Maharashtra

21:25 - October 17, 2018

మహారాష్ట్ర : దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా అమ్మవారి నామస్మరణతో ఆలయాలు మారుమ్రోగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మహారష్ట్రలోని థానే నగరంలో అమ్మవారి మండపం పలువురిని ఆకట్టుకుంటోంది. అమ్మవారి మండపం మొత్తం వేరుశెనగ కాయలతో తయారు చేసారు. దాదాపు 80 అడుగుల ఎత్తులో తయారు చేసిన ఈ మండపం స్థానికులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ భారీ మండపం తయారికీ దాదాపు 12 లక్షల వేరుశెనగ కాయలను వినియోగించినట్లుగా  నిర్వాహకులు తెలిపారు. మండపం లోపలిభాగంలో వేరుశెనగ కాయలతో తయారు చేసిన ఇండియా మ్యాప్, ఇతర చిత్రాలు అమర్చారు. వేరుశెనగ మండపంలో కొలువైన  అమ్మవారు విద్యుత్ కాంతులతో వెలుగొందుతు భక్తులకు దర్శనమిస్తోంది. 
 

16:42 - October 16, 2018

కేరళ : శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిననాటినుండి ఈ అంశంపై కేరళ అట్టుడుకుతోంది. సుప్రీం తీర్పును నిరసిస్తు కార్యక్రమాలు మిన్నంటుతున్నాయి. ఈ వేడి చల్లారకముందే సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ కేరళ ప్రభుత్వానికి మరో ఝలక్ ఇచ్చింది. తాను రేపు శబరిమలకు వస్తున్నానని..నా రక్షణ బాధ్యత ప్రభుత్వమే చూసుకోవాలని అగ్నికి ఆజ్యం పోసింది. కాగా మహిళలకు ప్రవేశం లేని ఆలయాల్లో ప్రవేశం కోరుతూ, సుప్రీంకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని, పోలీసుల సాయంతో ఆలయాల్లోకి వెళ్లి పూజలు చేసి వస్తున్న హక్కుల కార్యకర్త తృప్తీ దేశాయ్, రేపు శబరిమలకు వస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. 
సుప్రీంకోర్టు ఆదేశాలను అందరూ గౌరవించాలని, తాను అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు రేపు అంటే బుధవారం నాడు వెళుతున్నానని ప్రకటించారు. కాగా తన రక్షణ బాద్యత కేరళ ప్రభుత్వం వహించాలన్నారు. కేరళలో జరుగుతున్న నిరసనల గురించి తాను పట్టించుకోబోనని, ఓ వర్గం వారు చేస్తున్న నిరసనలు కోర్టు తీర్పులను అడ్డుకోలేవని తృప్తీ దేశాయ్ మరోసారి స్పష్టం చేశారు. 
కాగా, తృప్తీ దేశాయ్ చేసిన ప్రకటన గురించి తెలుసుకున్న కేరళ సంఘాలు మరింతగా మండిపడుతున్నాయి. అమెను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయం వద్దకు వెళ్లనివ్వబోమని..ఆమెను అడ్డుకునేందుకు ఆత్మహత్య కూడా చేసుకుంటామని హెచ్చరించారు. కేరళ మహిళల మనోభావాలను దెబ్బతీయకుండా తృప్తీదేశాయ్ వెనక్కు వెళ్లిపోవాలన్నారు. కాగా తృప్తీ తన నిర్ణయం మార్చుకోకుంటే ఆమె తీవ్ర పరిణామాలను  ఎదుర్కోవాల్సిందేనని మహిళలు హెచ్చరించారు. కాగా లంచగొండితనం, స్త్రీల అసమానత, గృహహింస, అధికార దుర్వినియోగం మొదలగు సామాజిక సమస్యలపై పోరాటం చేస్తున్న సామాజిక ఉద్యమకర్త తృప్తీ దేశాయ్  పదవ తరగతిలోనే సామాజిక సమస్యలపై పోరాటం మొదలుపెట్టింది. కాగా ఆమె  ఇటీవల శనిసింగణాపూర్ ఆలయంలో మహిళల ప్రవేశం ఉదంతంతో మరింత వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో ప్రస్తుతం వున్న పరిస్థితుల రీత్యా తృప్తీ ఎంట్రీతో ఎటువంటి పరిణామాలు సంభవించనున్నాయో వేచి చూడాల్సిందే.

