nda government

12:39 - August 30, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జోన్ల వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలిపింది. గురువారం ఉదయం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీనితో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలిపింది. ఉపాధి విషయాల్లో స్థానికులకే అవకాశం వచ్చే విధంగా కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల నిరుద్యోగులు లబ్ధి పొందే అవకాశం ఉందని ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా లాభం కలుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.

జోన్ల వివరాలు: కాళేశ్వరం జోన్ : భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి. బాసర జోన్ : ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల. రాజన్న జోన్ : కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్. భద్రాద్రి జోన్ : కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి జోన్ : సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ. చార్మినార్ జోన్ : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి. జోగులాంబ జోన్ : మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్.
మల్టీ జోన్లు : కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ.

08:34 - August 27, 2018

కడప : కడపలో స్టీల్‌ప్లాంట్‌ను ఎప్పుడు నిర్మిస్తారు? స్టీల్‌ప్లాంట్‌ అసలు నిర్మిస్తారా ? లేక అది నీటిమీది రాతలుగా మిగిలిపోతుందా? అదిగో, ఇదిగో స్టీల్‌ప్లాంట్ అంటూ బీజేపీ, టీడీపీలు ప్రజలను వంచిస్తున్నాయా? స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ఎందుకు ఆలస్యమవుతోంది? నాలుగు సంవత్సరాలైనా ఎందుకు అడుగు ముందుకుపడడం లేదు?
4ఏళ్లుగా సాగుతున్న స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు
కడపలో స్టీల్‌ ప్లాంట్‌ నాలుగు సంవత్సరాలుగా సాగుతూనే ఉంది.  కడపలో వైఎస్‌ హయాంలో బీజం పడింది.  ఆ తర్వాత అది అనివార్య కారణాలతో వెనకబడుతూ వస్తోంది.  విభజన చట్టంలో ఆరు నెలలలోపే ఉక్కుఫ్యాక్టరీ నిర్మించాలని చట్టం చేశారు. అయినా నేటికీ ఉక్కుఫ్యాక్టరీ ఆచరణకు నోచుకోలేదు. నాలుగేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్‌ప్లాంట్‌పై నోరుమెదపలేదు. కానీ బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్నాక  ఉక్కు ఫ్యాక్టరీపై గళం విప్పడం మొదలైంది. సీఎం రమేష్‌తో టీడీపీ దీక్ష చేయించింది. ఈ దీక్షకు కేంద్రం స్పందించకపోతే తామే ఉక్కు ఫ్యాక్టరీ పెడతామంటూ చంద్రబాబు ప్రకటన కూడా చేశారు. కేంద్రానికి రెండు నెలల గడువు కూడా ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీఎం ఇలాంటి ప్రకటన చేయడంతో.. దీన్ని ఎన్నికల స్టంట్‌గానే ప్రజలు భావిస్తున్నారు. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డ్రామా : విపక్షాలు 
స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామా ఆడుతున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. టీడీపీ, బీజేపీ రెండూ ప్రజలను మోసం చేశాయని ఆరోపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు ప్రకటన జిల్లా ప్రజలను మోసం చేసేలా ఉందని కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా అన్నారు.  కడప జిల్లా అభివృద్ధి కావాలంటే ఉక్కు ఫ్యాక్టరీ ఒక్కటే మార్గమన్నారు. 
రాజకీయ అంశంగా మారిన స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు  
మొత్తానికి కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు ఇప్పుడు రాజకీయ అంశంగా మారింది. టీడీపీ, బీజేపీ రెండు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై పాలిటిక్స్‌ చేస్తున్నాయి. మరి ఈ రెండు పార్టీలు ప్రజలగోడు విని ఎప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాయో చూడాలి.

