Latest Telugu Films

12:59 - February 16, 2018

తెలుగు సినిమాల్లో స్పీడ్ పెరిగింది. కొత్త కొత్త కథలతో న్యూ టాలెంట్ ఫ్లో బాగా వస్తుంది. వెరైటీ సినిమాలతో ఆడియన్స్ అలరించడానికి ఈ వారం కూడా రెండు ఇంటరెస్టింగ్ సినిమాలు ట్రాక్ లో ఉన్నాయ్. మరి ఈ వారం ఈ సినిమాల టాక్ ఎలా ఉంటుంది అనేది ఆడియన్స్ ఛాయిస్.

వెరైటీ కాన్సెప్ట్ తో రాబోతున్న సినిమా 'అ!'. కథలో కొత్తదనం ఉన్న సినిమాగ ట్రైలర్ టీజర్ చూస్తే తెలుస్తుంది. నాచురల్ స్టార్ నాని 'అ!' సినిమా నిర్మిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వాల్ పోస్టర్ బ్యానర్ పై నానియే స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు. 'అ!' సినిమాలో కాజల్ అగర్వాల్.. నిత్య మీనన్.. రెజీనా కెసాండ్రా.. ఈషా రెబ్బా నాయికలుగా నటిస్తున్నారు. ఇందులో వీళ్లందరివీ డిఫరెంట్ రోల్స్. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది.

మహేష్ బాబు అక్కగానే కాక నటిగా కూడా సుపరిచితురాలు 'మంజుల ఘట్టమనేని'. కృష్ణ గారి ముద్దుల కూతురిగా మాత్రమే కాక ఒక మంచి నిర్మాతగా కూడా ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. తను దర్శకత్వం వహిస్తోన్న తొలి చిత్రంగా మన ముందుకు రాబోతోంది 'మనసుకు నచ్చింది'. ఈ సినిమా లో సందీప్ కిషన్ - అమైరా దస్తూర్ ముఖ్య తారాగణం. ట్రైలర్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. మరి ఏ సినిమా ప్రేక్షకాదరణ పొందిందో రానున్న రోజుల్లో తెలియనుంది. 

11:56 - December 30, 2017

మహేష్ బాబు అభిమానులంత ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం భరత్ అనే నేను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏప్రిల్ 27 న విడుదల కానుంది. బ్రహ్మోత్సవం, స్ర్పైడర్ చిత్రాలు మహేష్ కు నిరాశ మిగిల్చాయి. దీంతో భరత్ అనే నేను పై మహేష్, అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. శివ, మహేష్ కాంబినేషన్ వచ్చిన శ్రీమంతుడు ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే.. ఈ మూవీ తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

21:53 - December 29, 2017

హిట్టనుకున్నారు.. ఫట్టయింది. చిన్న సినిమా అనుకున్నారు.. కలెక్షన్లలో భారీ అని రుజువయింది. ఆ హీరో కథ ముగిసింది అనుకున్నారు..కాదు.. మళ్లీ మొదలయిందని తేలింది.కసిపెట్టి తీశారు.. ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు...టాక్ నెగెటివ్ గా వినపడింది.. కలెక్షన్లు పాజిటివ్ గా వచ్చాయి.. ఇదీ సింపుల్ గా తెలుగు సినిమాకు 2017 మిగిల్చిన గుర్తులు.. ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. 2017లో రెండు సినిమాలు విపరీతమైన హైప్ తో వచ్చాయి. ఒకటి మెగాస్టార్ 150 వ చిత్రం.. మరొకటి బాహుబలి2. కట్టప్పను చంపిందెవరో తెలుసుకోటానికి ప్రేక్షకులు ఆరాటపడ్డారు. ఫలితం మెగా హిట్ గా నిలిచింది బాహుబలి. ఇక పోస్టర్ నుంచి సినిమా రిలీజ్ వరకు... ఆ తర్వాత. ఆద్యంతం వివాదాస్పదంగా నిలిచిన అర్జున్ రెడ్డి అనూహ్యంగా ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఈ ఏడాది సత్తా చాటిన మరో భారీ చిత్రం ఖైదీ నంబర్ 150. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి తన కలెక్షన్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక జనతా గ్యారేజ్ లాంటి భారీ విజయం తరువాత ఎన్టీఆర్ నటించిన సినిమా జై లవకుశ రిలీజ్ కు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టు కథా కథనాలు సాగటంతో ఈ సినిమా ఘనవిజయం సాధించింది.

టాక్ తో సంబంధం లేదు.. టాక్ ఫ్లాప్ అంటుంది. కలెక్షన్లు మాత్రం రివర్స్ లో ఉంటాయి. అవును.. 2017లో టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు తమ అభిమాన హీరోలపై కనకవర్షం కురిపించారు. సినిమాలకు ఫ్లాప్ టాక్.. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం తగ్గలేదు.. ఈ ఏడాది చిన్న సినిమాలకు బాగా కలిసొచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. ఎవరూ ఊహించని విధంగా 50 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టి స్టార్ హీరోలకు కూడా షాక్ ఇచ్చాయి. అదే సమయంలో చాలా కాలంగా హిట్ చూడని హీరోలు కొందరికి 2017 బంపర్ హిట్ లను అందించింది. ఓ పక్క రొటీన్ సినిమాలు వెల్లువెత్తుతున్నా, మంచి సినిమా వచ్చిందంటే ప్రేక్షకులు ఆదరించటం సహజంగా జరిగే విషయం. 2017లోనూ అదే జరిగింది. కొన్ని అంచనాలు మించాయి. కొన్ని బోల్తా కొట్టాయి. కొన్ని ఓ రేంజ్ లో కలెక్షన్ల వర్షం సాధించాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు లైఫ్ ఉందని ప్రూవ్ అయింది. ఈ ఉత్సాహంతో ఇండస్ట్రీ 2018వైపు ఆశావహంగా అడుగులు వేస్తోంది.

 

Don't Miss

Subscribe to RSS - Latest Telugu Films