19:51 - October 8, 2018

న్యూఢిల్లీ: దేశ జాతీయ భద్రతలోని డొల్లతనం మరోసారి బయటపడింది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజంటు ఒకరు అత్యంత భద్రత నడుమ రహస్యంగా చేపడుతున్న బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగశాల వద్ద తచ్చాడుతూ కనిపించడం జాతీయ భద్రతపై అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలియజేస్తోంది. మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బ్రహ్మోస్ మిసైల్ తయారీ కేంద్రం వద్ద నిషాంత్ అగర్వాల్ అనే పాకిస్థాన్ గూఢచారి తచ్చాడుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక శాఖ అధికారులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌‌లో నిషాంత్ పట్టుబడ్డట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.


గత కొంతకాలంగా పోలీసులు నిషాంత్ కదలికలపై నిఘా పెట్టారు. ఈ నిఘాను శనివారం నుంచి పెంచారు. కీలకమైన సాంకేతిక సమాచారాన్ని ఐఎస్ఐకు నిషాంత్ చేరవేస్తున్నాడని తెలుస్తోంది. పాకిస్థాన్‌తో పాటు ఇతర గూఢచార సంస్థలకు చేరవేస్తున్నట్టు సమాచారం.

16:36 - October 3, 2018

ఢిల్లీ :  సాధారణ స్థాయి నుండి ప్రధాన మంత్రి స్థాయికి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనే విషయం అందరికి తెలుసు. క్రమేపీ పార్టీలో ఎదిగి గుజరాత్ ముఖ్యమంత్రి..అనంతరం ప్రధానమంత్రి అయిన ప్రధాన మోదీని నమ్మిన ప్రజలు ప్రధానికి చేశారు. కానీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన మోదీ డీమానిటేష్ వంటి పథకాలతో అప్పతిష్టను మూటకట్టుకోవటమే కాక..భారతదేశపు ఆర్థిక వ్యవస్థనే ఛిన్నా భిన్నం చేసేసారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు ఎన్నికల ప్రధాన అస్త్రంగా ఎన్డీయే వైఫల్యాలను అస్త్రాలుగా చేసుకున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతు..నరేంద్ర మోదీని నమ్మిన ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వగా, ఆయన దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారని..నమ్మిన ప్రజలను మోదీ మోసం చేశారని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తనను నమ్మాలని కోరారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి మహాత్మాగాంధీ ఎంతో కృషి చేస్తే, ఇప్పటి ప్రధాని విభజించి పాలించాలన్న సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.
"మీరు మోదీకి మద్దతిచ్చారు. ఆయన మీ నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని, మహాత్మా గాంధీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లి దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా ఉన్న కాంగ్రెస్ ను నమ్మండి" అని ఆయన వ్యాఖ్యానించారు. రాఫెల్ డీల్ ను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థను వదిలేసి, అంబానీల సంస్థను ఎంచుకోవడం వెనకున్న కారణం ఏంటో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు.

21:14 - October 1, 2018

ముంబై : క్యాస్టింగ్ కౌచ్ వివాదం సినిమా పరిశ్రను కుదిపివేస్తోంది. టాలీవుడ్ లో శ్రీరెడ్డితో మరోసారి మొదలైన ఈ రచ్చ బాలివుడ్ లో కూడా గత కొన్ని రోజుల నుండి వివాదాస్పదమవుతోంది. దాదాపు అన్ని భాషాల్లోని సినిమా పరిశ్రమపై ఈ అంశం సంచలనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో  బాలీవుడ్ లో హీరోయిన్ తనుశ్రీ దత్తా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తనను సీనియర్ నటుడు నానా పటేకర్ లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే  కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కూడా తనను లైంగికంగా వేధించాడని ఆమె తెలిపింది.  దీంతో ఈ వివాదంపై సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా తనుశ్రీ దత్తాకు మద్దతుగా నిలిచారు. అయితే ఈ వివాదంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించేందుకు నిరాకరించారు. ఈ వివాదంపై మాట్లాడటానికి తాను తను శ్రీ దత్తాను కానీ, నానా పటేకర్ ను కానీ కాదని స్పష్టం చేశారు. దీంతో అమితాబ్ వ్యాఖ్యలపై తనుశ్రీ దత్తా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయిల సమస్యల గురించి స్పందించని అమితాబ్ లాంటి వ్యక్తులు సామాజిక కథాంశాల ఆధారంగా ‘పింక్’ వంటి సినిమాలు తీస్తున్నారని విమర్శించింది. ఇలాంటి వ్యక్తులు నిజజీవితంలో కళ్ల ఎదుట జరిగే దారుణాన్ని ప్రశ్నించరనీ, కళ్లు మూసుకుంటారని..ఇటువంటివారు సినిమాల్లో హీరోలు..నిజ జీవితంలో జీరోలు అని వ్యాఖ్యానించింది. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై తాను చివరివరకూ పోరాడుతానని స్పష్టం చేసింది. 
మహారాష్ట్ర, ముంబై, బాలివుడ్, క్యాస్టింగ్ కౌచ్, తనుశ్రీదత్తా, నానా పటేకర్, అమితాబచ్చన్,టాలీవుడ్, శ్రీరెడ్డి, Maharashtra, Mumbai, Bollywood, Casting Cowch, Tanushree Datta, Nana Patekar, Amitabhachan,Tollywood, Sri Reddy