 

18:39 - August 24, 2018

ప్రకాశం : అధికారం కోసం టీడీపీ... కాంగ్రెస్ పంచన చేరుతోందని బీజేపీ ఆరోపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యంలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల చరిత్ర అంతా పొత్తులేని వ్యాఖ్యనించారు. ఏపీలో కాంగ్రెస్‌తో పెత్తుకు సిద్ధమవుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ విమర్శించారు. 

18:20 - August 24, 2018

కేరళ : వరదలతో అతలాకుతలమైన కేరళకు యూఏఈ 700 కోట్ల సహాయంపై చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో భారత్‌లో ఆ దేశ రాయబారి అహమద్‌ అలబానా స్పందించారు. ఇప్పటివరకు అధికారికంగా ఎన్ని కోట్లు ఇవ్వాలన్నది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. దీనిపై తమ ప్రభుత్వం అంచనా వేస్తోందని అలబానా పేర్కొన్నారు. విదేశీ ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహకారాన్ని తీసుకునేది లేదని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కేరళలో సహాయక చర్యలు, పురరావాసానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే సహకారం అందిస్తాయని విదేశాంగ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ వెల్లడించారు. కేరళకు సహాయం అందించేందుకు యూఏఈ 700 కోట్లు, కతార్‌ 35 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వం యూఏఈ సహాయం స్వీకరించడానికి శ్రద్ధ చూపుతోంది. కేరళ ప్రజలు యూఏఈ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని ఆ దేశ పాలకులు గుర్తించిన క్రమంలో యుఏఈని ఇతర దేశంగా పరిగణించలేమని చెబుతోంది. 

15:52 - August 23, 2018

ఢిల్లీ : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ మూడు నెలల విరామం తర్వాత ఇవాళ తిరిగి తన శాఖ బాధ్యతలను చేపట్టారు. కిడ్నీ శస్త్ర చికిత్స కారణంగా ఆయన 3 నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అరుణ్‌జైట్లీ మే 14న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి కోవింద్‌.. అరుణ్ జైట్లీకి ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖలను అప్పగించారు. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ ఇవాళ విడుదల చేశారు. జైట్లీ స్థానంలో మూడు నెలల పాటు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అదనంగా ఆర్థిక శాఖ బాధ్యతలను చూసిన విషయం తెలిసిందే.

20:25 - August 22, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి 'అస్థి కలశ యాత్ర'ను ప్రధాని మోది ప్రారంభించారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వాజ్‌పేయి అస్తి కలశాలను వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులకు మోదీ అందజేశారు. దేశంలోని 100 నదుల్లో ఈ అస్థికలను నిమజ్జనం చేసేందుకు 'అస్థి కలశ యాత్ర'ను బీజేపీ చేపడుతోంది. రాష్ట్ర రాజధానుల్లో ఈ యాత్రలు ప్రారంభమై అన్ని బ్లాక్‌లకూ చేరుకుంటాయి. ఈ కార్యక్రమంలో బిజెపి చీఫ్ అమిత్‌షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘ అస్వస్థతతో ఈనెల 16న వాజ్‌పేయి తుదిశ్వాస విడిచారు.

11:34 - August 19, 2018

హైదరాబాద్ : కేరళలోని వరద బాధితులను ఆదుకొనేందుకు పలు రాష్ట్రాలు, పారిశ్రామిక వేత్తలు, ఇతరులు ముందుకొస్తున్నారు. వీరిని ఆదుకొనేందుకు కేరళ బ్లాస్టర్స్ పుట్ బాల్ క్లబ్ ముందుకొచ్చింది. క్లబ్ తరపున పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ రూ. 50లక్షల విరాళాన్ని ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపిస్తున్నట్లు వెల్లడించారు. వరద బాధితులకు వస్తు సామాగ్రీని క్లబ్ సభ్యులు పంపిణీ చేస్తున్టన్లు తెలిపారు. సహాయక కార్యక్రమాల్లో ప్రతొక్కరూ మానవతాదృక్పథంతో పాల్గొనాలని క్లబ్ పిలుపునిచ్చింది...

