Mallanna Funny Conversation

22:00 - August 14, 2018

రాహుల్ రాకతోని కాంగ్రెస్ రాత మారిందా..?..కేసీఆర్ ముందస్తు ఉత్తముచ్చటనేనా..?, బీసీల మీద టీఎంసీల కొద్ది గావురం గార్చిండు..ఓట్ల కోసం బదునాం బదలాయించిన సీఎం, ఆంధ్ర రాష్ట్రంల మంత్రులు ఆడోళ్ల మొగోళ్ల...అనుమానం వ్యక్తం జేస్తున్న ఆర్కే రోజా, జనసేనా పార్టీ గుర్తు పిడికిలన్న పవన్...మెనిఫెస్టోల ఒక్కొక్కటి ఇడిశిపెడ్తున్నడు, ఎన్నికలు దగ్గరికొస్తుంటే కులసంఘాలు...ఎన్నికలు అయిపోయినంక ఏ కులంలేదు, పామును వెంచుకుంటున్న పనిమంతుడు...విషం దీశిండ్రా లేదా అనేది తెలుస్తలేదు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

20:11 - August 11, 2018

ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెల్గుదేశం ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం బెట్టుకోని ఉన్నరట.. నిన్న ఫ్యాను పార్టీ జగనాలు సారు జనాలకు బహిరంగ ఉత్తరం రాశిండు..మంత్రి కేటీఆర్కు సుక్కలు జూపెడ్తున్నరుగదా జనం.. క్క సీసీ కెమేరా ఉంటే.. ఐదుగురు కానిస్టేబుళ్లతోని సమానం అంట మన నీళ్ల మంత్రి హరీషు రావుగారు అంటున్నడు..పాపం గుడులు గోపురాల పొంటి అయ్యగార్లు భక్తులకు శఠగోపం బెడ్తుంటే.. అయ్యగార్లకే శఠగోపం బెట్టిండు ముఖ్యమంత్రి కేసీఆర్..ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదే మా తాగువోతులు.. ఆస్తి అనేది జీవితంల భాగంగని.. జీవితమే ఆస్తిగాదు గదా..? మన్సులకే అన్ని పట్టింపులు లోకంల బత్కే జంతులకు ఏ పట్టింపు ఉండది.. గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:31 - July 30, 2018

తెలంగాణ ఆడోళ్లు సంతోషంగ లేరంట..మహాంకాళి అమ్మవారి రంగంల వెల్లడి, కాపులకు జగన్, చంద్రాలు ఇద్దరు పన్కిరారు..అధికారంలకొస్తె తప్ప ఆశయం నెరవేరది, కంటివెలుగు పథకం వెనుక అసులు మర్మం.. ఓట్లు కన్ఫ్యూజ్ గాకుంట సార్ ఎత్తుగడ, కామారెడ్డి ఎమ్మెల్యేగారి మదం మాటలు..బాధితున్ని అడ్డగోల్గ తిట్టి కేసువెట్టిచ్చిండట, ముప్పై తొమ్మిది రూపాలకే ఒక చీర..జగిత్యాల కాడ లైను గట్టిన ఆడోళ్లు, శంకరుని బొమ్మమీద నాగుం బాము..పెద్దపల్లి జిల్లా మంథని కాడ అయ్యింది.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

20:26 - July 26, 2018

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల జర్గే ప్రతి ప్రతి అత్యాచారానికి.. ప్రతి మానభంగానికి.. ప్రతి మహిళా వేదనకు కారకుడు చంద్రబాబునాయుడుగారే అంటున్నది ఎమ్మెల్యే రోజా మేడం.. అసలు ఆయన అనెటోడు లేకపోతె మహిళలంత సుఖసంతోషాలతోని.. పిల్లాపాపలతోని సంతోషంగ బత్కేటోళ్లు అనుకొచ్చింది.. ఇంక చాల జెప్పింది మద్యం దుకాండ్లు బెల్టు షాపుల ముచ్చట్లు.. జర్రంత మనం గూడ అర్సుకునేదున్నది రోజమ్మను పాండ్రిగ..

