no confidence motion

11:42 - November 14, 2018

కొలంబో: ఇద్దరు ప్రధాన మంత్రులు పవర్ కోసం పోటీపడటంతో శ్రీలంకలో రాజకీయ కల్లోలం ప్రారంభమైంది. ప్రధాని మహీంద్ర రాజపక్సేకు వ్యతిరేకంగా పార్లమెంటులో బుధవారం (నవంబర్ 14) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి మైత్రీపాల సిరిసేనను తొలగించడాన్ని మంగళవారం తప్పుపట్టిన శ్రీలంక సుప్రీంకోర్టు అకస్మిక ఎన్నికల ఏర్పాట్లకు స్వస్తిపలకాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్లమెంటులో కొత్త ప్రధానికి వ్యతిరేకంగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 
అంతకుముందు అంటే నవంబర్ 9న సభలో హింసను నిరోధించేందుకు రాష్ట్రపతి సిరిసేన పార్లమెంటును రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దేశంలో అకస్మిక ఎన్నికలను నిర్వహించాలని సిరిసేన ప్రకటించారు. జనవరి 17న కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఆయన చెప్పారు. 
శ్రీలంకలో రాజకీయ కల్లోలం ఈ ఏడాది అక్టోబరులో మొదలైంది. రాష్ట్రపతి సిరిసేన ప్రధాని రానిల్ విక్రమసింఘేను పదవినుంచి తప్పించి అయన స్థానంలో రాజపక్సేను నియమించడంతో వివాదం రాజుకుంది. 
 

 

21:14 - July 25, 2018

ఢిల్లీ : తాను ఒకరికి దగ్గర... మరొకరికి దూరం కాదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌. రాజకీయాల్లోకి వచ్చి జీవితాలు పాడు చేసుకున్నవారే ఎక్కువ.. కానీ ఇప్పుడా పరిస్థితులు మారాయన్నారు. తెలంగాణ బిల్లు పాస్‌ అయ్యేందుకు సరిపడ సభ్యులు ఆనాడు పార్లమెంట్‌లో లేరని.. డివిజన్‌ ఉండదంటే హెడ్‌కౌంట్‌ చేయాలని,... కానీ విభజన బిల్లు సందర్బంగా అలా జరగలేదన్నారు ఉండవల్లి గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ చేసిన అన్యాయం గురించి తాను నాలుగేళ్లుగా చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వాలు తలచుకున్నది చేస్తే.. ఇక చట్టసభలు ఎందుకని ప్రశ్నించారు. ఇక జగన్‌ పవన్‌పై చేసిన వ్యాఖ్యలను ఉండవల్లి ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. 

11:24 - July 25, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలూ బుధవారం తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్ సభ..రాజ్యసభలో స్పీకర్..డిప్యూటి ఛైర్మన్ లు సమావేశాలను కొనసాగించారు. లోక్ సభలో పలువురు సభ్యులు వేసిన ప్రశ్నలకు ఆయా శాఖలకు చెందిన మంత్రులు సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే టిడిపి ఎంపీలు ఎప్పటిలాగానే నిరసనలు చేపట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేశారు. హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. రోజుకో వేషధారణలో వస్తూ ఆకట్టుకుంటున్న చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ మరో వేషధారణలో కనిపించారు. మరో వేషధారణలో ఎంపీ శివప్రసాద్...ఉయ్యాల వాడ నరసింహారెడ్డి వేషధారణలో వచ్చిన ఆయన ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. 

06:36 - July 25, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఏపి విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. బిల్లులో పేర్కొన్న హామీల్లో 90 శాతం హామీలను కేంద్రం ఇప్పటికే నెరవేర్చిందని... మిగిలినవి కూడా పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. రైల్వే జోన్‌పై ప్రతికూలంగా నివేదిక వచ్చినా జోన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకూ 6754 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్ట్‌ కోసం తొలి కేబినెట్‌ భేటీలోనే తెలంగాణకు చెందిన 7 ముంపు మండలాలను ఏపీలో కలిపడమే తమ చిత్తశుద్ధికి నిదర్శనమని హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతో సమానంగా ప్రత్యేక ప్యాకేజీకి సిఎం చంద్రబాబు అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు వ్యతిరేకంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దన్న 14వ ఆర్థిక సంఘం ఏపికి మాత్రం 42 శాతం కేంద్రం నిధులు ఇవ్వాలని సూచించినట్లు ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయెల్‌ అన్నారు. రెవెన్యూ లోటు కింద ఏపీకి ఐదేళ్లలో 22 వేల కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసిందన్నారు. ఏపీకి చేస్తున్న సాయానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం చంద్రబాబు లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

