kamal hassan

22:14 - August 14, 2018

డీఎంకే నేత..మాజీ సీఎం కరుణానిధి మరణం అంతరం ఆ పార్టీలో అంతర్గత కలహాలు చెలరేగాయి. పార్టీ అధ్యక్ష పదివి నాదంటు నాదని డీఎంకేలో వారసత్వపు పోరు ప్రారంభమయ్యింది. కరుణానిధి జీవించి వున్నంతకాలంగా పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగారు. ఇప్పుడు ఆయన మరణం అనంతం ఆయన కుమారులైన స్టాలిన్, అళగిరిల మధ్య అధ్యక్షపదవికి సంబంధించిన కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కరుణానిధి మరణం అనంతం పార్టీ 750మంది సభ్యులతో కార్యనిర్వాహక కమిటీ తొలిసారి సమావేశమయ్యింది. పార్టీ అధ్యక్ష పదవికి తాను అర్హుడినేనంటు..తండ్రి కరుణానిధికి మిత్రులు తనకే మద్దతునిస్తున్నారంటూ అళగిరి ప్రకటన పార్టీలో అలజడి రేపింది. ఇదే అంశంపై విశ్లేషకులు లక్ష్మీనారాయణ విశ్లేషణ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

18:57 - August 10, 2018

2013లో వచ్చిన 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం 2' రూపొందించారు. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్ ముఖ్య పాత్రలు పోషించారు. కానీ పలు కారణాల వల్ల ఐదేళ్ల తరవాత ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్ర రివ్యూ...రేటింగ్ కోసం వీడియో క్లిక్ చేయండి.

 

13:45 - April 8, 2018

చెన్నై : తమిళనాడులో కావేరి జలాలకు మద్దత్తుగా తమిళచిత్రసీమ  దీక్ష చేపట్టింది. దీక్షలో కోలీవుడ్‌కు చెందిన 24 క్రాప్ట్స్‌ పాల్గొన్నాయి. స్థానిక వల్లువర్‌ కొట్టం వద్ద జరుగుతున్న ఈ దీక్షలో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, సూర్య, విశాల్, కార్తీ, విక్రమ్‌తో పాటు.. దర్శకులు నిర్మాతలు తదితరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తమిళుల కనీస హక్కుగా కావేరి మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ కు మద్దత్తుగా మౌన దీక్షలో పాల్గొంటున్నామని సీనియర్‌ నటుడు నాజర్‌ తెలిపారు. మరోవైపు రాష్ట్ర రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో.. చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచులు నిర్వహించడం సరికాదన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు కనీసం నల్ల బ్యాడ్జీలను ధరించాలన్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని కోరారు.

22:11 - April 1, 2018

తమిళనాడు : కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలనే తమిళనాడులో ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే పార్లమెంట్‌లో అన్నాడిఎంకె, ఎంపీలు ఆందోళనలు చేస్తుండగా... వివిధ పార్టీలు, రైతు సంఘాల ఆందోలనతో  తమిళనాడు భగ్గుమంటోంది. ఇదే విషయంపై అన్నాడిఎంకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలకు పిలుపునివ్వగా డిఎంకే ఇవాళే ఆందోళనలు చేపట్టింది. ఈ ఆందోళనలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో పోలీసులు పలుచోట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. 

15:47 - April 1, 2018

తమిళనాడు : తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ ప్లాంట్‌ బాధితులకు మక్కల్‌ నీది మయమ్‌ పార్టీ అధినేత నటుడు కమల్‌ హాసన్‌ మద్దతు తెలిపారు. ప్లాంట్‌ను మూసివేయాలని బాధితులు గత 52 రోజులుగా నిరవదిక దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతు పలికిన కమల్‌ హాసన్‌ నేరుగా తూత్తుకుడి వెళ్లి వారితో దీక్షలో పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వ వ్యతిరేకంగా అన్ని పార్టీలు ప్రజాసంఘాలు బాధితులకు సంఘీభావం తెలుపుతుండటంతో తూత్తుకుడి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

 

