KCR government

06:53 - September 1, 2018

హైదరాబాద్ : అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ... సెప్టెంబర్‌ 12న దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ స్పష్టంచేశారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. స్థానికతను ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పరిగణించాలని కోరారు. ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలన్నారు. బాహ్యవలయ రహదారిని ఇష్టానుసారం మార్పు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల్లో సగానికి పైగా ఖర్చు చేయలేదని విమర్శించారు. వారిది ప్రగతి నివేదన సభ అయితే,..తమది ప్రజల ఆవేదన అని అన్నారు.

06:49 - August 20, 2018

సూర్యాపేట : తెలంగాణ ప్రభుత్వ అధికారుల నిర్వాకంతో ఓ కుటుంబం అభాసుపాలైంది. లోన్లు ఇస్తామని మాయమాటలు చెప్పి ఫోటోలు తీసుకున్న అధికారులు... తమను నవ్వులపాలు చేశారని ఆ కుటుంబం బాధపడుతోంది. రైతు బీమా, కంటి వెలుగు వాణిజ్య ప్రకటనల్లో భార్య ఫోటో పక్కన భర్త కాకుండా వేరే వ్యక్తి ఫోటో పెట్టి తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంట భూమి లేకపోయినా.. రైతు బీమా పథకం ఇస్తామని అధికారులు చెప్పడంపై ఆ కుటుంబం మండిపడుతోంది. బిడ్డకు స్నానం చేయిస్తుండగా.. ఫోటోలు తీసుకుని... వాటి స్థానంలో వేరే ఫోటో పెట్టడంపై కాపురంలో చిచ్చురేగుతోంది. ఫోటోలో కనిపిస్తున్న వీరి పేర్ల పద్మ, నాగరాజు. వీరిది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామం. మూడేళ్ల క్రితం యాదాద్రి సమీపంలోని వంగపల్లిలో పాత బొంతలు కుట్టుకుని బతుకుతుండగా.. లోన్లు ఇప్పిస్తామని ఫోటోలు తీసుకున్నారని వీరు చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా, కంటి వెలుగు పథకాల కోసం ఇచ్చిన వాణిజ్య ప్రకటనల్లో పద్మ ఫోటో పక్కన వేరే వ్యక్తి ఫోటో పెట్టి ప్రచురించారు. ఇప్పుడు ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. తెలుగు పత్రికలకు ఇచ్చిన వాణిజ్య ప్రకటనల్లో పద్మ, నాగరాజు ఫోటోలే ఉన్నాయి. ఆంగ్ల ప్రతికలు ఇచ్చిన వాణిజ్య ప్రకటనల్లో పద్మ ఫోటో పక్కన వేరే వ్యక్తి ఫోటో పెట్టారు. రెండు వాణిజ్య ప్రకటనల్లో పద్మఎత్తుకున్న బిడ్డ ఒక్కరే. కానీ ఆంగ్ల వాణిజ్య ప్రకటనల్లో భర్త ఫోటో పక్కన వేరే వ్యక్తి ఫోటో పెట్టడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. అయితే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దీన్ని సమర్థించుకుంటున్నారు. వివాదంపై ఎదురుదాడికి దిగుతున్నారు. వాణిజ్య ప్రకటనల్లో నటించే నటించేవారు ఎవరైనా కావొచ్చన్న వాదాన్ని లేవనెత్తున్నారు. సోషల్‌ మీడియా దీన్ని వివాదం చేయడం తగదని వారిస్తున్నారు.

