kannada

10:56 - September 12, 2018

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రంపై ఓ వార్త సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ‘సైరా’ సినిమాను నిషేధిస్తారనే వార్త కలకలం రేపుతోంది. తెలుగు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో ఇతర భాష నటీనటులు కూడా నటిస్తున్నారు. శాండల్‌వుడ్ కు సంబంధించిన స్టార్ హీరో సుదీప్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘సైరా నరసింహారెడ్డి' సినిమాపై నిషేధం విధించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.  భారీ బడ్జెట్‌తో తెరకెక్కే తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల డబ్బింగ్ వెర్షన్ ని కన్నడలో విడుదల చేయాలని నిషేధించాలని అక్కడ సినీ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందంట. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించే వరకు తెలియదు. 

15:38 - April 20, 2017

హైదరాబాద్: బాహుబలి 2 కన్నడ మూవీపై నిరసనల ప్రభావం పడకుండా రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు.. సోషల్‌ మీడియా పేజ్‌లో వీడియో పోస్ట్ చేసిన జక్కన్న... సినిమా రిలీజ్‌ను అడ్డుకోవద్దంటూ కన్నడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. కన్నడలో మాట్లాడిన రాజమౌళి... తనకు కన్నడ భాష సరిగారాదని... ఏవైనా తప్పులుంటే క్షమించాలంటే మాటలు మొదలుపెట్టారు.. చాలాఏళ్లక్రితం సత్యరాజ్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాహుబలిని అడ్డుకోవద్దని కోరారు.. ఆ వ్యాఖ్యలు కేవలం సత్యరాజ్‌ వ్యక్తిగత అభిప్రాయంమాత్రమేనని స్పష్టం చేశారు.. ఆ విమర్శలతో బాహుబలి యూనిట్‌కు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు.. సినిమాకోసం ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కష్టపడి పని చేశారని జక్కన్న చెప్పారు.. రిలీజ్ అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. బాహుబలి తొలి భాగాన్ని ఆదరించినట్టుగానే రెండో భాగాన్ని కూడా ఆదరించాలని కన్నడ ప్రజలను కోరారు..

15:52 - April 13, 2017

బాహుబలి -2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్...పోస్టర్స్ అభిమానులను ఎంతగానో అలరించాయి. మరో రెండు వారాల్లో విడుదల కావాల్సి ఉండగా కర్నాటక రాష్ట్రంలో అడ్డంకులు ఇంకా తొలగలేదు. ఈ సినిమాను కర్నాటక రాష్ట్రంలో ఏ ఒక్క థియేటర్ లో అడనివ్వమని కన్నడ సంఘాలు తేల్చిచెబుతున్నాయి. నటుడు సత్యరాజ్ క్షమాపణలు చెప్పే వరకు తమ నిర్ణయంలో మార్పు ఉండదని కుండబద్ధలుగా చెబుతున్నాయి. తాము బాహుబలి 2 సినిమాకు వ్యతిరేకం కాదని, సినిమాలో కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ కు మాత్రమే వ్యతిరేకం అని పేర్కొంటున్నారు. కావేరీ నది జిలాల విషయంలో నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం జరుగుతున్న తరుణంలో తమిళనాడుకు చెందిన సత్యరాజ్‌ గతంలో తమిళనాడుకు కావేరీ నీటి సరఫరా అంశంపై కన్నడ సంఘాల పట్ల చులకనగా మాట్లాడారని ఆరోపణలున్నాయి. మరి చిత్ర విడుదల విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

19:44 - February 21, 2017

హైదరాబాద్: తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో మేథోమథన సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా సంపాదకులు హాజరయ్యారు. ప్రాథమిక పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి భాషగా ప్రవేశపెట్టాలని తెలుగు యూనివర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ కోరారు. మైసూర్‌లోని ప్రాచీన విశిష్ట భాషా కేంద్రాన్ని హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. చాలా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా కోర్సులు లేవని, విశిష్ట భాషా కేంద్రం ద్వారా ఈ కోర్సులు ప్రారంభించే అవకాశం ఉందని ఎస్వీ సత్యనారాయణ అన్నారు.

శాస్త్రీయ పద్ధతిలో తెలుగు నేర్చుకునేలా...

శాస్త్రీయ పద్ధతిలో తెలుగు నేర్చుకునేలా విద్యావిధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌ సూచించారు. తెలుగు భాషాభిమానులు, పాలకులు ఈదిశగా కృషి చేయాలన్నారు. భాష బలోపేతం కావాలంటే.. మాండలికాలను కూడా ప్రాంతీయ భాషల్లోకి చేర్చి వాడాలని ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ అభిప్రాయపడ్డారు. మాతృభాషను రక్షించుకోవడంతో పాటు భాష అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

మాతృభాషకు తమిళులు ఇచ్చినంత ప్రాధాన్యత తెలుగువారు ఇవ్వడం లేదని..

మాతృభాషకు తమిళులు ఇచ్చినంత ప్రాధాన్యత తెలుగువారు ఇవ్వడం లేదని టెన్‌ టీవీ అసోసియేట్‌ ఎడిటర్‌ శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. మాతృభాష సముజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందన్న భావన విద్యార్థుల్లో ఏర్పడినప్పుడే.. తెలుగు భాష పరిఢవిల్లుతుందన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా తెలుగు భాషాను వినియోగించాలని ఆయన సూచించారు. విద్యార్థులు, విద్యాసంస్థలు, భాషాభిమానులతో పాటు పరిపాలకులు కూడా మాతృభాష పరిపుష్టికి కృషి చేయాల్సిన అవసరం ఉందని వక్తలు సూచించారు.