11:17 - August 19, 2018

ఢిల్లీ : 'కేరళ రాష్ట్రానికి సహాయ పడుదాం రండి..తోచిన విధంగా ఆ రాష్ట్రానికి విరాళాలు ఇవ్వండి..వరద బాధితులను ఆదుకోండి' అంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వినతులు వైరల్ అవుతున్నాయి. కేరళ...గడిచిన 12 రోజులుగా వరదలతో కొట్టుమిట్లాడుతోంది. భారీ వర్షాలు..వరదలతో రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. ఇప్పటి వరకు 358 మంది మృతి చెందినట్లు సమాచారం. ఆరు లక్షల మంది సహాయక శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, జాతీయ విపత్తు, రాష్ట్ర పోలీసులు సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. వరద బాధితులకు ఆహార పదార్థాలు..తాగునీరు..మందులను సహాయక బృందాలు అందచేస్తున్నాయి. రాష్ట్రంలోని 280 పెట్రోల్ బంకులు నీట మునిగిపోయాయి.

ఇంకా పదివేల మందిని సురక్షితంగా కాపాడాల్సి ఉందని తెలుస్తోంది. 38 హెలికాప్టర్ ల సహాయంతో ప్రజలను కాపాడుతున్నారు. మూడు జిల్లాల మినహా మిగతా అన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంపై వాతావరణ శాఖ కొంత ఊరట ఇచ్చే ప్రకటన చేసింది. రెండు..మూడు రోజుల్లో వర్షాలు..వరదలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. దీనితో సహాయక చర్యలు ముమ్మరం చేపట్టే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పదార్థాల కోసం ప్రజలు ఎదురు చూపులు చూస్తున్నారు. కొచ్చి ఎయిర్ పోర్టు సోమవారం నుండి విమాన రాకపోకలకు సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలోని వరద బాధితులకు సహాయం చేయాల్సిందిగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రతొక్కరూ ముందుకు రావాలని సీఎం కేజ్రీవాల్ పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. కేరళ సీఎం అకౌంట్ నెంబర్ తో విడుదల చేసింది. ఆప్ పార్టీకి చెందిన ఎంపీలు తమ నేల వేతనాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. 

07:56 - August 18, 2018
06:38 - August 18, 2018

తిరువనంతపురం : వందేళ్ళలో ఎన్నడూ లేనంతగా వరదలు పోటెత్తడంతో కేరళ తడిసిముద్దయింది. జనజీవనం స్తంభించింది. కేరళ పునర్నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని సీఎం పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా స్పందించారు. పలు రాష్ట్రాలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. పలువురు సిసీనటులు కూడా ఆర్థిక సాయానికి ముందుకొచ్చారు. వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా వరదలు కేరళను ముంచెత్తాయి. 80 డ్యాములు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు.. పోటెత్తిన వరదలకు 324 మంది మృత్యువాత పడ్డారు. 2,23,139 మంది నిరాశ్రయులయ్యారు. బాధితులకోసం 1500 పైగా శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు సీఎం పినరయి విజయన్‌. వరద బాధితుల పునరావాసానికి సాయం చేయాలని పిలుపునిచ్చారు. కేరళ పునర్నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు.

కేరళ ఆదుకోవాలన్న సీఎం పిలుపునివ్వడంతో.. దేశవ్యాప్తంగా అనూహ్యస్పందన వచ్చింది. పలు రాష్ర్ట ప్రభుత్వాలు ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. వరదలతో అతలాకుతలమైన కేరళలో పర్యటించేందుకు ప్రధాని మోదీ తిరువనంతపురం చేరుకున్నారు. శనివారం విజయన్‌తో కలిసి ప్రధాని మోదీ ఏరియల్ సర్వే చేయనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి. సహాయక చర్యలు సమీక్షించనున్నారు. కేంద్రం ఇప్పటికే వంద కోట్ల రూపాయలను సాయంగా ప్రకటించింది.

