nirbhaya act

14:37 - February 15, 2018

మహిళలు ఆకాశంలో సగం అన్నారు..! స్త్రీ, పురుషులిద్దరు సమానమేనని రాజ్యంగం చెబుతుంది. సమానావకాశాలు కల్పిస్తామని పాలకులు తరుచు చెబుతారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని డబ్ల్యూఈఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అసమానతలు తొలిగిపోయి, పురుషులతో స్త్రీలకు సమానత్వం రావాలంటే 170 సంవత్సర కాలం పడుతుందని సాక్ష్యాత్ వరల్డ్ ఎకానమీక్ ఫోరం నివేదిక పేర్కొంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.  

10:31 - December 26, 2017

జగిత్యాల/కరీంనగర్ : జిల్లా రాయకల్ మండలం మైతాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. 8న తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచార నింధితుల్లో మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. మరో నింధితుడు విజయ్ పరారీలో ఉన్నాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:58 - December 1, 2017

వరంగల్ : యాసిడ్ దాడి ఘటనలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందారు. బుధవారం మాధవిపై యాసిడ్ దాడి జరిగింది. తీవ్ర గాయాలైన మాధవిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మాధవి మృతి చెందింది. వరంగల్‌ జిల్లాలోని ఐనవోలు మండలం గర్మిల్లపల్లి శివారులో బుధవారం వివాహిత మాధురిపై చందు, రాకేష్, అనీల్ లు యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన యువతిని.. స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మాధవి మృతి చెందింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ లోని ఓ పెట్రోల్ బంక్ లో మాధురి పని చేస్తోంది. చందు పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో ఆమెను వేధించాడు. దీంతో ఆమె ఉద్యోగం మానేసింది. ఈనేపథ్యంలో చందు మాధవిని ఆటోలో తీసుకెళ్లి ఆమెకు మత్తు మందు ఇచ్చి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.  

19:19 - May 22, 2017

విశాఖ : జిల్లాలోని ఏజెన్సీలో మృగాళ్లు బరితెగించారు. ఇద్దరు అడవిబిడ్డలపై లైంగికదాడికి తెగబడ్డారు. చింతపల్లి మండలం తాజంగి గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు 2 రోజుల క్రితం పోతురాజు జాతరకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో తాజంగి స్కూల్లో విశ్రాంతి తీసుకుంటుండగా.. ఏడుగురు యువకులు పంజా విసిరారు. పైశాచికంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. గ్రామ పెద్దల తీర్మానంతో అధికారపార్టీ నేతలు బాధిత యువతులకు 50 వేలతో సెటిల్‌మెంట్‌కు యత్నించారన్న ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై మీడియాలో కథనాలు రావడంతో.. బాధితులు జరిగిన దారుణంపై చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. 

18:33 - May 21, 2017

విజయవాడ : ఫేస్ బుక్ చాటింగ్ ఓ మైనర్ బాలిక భవిష్యత్తును అంధకారం చేసింది. తొమ్మిదో తరగతిలోనే యువకుడితో చాటింగ్ చేస్తూ ప్రేమలో పడింది. ప్రేమికుడిని రహస్యంగా కలిసి వస్తూ మరో నలుగురు యువకులకు చిక్కి గ్యాంగ్ రేప్‌కు గురైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన విజయవాడలో సంచలనం కలిగిస్తోంది.

బాలికకు ఫేస్‌బుక్‌ ద్వారా అజయ్‌ పరిచయం

విజయవాడలో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.. నగరంలోని మాచవరంకు చెందిన పదహారేళ్ళ బాలికకు అజయ్‌ అనే యువకుడు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. ఈ నెల 16న స్నేహితురాలి ఇంటికి వెళుతున్నానంటూ బాలిక ఉదయం ఇంటినుంచి బయలుదేరింది.. అజయ్‌ అతని స్నేహితుడు అఖిల్‌ ఆమెను ముస్తాబాద్‌కు తీసుకువెళ్లారు.. అక్కడ అందరూ మద్యం తాగారు. బాలిక మద్యంమత్తులోఉండగానే బిఆర్ టిఎస్ రోడ్‌లో వదిలేశారు..

మద్యం తాగించి ఆమెపై గ్యాంగ్ రేప్...

మద్యం మత్తులోఉన్న బాలికకు ఆ రాత్రి ఎటువెళ్లాలో అర్థం కాలేదు.. అలాంటి పరిస్థితిలోఉన్న బాలికను జాగ్రత్తగా ఇంటిదగ్గర దించాల్సింది పోయి మరో నలుగురు యువకులు ఘాతుకానికి తెగబడ్డారు. ఇంటి దగ్గర వదిలేస్తామంటూ శ్రీకాంత్, అభిషేక్, పవన్, సునీల్ అనే యువకులు ఆమెను నమ్మించారు. మధురానగర్‌లో నలుగురు మద్యంతాగారు. బాలికకూ మద్యం తాగించి ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఉదయం ఆమెను రోడ్డుపై వదిలేశారు. అక్కడినుంచి తన ఇంటికి వెళ్ళిన బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది.. వారితో కలిసి పోలీసులకు ఫిర్యాదుచేసింది.. బాలిక చెప్పిన బైక్‌ నెంబర్‌ ఆధారంగా పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.. వీరిపై నిర్భయ, ఫోక్సా యాక్ట్‌కింద కేసులు నమోదుచేశారు.. బాలికను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు... కేసు దర్యాప్తు చేస్తున్నారు..

