Janasena pawan kalyan

06:54 - July 29, 2018

విజయవాడ : పాలకుల అరాచకాలకు బలైపోతున్న దళితులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు జనసేనాని. నవ్యాంధ్ర రాజధాని కోసం మూడు పంటలు పండే భూములు లాక్కుని.. పరిహారంలోనూ వివక్ష ప్రదర్శిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న దళితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూదోపిడీని అడ్డుకునేందుకు అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. భూపరిహారంలో కూడా వివక్షను నిరసిస్తూ ఉద్దండరాయపాలెంలో కొనసాగుతున్న దళితుల నిరశన దీక్షను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విరమింపజేశారు. దీక్ష చేస్తున్న నాయకులకు నిమ్మరసం ఇచ్చిన జనసేనాని.. దళితుల పోరాటానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

అమరావతి రాజధాని కోసం 29 గ్రామాల్లో మూడు పంటలు పండే భూములను తీసుకున్న ప్రభుత్వం.. అసైన్డ్‌ భూములకు ఇతరులకు ఇచ్చేవిధంగా సమాన ప్యాకేజీ ఇవ్వడం లేదని నిరసన తెలుపుతున్న దళితులు పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న భూదోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరముందని స్పష్టం చేశారు పవన్‌కల్యాణ్‌. దళితుల న్యాయమైన పోరాటానికి జనసేన అండగా ఉంటుందన్నారు జనసేనాని.

సమాజంలో దళితులకు జరుగుతున్న అన్యాయమే.. ప్యాకేజీ చెల్లింపులోనూ కొనసాగిస్తున్నారన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. దళితులు గౌరవప్రదంగా బతికే రోజులు రావాలన్నారు. ఇళ్ల స్థలాలు లేని దళితులందరికీ భూములు ఇవ్వాలని,.. అందరికీ సమానమైన ప్యాకేజీ ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం చేసే కుట్రలను అడ్డుకునేందుకు అందరూ సమిష్టిగా పోరాటం చేయాలని.. వారికి జనసేన, వామపక్షాలు అండగా ఉంటాయని జనసేనాని స్పష్టం చేశారు. 

17:33 - July 28, 2018

విజయవాడ : అడ్డగోలుగా భూసేకరణ చేస్తే మహారాష్ట్ర తరహాలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం శ్రీకాకుళం, అనంతపురం నుంచి ఉప్పెనలా వస్తామన్నారు. ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడానికి సీఎం సొంత రాజ్యం కాదన్నారు.

తన సభలకు భద్రత కుదరదని చెప్పే పోలీసులపై తనకెలాంటి వ్యతిరేకతా లేదన్నారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వారు అలా వ్యవహరించి ఉంటారని అభిప్రాయపడ్డారు. భీమవరంలో ఇప్పటివరకు చెత్త డంపింగ్‌ యార్డు లేదన్న పవన్‌.. బాధ్యతాయుతమైన అభివృద్ధి చేయాలని అన్నారు. ప్రజల కోసం తాను చావడానికి సిద్ధమని, పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. కలుషితమైన రాజకీయాలను మార్చడానికే వచ్చానన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కన్నీటి కథలే వినబడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రశ్నించేవారిని భయపెడుతున్నారన్నారు.

12:43 - April 7, 2018

హైదరాబాద్ : ట్విట్టర్‌ వేదికగా పవన్‌ కల్యాణ్‌ మరోసారి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టారు. దేశంలో వాయుకాలుష్యంపై ప్రశ్నించారు. భారత్‌ ఆర్థికంగా దూసుకుపోతున్నా, భారత్ వెలిగిపోతున్నా.. దేశంలో స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే పరిస్థితి లేదని అన్నారు. ఇందుకు నాయకుల చర్యలే కారణమని అన్నారు. స్వచ్ఛమై గాలి, నీరు దొరకడం లేదని తుందుర్రు యువత ప్రశ్నిస్తోందన్నారు.

