KCR Speech at Golconda Fort

21:34 - August 15, 2018

ఢిల్లీ : దేశంలోని పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు.  వచ్చే నెల 25 నుంచి దేశవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. తొలిదశలో 10 కోట్ల మందికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ ఎర్రకోటలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మోదీ చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్ర ఎర్రకోటలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సైనిక, పోలీసుదళాల నుంచి గౌరవ వందన స్వీకరించారు. 
మోదీ స్వాతంత్ర్య దినోత్సవ సందేశం 
ఎర్రకోట బురుజల నుంచి ప్రధాని మోదీ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ సందేశమిస్తూ... దేశంలోని పేదలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో ఆయుష్మాన్‌ భారత్‌-జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రకటించారు. పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వచ్చేనెల 25 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తారు. మొత్తం 50 కోట్ల మందికి ప్రయోజనం చేకూరేలా ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ద్వారా తొలిదశలో 10 కోట్ల మంది పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. మొత్తం 1354 చికిత్స ప్రక్రియలను దీనిలో చేర్చారు. 
మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు 
2022 నాటికి అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ ప్రపంచంలో నాల్గవ దేశంగా అవతరిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. భారత బాలబాలికలు త్రివర్ణ పతాకాన్ని అంతరిక్షంలోకి సగర్వంగా మోసుకెళ్లే రోజు వస్తుందన్నారు. జమ్ము-కశ్మీర్‌లో స్థానిక సంస్థలను బలోపేతం చేసే కృషిలో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని చెప్పారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టాలను సవరిస్తున్నామని మోదీ చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట పరిసరాల్లో 70 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

20:52 - August 15, 2018

దేశమంత స్వాతంత్ర్య దినం సంబురాలు...డెబ్బై రెండేండ్లైనా పేదోనికి అందని ఫలాలు, అమరవీరుల స్థూపంతోని రాజకీయాలు...ఓపెనింగ్ కు నోచుకోని స్థూపంతోని ఆటలు, బీపి వెంచుకున్న మంత్రి సోమిరెడ్డి సారు...ఇర్వైకోట్ల అవినీతి చర్చ పక్కదారి వట్టిచ్చి, కోర్టు తీర్పును గౌరవించరా స్పీకర్ గారు...కోమటి రెడ్డి సంపత్ ముచ్చట్ల హైకోర్టు, దళిత గూడాల పొంట నీళ్ల గోసలు...మెదక్ జిల్లాల రోడ్డెక్కిన అమ్మలక్కలు, వేములవాడ గుడిలె తిర్గిన హోం సారు...
పూలదండ మేయజూశిన రాజన్న ఎద్దు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

20:43 - August 15, 2018

ఢిల్లీలో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటలో ప్రధాని నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. జిల్లాలోని ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఎగరువేసి, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రైతాంగం ప్రయోజనాలు రక్షించేందుకు రాజీలేని వైఖరితో ముందుకు పోతామన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు, ది హిందూ మాజీ ఎడిటర్ నగేష్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, టీడీపీ నేత రామకృష్ణ, బీజేపీ నేత రాకేశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. మోడీ, కేసీఆర్, చంద్రబాబు ప్రసంగాల్లో పస లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...  

Don't Miss

Subscribe to RSS - KCR Speech at Golconda Fort