Mancherial

09:43 - October 14, 2018

మంచిర్యాల:మాజీ మంత్రి టీఆర్ఎస్ నాయకుడు జి.వినోద్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మాజీ మంత్రి ఐనప్పటికీ తనకు టీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యం లభించటం లేదనే అసంతృప్తితో ఉన్న వినోద్ 1,2 రోజుల్లో  ఏఐసీసీ అధ్యక్షుడు  రాహుల్  గాంధి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. తన తండ్రి జి.వెంకటస్వామి హయాం నుంచి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన వినోద్ గత ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తున్న వినోద్ చెన్నూరు లేదా బెల్లంపల్లి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఆయన ఢిల్లీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. 

 

19:12 - September 12, 2018

మంచిర్యాల : తనపై నల్లాల ఓదేలు వర్గం హత్యాయత్నానికి పాల్పడిందని ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన తనపై హత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గ టిక్కెట్ ను కేసీఆర్ తనకు కేటాయించారని ఎవరూ అడ్డుపడినా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ఓదేలు వర్గం ఎన్నికుట్రలు పన్నినా తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని స్పష్టం చేశారు. చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా బాల్క సుమన్ టీఆర్ ఎస్ ఇటీవలే ప్రకటించిన విషయం విధితమే. దీన్నితాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తీవ్రంగా ఖండించారు. తనకు చెన్నూరు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిన్న ఓదేలు స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. దీంతో ఓదేలు వర్గ బాల్క సుమన్ పై ఆగ్రహంతో ఉన్నారు.

ఇవాళ నియోజకవర్గంలోని ఇందారం గ్రామంలో పర్యటించేందుకు వెళ్లిన బాల్క సుమన్‌ను ఓదేలు వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్య కిరోసిన్‌ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనను బాల్క సుమన్‌ తీవ్రంగా ఖండించారు. 

 

12:25 - July 30, 2018

ఆదిలాబాద్ : ఆగస్టా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రారంభానికి వచ్చిన మంత్రి జోగు రామన్నకు ప్రమాదం తప్పింది. మంత్రి జోగు రామన్న, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి పార్టీ నేతలు..ఆసుపత్రి సిబ్బంది తాకిడి ఎక్కువగా ఉంది. వీరిలో కొంతమంది లిఫ్ట్ లో ఎక్కారు. ఒక్కసారిగా కేబుల్ తెగిపోయింది. కింది ఎత్తులోనే లిఫ్ట్ కుప్పకూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓవర్ లోడ్ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. 

06:30 - June 25, 2018

మంచిర్యాల : సీఎం కేసీఆర్‌ పాలనను తీవ్రంగా దుయ్యబట్టారు సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. నాలుగేళ్ళుగా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్‌ అన్ని పార్టీల్లో ఉన్న ఉద్యమ ద్రోహుల్ని టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని.. దీంతో ఆ పార్టీ ఓవర్‌ లోడై మునిగిపోతుందన్నారు చాడ వెంకటరెడ్డి.

15:11 - June 13, 2018

మంచిర్యాల : మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అనుభవజ్నులు చెప్పిన మాటకు నిదర్శనంగా కనిపిస్తోంది వెన్నల మండలంలో చోటుచేసుకుంది. తోడబుట్టిన అన్న కృష్ణారెడ్డిపై తమ్ముడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తహశీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా వుండటంతో ఆసుపత్రికి తరలించారు.

08:16 - June 13, 2018

మంచిర్యాల : కేసీఆర్ కిట్టు వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిల్లో అన్ని రకాల చికిత్సాలను ఉచితంగా అందించేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో మాతా శిశు నూతన విభాగాన్ని ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపడ్డాయన్నారు. మంచిర్యాల ఆస్పత్రిని 2 వందల 50 పడకల ఆస్పత్రిగా ఏర్పాటు చేయాడానికి ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. ఆస్పత్రిలో ఆత్యాధునికి టెక్నాలజీతో డయాలసిస్‌ సెంటర్‌, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు.