విభజన చట్టంలోని హామీల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నత విద్యా సంస్థలను మంజూరు చేసినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. తిరుపతిలో ఐఐటి, ఐసిఈఆర్‌.... వైజాగ్‌లో ఐఐఎం, కర్నూల్‌లో ట్రిపుల్‌ ఐటిలు ఇప్పటికే నడుస్తున్నాయన్నారు. అనంతపూర్‌లో సెంట్రల్‌ యూనివర్సిటీని త్వరలోనే ప్రారంభిస్తామని... గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా అప్రూవర్‌ లభించిదన్నారు. ఏపికి ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని వెల్లడించిన నేపథ్యంలో టిడిపి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి. 

17:29 - July 24, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవటంపై మొదటి ముద్దాయి టీడీపీ, అని రెండవ ముద్దాయి బీజేపీ, మూడవ ముద్దాయి కాంగ్రెస్ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ఇచ్చిన కేంద్రాన్ని ప్రశ్నించకుండా హోదాతో ఏం రాదనీ..ప్యాకేజీయే బెటర్ అని టీడీపీ ప్యాకేజీకి ఒప్పుకుందని విజయసాయి విమర్శించారు. హోదా కోసం నాలుగేళ్లుగా వైసీపీ పోరాటం చేస్తోందన్నారు. ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నప్పుడు వైసీసీ,జనసేన, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయని తెలిపారు.  

13:15 - July 24, 2018
12:18 - July 24, 2018

ఢిల్లీ : రాజ్యసభలో ఇవాళ విభజనచట్టం, అమలుకాని హామీలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుకాకపోవడంపై చర్చ చేపట్టాలంటూ టిడిపి, వైసిపి, కాంగ్రెస్ ఎంపీలు నోటీసులిచ్చారు. మధ్యాహ్నం 2:30 గంటలకు చర్చ ప్రారంభం కానుందిప్రారంభం‌‌ కానుంది. టిడిపి తరపున సుజనాచౌదరి, కాంగ్రెస్ నుంచి కెవిపి, వైసిపి నుంచి విజయసాయిరెడ్డి, బిజెపి నుంచి జివిఎల్ నరసింహరావు చర్చలో పాల్గొననున్నారు.  హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాజ్యసభలో సమాధానం ఇవ్వనున్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, బీజేపీ నేత ఆంజనేయరెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి క్రిశాంక్, టీడీపీ నాయకురాలు సునీత పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:06 - July 24, 2018

యాదాద్రి భువగిరి : భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్లు ఇవాళ అవిశ్వాసం పెట్టనున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్‌ను విధించారు. చైర్‌పర్సన్‌ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో ఎమ్మెల్యే దీన్ని సవాలుగా తీసుకున్నారు. కొన్ని రోజులగా కౌన్సిలర్లతో క్యాంపు రాజకీయం నిర్వహిస్తూ ఇవాళ అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. మరో వైపు చైర్‌పర్సన్‌ పీఠం చేజారిపోకుండా బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

 

11:29 - July 23, 2018

ఢిల్లీ : ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ రాజ్యసభ వాయిదా పడింది. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుపై చర్చకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ నేత కేవీపీ విడివిడిగా నోటీసులు ఇచ్చారు. విభజన హామీల అమలుపై చర్చకు టీడీపీ ఎంపీలు పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. 

11:16 - July 23, 2018

ఢిల్లీ : ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుపై చర్చకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ నేత కేవీపీ విడివిడిగా నోటీసులు ఇచ్చారు. విభజన హామీల అమలుపై చర్చించాలని టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. చర్చకు సిద్ధమని చైర్మన్ తెలిపారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సభలో లేనందున రేపు చర్చ జరిగే అవకాశం ఉంది.   

Pages

Don't Miss

Subscribe to RSS - no confidence motion