సూశిండ్రా.. తెలంగాణ ఇప్పుడు వానకాలంగాదు నడుస్తున్నది.. అవిశ్వాసాల కాలం.. ఎంపీటీలకు మళ్లొక సారి పంటవండిందన్కోరాదుండ్రి.. అయితే బేరం ఎటు గట్టిగ గుదిర్తే అటే ఉర్కుతున్నరు ఎంపీటీసీలు.. వేములవాడ ఎంపీపీ అవిశ్వాసం కాడ ఎంత కథ అయ్యిందో సూడుండ్రి.. ఆఖరి దాక అవిశ్వాసం దిక్కున్న ఒక ఎంపీటీసీ.. ఆఖరి క్షణంల ఫ్లేటు ఫిరాయించిండు..

మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి గురించి మీకు ఎర్కేగదా..? ఆయన ఇంట్లకెళ్లి ఎల్కబైటికెల్తె గూడ.. అబ్బా ఎంత సుందరమైన ఎల్క అది..? బ్రహ్మండంగ బైటికెళ్లింది అంటడు.. ఆయన నోటికి పొగుడుడు తప్పితె తిట్టుడు రాదు అసొంటాయిన ఒకదిక్కు.. ఇగ అదే మల్కాజ్ గిరికి ఎమ్మెల్యే మొన్నతుపాకులతోని ఫామౌజుల దందాలు జేస్కుంట మీడియాకు దొర్కిన కనకారెడ్డి ఇంకోదిక్కు ఉండంగ.. మల్కాజ్ గిరి జనం దూపకు సస్తున్నరు..

ఇర్వై రెండు రోజుల సంది దీక్షలు జేస్తుంటె మమ్ములను ఎవ్వలు వట్టిచ్చుకుంటలేరు అంటున్నరు మెప్మా ఉద్యోగులు.. వీళ్ల కథగాకపోతె.. పట్టిచ్చుకునే ప్రభుత్వాన్నే గెలిపిచ్చిండ్రా మీరు..? దొంగోడు దోస్కపోయిండు అంటే.. దొంగోడు అంటెనే వాడు దోస్కపోయెటోడు అన్నట్టుగదా..? కేసీఆర్, కవిత న్యాయం జేస్తలేదంటే.. వాళ్లెట్ల జేస్తరు చెప్పుండ్రి పాపం..

ఇంతపెద్ద మియ్యా దేడ్ పైసా దియ్యా అన్నట్టు.. మన ముఖ్యమంత్రి ఏం జెప్తడు.. ఈ అభివృద్ధిని ఎవ్వడు ఆపుతడో సూస్తా అని గర్జిస్తుంటడు.. ఆడ ఆపెటోడు ఎవ్వడుండు.. ఈననే ఆపేస్తడు.. మన సాలార్ జంగ్ మ్యూజియంల గంటకోపారి గడియారంలకు ఒక పొట్టోడొచ్చి గంట గొట్టిపోతడు సూడు.. అగో సేమ్ ముఖ్యమంత్రిగారు గూడ.. ప్రగతి భవన్ల కెళ్లి గడ్కోపారి బైటికొచ్చి అభివృద్ధి ముచ్చట్లు జెప్పి అవుతల వడ్తడు.. కని నిజమేందంటే.. ఇగో ఇది..

బ్బా జంట అంటే సీతారామా చంద్రుల లెక్క ఉండాలే చిల్కా గోర్రెంకల లెక్కుండాలే అంటుంటరు పెద్దలు గని..? ఒక పెద్దమన్షి జేశిన పనితోని.. జంట అంటే వాళ్లు గాదు.. ఇగో వీళ్ల లెక్కుండాలే అని నిరూపించిండు.. నల్పై ఏండ్ల సంది నాతోని కల్చి బత్కిన భార్య క్యాన్సర్ తోని సచ్చిపోయిందని తన భార్య విగ్రహం బెట్టి పూజలు జేస్తున్నడంటే ఇంత గొప్ప ఆదర్శమన్షి ఏడుంటడు చెప్పుండ్రి..