 

13:52 - September 21, 2018

మహారాష్ట్ర : ధర్మాబాద్ కోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు చుక్కెదురైంది. బాబ్లీ కేసులో చంద్రబాబుకు ఊరట లభించలేదు. చంద్రబాబు వేసిన రీకాల్ పిటిషన్‌ను ధర్మాబాద్ కోర్టు తిరస్కరించింది. అక్టోబర్ 15కు విచారణను వాయిదా వేశారు. నోలీసులు అందుకున్నవారంతా విచారణకు హాజరు కావాలని కోర్టు అదేశించింది. ప్రకాశ్‌గౌడ్, గంగుల కరుణాకర్, కేఎస్ రత్నానికి బెయిల్ మంజూరు అయింది. రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. 

 

15:58 - September 9, 2018

ముంబై : చమురు ధరల పెరుగుదలపై మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా చూస్తామని సీఎం పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానెల్ తో ఆయన మాట్లాడారు. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ తీసుకురావడం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోందని..ధరలు తగ్గే మార్గాలను చూస్తున్నట్లు వెల్లడించారు. జీఎస్టీలోకి తీసుకొస్తే మహారాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తుందని, ఎన్డీయే ప్రభుత్వ హాయాంలో 13 సార్లు ధరలు పెరిగాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ధరల పెరుగుదల ఉంటుందన్నారు.

 

11:42 - August 9, 2018

మహారాష్ట్ర : రైతే రాజ్యానికి వెన్నెముక అన్నారు. రైతన్న అలిగితే ఎవరికి అన్నమే వుండదు..కడుపు నిండదు. రైతు లేనిదే రాజ్యం లేదు. అందుకే రైతన్నను అన్నదాత అన్నారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం..దేశ ప్రగతికి రైతే వెన్నెముకలాంటివాడు. మరి ఈనాడు రైతు అంటే విలువలేకుండా పోయింది. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు హామీలతోనే సరిపెడుతున్నాయి. మరోపక్క వరుణుడు కూడా రైతన్నపైనే అలుగుతున్నాడు. కోపం లేని కోపం రాని రైతన్న అలిగితే..క్రాప్ హాలిడే ప్రకటిస్తే..దేశమే కాదు..ప్రపంచమే స్థంభించిపోతుంది. ఆకలి కరాళనృత్యం చేస్తుంది. కానీ అన్నదాత అన్నమే పెడతాడు..ఆకలిని దరి చేరనివ్వడు. అందుకే తనను తాను చంపుకుంటాడు తప్ప ఎవరిపైనా రైతన్న కోపగించుకోడు..కానీ ఆ రైతన్నకు కోపం వస్తే..ఎవరిమీదనైనా సరే పోరాడుతాడు. తన పంటను కాపాడుకునేందుకు రైతన్న దేనికైనా తెగిస్తాడు..ఈ నేపథ్యంలో కొందరు రైతన్నలు ఓ విచిత్రమైన పనిచేశారు. నారు వేసిన రైతన్న వర్షం కోసం ఆకాశం వంక ఆశగా చూసాడు. వర్షాలు పడతాయో లేదోనని ఆందోళన పడ్డాడు. వర్షాలు పడతాయో లేదో చెప్పేందు ఓ శాఖ కూడా వుంది. కానీ అదెప్పుడు సరైన సమాచారాన్ని అందివ్వదు. దీనికి నిరసనగా రైతన్నలు వాతావరణ శాఖ తప్పుడు సమాచారం చెప్పిందనీ ఆ సంస్థ డైరెక్టర్ పై కేసు పెట్టారు..అవును నిజమండీ..కావాలంటే ఆ వివరాలు చూడండి..
వాతావరణ శాఖ డైరెక్టర్ పై ఫిర్యాదు చేసిన మలాఠ్వాడ రైతులు..
వానలు పడక ఒకసారి..నకిలీ విత్తనాలతో మరోసారి..వెరసి రైతన్నలు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. తీవ్రంగా నష్టపోతున్నారు. రైతన్న నష్టపోతే మనకేమిలో అనుకోవటానికి వీలులేదు..రైతన్న నష్టపోతే దేశానికే నష్టం. ఈ క్రమంలో నష్టాలపాలైన రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే..మరికొందరు వున్న ఊరును..కన్నతల్లిలాంటి పొలాన్ని అమ్ముకుని వలస బాట పడతున్నారు. కానీ రైతన్నలలో మరాఠ్వాడా రైతులు మాత్రం ఫుల్ డిఫరెంట్. వాతావరణ శాఖ వర్షపాతంపై సరైన అంచనాలు ఇవ్వకపోవడంతో ఏకంగా సంస్థ డైరెక్టర్ పై మహారాష్ట్రలోని మలాఠ్వాడ రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వర్షాలు పడతాయన్న సంస్థ..పడని వర్షాలు..కేసు నమోదు..
ఈ సారి రుతుపననాల సందర్భంగా మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మరఠ్వాడా ప్రాంతానికి చెందిన రైతులు తమవద్ద ఉన్న మొత్తం నగదుతో పంటల్ని సాగుచేశారు. అయితే తొలికరి వర్షం మినహా వాన జాడలేకపోవడంతో ఆగ్రహం చెందిన రైతన్నలు.. భారత వాతావరణ శాఖ పుణె డైరెక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడి అధికారులు ఎరువులు, పురుగు మందుల కంపెనీలతో కుమ్మక్కై తప్పుడు అంచనాలను ఇచ్చారని ఆరోపించారు.

ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదుచేయాలని డిమాండ్..
ఈ మేరకు రైతు సంఘం స్వాభిమాని షేట్కారీ సంఘటన మరఠ్వాడా ప్రాంత చీఫ్ మాణిక్ కదమ్ రైతులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ విషయమై స్పందించేందుకు వాతావరణ శాఖ అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు.

20:28 - July 28, 2018

మహారాష్ట్ర : ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సతారా జిల్లాలో విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. సుమారు 35 మందితో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 32 మంది మృతి మృత్యువాత పడ్డారు. అంబేనలి ఘాట్‌లో పొలందపూర్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 800 అడుగుల లోతులో పడటంతో బస్సు నుజ్జునుజ్జయింది. బస్సు లోయలో పడేముందే అప్రమత్తమైన ఓ వ్యక్తి అందులోంచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ప్రాంతంలో జనసంచారం పెద్దగా లేకపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

స్థానిక ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని మృతుల వివరాలను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మృతులంతా కొంకణ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందినవారిగా ఆయన వెల్లడించారు. వెలికి తీసిన మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించి వారి బంధువులకు అప్పగిస్తామని చెప్పారు. మృతుల్లో కొందరు రత్నగిరి, తదితర ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. తన కళ్ల ముందు జరిగిన ఈ ఘోర విషాదం నేపథ్యంలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక వ్యక్తి ఇంకా ఆ షాక్‌ నుంచి తేరుకోలేదు. ఆయనను విచారించి మృతుల వివరాలను తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. లోయ బాగా లోతుగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం నెలకొంది. కొన ఊపిరితో ఉన్న వారికి చికిత్స అందించేందుకు కావాల్సిన మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

15:24 - July 28, 2018

ఢిల్లీ : దేశంలో మరో మరణ మృందంగం మోగింది. గత కొన్ని రోజులుగా కొన్ని దుర్ఘటనల వల్ల ఎంతో మంది మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ బస్సు లోయలో పడిపోవడంతో 32మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘోరమైన దుర్ఘటన మహారాష్ట్ర జిల్లాలో చోటు చేసుకుంది. దపోలీలోని డా.బాలాసాహెబ్ సావంత్ కొంకణ్ కృషి విద్యాపీఠ్ కు చెందిన కొంతమంది విద్యార్థులు మహాబలిపురానికి విహార యాత్రకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు అంబేనాలీ ఘాట్ ప్రాంతంలో అదుపు తప్పింది. సుమారు 800 అడుగుల లోయలో పడిపోయ్యింది. ఈ సమయంలో ఒక వ్యక్తి బస్సు నుండి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.

అతను తెలిపే వరకు బాహ్యా ప్రపంచానికి ఈ విషాద ఘటన తెలియరాలేదు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. బస్సులో ఉన్న 32 మంది మృతదేహాలను అధికారులు బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రోడ్డు సరిగ్గా లేకపోవడమా ? డ్రైవర్ నిర్లక్ష్యమా ? అనేది తెలియరాలేదు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Maharashtra