12:33 - September 19, 2016

కన్నడలో ఘన విజయం సాధించిన 'రణతంత్ర' చిత్రం 'ఇది పెద్ద సైతాన్‌' పేరుతో తెలుగులో తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్ రాఘవేంద్ర, హరిప్రియ జంటగా నటిస్తున్నారు. ఆదిరామ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొదింది. శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి లతా మార్టోరి సమర్పణలో నిర్మాత వెంకట్రావ్‌ మార్టోరి అందిస్తున్నారు. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 30న రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రం హిట్ అవుతుందో లేదో చూడాలి మరి. 

 

07:33 - April 29, 2016

తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలతో అందరికీ సుపరిచితురాలైన అమలాపాల్‌ తాజాగా కన్నడ చిత్ర సీమలోకి కూడా అడుగిడుతోంది. 'హెబ్బులి' పేరుతో రూపొందనున్న కన్నడ చిత్రంలో సుదీప్‌ సరసన నటించేందుకు అమలాపాల్‌ గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమలాపాల్‌ స్పందిస్తూ, 'చాలా కాలంగా కన్నడ సినిమాలో నటించాలనుకుంటున్నాను. ఆ కోరిక 'హెబ్బులి'తో తీరుతోంది. ఈ చిత్ర కథ, కథనం చాలా వైవిధ్యంగా ఉన్నాయి. ముఖ్యంగా నాపాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది' అని చెప్పింది. 'నాయక్‌', 'ఇద్దరమ్మాయిలతో', 'జెండా పై కపిరాజు' చిత్రాలతో తెలుగునాట తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్‌ ప్రస్తుతం తమిళంలో 'అమ్మ కనక్కు' చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది.

07:47 - April 19, 2016

రాజ్‌ తరుణ్‌, హేబాపటేల్‌ జంటగా రూపొంది తెలుగునాట ఘనవిజయం సాధించిన చిత్రం 'కుమారి 21 ఎఫ్‌'. సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని శ్రీమాన్‌ దర్శకత్వంలో సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో సెవెన్‌ ఛానల్‌ మాణిక్యం నారాయణన్‌, శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఎ.ఎన్‌.బాలాజీ సంయుక్తంగా కన్నడలో రీమేక్‌ చేస్తున్నారు. 'గత 9 ఏండ్లుగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ దర్శకత్వ శాఖలో మంచి అనుభవం సంపాదించిన శ్రీమాన్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు సాగర్‌ మహతి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌ కె.కె.సెంథిల్‌ కుమార్‌ దగ్గర వర్క్‌ చేసి 'గుంటూరు టాకీస్‌', 'ఒక మనసు' చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన రామిరెడ్డి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి' అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌.

07:43 - March 17, 2016

బాలీవుడ్‌ బ్యూటీగా పేరొందిన జూహీ చావ్లా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ ఓ కన్నడ చిత్రంలో నటిస్తోంది. 1987లో రవిచంద్రన్‌ సరసన 'ప్రేమ లోక' చిత్రంలో జూహీ నటించింది. ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ కన్నడ ప్రేక్షకుల్ని అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో 'పుష్పక విమాన' చిత్రం రూపొందనుంది. ఈచిత్రంలోని ఓ కీలక పాత్రలో జూహీ నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. తండ్రీకూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో తెరకెక్కే చిత్రమిదని దర్శకుడు రమేష్‌ అరవింద్‌ తెలిపారు. జూహీ ఇటీవల బాలీవుడ్‌లో నటించిన 'చాక్‌ అండ్‌ డస్టర్‌' చిత్రానికి మంచి స్పందన లభించింది.

21:33 - January 30, 2016

కెనడా : హిమపాతం వణికిస్తోంది. పశ్చిమ ప్రాంతంలో భారీ హిమపాతం వల్ల జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న మంచు కారణంగా ఐదుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో విపరీతంగా మంచు కురవడంతో పాటు వర్షాలుడ పడ్డాయి.

07:31 - December 27, 2015

అలనాటి అగ్ర నటులు ఎన్టీఆర్‌, కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ల ఫ్రెండ్‌షిప్‌ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి లేదు. వారిద్దరి స్నేహాబంధాన్ని వారి వారసులైన ఎన్టీఆర్‌ మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌, రాజ్‌కుమార్‌ తనయుడు పునీత్‌ రాజ్‌కుమార్‌లు కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరు వారసులు తమ తమ 25వ చిత్రాల్లో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 25వ చిత్రంగా 'నాన్నకు ప్రేమతో' లో నటిస్తుండగా, పునీత్‌ రాజ్‌ కుమార్‌ 25వ చిత్రంగా 'చక్రవ్యూహ'లో నటిస్తున్నాడు. స్నేహితుడు రాజ్‌ కుమార్‌ కోరిక మేరకు కన్నడ చిత్రం 'చక్రవ్యూహ'లో ఎన్టీఆర్‌ ఓ పాట పాడటం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ సంగీత దర్శకుడు థమన్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు. దీంతోపాటు పునీత్‌ రాజ్‌కుమార్‌, ఎన్టీఆర్‌లతో కలిసి దిగిన ఫొటోలను 'ఇద్దరు గొప్ప నటులు కలిసి వేళ..' అంటూ పోస్ట్‌ చేసి అభిమానులతో పంచుకున్నారు. పునీత్‌ 25వ చిత్రానికి థమన్‌ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటను సంగీత దర్శకుడు థమన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ కేవలం రెండే రెండు గంటల్లో పాటను పాడారు. 'యాదృచ్చికంగా మా ఇద్దరివి 25వ చిత్రాలే. రాజ్‌కుమార్‌ చిత్రంలో పాట పాడ్డం సంతోషంగా ఉంది' అని ఎన్టీఆర్‌ సైతం ట్వీట్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - kannada