తిరుమల తిరుపతి ఎంకన్నగుడిని ఓ వారం రోజులు మూశేద్దామనుకున్నరుగదా మొన్న.. ఇగ ఒక భక్తునికి భళే ఉపాయం దట్టింది.. మరి గుడి శుద్ది కింద పనులు జేస్తుంటే గర్భగుడిలున్న స్వామివారు అమ్మవారు ఖాళీగుండి ఏం జేస్తరనుకున్నడో ఏమో.. ఒక కొత్త కారుగొన్కపోయి ఇచ్చిండు.. స్వామీ ఇగ మీకిప్పుడు హాలీడే.. అమ్మవారితోని అట్లట్లవొయ్యిరాపోండ్రి అన్నట్టున్నది ఆ డొనేషన్..

20:10 - July 25, 2018

సూస్తున్నరా ఆంధ్ర రాష్ట్రంల రాజకీయం ఎట్లైతున్నదో.. జగనాలు ప్రెస్ మీటింగు వెట్టి.. పవన్ కళ్యాణ్ను ఎన్నిమాటలన్నడు.. ఏదన్న ఉంటే రాజకీయంగ ఎదుర్కోవాలెగని.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు ఎందుకు జగన్కు..? అంటే ఓ ఆంధ్రా ప్రజలారా..? జగన్ మోహన్ రెడ్డి జేశ్న తిక్కపని ఏం తెల్వక జేశిండేమో అనుకుంటున్నరా..? తప్పు.. దీని ఎన్క అత్యంత పెద్ద కుట్ర దాగున్నది.. నేను జెప్త సూడుండ్రి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణకు గూడ ఇయ్యాలే అని డిమాండ్ జేస్తున్నడు పార్టీ మారి పదవి దక్కిచ్చుకున్న పూజ్యులు శ్రీ గుత్త సుఖేందర్ రెడ్డిగారు.. తెలంగాణల గూడ.. హైద్రావాదు, వరంగల్ తప్ప అంత ఎన్కబడిన ప్రాంతమే మా ప్రాంతానికి గూడ ప్రత్యేక హోదా ఇస్తెనే మంచిది అనుకొచ్చిండు ప్రెస్ మీటింగు వెట్టి..

తెలంగాణ రాష్ట్రంల కేసీఆర్ పరిపాలన అంత దరిద్ర్యమైన పరిపాలన నేను ఏడ జూడలే అంటున్నడు సీపీఎం పెద్ద ముత్తైదువు తమ్మినేని వీరభద్రం సారు.. గుర్రానికి ముంగట గడ్డిగట్టి ఉర్కిచ్చినట్టు ఉంటది కేసీఆర్ పరిపాలన.. ఆ గుర్రానికి గడ్డి అందది అది తినది.. సేమ్ ఈన పథకాలు ఈన ఏశాలు గూడ అట్లనే ఉంటయనుకొచ్చిండు..

పొయ్యిన ఊరుకు మళ్ల వొయ్యేది లేదు.. చెప్పిన మాట మళ్ల జెప్పేది లేదు.. రోజు రొక్కం బలాదూర్.. ఇది తెలంగాణ ప్రభుత్వం యవ్వారం.. మీరు జూడుండ్రి హరీష్ రావుగారు ఎప్పుడు జూడు కొబ్బరు కాయలు గొట్టి రిబ్బన్లు కట్ జేశేకాడనే గనిపిస్తడుగని.. సమస్యలు ఉన్నకాడికి వోడు.. ఎందుకంటె జనం నుంచి రియాక్షన్ ఉంటదని.. ఇగ ఒకతాన మళ్లేందో చెప్తున్నడు అక్కడి పబ్లీకుకు..

ఇప్పుడేగాదు మన నీళ్ల మంత్రి హరీషు రావుగారు ముచ్చట జెప్పింది.. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినంక ఐదువందల రెసిడెన్షియల్ హాస్టళ్లను ప్రారంభం జేశి సన్నబియ్యంతోని బువ్వవెడ్తున్న ప్రభుత్వం మాది అని.. ఇగ జూడుండ్రి ఆయన ముచ్చట ఎంత పచ్చి అవద్దమో ఈ ముచ్చట జూస్తె మీకే అర్థమైతది.. ఏమన్నడు మంత్రి హాస్టళ్ల పిల్లలు ఏమంటున్నరో ఇనుండ్రి..

