Modi Government Scams

18:35 - March 18, 2018

ఢిల్లీ : ప్రధాని మోదీ, బీజేపీలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జరగుతున్న పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఆయన బీజేపీపై మునుపెన్నడూ చేయని విధంగా ఆరోపణలు చేశారు. ఓ నిందితుడిని అధ్యక్షుడిగా చేసుకున్న పార్టీ బీజేపీ అంటూ విమర్శించారు. తాము మహాభారతంలోని పాండవుల్లా ధర్మం కోసం పోరాడుతుంటే... బీజేపీ, ఆర్ఎస్ఎస్ కౌరవుల్లా అధికారం కోసం పాకులాడుతున్నాయన్నారు. మోదీపై యువత పెట్టుకున్న నమ్మకం తొలగిపోతోందన్నారు. అవినీతిపై యుద్ధం చేస్తామన్న ప్రధాని.. లలిత్ మోదీ, నీరవ్ మోదీ విదేశాలకు పారిపోతే ఏం చేశారని ప్రశ్నించారు. 

17:37 - March 17, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోది ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోది హయాంలో చోటుచేసుకున్న అవినీతిని కాంగ్రెస్‌ బయటపెడుతుందని సోనియా స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో మోది 'సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌, నేను తినను...ఇతరులను తిననివ్వను' లాంటి హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ సంస్థలపై దాడులు, పార్లమెంట్‌ను నిర్లక్ష్యం చేయడం, మతపరంగా దేశాన్ని విభజించడం, విపక్షాలను టార్గెట్‌ చేసే మోది ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని సోనియా పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే నెరవేర్చగలదని సోనియాగాంధీ అన్నారు. 

07:38 - March 16, 2018

ఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో తవ్వే కొద్దీ స్కాంలు బయటికి వస్తున్నాయి. ముంబై పిఎన్‌బి బ్రాంచీలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. 9.9 కోట్ల మోసం జరిగినట్టు గుర్తించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారుల సహకారంతో చంద్రీ పేపర్‌ అండ్‌ అలైడ్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమెటెడ్ కంపెనీ స్కాంకు పాల్పడినట్టు సమాచారం. ఈ స్కాంపై పీఎన్‌బీ అధికారులు కానీ, చంద్రీ పేపర్‌ కంపెనీ ఇంతవరకు స్పందించలేదు. నీరవ్‌ మోదీ ఆయన మేనమామ మెహుల్‌ చోక్సీ పీఎన్‌బీ ముంబై బ్రాంచ్‌లో 12,700 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ స్కాం బయటికి రాకముందే విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సిలను భారత్‌కు రప్పించడానికి దర్యాప్తు సంస్థలు కృషి చేస్తున్నాయి. మోదీ, చౌక్సిలకు వ్యతిరేకంగా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీచేయాలని ఈడీ ఇంటర్‌పోల్‌ను కోరుతోంది.

12:12 - March 9, 2018

ఢిల్లీ : లోక్ సభలో పరిస్థితిలో మార్పు రావడం లేదు. వి వాంట్ జస్టిస్ అంటూ ఏపీ ఎంపీలు నినాదాలో హోరెత్తిస్తున్నారు. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇదే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఏపీ పునర్ విభజన చట్టంలో పేర్కొన్న వాటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం..గురవారం కీలక నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నుండి తెగదెంపులు చేసుకుంటున్నట్లు టిడిపి వెల్లడించగానే కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాలను రాష్ట్రపతి శుక్రవారం ఉదయం ఆమోదించారు.

శుక్రవారం ఉదయం లోక్ సభ..రాజ్యసభ ప్రారంభం కాగానే సభ్యులు ఆందోళనను కంటిన్యూ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేయాలంటూ ఏపీ ఎంపీలు నినదించారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో వెంటనే సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రారంభమైన సభలో కూడా అదే పరిస్థితి నెలకొంది. వెల్ లోకి వెళ్లి సభ్యులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. చివరకు స్పీకర్ సుమిత్రా మహజన్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

11:48 - March 9, 2018

ఢిల్లీ : కేంద్ర మంత్రులుగా ఇన్నాళ్లు ఉన్న అశోక్ గజపతి రాజు..సుజనా చౌదరీలు కాసేపటి క్రితం మాజీలయ్యారు. ఏపీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు..ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీల అమలు చేయడం లేదని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం బీజేపీకి గుడ్ బై చెప్పింది. దీనితో కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాజీనామాలను గురువారం సమర్పించారు. సెంటిమెంట్ కోణంలోనే తాము రాజీనామాలు చేయడం జరిగిందని ప్రధానికి వివరించారు. అనంతరం ఈ రాజీనామాలను రాష్ట్రపతి కార్యాలయానికి పీఎం పంపించారు.

శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాజీనామాలపై నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 75 (2) ప్రకారం రాజీనామాలను ఆమోదించారు. రాష్ట్రపతి సూచన మేరకు పౌర విమానయాన శాఖల బాధ్యతలను ప్రధాన మంత్రి మోడీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 

11:14 - March 9, 2018

ఢిల్లీ : లోక్ సభలో పరిస్థితిలో మార్పు రావడం లేదు. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండది విపక్ష సభ్యులు ఆందోళన చేపడుతుండడంతో సభా కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేయాలంటూ ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇతర విపక్ష సభ్యులు ఆందోలన చేపట్టాయి. రాజ్యసభ..లోక్ సభలలో నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సభ ప్రారంభం కాగానే సభ్యులు చేస్తున్న ఆందోళనతో సభలను స్పీకర్..ఛైర్మన్ లు వాయిదా వేస్తున్నారు.

శుక్రవారం నాడు ఉదయం ప్రారంభయ్యాయి. లోక్ సభను రిపబ్లిక్ ఆఫ్ కొరియా సభ్యులు సందర్శించారు. ఈ సందర్భగా స్పీకర్ సుమిత్రా మహజన్ స్వాగతం పలికారు. అనంతరం ఇటీవలే మృతి చెందిన సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. వెంటనే సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఛైర్మన్ వెంకయ్య నాయుడు జీరో అవర్ అని ప్రస్తావించగానే సభ్యులు వెల్ లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. సభను మధ్యాహ్నం 02.30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. 

12:19 - March 8, 2018
20:51 - March 7, 2018

కర్నూలు : త్రిపురలో లెనిన్ విగ్రహం ధ్వంసం, సీపీఎం కార్యాలయాలు, కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ... కర్నూలు కలెక్టరేట్ వద్ద సీపీఎం ధర్నా నిర్వహించింది. నగరంలోని కలెక్టరేట్ వద్ద బీజేపీ,ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. త్రిపురలో గెలిచిన తరువాత... బీజేపీ తన వాస్తవ నైజాన్ని కనబరుస్తోందని సీపీఎం నేతలు ఆరోపించారు. బీజేపీ అరాచకాలకు విగ్రహాల విధ్యంసమే నిదర్శనమన్నారు. ఈ దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. 
జనగామలో 
త్రిపురలో జరుగుతున్న మతోన్మాద దాడులను నిరసిస్తూ జనగామ జిల్లా కేంద్రంలో సిపియం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, నిరసన చేపట్టారు. ధర్నాలో ఎంఆర్ పీఎస్, టీజాక్ నేతలు పాల్గొని మద్దతు తెలిపారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి నెహ్రూ పార్కు మీదుగా ఆర్టీసీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. హిందుత్వ వాదులది పిరికిపందల చర్య అంటూ.. సీపీఎం నేతలు మండిపడ్డారు. 
వికారాబాద్‌లో 
వికారాబాద్‌లో సీపీఎం నాయకులు ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. త్రిపురలో లెనిన్‌ విగ్రహం కూల్చివేత, సీపీఎం నాయకులపై దాడులకు వ్యతిరేకిస్తూ.. మోదీ దిష్టి బొమ్మతో రోడ్డుపైకి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దిష్టి బొమ్మ లాక్కోవడంతో... పోలీసులు, సీపీఎం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలుపకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు.

 

11:59 - March 7, 2018
11:16 - March 7, 2018

ఢిల్లీ : వివిధ రాష్ట్రాల్లో విగ్రహాలు కూల్చడంపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు స్పందించారు. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. లోక్ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ఏపీకి ప్రత్యేక హోదాపై తెలుగు ఎంపీలు..వివిధ అంశాలపై ఇతర ఎంపీలు ఆందోళన చేపట్టారు. స్పీకర్ ఎన్నిమార్లు విజ్ఞప్తులు చేసినా సభ్యులు శాంతించలేదు. దీనితో సభను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు విగ్రహాల కూల్చివేతలపై ప్రకటన చేశారు. తమిళనాడు, త్రిపుర ఇతర రాష్ట్రాల్లో విగ్రహాలు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలు జరగడం దురదృష్టకరమని, షేమ్ అని అభివర్ణించారు. వెంటనే విపక్ష సభ్యులు నినాదాలు..ఆందోళన చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు సభను మధ్యాహ్నం 2.00గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్య వెల్లడించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Modi Government Scams