తెలంగాణ సర్కార్‌ 25 కోట్ల రూపాయల తక్షణ సహాయం ప్రకటించింది. ఈ మొత్తాన్ని వెంటనే కేరళకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు సీఎం కేసీఆర్. నీటిని శుద్ధి చేసేందుకు రెండున్నర కోట్ల విలువైన ఆర్వో యంత్రాలను కూడా పంపాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏపీ సర్కార్‌ కేరళ బాధితులకు 10 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. వరదలతో జరిగిన ప్రాణ, ఆస్థి నష్టం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేరళ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన పాత్రికేయుడు.. మానవత్వాన్ని చాటి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. మనోజ్‌ అనే విలేకరి తన కూతురి నిశ్చితార్థానికి దాచిన డబ్బును సీఎం సహాయ నిధికి అందించారు. కేరళ వరద బాధితుల ఆకలి తీర్చేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది. కేరళకు సహాయం అందిస్తున్నట్లు ఆ ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యగౌరచంద్ర దాస్ ప్రకటించారు. కేరళలోని ఏడుతువు, అలపూజ జిల్లాల్లో కొంత మంది సిబ్బందితో ఈ నెల 13వ తేదీ నుంచి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చింది. సీఎం సహాయ నిధికి 10కోట్లు విరాళంగా ప్రకటించింది. ఆగస్టు నెలకు సంబంధించిన లేట్‌ ఫీజులన్నీ రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. వాహన, వ్యక్తిగత రుణాల నెలవారీ వాయిదాల చెల్లింపుల లేట్‌ ఫీజు, క్రెడిట్‌కార్డు బిల్లులపై చెల్లింపులపై లేట్‌ ఫీజు రద్దు చేస్తున్నట్టు తెలిపింది.

టాలీవుడ్‌ సైతం తనవంతు సహాయానికి ముందుకొచ్చింది. 'గీత గోవిందం' చిత్రానికి కేరళలో వచ్చిన మొత్తం షేర్‌ని వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ప్రకటించారు. హీరోలు అల్లు అర్జున్‌, విజయ్‌ దేవర్‌ కొండ, సింగర్ చిన్మయి విరాళం ప్రకటించారు. డైరెక్టర్ కొరటాల శివ కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 3 లక్షలు అందించారు. ''కేరళ ప్రజలు తమ జీవితాలను.. తమ అందమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునేందుకు మనం అండగా నిలబడదాం'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు కొరటాల శివ.

తమిళనాట సినీనటులు, మీడియా సంస్థలు వరద బాధితులపై తమ ఔదార్యాన్ని చూపాయి. సన్‌టీవీ కోటి రూపాయలు, విజయ్‌ టీవీ 25లక్షలు ప్రకటించింది. సినీహీరో విశాల్‌ భారీ విరాళం ఇవ్వనున‍్నట్టు ప్రకటించగా.. సిద్దార్థ్‌ ట్విటర్‌లో కేరళ డొనేషన్‌ చాలెంజ్‌ను ప్రారంభించారు. కమల్‌హాసన్‌ రూ. 25లక్షలు, సూర్య, కార్తీ 25లక్షలు విరాళమిచ్చారు. మరోవైపు మలయాళ నటుడు మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, దుల్కర్‌ సాల్మన్‌ తమ వంతు సహాయాన్ని ప్రకటించారు. దీంతోపాటు అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాల మూవీ ఆర్టిస్ట్స్‌ 10కోట్లు సీఎం సహాయ నిధికి ప్రకటించింది. వరదలతో స్తంభించిపోయిన కేరళను ఆదుకునేందుకు యావద్దేశం కదిలింది. దేశవ్యాప్తంగా బాధితులను ఆదుకునేందుకు తారతమ్యంలేకుండా మానవత్వాన్ని చాటారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - nda government