Jagtial

21:01 - September 12, 2018

జగిత్యాల : కొండగట్టు బస్సు ప్రమాద ఘటనతో మూడు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడి 57 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. బస్సు ప్రమాదంలో  డబ్బుతిమ్మాయిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. వీరి మృతితో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తలు అంటున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాల్లో ఒక్కొరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. లేని ఎడల మూడు గ్రామాల ప్రజలందరం ధర్నా చేపడతామని హెచ్చరించారు. డొక్కు బస్సులు వేసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు.

జగిత్యాల జిల్లాలో కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 57 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల్లో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘాట్‌రోడ్డులో బ్రేక్ లు ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. 

22:23 - September 11, 2018

జగిత్యాల : జిల్లా కొండగట్టు బస్సు ప్రమాదానికి కారణాలేంటీ ? భారీ స్థాయిలో మృతుల సంఖ్య పెరగడానికి...డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా ? లేదంటే ఘాట్ రోడ్డులోని చివరి మలుపు కొంపముంచిందా ? ఘాట్ రోడ్డయినప్పటికీ....పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నారా ? 

గతంలో ఎన్నడూ చోటు చేసుకొని...వినని విషాదమిది...ఒకరు కాదు ఇద్దరు కాదు...పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లోకి...జగిత్యాల జిల్లాలోనే అతి పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం...కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లు...బస్సు ప్రమాదానికి కారణాలెన్నో. బస్సు చాలా పాతది కావడంతో పాటు కండీషన్ లో ఉందా లేదా అనేక సందేహాలకు తావిస్తోంది. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు చాలా పాతది కావడంతోనే ప్రమాదం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.

మంగళవారం కావడంతో ఎక్కువ మంది భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో...పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఎక్కారు. కొండగట్టు చివరి మలుపు వద్ద ప్రయాణికులందరూ డ్రైవర్‌ వైపు ఒరగడంతో...ఒకవైపే బస్సులో బరువు పెరిగింది. దీంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. బస్సు మరో నిమిషంలో ప్రధాన రహదారికి చేరుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదం జరిగిన ఘాట్ రోడ్డులో....బస్సు వెళ్లేందుకు అనుకూల పరిస్థితులు లేవంటున్నారు. అయితే పోలీసులు మాత్రం....అలాంటిది ఏమీ లేదని చెబుతున్నారు.

మరోవైపు ప్రమాదం సమయంలో బస్సును డ్రైవింగ్ చేసిన శ్రీనివాస్...ఘాట్ రోడ్ల డ్రైవింగ్ లో మంచి ప్రావీణ్యం ఉంది. తెలంగాణ ఆర్టీసీ నుంచి ఉత్తమ డ్రైవర్ గా ఇటీవలే అవార్డు కూడా అందుకున్నారు. బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో...ముందువైపు మొత్తం ధ్వంసమైంది. డ్రైవర్ సీట్లో కూర్చున్న శ్రీనివాస్ తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించినా...ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ డ్రైవర్ శ్రీనివాస్ మృతి చెందారు.  