ఊర్లె మోరీలు సక్కగలేవు ఏంలేవు ఎన్నిమాట్ల జెప్పినా సర్పంజి వట్టిచ్చుకుంటలేడు.. వార్డునెంబర్లు వట్టిచ్చుకుంటలేరు.. సెక్రటెరీ గూడ ఇంటలేడని ఏం జేశిండ్రు ఆ ఊరోళ్లంత.. పెద్దతాళం దీస్కపోయి గ్రామ పంచాది ఆఫీసుకు తాళమేశిండ్రు.. ఎమ్మార్వోను గల్చి వినతిపత్రం ఇచ్చిండ్రు.. తర్వాత ఎమ్మెల్యే కారు ఆడంగొస్తుంటే.. అడ్డం దల్గిండ్రు.. ఇగ జూడుండ్రి కథ ఎట్లున్నదో..

మనం గడ్కోపారి పోలీసోళ్లను అంటాఉంటం వాళ్లు ఎక్స్ ట్రా జేస్తుంటరు అని.. కని పోలీసోళ్ల తప్పుగాదు.. చట్టం తెల్సుకోకపోవడం ప్రజల తప్పు.. ప్రజలకు చట్టం ఏంది... న్యాయం ఏంది.?. పోలీసోళ్లు ఏం జేయాలే.. ఏం జేస్తున్నరు అన్న సోయి తెలిస్తె పోలీసోళ్లు ఓవరాక్షన్ జేయరు.. తోకముడుస్తరు.. ప్రజలకే సెల్యూట్ కొడ్తరు.. అమెరికా పోలీసోళ్లకు మనకు తేడా జూడుండ్రి..

జనం తల్చుకుంటే మంచోన్ని పిచ్చోన్ని జేస్తరు.. పిచ్చోన్ని దేవున్ని జేస్తరు... ఇద్వరకు చాలమాట్ల  జేశిండ్రు.. మనంగూడ ఎన్నోమాట్ల అసొంటియి జూపెట్టుకున్నం మన మల్లన్న ముచ్చట్లగని.. సేమ్ అసొంటిదే ఇంకోటొచ్చింది మనతానికి.. అదేందంటే.. రాత్రికి రాత్రే ఒక తాడిచెట్టును ఎల్లమ్మ తల్లిగ మల్చేశిండ్రు మన భక్తజనం.. నిన్నటిదాక కల్లువోశిన తాడిచెట్టు ఇయ్యాళటి సంది దీవెనార్తిలు వెట్టెస్తుందన్నట్టు..

20:21 - July 24, 2018

ప్రత్యేక హోదాకోసం పోరాటం జేస్తె తెల్గుదేశమే జేయాలేగని.. ఇంకోడు జేయొద్దు అనేది చంద్రబాబు యవ్వారం.. లేదు మేమే జేయాలే.. చంద్రబాబును ప్రత్యేక హోదా సీన్మల విలన్ను జేయాలే అని జగనాలు ఆరాటం.. అటు ఢిల్లీల పాలన జేయవల్చిన అంతర్జాతీయ అత్యుత్తమ పర్యాటకుడు ఈళ్ల డ్రామాలు జూడకుంట విదేశీ యానాలు జేసుడు... దేశానికి రాష్ట్రాలకు సరిగ్గ సరిపోయిండ్రు ఈ నాయకులు..

నెట్టెంపాడు నీళ్లను ఎవ్వలు తెచ్చిండ్రు..? మీ డీకే అరుణమ్మ నేను తెచ్చినా అంటున్నది.. కని అది కేసీఆర్ తెచ్చిండు అని నేను జెప్తున్న అంటున్నడు మంత్రి జూపల్లి కిష్టయ్య.. అవునయ్యా ఓ సారు.. మీ అయ్యాజాగీర్లు ఏమన్న అమ్మి నెట్టెంపాడు నీళ్లను జనాలతానికి దీస్కొచ్చిండ్రా లేకపోతె.. ఆ డీకే భరత సింహారెడ్డి సారదందల సంపాయించిన పైకం తెచ్చి మాకోసం ఖర్చువెట్టిండ్రా.?. మీరు తెచ్చినారు..?