07:05 - April 1, 2018

చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడిలో వివాదాస్పద స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టెరిలైట్‌ కారణంగా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నా...కర్మాగార నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతించడం శోచనీయమన్నారు. '47 రోజులుగా అక్కడి ప్రజలు చేస్తున్న ఆందోళన పట్టదా' అంటూ రజనీ ట్వీట్‌ చేశారు. స్టెరిలైట్‌ ఆందోళనకు మరో నటుడు కమల్‌హాసన్ కూడా తన మద్దతు ప్రకటించారు. ఏప్రిల్ 1న జరిగే నిరసన కార్యక్రమానికి కమల్ నాయకత్వం వహిస్తారు. 'తూత్తుకుడిలో మరో భోపాల్ తరహా విషాదం జరగనీయం' అని కమల్‌హాసన్ తెలిపారు. వేదాంత గ్రూప్ చేపడుతున్న స్టెరిలైట్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా గత 48 రోజులుగా గ్రామస్థులు ఆందోళన సాగిస్తున్నారు. కాపర్ ప్లాంట్ కారణంగా తాము శ్వాససంబంధిత ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

12:55 - March 30, 2018

తమిళనాడు : కావేరి మేనేజింగ్‌ బోర్డును ఏర్పాటు చేసి తీరాల్సిందేనని నటుడు, మక్కల్‌ నీది మయ్యుం అధ్యక్షుడు కమల్‌ హసన్‌ స్పష్టం చేశారు. కావేరి నీటి విషయంలో కేంద్రంపై తమిళ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకపోతే జయలలితకు ద్రోహం చేసినట్లేనని అన్నారు. కావేరి బోర్డు విషయంపై త్వరలో ముఖ్యమంత్రి పళనిస్వామితో చర్చిస్తానని చెప్పారు. కావేరి బోర్డు ఏర్పాటు పై ఓటు రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. కావేరి బోర్డు కోసం రజనీకాంత్‌ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని తెలిపారు. భోపాల్‌ ఉదంతం తమిళనాట చోటు చేసుకోవద్దంటే సెర్టిలైట్‌ ప్లాంట్‌ను అక్కడి నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

07:12 - March 26, 2018

చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉన్న స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రజలు ఆమరణ నిరాహార దీక్షకు దిగటం సంచలనం సృష్టిస్తోంది. కలుషిత నీటితో సమీప గ్రామ ప్రజలు మృత్యువాత పడటం.. ఇతర గ్రామాలలో పంటలు నాశనమవుతున్నాయని 12 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ పోరాటానికి నటుడు కమలహాసన్‌, ఎండిఎంకే నేత వైగో మద్దతు పలికారు. ఆందోళనకారులతో దీక్షలో కూర్చునేందుకు బయలుదేరిన నేతలను తమిళనాడు ప్రభుత్వం అరెస్ట్‌ చేయడంతో, తూత్తుకుడి జిల్లా ప్రజలు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని దీక్షలో కుర్చున్నారు. జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తోంది. ఫ్యాక్టరీ మూసి వేసివేసేంత వరకు పోరాటం చేస్తామని ప్రజలు తేల్చి చెబుతున్నారు.

21:55 - March 20, 2018

చెన్నై : కొత్త పార్టీ, జెండా, ఎజెండా ఎప్పుడనేది కాలమే నిర్ణయిస్తుందని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు. ఏప్రిల్ 14న పార్టీ జెండా ఆవిష్కరిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. హిమాలయాల్లో ఆధ్మాత్మిక యాత్ర ముగించుకుని చెన్నైకి చేరుకున్న రజనీ మీడియాతో మాట్లాడారు. హిమాలయ యాత్ర తనలో కొత్త శక్తి ఇచ్చిందని పేర్కొన్నారు. తన వెనక బిజెపి ఉందన్న వార్తలను రజనీ ఖండించారు. తన వెనక ద్రవిడ పార్టీలు, వ్యక్తులు ఎవరూ లేరని తాను స్వయంగా ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పారు. రామరాజ్య రథయాత్ర కారణంగా మత విద్వేషాలు చెలరేగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని రజనీకాంత్‌ స్పష్టం చేశారు.

 

07:38 - January 26, 2018

చెన్నై : ఫిబ్రవరి 21న పార్టీ పేరును ఖరారు చేయనున్నట్లు  ప్రముఖ తమిళ నటుడు కమల్‌హసన్ తెలిపారు. పార్టీ చిహ్నం, విధి విధానాలను కూడా అదేరోజు ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 21 నుంచి రాజకీయ పర్యటన ప్రారంభం కానుందని ఆయన పేర్కొన్నారు. ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని మోడల్‌గా నిలుస్తామని చెప్పారు. సినిమాలోనే కాదు...రాజకీయాల్లోనూ తానేంటో నిరూపించుకుంటానని కమల్‌ చెప్పారు. రజనీకాంత్‌, తాను తమిళ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తామని వెల్లడించారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - kamal hassan