12:39 - May 9, 2017

ఢిల్లీ:నిర్భయ ఉదంతం, పరియవసానాలు, మే5 న సుప్రీం తీర్పుతో ఆ ఘటనలు ఆగుతాయా ? అన్న అంశంపై 'వేదిక' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఐద్వా నేత ఆశాలత, ప్రముఖ న్యాయవాది గీత పాల్గొన్నారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

19:57 - May 5, 2017

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఎట్టకేలకు దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్షణను ఖరారు చేసింది. దోషులైన ముఖేష్‌, వినయ్‌, పవన్‌, అక్షయ్‌కు ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది. నలుగురికీ ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారు. ఇదే అంశంపై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ న్యాయవాది పార్వతి, సీఐ లక్ష్మీ మాధవి, ఐద్వా నేత రమాదేవి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:58 - May 5, 2017

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఎట్టకేలకు దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్షణను ఖరారు చేసింది. దోషులైన ముఖేష్‌, వినయ్‌, పవన్‌, అక్షయ్‌కు ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది. నలుగురికీ ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారు.

16 డిసెంబర్‌ 2012 నిర్భయ ఘటన

2012 డిసెంబర్‌ 16వ తేదీ సాయంత్రం నిర్భయ తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి తిరిగి వస్తూ.. ఆరుగురు ప్రయాణికులు ఉన్న బస్సును ఎక్కారు. అప్పటికే పీకలదాకా మద్యం సేవించి ఉన్న ఆరుగురు... నిర్భయ స్నేహితుడిని చితకబాది ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కదులుతున్న బస్సులోనే గంటకుపైగా పాశవికంగా లైంగిక దాడికి పాల్పడి.. చివరకు వారిద్దరినీ బస్సులోనుంచి బయటకు తోసివేశారు. అటువైపు వెళ్తున్న కొందరు వివస్త్రంగా, అచేతనంగా పడిఉన్న నిర్భయను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చేర్చారు. డిసెంబర్‌ 26న నిర్భయను మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రికి తరలించారు. చివరికి చికిత్స తీసుకుంటూ డిసెంబర్‌ 29న నిర్భయ తుది ప్రాణాలు విడిచింది.

భారతదేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటన

నిర్భయ ఘటన యావత్‌ భారతదేశాన్ని ఓ కుదుపు కుదిపివేసింది. కేంద్ర సర్కార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు దేశవ్యాప్తంగా జరిగాయి. ఈ ఘటన అమ్మాయిలు, మహిళలపట్ల జరుగుతున్న లైంగిక దాడిని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. మహిళలపై లైంగిక దాడికి పాల్పడే కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఒక్కటై గొంతెత్తి నినదించారు. నిర్భయ నిందితులను ఉరితీయాలంటూ విద్యార్ధి, యువజన, మహిళా , ప్రజా సంఘాలు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. మహిళ చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆరుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

ప్రజాందోళనలతో నాటి మన్మోహన్‌ సర్కార్‌ నిర్భయ కేసు నిందితుల్లో 6గురిని అరెస్ట్‌ చేసింది. నిందితుల్లో ఒకరైన రామ్‌సింగ్‌ తీహార్‌ జైల్‌లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్‌ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు 2013 సెప్టెంబర్‌ 13న తీర్పు వెలువరించింది. నిర్భయపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి, కిరాతకంగా హింసించి చంపిన నరరూప రాక్షసులను చనిపోయే వరకు ఉరితీయడమే సరైన శిక్షని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇక నాటి యూపీఏ సర్కార్‌ నిర్భయ పేరుతో చట్టాన్ని కూడా తీసుకొచ్చింది.

ఢిల్లీ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకెళ్లిన దోషులు

ఢిల్లీ హైకోర్టు తీర్పుపై దోషులైన అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌శర్మ, పవన్‌గుప్తా, ముఖేష్‌ సుప్రీంలో అప్పీలు చేశారు. దీనిపై పలుమార్లు విచారించిన సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్ధించింది. నలుగురికీ ఉరిశిక్ష ఖరారు చేసింది. నిర్భయ మరణ వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ ఘటనను నేరపూరిత కుట్రగా ధృవీకరించింది. సీసీ టీవీ ఫుటేజ్‌ను సరైన సాక్ష్యంగా సుప్రీంకోర్టు పరిగణించింది. అమానుషంగా వ్యవహరించిన దోషులకు ఉరే సరైందని... భవిష్యత్‌లోనూ ఎవరూ ఇలాంటి నేరం చేయకూడదని వ్యాఖ్యానించింది. కోర్టు రూమ్‌లో ఉన్న లాయర్లు, నిర్భయ తల్లిదండ్రులు చప్పట్లతో ఈ తీర్పును స్వాగతించారు. కేవలం వారే కాదు... యావత్‌ దేశప్రజంతా సుప్రీం తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

14:47 - May 5, 2017

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్షను సమర్థించింది. 2012 డిసెంబర్‌ 12న దేశ రాజధాని దిల్లీలో కదిలే బస్సులో 23 ఏళ్ల యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో కిందికోర్టులు నిందితులకు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.మొత్తం ఈ ఘటనలో ఆరుగురికి శిక్ష పడగా.. ఒకరు జైల్లోనే సూసైడ్‌ చేసుకున్నారు. మరొకరు మైనర్‌ కావడంతో మూడేళ్లు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌శర్మ, పవన్‌గుప్తా, ముఖేష్‌లు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈరోజు వారి పిటిషన్‌ను కొట్టివేసింది.

12:55 - March 3, 2017

ప్రస్తుత సమాజంలో మహిళల పట్ల దాడులు జరుగుతున్నాయి. హింస అనేక రూపాల్లో జరుగుతోంది. ఎవరు ఎక్కడి నుండి హానీ తలపెడుతారో..దాడులు చేస్తారో తెలియని సమాజంలో ఉంటున్నాం. మరి ఒకరి కోసం ఎదురు చూడకుండా ఆత్మరక్షణ పద్ధతులు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

Pages

Don't Miss

Subscribe to RSS - nirbhaya act