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లతో పాటు హెలిక్యాప్టర్లు, విమానాలు, విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దారుణమైన పరిస్థితిలో ఉన్న ప్రజలకు వెచ్చించేందుకే నిధులు లేవన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తాను కేవలం ఇద్దరు సర్వెంట్లను మాత్రమే తనతో ఉంచుకుంటానని వెల్లడించారు. ప్రధాని అధికారిక నివాసాన్ని రీసెర్చి యూనివర్సిటీగా మార్చాలని ఆయన ఆదేశించారు. దేశ వ్యాప్తంగా అనవసర ఖర్చులు తగ్గించేందుకు ఇమ్రాన్‌ ఓ కమిటీని వేశారు. గత ప్రధానులు విదేశీ పర్యటనలకు విపరీతంగా ఖర్చు చేశారని ఇమ్రాన్‌ ఆరోపించారు. 650 మిలియన్‌ డాలర్లు ఏం చేశారని ప్రశ్నించారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు వేలంలో పెడతానని వీటిని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావాలని ఆహ్వానించారు.

19:14 - August 11, 2018

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్ చీఫ్‌ ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానమంత్రిగా ఆగస్టు 18న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 14న ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా 18కి వాయిదా పడింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆహ్వానితుల జాబితాలో కొంత మార్పు చేశారు. భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్లు కపిల్‌ దేవ్‌, సునీల్‌ గవాస్కర్, నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూలకు మాత్రమే ఇమ్రాన్‌ తరపున ఆహ్వానం అందింది. పాకిస్తాన్‌కు కాబోయే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను భారత్‌ హైకమిషనర్‌ అజయ్‌ బిసారియా ఆయన ఇంట్లో కలిశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వీరివురు చర్చించారు.

07:07 - August 3, 2018

ఢిల్లీ : పాకిస్తాన్‌ ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి విదేశీ నేతలను ఆహ్వానించడం లేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహత స్నేహితులైన విదేశీ వ్యక్తులను కొందరిని మాత్రమే ఆహ్వానించినట్లు తెలిపింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా మాజీ క్రికెటర్, 65 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సార్క్ దేశాల అధినేతలతో పాటు ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం పంపుతారని వార్తలు వెలువడ్డ నేపథ్యంలో పాక్‌ విదేశాంగ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. పాక్ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేకపోవడంతో చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.

10:44 - June 13, 2018

జమ్మూకాశ్మీర్ : పాకిస్తాన్ పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సాంబా జిల్లా చంబ్లియాల్ సెక్టార్‌లో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ఐదుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులు జమ్మూకాశ్మీర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. కాల్పులను సహించేదిలేదని..ధీటైన సమాధానం చెబుతామని బీఎస్ ఎఫ్ అధికారులు నుంచి 
సమాచారం వస్తోంది. రాత్రి పదిన్నర నుంచి తెల్లవారుజామున 4.30 గంటల వరకు కాల్పులు కొనసాగినట్లు తెలుస్తోంది. 

 

08:59 - June 13, 2018

జమ్మూకాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సాంబా జిల్లా చంబ్లియాల్ సెక్టార్ లో పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు బీఎస్ ఎఫ్ జవాన్లు మృతి చెందారు, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

 

12:46 - May 29, 2018

ఢిల్లీ : పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ స్పష్టం చేశారు. తాము పాకిస్తాన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగానే ఉన్నామని... ఉగ్రవాదం, చర్చలు ఒకే ఒరలో ఇమడవని తేల్చి చెప్పారు. పాకిస్తాన్‌ సార్వత్రిక ఎన్నికల తర్వాత చర్చలు జరగాలన్నా ఉగ్రవాదాన్ని వీడాల్సిందేనని సుష్మా పేర్కొన్నారు. గిల్గిట్‌-బాల్టిస్టాన్‌ 2018 ఆర్డర్‌పై ఆమె మాట్లాడుతూ...పాకిస్తాన్‌ చరిత్రను వక్రీకరిస్తోందని...చట్టం మీద వారికి నమ్మకం లేదని మండిపడ్డారు. మోది నాలుగేళ్ల పాలనలో విదేశాంగ శాఖ సాధించిన విజయాలను సుష్మా ప్రస్తుతించారు.

 

08:57 - March 30, 2018

ఢిల్లీ : నోబెల్‌ శాంతి పురస్కార విజేత యూసుఫ్‌జాయ్ మలాలా ఆరేళ్ల తర్వాత పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు. 20 ఏళ్ల మలాలా భారీ భద్రత నడుమ తల్లిదండ్రులతో కలిసి ఇస్లామాబాద్‌ చేరుకున్నారు. పాకిస్తాన్‌ ప్రధాని షాహిద్‌ ఖాకన్‌ అబ్బాసీని మలాలా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను మళ్ళీ తన దేశానికి వస్తానని అనుకోలేదని చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ చెప్పారు. పాకిస్థాన్ సైన్యానికి, రాజకీయ నేతలకు, పాకిస్థానీలందరికీ ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. 2012లో తాలిబన్‌ ఉగ్రవాదులు దాడి తర్వాత మలాలా పాకిస్తాన్‌కు రావడం ఇదే తొలిసారి. మలాలా నాలుగు రోజుల పాటు పాకిస్తాన్‌లో పర్యటించే అవకాశం ఉంది. బాలికల విద్య కోసం పోరాడుతున్న మలాలపై 2012లో తాలిబన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మలాలా తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం లండన్‌కు వెళ్లిన మలాలా అక్కడే ఉండిపోయారు. బాలికల విద్య కోసం కృషి చేస్తున్న మలాలాకు 2014లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.

Pages

Don't Miss

Subscribe to RSS - pakistan