21:51 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి...లోయలోకి దూసుకెళ్లడంతో 57 మృతి చెందారు. గాయపడ్డ క్షతగాత్రులకు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాదంపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు.
తప్పి లోయలో పడిన బస్సు 
కొండగట్టు ఘాట్ రోడ్డు నుంచి కిందికి దిగుతున్న బస్సు....చివరి మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడింది. దీంతో పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి కొందరి తీవ్ర గాయాలు కావడంతో...ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కరీంనగర్, హైదరాబాద్ కు తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతులు బంధువులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటన స్థలంలో తమ బంధువులను చూసి....కన్నీరుమున్నీరయ్యారు.
ఊపిరాడక పలువురు అక్కడికక్కడే మృతి 
బస్సు లోయలో పడటంతో ఊపిరాడక పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది పెద్దపల్లి, జగిత్యాల జిల్లా వాసులు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక యువకులు సహాయ చర్యల్లో పాల్గొని...ఆసుపత్రులకు తరలించారు. జగిత్యాల ఆస్పత్రి మొత్తం మృతుల బంధువులతోనే నిండిపోయింది. తమ వారి మృతదేహాలను...కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. 
ప్రమాదంపై కేసీఆర్, గవర్నర్ దిగ్భ్రాంతి 
కొండగట్టు రోడ్డు ప్రమాదంపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహాన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన కేసీఆర్...క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతులకు కుటుంబాలకు 5లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. తాజా మాజీ మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, మహేందర్ రెడ్డిలు...క్షతగాత్రులను పరామర్శించి...వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆర్టీసీ తరపున 3లక్షల రూపాయలు సాయం అందిస్తామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ , మహేశ్వర్ రెడ్డిలు పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పోస్టు మార్టం పూర్తి కావడంతో మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు ట్రాక్టర్ లో తరలించారు.

 

20:44 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 58 కు చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పలువురికి గాయాలు అయ్యాయి. ఘాట్‌రోడ్డులో బ్రేక్ లు ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎక్కువ మంది ఊపిరాకడ చనిపోయినట్లు తెలుస్తోంది.

ప్రమాద ఘటనపై తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఏపీ మంత్రి నారా లోకేశ్‌  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని గవర్నర్‌ నరసింహన్‌, అద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

18:35 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 52కు చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద ఘటనపై తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఏపీ మంత్రి నారా లోకేశ్‌  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.


జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 88 మందితో వెళ్తోంది. కొండగట్టు ఘాట్‌ రోడ్డు పైకి ఎక్కుతున్నసమయంలో చివరి మూలమలుపు స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 52 మంది మృతిచెందారు. మృతుల్లో 25 మంది మహిళలు ఉన్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తీవ్రంగా గాయాలపాలైన 8 మందిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌, హైదరాబాద్‌ ఆస్పత్రులకు తరలించారు. మరికొందరికి జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందగానే జగిత్యాల జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ సింధూ శర్మ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతిచెందిన వారిలో ఇప్పటివరకు 35 మందిని అధికారులు గుర్తించారు. వారిలో 30 మంది శనివారంపేట, హిమ్మత్‌రావుపేటకు చెందినవారని తెలిపారు. బస్సు డ్రైవర్‌ శ్రీనివాస్‌ మృతిచెందగా.. కండక్టర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడే శవపరీక్ష నిర్వహించి బంధువులకు అప్పగించనున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకొని అక్కడికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు, వారి బంధువులు దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్ధరిల్లింది.

 

13:27 - July 7, 2018

జగిత్యాల : ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది. అయితే అధికారులు, కాంట్రాక్టర్లు నిధులు సద్వినియోగం చేయకుండా కాలయాపన చేయడంతో పాఠశాలలు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇలాంటి పరిస్థితే జగిత్యాల జిల్లా ప్రభుత్వ పాఠశాల ఎదుర్కొంటోంది. ఇదిగో ఇదే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వున్న ప్రభుత్వ పాఠశాల.. సుమారు 320 మంది విద్యార్థులు ఇందులో చదువుతున్నారు. అయితే పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థుల చదువు భయం నీడన కొనసాగుతోంది.. పై కప్పు పెచ్చులుగా ఊడి పడుతుండటంతో ఎప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటు విద్యార్థులు తమ విద్యను కొనసాగిస్తున్నారు.

స్కూల్‌లో చదువుకునేందుకు క్లాస్‌రూమ్‌లు లేవని విద్యార్థులు వాపోతున్నారు. కూర్చొవడానికి బెంచీలు లేక సగానికి పై విద్యార్థులు నేలపై కూర్చుని పాఠాలు వింటున్నారు. ఓ వైపు ఎక్కడ పై కప్పు కూలుతుందోనని భయపడుతుంటే.. మరోవైపు చిన్న వర్షానికే నోట్‌ బుక్స్‌ తడిసి ముద్దవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో ఉండాల్సిన కనీస వసతులు త్రాగునీరు, మూత్రశాలలు, ఆడుకోవడానికి గ్రౌండ్‌ కూడా లేవని ఆందోళన చెందుతున్నారు. తమ చదువులు ఎలా సాగుతాయని ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన భవన నిర్మాణం చేసి కనీస సౌకర్యాలు త్రాగునీరు, మూత్రశాలలను బాగు చేయించాలని అంటున్నారు.