ఫోటో మార్పిడిపై పద్మ స్పందించడంతో వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. వాణిజ్య ప్రకటనల్లో తన భర్త ఫోటో పక్కన వేరే వ్యక్తి ఫోటో పెట్టడాన్ని పద్మ తప్పు పడుతున్నారు. ప్రభుత్వ అధికారుల నిర్వాకంతో తమ కుటుంబ పరువు బజారుపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపకు స్నానం చేయిస్తుండగా తీసుకున్న ఫోటోలను ఇలా మారుస్తారా.. అని పద్మ ప్రశ్నించడంతో ప్రభుత్వ అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయపడినట్టు అయింది. లోన్లు ఇస్తామంటే ఫోటోలు దిగామని, భర్త ఫోటో మార్చి కుటుంబ పరువును వీధిపాలు చేశారని పద్మ మండిపడుతోన్నారు. ఫోటోలు మార్చి తమ సంసారంలో నిప్పులు పోస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంగ్ల పత్రికల్లో ఫోటో మార్చి వాణిజ్య ప్రకటన ప్రచురించిననాటి నుంచి తమ ఇంట్లో గొడవలు అవుతున్నాయని పద్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముకుంటే.. దీని నుంచి ఎలా బయటపడాలా.. అన్న అంశంపై ఇటు పాలకులు, అటు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. 

22:00 - August 14, 2018

రాహుల్ రాకతోని కాంగ్రెస్ రాత మారిందా..?..కేసీఆర్ ముందస్తు ఉత్తముచ్చటనేనా..?, బీసీల మీద టీఎంసీల కొద్ది గావురం గార్చిండు..ఓట్ల కోసం బదునాం బదలాయించిన సీఎం, ఆంధ్ర రాష్ట్రంల మంత్రులు ఆడోళ్ల మొగోళ్ల...అనుమానం వ్యక్తం జేస్తున్న ఆర్కే రోజా, జనసేనా పార్టీ గుర్తు పిడికిలన్న పవన్...మెనిఫెస్టోల ఒక్కొక్కటి ఇడిశిపెడ్తున్నడు, ఎన్నికలు దగ్గరికొస్తుంటే కులసంఘాలు...ఎన్నికలు అయిపోయినంక ఏ కులంలేదు, పామును వెంచుకుంటున్న పనిమంతుడు...విషం దీశిండ్రా లేదా అనేది తెలుస్తలేదు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

16:32 - August 14, 2018

హైదరాబాద్‌ : హరిత ప్లాజాలో సీనియర్‌ నేతలతో రాహుల్‌గాంధీ భేటీ ముగిసింది. హోటల్‌ హరిత ప్లాజాలో రాహుల్‌ భేటీలో గందరగోళం నెలకొంది. జానారెడ్డి పేరు లేకపోవడంతో గందరగోళం నెలకొంది. అలిగి బయటకు వెళ్లిపోవడానికి జానారెడ్డి, షబ్బీర్‌అలీ సిద్ధమయ్యారు. గూడూరు నారాయణరెడ్డి వారిని బతిమాలి లోనికి పంపారు. సీనియర్ల మీటింగ్‌లో లోపలికి రేవంత్‌రెడ్డికి, సునితా లక్ష్మారెడ్డికి పాస్‌ నిరాకరించారు. మరికాసేపట్లో రాహుల్‌గాంధీ గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు రాహుల్‌ నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్‌ సభలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీకి తిరిగి పయనమవుతారు. 

16:22 - August 14, 2018

హైదరాబాద్‌ : హరిత ప్లాజాలో సీనియర్‌ నేతలతో రాహుల్‌గాంధీ భేటీ ముగిసింది. మరికాసేపట్లో రాహుల్‌గాంధీ గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు రాహుల్‌ నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్‌ సభలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీకి తిరిగి పయనమవుతారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాహుల్ టూర్ సక్సెస్ అయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

 