 

ఉన్నదున్నట్లు మాట్లాడుట్ల.. తెలంగాణల ఎం సత్యనారాయణ ఒక్కడైతె.. ఆంధ్రల జేసీ దివాకర్ రెడ్డి ఇంకొక్కలు.. వీళ్లకు పట్టింపులు గిట్టింపులు ఏముండయ్.. ఏది మాట్లాడాలే అనుకుంటే దాసుకోరు కటక్కున అనిపారేస్తరు.. మొత్తానికి మీడియాకు దొర్కుతరు.. తర్వాత మీడియాను జూశి భయపడ్తరు ఇద్దరు ఇద్దరే.. జేసీ దివాకర్ రెడ్డి మీడియా జూశి వద్దురా నాయనా మీకో దండం అని పెడ్తున్నడు..

కేసీఆర్ ముచ్చట జెప్తె ఎట్లుంటది.. కడ్పుల అన్నంలేకున్నా కక్కొచ్చెతట్టు తిన్నట్టుంటది.. అట్ల ఫీలైనోళ్లే విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు.. ఏ ఎన్నిరోజులువా ఇంక వీళ్లను పర్మినెంట్ జేశిపడేయుండ్రి అని మంది ముంగటనే చెప్పుడు బాధితులు సప్పట్లు గొట్టుడు.. పాలాభిషేకాలు జేసుడు.. తర్వాత ఏందంటే.. పర్మినెంట్ లేదు లొట్టపీసు లేదు.. యాడేశ్న గొంగడి ఆడనే..

 

ఏం తయ్యారైండ్రు సూడుండ్రి రాజకీయ నాయకులు.. రాజకీయం అంటే తినుడు తాగుడు జల్సాలు జేసుడు.. పైసలు సంపాయించుడు అవినీతులు జేసుడు ఇదా..? అయినా వాళ్లదేం తప్పు.. ఓట్లు ఏశెటోళ్లది తప్పుగదా..? మీరు సక్కనైనోళ్లకు ఓట్లేస్తె వ్యవస్థ ఇంత ఎందుకు ఆగమైతదిగని.. ఈముచ్చట ఎందుకంటె.. గా బోధన్ పట్టనంల టీఆర్ఎస్ కౌన్సిలర్ల ఏశాలు జూడుండ్రి..

ఒక్కనాడు మంచినీళ్లు రాకపోతె ఈ మంత్రులు.. ఎమ్మెల్యేల భార్యలు ఊకుంటుండొచ్చునా..? తానాలు జపాలు జేయకుంట అట్లనే ఉంటరా..? ఉండరు మరి జనం ఎందుకు ఉండాలే..? సిద్దిపేటకాడ నీళ్లలొల్లె.. పాలమూరుల నీళ్ల లొల్లే.. సూర్యాపేటకాడ నీళ్లలొల్లె.. వస్తయ్ మిషన్ భగీరథ నీళ్లు ఏమన్న అంటే.. ఆ వచ్చేదాక జనం బత్కుండాలేగదా..?

తెలంగాణల సర్కారు విద్య సత్రోలు అయితున్నది అనెతందుకు మళ్లొక ముచ్చటొచ్చింది మనకు.. పేదోనికి సద్వు అందొద్దు వాని పిల్లలు మళ్ల గదే ఊర్లపొంటి బానిసలుగ.. ఉపాధి హామీ కూలీలుగ.. ఉప్పరిపనోళ్లుగ.. మోరీలు ఎత్తిపోశెటోళ్లుగ బత్కెతందుకు సర్కారు ఎంత కష్టపడి పనిజేస్తున్నదో ఈ పాల్ టెక్నిక్ కాలేజీ కథ జూస్తె మీకే అర్థమైతది..

జోగిని.. అంటే తెల్సా..? అగ్రవర్ణ దొరలు పెత్తందారులకు అవసరాలకోసం బుట్టిన ఒక పేరు అది.. తరతరాలుగా దొరల శారీరక అవసరాలకు బలై.. సమాజంల చిన్నచూపుకు గురైతున్న సమాజమే ఈ జోగిని దేవదాసీ మాతాంగిలు.. కొందరు అంటరు తీన్మార్ మల్లన్నా దేవుడే లేడంటవ్ గదా..? గీ బోనాల పండుగేంది..? అని.. అసొంటి అజ్ఞాన మేధావులకు ఇగో ఇండ్ల సమాధానం ఉన్నది సూడుండ్రి..