 

06:27 - May 14, 2018

మంచిర్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధుకాదని... రాబందు అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రైతుబంధు పథకం ఎన్నికల స్టంటేనని విమర్శించారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలురైతులు వారికి రైతుబంధు ఎందుకు వర్తింపచేయలేదని ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో కేసీఆర్‌ ఆర్భాటాలకు పోతున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ చేపట్టిన మూడో విడత ప్రజాచైతన్య యాత్ర మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుబంధు పథకం.... ఎన్నికల స్టంటేనని కొట్టిపారేశారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పతకం ఖాయమన్నారు. రైతుబంధునని చెప్పుకుంటున్న కేసీఆర్‌.. రాష్ట్రంలో 3600 మంది రైతులు ఆత్మహత్యచేసుకుంటే ఏనాడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న పన్నులతో సీఎం కేసీఆర్‌ తన ప్రచారాల కోసం ఆర్భాటాలు చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. పంటకు గిట్టుబాటు ధర అడిగిన రైతుల చేతులకు సంకెళ్లు వేసిన చరిత్ర కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ కుటుంబం చేసిన త్యాగాలు ఏమీ లేవని ఆయన విమర్శించారు. ప్రజలు రక్తం చిందించి తెచ్చిన తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం రాజభోగాలు అనుభవిస్తోందని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

16:46 - May 6, 2018

మంచిర్యాల : ఆమె స్వప్నాన్ని ఆర్థిక సమస్యలు చిదిమేస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన కిక్‌బాక్సర్‌.. మరో అంతర్జాతీయ పతకాన్ని సాధించే క్రమంలో ఆర్థిక సమస్యతో తల్లడిల్లుతోంది. రష్యాలో జరిగే అంతర్జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ధనం కోసం అభ్యర్థిస్తోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లింగపూర్ గ్రామానికి చెందిన కందుల మౌనిక కరాటే, కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి. నిరుపేద కుటుంబంలో పుట్టిన మౌనిక చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తితో.. బెల్లంపల్లికి చెందిన కరాటే గురువు భరత్ వద్ద శిక్షణ తీసుకుంది. మంచిర్యాలలో ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతూనే తనకు ఇష్టమైన కిక్‌ బాక్సింగ్‌లో ప్రతిభను చాటుతూ వస్తోంది.

ఇష్టపడి నేర్చుకున్న కిక్ బాక్సింగ్‌లో.. మౌనిక, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. ప్రస్తుతం రష్యా దేశంలోని అనపలో మే 30 నుంచి జూన్‌ 4 వరకు జరగనున్న అంతర్జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీకి అర్హత సాధించింది. తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి పాల్గొననున్న ఏకైక క్రీడాకారిణి మౌనిక కావడం గమనార్హం. అయితే అక్కడికి వెళ్లడానికి దాదాపు రెండు లక్షల వరకు ఖర్చవుతోంది. అయితే.. దాన్ని భరించే స్థోమత తనకు లేదని మౌనిక తల్లడిల్లుతోంది.

మౌనిక ఇప్పటి వరకు ఇరవైసార్లు రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పాల్గొంది. 18 బంగారు పతకాలు, 2 రజత‌‌ పతకాలు గెలుచుకుంది. 7 సార్లు మహిళల విభాగంలో గ్రాండ్ ఛాంపియన్‌ షిప్‌ సాధించింది. కిక్ బాక్సింగ్‌ పోటీల్లో రెండు సార్లు రాష్ట్రస్థాయి పోటీలకు హాజరైంది. ఇందులో రెండు బంగారు పతకాలు గెలుచుకుంది. గతేడాది ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో రెండు ఈవెంట్లలో పాల్గొని బంగారు, రజత‌ పతకాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది మౌనిక. అయితే ఆర్థిక సమస్యలు ఆమెను కుంగదీస్తున్నాయి.