 

20:21 - April 6, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఏపీ ప్రభుత్వానికి ఏడు ప్రశ్నలు సంధించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సంగం జాగర్లమూడిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రత్యేక హోదా కోసం..విభజన హామీల అమలు కోసం గత నాలుగేళ్లుగా ఏపీ సీఎం బాబు ఏం చేస్తున్నారు ? గాడిదలు కాస్తున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీలు చర్చలు జరిపితే ఏం తప్పని ప్రశ్నించారు. ఆనాడు ప్యాకేజీని మెచ్చుకున్న బాబు ప్రస్తుతం యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను గొంగళి పురుగునైనా ముద్దాడుతానని కేసీఆర్ చెప్పారని..తెలంగాణ సాధించారా ? లేదా ?..ఇక్కడ సంకల్పం ముఖ్యమన్నారు. పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడం అభినందనీయమని, టిడిపి ఎంపీలు కూడా రాజీనామా చేయాల్సి ఉండేదని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదని, హోద అనేది ప్రజల అభిమతమన్నారు. వైసీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తునన్నామని, చివరి బడ్జెట్ లో న్యాయం దక్కకపోవడంతో ఆఖరి అస్త్రం ప్రయోగించామన్నారు.

1 ప్రశ్న : ప్లానింగ్ కమిషన్ కు ఏపీ సీఎం చంద్రబాబు ఒక్క లేఖ రాయలేదని, అప్పటి నుండి ఏమీ చేస్తున్నారు ? గాడిదలు ఏమైనా కాస్తున్నారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

2వ ప్రశ్న : సెప్టెంబర్ 8, 2016 రోజున ప్రత్యేక హోదా..అబద్ధపు ప్యాకేజీ అంటూ అర్ధరాత్రి కేంద్ర మంత్రి జైట్లీ ప్రకటన చేశారని...బాబుతో చర్చలు జరిపిన అనంతరం ప్యాకేజీని ప్రకటించారని ప్రచారం జరిగిందని తెలిపారు. బాబు కోరిక మేరకు ప్యాకేజీని ప్రకటించామని జైట్లీ లేఖలో ఒక భాగమన్నారు. ప్యాకేజీని గొప్పగా ఉందని పేర్కొనలేదా ? ఢిల్లీకి వెళ్లి జైట్లీని సిన్మానించలేదా ? అసెంబ్లీలో మాట్లాడలేదా ? ఈ విషయంలో బాబు పలు వ్యాఖ్యలు చేశారన్నారు. ఇది మోసం కాదా? అని ప్రశ్నించారు.

3వ ప్రశ్న : హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టకుండా..లేని జీఎస్టీ ఫిగర్స్ ప్రకటించారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే వేగంగా పరుగెత్తుతున్న రాష్ట్రం ఏపీ అని బాహ్య ప్రపంచానికి చెప్పలేదా ? విశాఖలో జరిగిన సమావేశాల్లో కోట్ల పెట్టుబడులు వచ్చాయని..ఉద్యోగాలు వచ్చాయంటూ చెప్పలేదా ? రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కన్నా ఎక్కువగా ఉందని..చెప్పలేదా ? అని నిలదీశారు.

4వ ప్రశ్న : హోదా పై టిడిపి ఎలాంటి పోరాటం చేసింది ? నాలుగేళ్లుగా వైసీపీ పోరాటం చేసిందన్నారు. ఆయా సమయాల్లో పోలీసుల చేత నిర్భందం ప్రయోగించారని, ప్రధాన మంత్రి వస్తున్నారని తాను చేపట్టిన దీక్షను భగ్నం చేయించారని...ఎన్నో ఆందోళనలు నీరు గార్చలేదా ? యువభేరీ కార్యక్రమం నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేశామని..ఈ కార్యక్రమానికి హాజరయితే పీడీ యాక్టు పెడుతామని హెచ్చరించలేదా ? అని ప్రశ్నించారు.

5వ ప్రశ్న : వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండకపోతే బాబు అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండేవారా ? అని ప్రశ్నించారు. సంఖ్యాబలం ఉంటేనే మద్దతిస్తానని చెప్పిన బాబు యూ టర్న్ తీసుకున్నారన్నారు. తాను రాసిన లెటర్ ను ఇతర విపక్ష నేతలకు చూపించి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారని, దీనితో అవిశ్వాస తీర్మానం పెడుతామని బాబు ప్రకటించారని తెలిపారు.