 

11:07 - June 23, 2018
20:29 - June 12, 2018

ఏ ధమ్ముందా సూస్కుందామంటె సూస్కుందాం నువ్వెంత నీ బతుకెంత..? ఏయ్ అమెరికోడా..? ఇగో ఈ కట్క ఒత్తితే నీ అమెరికా మొత్తం కుప్పగూలిపోతది..? ఏయ్ ఉత్తర కొరియా తమాష జేస్తున్నవా..? మమ్ములను తక్వంచనేస్తున్నవా..? అమెరికా సత్తా ఏందో సూపెడ్త..? ఇట్ల పాము ముంగీస లెక్క కీసులాడుకున్న ఇద్దరు దేశాధినేతలు.. ఇయ్యాళ కల్చుకోని కావలిచ్చుకున్నరు.. ముద్దుగ..

అయ్యో పోసాని క్రిష్ణ మురళి సారు చంద్రబాబు మైలపోలు బాగనే దీస్తున్నట్టుండుగదా..? చంద్రబాబుకు నీతి జాతి ఏముండది.. తన అధికారం కోసం ఎవ్వలినైనా రాజకీయంగ సంపెతందుకు ఎన్కకు వొయ్యెమన్షిగాదు చంద్రబాబును నమ్మొద్దు అని గంటల కమానం ప్రెస్ మీటింగు వెట్టి మరీ చెప్పిండు.. ఇగ ఆ ప్రెస్ మీటింగుల బ్యాగ్ రౌండు జూస్తరా సూడుండ్రి..

యాడంగ దాపురమైతర్రా వారీ మీరంత ఈ దొంగలు లంగలు అంత ఎమ్మెల్యేలు అయ్యితుంటే ఇది ప్రజాస్వామ్యమేనా అన్న అనుమానం రావట్టే.. మాల్కజ్ గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి.. నువ్వు ఎమ్మెల్యే పోస్టుకు గాదు.. కనీసం వార్డు కౌన్సిలర్ పోస్టుగూడ అర్హునువి గాదన్న ముచ్చట నీ చేతలతోనే బైటవడ్డది.. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే కనకారెడ్డికి ఓట్లేశిన ప్రజలరా.?. ఇది జూడుండ్రి మీ ఎమ్మెల్యేగారి పనితనం ఎట్లున్నదో..

రేపటి తెలంగాణ రాష్ట్రం ఇట్లుండది.. ఆంధ్రవలస పాలకులు ధ్వంసం జేశినారు.. రేపు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక ఆదిలాబాద్ ఆడ్విబిడ్డల కోసం హెలికాప్టర్ అంబులెన్సులు వెట్టుకుంటం... వాళ్లకు ఆపతొస్తె పదినిమ్షాలళ్ల దావఖానకు చేరుస్తం.. ఇది కేసీఆర్ మాట... కేసీఆర్ మాట జెప్తె ఎట్లుంటదో మీకు ఎర్కేగదా..? ఎవ్వలికన్న అనుమానం ఉంటే సూడుండ్రి..

అయ్యా సిరిసిల్లా కలెక్టర్ సారు మా భూమిని టీఆర్ఎస్ నాయకులు కబ్జావెడ్తున్నరు సారూ మీరే కాపాడాలే అని మొత్తుకున్నరు.. అయినా ఆ కలెక్టర్కు చెవ్వుమీద పేను వారలే.. ఒక్కపారి వొయ్యింది రెండు మాట్ల వొయ్యింది మూడో పారి ఏకంగ నరేంద్రమోడీ ఏశం గట్టుకోని దిగిండు బాధితుడు.. ఇట్లనన్న ఇంటడో ఏమో అని పాండ్రి పల్కరిద్దాం..

