Jubilee Hills Police

13:16 - September 12, 2018

హైదరాబాద్ : టి.టిడిపి నేత రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది.  తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఫీవర్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. రాజకీయ కుట్రలో భాగంగా అరెస్టులు చేశారని టీ.పీసీసీ ఆరోపించింది. మరో నేత గండ్ర వెంకటయ్య వీరయ్యకు పోలీసులు ఓ కేసు నిమిత్తం నోటీసులు జారీ చేశారు. తాజాగా టి.టిడిపి నుండి కాంగ్రెస్ లో జంప్ అయిన రేవంత్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

బుధవారం జూబ్లీహి ల్స్ హౌజింగ్ సొసైటీ కేసులో రేవంత్ కు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. తప్పుడు డ్యాక్యుమెంట్లతో సొసైటీ సొసైటీలో అక్రమంగా లబ్ది పొందారనే ఆరోపణలతో నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు 13 మంది సభ్యులకు కూడా నోటీసులు జారీ చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో తాను బిజీగా ఉన్నట్లు ప్రస్తుతం రాలేనని రేవంత్ స్పష్టం చేశారు. 

10:29 - July 28, 2018

హైదరాబాద్ : శుక్రవారం అర్ధరాత్రి జూబ్లీ హిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పట్టుబడ్డాడు. మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్‌ వైపు వస్తున్న రాహుల్‌కు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా 178 పాయింట్లు వచ్చాయి. అయితే, తాగిన మైకంలో ఉన్న రాహుల్ పోలీసులకు సహకరించకుండా వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో కేసు బుక్ చేసిన పోలీసులు కారును సీజ్ చేశారు. రాహుల్‌తోపాటు యాంకర్, నటుడు లోబో కూడా ఉన్నాడు. రాహుల్ సిప్లిగంజ్ లైసెన్స్ లేకుండానే కారు నడిపినట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన రంగస్థలం సినిమాలో టైటిల్ సాంగ్ పాడింది రాహులే. పూర్‌ గర్ల్, మంగమ్మ, మాక్కికిరికిరీ, గల్లీకా గణేష్‌ వంటి ప్రైవేట్‌ ఆల్బమ్‌లతో రాహుల్‌ మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు.

11:21 - April 22, 2018

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని డైమండ్ హౌస్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 31 మందిపై కేసులు నమోదు చేశారు. ఒక లారీ, 13 కార్లు, 2 ఆటోలు, 18 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

08:53 - April 8, 2018

హైదరాబాద్‌ : నగంరలో జూబ్లీహిల్స్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ యువజంట చుక్కలు చూపించింది. మద్యం మత్తులో కారులో జాలీగా ట్రిప్‌ వేస్తున్న జంటను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యువతి రెచ్చిపోయింది. ప్రియుడికి బ్రీత్‌అనలైజర్‌తో టెస్ట్‌ నిర్వహించకుండా బండబూతులు తిడుతూ, ళ్లు విసురుతూ హల్‌చల్‌ చేసింది. కొద్దిసేపు తంటాలు పడిన పోలీసులు ఆ ఇద్దరికీ నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. కాగా ఈ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 103 బైక్‌లతో సహా45కార్లు, రెండు ఆటోలను పోలీసులు సీజ్‌ చేశారు. 

 

08:25 - January 17, 2018

హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లు ఎన్ని నిర్వహిస్తున్నా మందుబాబులు మారడం లేదు. వీకెండ్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. యువతీ, యువకులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ చిక్కుతూనే ఉన్నారు. జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మద్యం మత్తులో సుహాని యువతి హల్ చల్ చేసింది. బ్రీత్ ఎనలైజర్ టెస్టుకు సహకరించకుండా పారిపోయేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకు ఆమెకు టెస్టు చేయగా మోతాదుకు మించిన మద్యం సేవించినట్లు వెల్లడైంది. దీనితో ఆమె ప్రయాణించిన కారును సీజ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 59 మందిపై కేసులు నమోదు చేశారు. 34 కార్లు, 25 బైక్ లు సీజ్ చేశారు.

 

09:52 - November 6, 2017

హైదరాబాద్: హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని తన వాహనంలో ప్రయాణిస్తూ.. నిలిపి ఉంచిన మరో కారును ఢీ కొంది.. శనివారం జూబ్లీ హిల్స్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే తన కారు పూర్తిగా డ్యామేజీ కావడంతో బాధితుడు తనకు 30 లక్షలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. శివానీ తల్లి జీవిత వచ్చి బాధితునితో మాట్లాడి సమస్యను సానుకూలంగా పరిష్కరించుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు కారు డ్యామేజ్‌కి సంబంధించి ఎస్‌పీవీఎస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ సీనియర్‌ ఆపరేషనల్‌ మేనేజర్‌ అశోక్‌‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివానిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Don't Miss

Subscribe to RSS - Jubilee Hills Police