6వ ప్రశ్న : అఖిలపక్షం అని చెప్పి డ్రామాలుడుతున్నారని, నిరసనలు తెలియచేయవద్దని..విద్యార్థులను ఉద్యమంలోకి రావద్దని..ఉద్యమం పెద్దది అయితే రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందని..కేవలం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియచేయాలని బాబు కార్యచరణ ఉందని ..ఇది మోసం కాదా ? అని నిలదీశారు.

7వ ప్రశ్న : హోదా సాధ్యమౌతుందని తెలిసి..ఆఖరి బడ్జెట్ అని కూడా తెలిసి 25 మంది ఎంపీలు ఒక్కదగ్గరకు వచ్చి రాజీనామాలు చేసి..నిరహార దీక్ష చేస్తే కేంద్రం దిగి వస్తుందని తెలిసి వారి ఎంపీల చేత రాజీనామాలు చేయకపోవడం ధర్మమమేనా ? అని ప్రశ్నించారు. ప్రజలను మళ్లీ మభ్య పెడుతున్న బాబు చరిత్ర హీనుడుగా నిలిచిపోతాడన్నారు. 

07:31 - April 6, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా.. ఇవాళ విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో జనసేన, సీపీఎం, సీపీఐ పాదయాత్ర చేపట్టనున్నాయి. ఈ పాదయాత్రలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొంటారు. శాంతియుతంగా జరిగే ఈ పాదయాత్రకు ప్రజలంతా సహకరించాలని జనసేన అధికార ప్రతినిధి హరిప్రసాద్‌ కోరారు.  

 

22:07 - April 5, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా.. రేపు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో జనసేన, సీపీఎం, సీపీఐ పాదయాత్ర చేపట్టనున్నాయి. ఈ పాదయాత్రలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొంటారు. శాంతియుతంగా జరిగే ఈ పాదయాత్రకు ప్రజలంతా సహకరించాలని జనసేన అధికార ప్రతినిధి హరిప్రసాద్‌ కోరారు.  

21:49 - April 4, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా ఉద్యమ సెగలు ఢిల్లీని తాకాలన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. లెఫ్ట్‌పార్టీలతో కలిసి చేపట్టబోయే ఆందోళనలతో  కేంద్ర ప్రభుత్వం దిగిరావాల్సిందే అన్నారు.  ఢిల్లీలో టీడీపీ, వైసీపీలు చేస్తున్న హంగామా వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదన్నారు లెఫ్ట్‌పార్టీ నేతలు. బీజేపీ, టీడీపీ, వైసీపీలు రాజకీయ ప్రయోజనాలకోసమే డ్రామాలాడుతున్నాయని ధ్వజమెత్తారు. జనసేనతో కలిసి ఈనెల ఆరున రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపడతామని  కమ్యునిస్టు నేతలు ప్రకటించారు. 
ఐక్యంగా ఉద్యమం 
ఏపీకి ప్రత్యేక హోదా, విభజనహామీలపై పోరాటాన్ని ఉధృతం చేయడానికి లెఫ్ట్ పార్టీలు, జనసేనపార్టీలు కార్యచరణ ప్రకటించాయి. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, సీపీఐ, సీపీఎం రాష్ట్రకార్యదర్శులు రామకృష్ణ, మధుతో విజయవాడలో సమావేశమయ్యారు. అనంతరం... భవిష్యత్‌  ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు.  
టీడీపీ, వైసీపీ విమర్శలతోనే కాలక్షేపం 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తే.. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిని మరిచిపోయి.. పరస్పరం విమర్శలకు దిగుతున్నాయని జనసేన అధినేత పవన్‌  విమర్శించారు.  ప్రత్యేక హోదా సాధనలో భాగంగా  ఏప్రిల్‌ 6న రాష్ట్ర వ్యాప్తంగా  జాతీయ రహదారులపై పాదయాత్రలు నిర్వహిస్తున్నమన్నారు. రాబోయే రోజుల్లో వామపక్షాలతో కలిసి నిర్వహించే  ప్రత్యేక హోదా పోరు సెగలు ఢిల్లీనీ తాకుతాయన్నారు పవన్‌ కల్యాణ్‌.   
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని బలహీనపర్చే కుట్రలు
కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని వామపక్షాల నేతలు ఆందోళన వెలిబుచ్చారు.  చట్టాలను బలహీనపరుస్తూ .. దళితులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు  ఏపీ అంటే అమరావతి,పోలవరం అన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏపీ అంటే అనంతపురం నుంచి పార్వతీపురం అని ఆయన తెలుసుకోవాలన్నారు. అభివృద్ధిని అమరావతి చుట్టే కేంద్రీకృతం చేస్తూ.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని లెఫ్ట్‌ నేతలు విమర్శలు గుప్పించారు. అటు విపక్ష వైసీపీ కూడా రాజకీయ ప్రయోజనాలకోసమే ప్రత్యేకహోదా, పార్లమెంటులో అవిశ్వాసం అంటూ డ్రామాలు మొదలు పెట్టిందని వామపక్షనేతలు ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, వైసీపీల వైఖరిని ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా  సభలు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. మేధావులు, యువతను సమన్వయం చేస్తూ ఉద్యమాన్ని నడిపిస్తామని తెలిపారు. మొత్తానికి జనసేనానితో కలిసి  ఉమ్మడి కార్యాచరణ ప్రకటించిన కమ్యూనిస్టుపార్టీలు.. ఏపికి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లతామని స్పష్టం చేశారు. 