16:12 - August 14, 2018

హైదరాబాద్‌ : హరిత ప్లాజాలో సీనియర్‌ నేతలతో రాహుల్‌గాంధీ భేటీ ముగిసింది. హోటల్‌ హరిత ప్లాజాలో రాహుల్‌ భేటీలో గందరగోళం నెలకొంది. జానారెడ్డి పేరు లేకపోవడంతో గందరగోళం నెలకొంది. అలిగి బయటకు వెళ్లిపోవడానికి జానారెడ్డి, షబ్బీర్‌అలీ సిద్ధమయ్యారు. గూడూరు నారాయణరెడ్డి వారిని బతిమాలి లోనికి పంపారు. సీనియర్ల మీటింగ్‌లో లోపలికి రేవంత్‌రెడ్డికి, సునితా లక్ష్మారెడ్డికి పాస్‌ నిరాకరించారు. మరికాసేపట్లో రాహుల్‌గాంధీ గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు రాహుల్‌ నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్‌ సభలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీకి తిరిగి పయనమవుతారు. 

 

09:21 - August 14, 2018

హైదరాబాద్ : తెలంగాణలో పార్టీనీ బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించేదుకు వచ్చిన రాహుల్ గాంధీ రెండవరోజు పర్యటన కొనసాగనుంది. ఈ క్రమంలో కాసేపట్లో బూత్ కమిటీ అధ్యక్షులతో రాహుల్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 9.30గంటలకు పార్టీ సీనియర్ నేతలలతో రాహుల్ చర్చలు జరపనున్నారు. అనంతరం 10.30గంటలకు మీడియా ఎడిటర్లతో సమావేశం..మధ్యాహ్నాం 12 గంటలకు తాజ్ కృష్ణాలో పారిశ్రామితక వేత్తలతో భేటీ కానున్నారు. 3.45గంటకు గన్ పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమ అమరవీరులకు రాహుల్ నివాళులర్పించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సరూర్ నగర్ సభలో పాల్గొని రాత్రి 7.30గంటలకు రాహుల్ గాంధీ తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.  

21:08 - August 13, 2018

హైదరాబాద్ : రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీతో బహింగ చర్చకు సిద్ధమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సవాల్‌ విసిరారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని రాహుల్‌ ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల విభజన హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రైతులు, నిరుద్యోగులను మోసం చేశారని శేరిలింగంపల్లి బహిరంగ సభలో రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేస్తున్న రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని రాహుల్‌ ఆరోపించారు. 540 కోట్ల రూపాయల విలువచేసే ఒక్కో రాఫెల్‌ యుద్ధ విమానానికి మోదీ ప్రభుత్వం 1600 కోట్లు చెల్లిస్తోందన్నారు. సాంకేతిక బదిలీలో భాగంగా ప్రభుత్వ రంగంలోని హెచ్‌ఏఎల్‌కు రాఫెల్‌ అసెంబ్లింగ్‌ను అప్పగించకుండా... ఏ అనుభవంలేని అనిల్‌ అంబానీ కంపెనీకి అప్పగించడంపై రాహుల్‌ మండిపడ్డారు. దీనిపై ప్రధాని మోదీతో ఎలాంటి బహిరంగ చర్చకైనా సిద్ధమని రాహుల్‌ సవాల్‌ విసిరారు.

మరోవైపు ఏపీకి, తెలంగాణ విభజన హామీల అమల్లో ప్రధాని మోదీ విఫలమయ్యారని రాహుల్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు తెలంగాణకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌... రైతులు, నిరుద్యోగులను మోసం చేశారని రాహుల్‌ ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేసీఆర్‌ విఫలమయ్యాయరని విమర్శించారు. నాలుగేళ్లలో తెలంగాణలో వందలాది మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని , రెవెన్యూ మిగులుతో అప్పగించిన తెలంగాణను కేసీఆర్‌ నాశనం చేశారని రాహుల్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి, మోసపూరిత విధానాలను ఇంటింటింకి వెళ్లి ప్రచారం చేయాలని రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను ఆదేశించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అకృత్యాలను ఎండగట్టాలని పిలుపు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన అందిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. 