1994 లో విద్యార్థుల సంఖ్య దృష్ట్యా అదనపు గదులను నిర్మించారు కానీ ఆ తరగతి గదులు చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్నాయి. ఆ తరువాత పాఠశాల నూతన నిర్మాణ భవనం కోసం రెండు సంవత్సరాల క్రితం రాష్ట్రీయ విద్యామిషన్‌ ద్వారా 40 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. కానీ ఇప్పటి వరకు భవన నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. స్థానిక అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నూతన భవన నిర్మాణం అటకెక్కిందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విమర్షిస్తున్నారు. ప్రభుత్వం ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తుంటే అధికారులు మాత్రం ఉన్న నిధులు వినియోగించకుండా కాలయాపన చేయడం విస్మయం కల్గిస్తుందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

08:46 - June 6, 2018

జగిత్యాల : అతి వేగం ప్రమాదకరమనీ..అది మీ కుటుంబాలకే కాక పలువురి కుటుంబాలలో విషాదాలను నింపుతుందనీ ఎంతగా చెప్పినా వినని వాహనదారులు వేగంగా నడిపి ప్రాణాలను కోల్పోతున్నారు. అంతేకాదు పలువురి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు. అతి వేగంగా వాహనాలను నడిపి ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన కుటుంబంలో తీరని శోకం మిగిల్చింది. గొల్లపల్లి మండలం చిల్లకూడూరులో జరిగిన రోడ్డు ప్రమాదంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం బైక్ పై వెళ్తున్న ముగ్గురిని వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. స్థానికులు అందించిన సమచారంతో సంఘనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం రోడ్డు ప్రక్కల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి గల కారాణాలను తెలుసుకునే యత్నం చేస్తున్నారు. మృతులు నిన్న అర్థరాత్రి ఓ పుట్టిన రోజు వేడుకకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు చిప్ప రాములు, చిప్ప సందీప్, చిప్ప వినోద్ లుగా గుర్తించారు. కాగా ప్రమాదం జరిగిన తీరు చూస్తే అతి ప్రమాదమే కారణంగా స్థానికులు పేర్కొంటున్నారు.

14:45 - June 4, 2018
10:54 - June 1, 2018

జగిత్యాల : పొరండ్ల గ్రామం దారుణం జరిగింది. మద్యానికి బానిసైన కొడుకును తండ్రి చంపాడు. రోజూ డబ్బుల కోసం తల్లిదండ్రులను కొడుకు వేధిస్తున్నాడు. రాత్రి మద్యం సేవించి వచ్చిన కొడుకు తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డారు. డబ్బుల కోసం వేధిస్తుండటంతో భరించలేక నిద్రిస్తున్న సమయంలో కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ కొడుకు మృతి చెందారు.

 

09:23 - May 22, 2018

జగిత్యాల : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పురిటిలో పిల్లలు తారుమారు కలకలం సృష్టించింది. ఒకరికి పుట్టిన పిల్లలను మరొకరరికి ఇచ్చారంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మేడిపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన చామంతి, బుగ్గరం మద్దునూర్‌ గ్రామాని చెందిన రజిత అనే ఇద్దరు గర్భిణిలు ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. అయితే వీరికి పుట్టిన శిశువులను ఆస్పత్రి సిబ్బంది తారుమారు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో శిశువుల తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో మేల్కొన్న ఆస్పత్రి సిబ్బంది శిశువులకు వైద్యపరీక్షలు నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెబుతున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Jagtial