 

17:26 - April 4, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యే హోదా ఇవ్వకుండా బీజేపీ నమ్మకద్రోహం చేసిందని వామపక్షాలు, జనసేన విమర్శించాయి. విజయవాడలో  సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు , రామకృష్ణ, మధు.. పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలు, ప్రత్యేకహోదాతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టంపై కేంద్రం వైఖరిని నేతలు ఖండించారు. రాష్ట్రప్రయోజనాలు పట్టించుకుండా టీడీపీ, వైసీపీలు రాజకీయ డ్రామాలకు తెరతీశాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 6న జాతీయ రహదారులపై పాదయాత్రలు నిర్వహిస్తామని జనసేన-లెఫ్ట్‌పార్టీల నేతలు ప్రకటించారు.   ఈ పాదయాత్రల్లో తాను స్వయంగా పాల్గొంటానని జనసేన అధినేత పవన్‌ తెలిపారు. శాంతియుతంగా చేపట్టే నిరసన సెగలు ఢిల్లీని తాకాలన్నారు. అటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని.. దీనికి వ్యతిరేకంగా వామక్షాలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. 

 

15:59 - April 4, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ నమ్మకద్రోహం చేసిందని వామపక్షాలు, జనసేన విమర్శించాయి. ఈమేరకు వామపక్ష నేతలు మధు, రామకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. నమ్మక ద్రోహానికి నిరసనగా ఈనెల 6న జాతీయ రహదారులపై పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. విభజన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా ఈ పాదయాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే చర్యలను వామపక్షాలు, జనసేన సీరియస్ గా తీసుకున్నాయి. ఫిబ్రవరిలో వామపక్షాలు బంద్ కు పిలుపు ఇవ్వకపోతే దేశమంతా ఏపీ గురించి చర్చ జరిగేది కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. అవిశ్వాసానికి పవన్ డిమాండ్ పెట్టి ఉండకపోతే దేశమంతా ఏపీ గురించి చర్చ జరిగేది కాదని వామపక్షాలు అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ నమ్మకద్రోహం చేసిందన్నారు. టీడీపీ, వైసీపీలు పరస్పరం విమర్శలతో కాలక్షేపం చేస్తున్నాయని విమర్శించారు. టీడీపీ, వైసీపీ సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. 

15:14 - April 4, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - Janasena pawan kalyan