21:06 - August 13, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో కేంద్రంతోపాటు తెలంగాణలోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అభయహస్తం పింఛను పథకం, స్వయం సహాయ సంఘాలకు పావలా వడ్డీకే రుణాల మంజూరును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణలో స్వయం సహాయ బృందాలు నిర్వీర్యమైపోయాయని రాహుల్‌గాంధీ విమర్శించారు. రుణాలు ఎగవేసి దేశం విడిచిపారిపోయే బడా పారిశ్రామికవేత్తలకే బ్యాంకు లోన్లు ఇస్తున్నాయని మండిపడ్డారు. బ్యాంకుల్లో ప్రజలను దాచుకున్న సొమ్మును బడా పారిశ్రామికవేత్తలు లూటీ చేస్తున్నారని శంషాబాద్‌లో జరిగిన స్వయం సహాయ బృందాల సదస్సులో రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనకు హైదరాబాద్‌ వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలను రాహుల్‌కు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్నాటకలోని బీదర్‌ వెళ్లిన రాహుల్‌ అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం తిరిగి శంషాబాద్‌ చేరుకుని టీపీసీసీ నిర్వహించిన స్వయం సహాయ బృందాల సదస్సులో పాల్గొన్నారు.

సహాయ బృందాల సభ్యులతో రాహుల్‌ ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ పాలనలో తమకు బ్యాంకు రుణాలు అందడంలేదని మహిళలు రాహుల్‌ దృష్టికి తెచ్చారు. స్వయం సహాయ బృందాల సమస్యలపై చలించిపోయిన రాహుల్‌.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తుందని హామీ ఇచ్చారు.
మోదీ పాలనలో దేశంలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై బీజేపీ నేతలు లైంగిక దాడులకు పాల్పడుతున్నా... మోదీ నోరు మెదపడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌లో బాలికలపై అత్యాచారాలు, అకృత్యాలు జరుగుతున్నా.. ప్రధాని పట్టించుకోపోవడాన్ని రాహుల్‌ తప్పుపట్టారు.

ప్రధాని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్‌టీని గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌తో పోల్చిన రాహుల్‌... కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్‌టీని ఒకే శ్లాబ్‌గా మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. నల్లధనం వెలికితీస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోదీ... అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రాహుల్‌ మండిపడ్డారు. బ్యాంకులను దివాలా తీయించిన ఘనత మోదీదేనని మండిపడ్డారు. రాహుల్‌గాంధీని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. 

17:34 - August 13, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గబ్బర్ సింగ్ ట్యాక్స్ తీసేసి గూడ్స్ అండ్ ట్యాక్స్ గా ఏర్పాటు చేస్తామని, ఐదు రకాల పన్నుల శ్లాబులు ఉండవని ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. ప్రతి నెలా జీఎస్టీ కోసం అనేక రకాలుగా దరఖాస్తులు నింపే అవకాశం లేదన్నారు. మహిళలు లేని దేశం ముందుకెళ్లలేదని..రాజకీయం..ఆర్థికం..ఇలాంటి ఏ రంగమైనా మహిళలను ముందుండాలని కాంగ్రెస్ అభిప్రాయమన్నారు. ఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సాధించిందంటే మహిళ శక్తి ప్రధానమన్నారు. మహిళా సంఘాలు చాలా ప్రధానమైనవని..వీటి అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పరిపాలన జరుగుతోందని...లాభమంతా ఆ కుటుంబానికి చెందుతోందన్నారు. భూములను లాక్కొంటున్నారని..మద్దతు ధర ఇవ్వడం లేదని..మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయడం లేదన్నారు. తెలంగాణలో ఉన్న పరిస్థితులు మోడీ పాలనలో కూడా కనిపిస్తున్నాయన్నారు. కేసీఆర్...మోడీ ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు కావడం లేదన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని, లక్షలాదిర రూపాయలు విద్య..వైద్యం కోసం నిరుపేదలు ఖర్చు పెట్టాల్సి వస్తోందన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - KCR government