తెలంగాణ రాష్ట్రంల రెప్పపాటుగూడ.. కరెంటివోదిగ.. జనరేటర్లతోని పనే ఉండది.. నేను ఆయాళ రాష్ట్రం విడిపోయేనాడు జెప్పిన.. ఇయ్యాళ చేశి సూపెట్టిన.. ఇది ఎవ్వలు జెప్పిండ్రో నేను మళ్ల యాది జేయవల్సిన పనేం లేదుగదా..? సరే ఈ టాపిక్ ఇప్పుడెందుకంటె.. కేసీఆర్ జెప్పినట్టు రెప్పపాటు కరెంటి వోవుడుగాదు.. రెప్పపాటన్న కరెంటి వస్తె సూద్దామని సూస్తున్నది ఒక గూడెం.. ఇదే అది..

తెలంగాణ రాష్ట్రం నిజంగనే దనిక రాష్ట్రం అనుకుంటున్నరా..? తూచ్.. 2014 కేసీఆర్ ముఖ్యమంత్రిగాకముందుకు నిజంగనే దనిక రాష్ట్రం దాంట్లె ఏం డౌటు లేదు.. ఏమంట సారువారు కుర్చెక్కిండో.. తెలంగాణలున్న ఒక్కొక్క తల్కాయ మీద లక్షా యాభైవేల రూపాల అప్పుజమజేశి పెట్టిండు.. మరి ఇంత అప్పులళ్ల రాష్ట్రముంటే.. ఇగో రైతులు ధాన్యం గొంటిరి పైసలియ్యకపోతిరి అంటున్నరు..

ఉన్నది వొయ్యింది ఉంచుకున్నది వొయ్యింది చేసుకున్నది చెప్పకుంటవొయ్యిందన్నట్టు.. పాపం ఎన్కటి సర్కారు నాగార్జున సాగర్ ముంపు బాధితులకు 724 ఎక్రాల భూమిచ్చి అండ్ల పట్టాలిచ్చి వన్ బీ గూడ ఇచ్చిండ్రు.. ఇగ బంగారు తెలంగాణ సర్కారొచ్చిందిగదా..? ఇప్పుడు ఆ భూములకు పట్టాలు లేవు.. వన్ బీ లేదు.. పాసుబుక్కు లేదు చెక్కుకాయిదం లేదు.. 

22:00 - June 9, 2018

ఇఫ్తార్ దావతు మాలయ ముస్లీంలు..దశాబ్దాలుగా ముస్లింలకు మోసమే, బారాపర్సెంట్ రిజర్వేషనేదంటున్న ఉత్తం..మీరు ఎన్ని సీట్లిచ్చిండ్రయ్యా నాలుగేగా ??, నీరుగారి పోతున్నటీడీపీ నిర్మాణ దీక్షలు..బాబు ప్రసంగాన్ని ఎక్కిరిస్తున్న కుర్చీలు, జనంలకు వోలేకపోతున్న జన సమితి పార్టీ..దూకుడు వెంచకుంటే కష్టమే అంటున్నరు, ఆర్మూరు నియోజకవర్గంలో బీసీల గోస.. ఓట్లు బీసీలయి.. సీట్లు మాత్రం ఓసీలయి, తెల్గు రాష్ట్రాలను పల్కరిస్తున్న తొలకరి.. ఈసారి బాగ వానలు వడ్తయంటున్నరు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

21:39 - June 8, 2018

వెయ్యిరూపాలకు జేరిన కిల చాపలు..మృగశీర కార్తికి విపరీతంగ పెర్గిన ధరలు, అక్కెరొచ్చినప్పుడు ఆర్టీసీ గావాలె..అక్కెర దీరినంక మీరెంతాని బెదిరియ్యాలే, నవనిర్మాణ దీక్షలా విమర్శల దీక్షాలా..?...పద్దతి దప్పి మాట్లాడుతున్న లోకేశం, తూట్ల గుడిశెకు ఐదువందల ఇంటిపన్ను...బంగారు తెలంగాణల బడుగు జీవి కష్టం, ఆదివాసీల గుండెల మీద సింగరేణి బాంబు..కొమురం భీం గడ్డమీద జనం ఆర్థనాదాలు, సర్కారు భూమి పట్టజేస్కున్న వీఆర్యే..టెన్ టీవీ దెబ్బకు సస్పెండ్ జేశ్న ఎమ్మార్వో.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

Pages

Don't Miss

Subscribe to RSS - Mallanna Funny Conversation