రష్యాలో జరగనున్న అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు వెళ్లడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటున్న మౌనిక... దాతల సహకారం కోసం ఎదురుచూస్తోంది. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆకెనపల్లి శాఖలోని తన ఖాతా నెంబర్‌ 62314564711 కు.. విరాళాలు పంపాలని కోరుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆశయం నీరు గారిపోకుండా క్రీడాకారిణిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

08:02 - May 4, 2018

హైదరాబాద్ : తెలంగాణలో అకాల వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. హైదరాబాద్‌లో ప్రహారీగోడ కూలి ముగ్గురు మృతి చెందగా.. పిడుగుపాటుకు ఓ బాలుడు చనిపోయాడు. అటు గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్‌ యార్డుల్లో నిల్వ ఉంచిన ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోయింది.  రాష్ట్ర వ్యాప్తంగా  వర్షబీభత్సం ఆందోళనను కలిగించింది. 
ఈదురుగాలులు, భారీ వర్షం 
హైదరాబాద్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిప్పులు కురిపించిన వాతావరణం.. ఈదురుగాలులు, భారీ వర్షంతో ఒక్కసారిగా చల్లబడిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. ఈదురు గాలులతో కూడిన వానలతో చాలాచోట్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనూహ్యంగా కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షంతో పాటు.. ఉరుములు, మెరుపులతో ప్రజలను హడలెత్తించాయి. 
హైదరాబాద్‌లో బీభత్సం
ఈదురుగాలులతో కూడిన వర్షాలు హైదరాబాద్‌లో బీభత్సాన్ని సృష్టించాయి. ఆరాంఘర్‌ ప్రాంతంలో కురిసిన వర్షానికి ప్రహారీగోడ పక్కన నిలుచున్న వారిపై గోడకూలి పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. నగరంలో అక్కడక్కడా చెట్లు విరిగి పడ్డాయి. దీంతో వాహనాలు దెబ్బతిన్నాయి.  జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసులు విరిగిపడ్డ చెట్లను తొలగించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మోకాలి లోతు వరకూ వర్షం నీరు చేరింది. 
తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం
హైదరాబాద్‌లోనే కాకుండా.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల మార్కెట్‌యార్డుల్లో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. గాలుల బీభత్సానికి మామిడి నేలరాలింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పరకాలలో వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయింది. జనగామ జిల్లాలోని నర్మెట్ట, తరిగొప్పులలో వడగండ్ల వానకు వరిచేను దెబ్బతింది. కరీంనగర్‌ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. వర్షానికి తడుస్తున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలూ పడ్డారు. 
మంచిర్యాల జిల్లాలోనూ వర్షం బీభత్సం 
మంచిర్యాల జిల్లాలోనూ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. మంథనిలోని సత్యసాయినగర్‌, పెంచేరుకట్టల్లోని ఇళ్లలోకి మురుగునీరు చేరింది. యాదాద్రి జిల్లాలోని బీబీనగర్‌లోనూ వర్షం బీభత్సం సృష్టించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వాననీటిలో తడిసిపోయింది. ఖమ్మం జిల్లాలోనూ రైతులు యార్డుల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరిశీలించారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
బోధన్‌లో వడగండ్ల వాన
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో వడగండ్ల వాన కురిసింది. చెట్లు కూలిపోయాయి. దీంతో కూడలిలోని తెలుగు విగ్రహంపై దెబ్బతింది. అటు వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో గాలికి ప్లాట్‌ఫాం రేకులు ఎగిరిపడ్డాయి. ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ అంతటా.. చాలాచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. వర్షబీభత్సానికి వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆయా విభాగాల సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి.. వాహనాల రాకపోకలు, విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. 

 

17:44 - April 23, 2018

మంచిర్యాల : జిన్నారం మండలం కలమడుగు అటవీశాఖ చెక్‌ పోస్టు అవినీతికి ఆలవాలంగా మారింది. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ నాయీమొద్దీన్‌ వసూళ్లకు పాల్పడుతూ కెమెరాకు చిక్కాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. పెళ్లి బృందం బస్సులో ఉంచిన మంచానికి వెయ్యి రూపాయల లంచం డిమాండ్‌ చేశాడు. లేకపోతే కేసు పెడతానని బెందిరించాడు. పెళ్లి బృంద రెండు వందల రూపాయలు ఇవ్వబోతే తీసుకోకుండా... ఇబ్బందులు పెట్టాడు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Mancherial