India

16:49 - November 14, 2018

పాకిస్థాన్ : భారత్, పాక్ ల మధ్య వివాదాస్పం కేంద్రంగా వున్న కశ్మీర్ పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్నేషనల్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా షాహిద్ అఫ్రిద్ ఈ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. కశ్మీర్ పై పాకిస్థాన్ భారతదేశాలమధ్య వైరం రోజు రోజుకూ ముదురుతున్న నేపథ్యంలో అఫ్రిద్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్థాన్ లో వున్న నాలుగు ప్రావిన్స్ లనే సరిగా చూసుకోలేకపోతున్నామని... ఇక మనకు కశ్మీర్ ఎందుకని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ గురించి పాకిస్థాన్ మరిచిపోవాలని... దేశంలో మంచి పాలన అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. 

Image result for kashmir pakistan and indian armyఉగ్రవాదుల నుంచి సొంత దేశాన్ని రక్షించడం కూడా తమ ప్రభుత్వాలకు చేత కాలేదని అఫ్రిది తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ లోయలో ప్రజలు చనిపోవడం తనను ఎంతో బాధిస్తోందని చెప్పాడు. కశ్మీర్ ను ఇండియాకు కూడా ఇవ్వొద్దని... అది ప్రత్యేక దేశం కావాలని అన్నాడు. కశ్మీర్ లో మానవత్వం పరిఢవిల్లాలని ఆకాంక్షించాడు. అఫ్రిది వ్యాఖ్యలు పాకిస్థాన్ లో వివాదాస్పదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా దేశ సరిహద్దుల్లో ఇండియా, పాకిస్థాన్ కశ్మీర్ విషయంలో విధించుకున్న నియమాలను పాక్ ఇప్పటికే వందల సార్లు బేఖాతరు చేసి కశ్మీర్ ను ఆక్రమించుకునేందుకు పలు యత్నాలు చేయటం వాటిని ఇండియా ఆర్మీ విజయవంతంగా తిప్పి కొట్టటం కొనసాగుతునే వుంది. ఈ నేపథ్యంలో భారత్ జవాన్లతో పాటు పలువురు కశ్మీర్ పౌరులు కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. 
 

21:41 - November 11, 2018

చెన్నై: భారత్‌తో చివరి టీ20లో వెస్టిండీస్‌ అదరగొట్టింది. చెపాక్‌ స్టేడియంలో విండీస్ బ్యాట్స్‌మెన్ వూరన్, బ్రావోలు చెలరేగారు. దీంతో భారత్‌ ముందు ఛాలెంజింగ్ టార్గెట్ నిర్దేశించగలిగారు. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి విండీస్ 181 పరుగులు చేసింది. విండీస్ జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్‌ రాణించారు. గత మ్యాచ్‌లకు భిన్నంగా షై హోప్‌ (24; 22 బంతుల్లో 3×4, 1×6), షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (26; 21 బంతుల్లో 4×4, 1×6) ఓపెనర్లుగా దిగారు. విండీస్‌కు శుభారంభం అందించారు. హెట్‌మైయిర్‌, షై హోప్‌ తొలి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం అందించారు. నిలకడగా ఆడుతూ అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలిస్తూ వీరిద్దరూ ప్రమాదకరంగా మారారు. అయితే పది పరుగుల వ్యవధిలో వీరిని భారత స్పిన్నర్ చాహల్‌ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన డారెన్‌ బ్రావో (43; 37 బంతుల్లో 2×4, 2×6), నికోలస్‌‌ పూరన్‌ (53; 25 బంతుల్లో 4×4, 4×6) రెచ్చిపోయారు. 43 బంతుల్లోనే 87 పరుగుల కీలకమైన పార్టనర్‌షిప్ నెలకొల్పారు. ఖలీల్‌ వేసిన చివరి ఓవర్‌లో ఏకంగా 23 పరుగులు సాధించారు. కాగా ఇప్పటికే ఈ సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

06:56 - November 10, 2018

వెస్ట్ ఇండిస్  : బ్యాట్ ఆమె చేతిలో వజ్రాయుధమే అయ్యింది. బంతి విష్ణుచక్రంలా గిర్రున తిరుగుతు బౌండరీలు దాటింది. సిక్స్ లతో చక్కలు చూపించింది భారత క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్. వచ్చిన ప్రతీ బంతిని గింగిరాలు తిప్పించింది. మహిళా టీ20లో చరిత్ర సృష్టించింది మన హర్మన్ ప్రీత్.  మహిళల క్రికెట్లో వేగం ఉండదని.. అందమైన షాట్లు ఉండవని.. పరుగుల మజా ఉండదని గతంలో మాటలు వినింపిచేవి. విమర్శల ధాటికి అంతే వుండేది కాదు. కానీ ఆ విమర్శలకు చరమగీతం పాడటమే కాదు ఇదీ మా మహిళా క్రికెటర్స్ సత్తా అంటు చాటి చెప్పింది హర్మన్ . భారత్‌-న్యూజిలాండ్‌ టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ హైలైట్లు ఓసారి చూస్తే ఎటువంటి విమర్శకులైన నోరు వెళ్లబెట్టి చూడాల్సిందే. బ్యాట్ తో మెరుపులు...కనిపించని బంతి వేగం చూడాల్సిందే ఆ షాట్స్.. నిజానికి లైవ్‌లో మ్యాచ్‌ చూసిన వాళ్లకు కూడా హైలైట్లు చూస్తున్న భావన కలిగి ఉన్నా ఆశ్చర్యమేమీ లేదు. 
పురుషులకు ఏమాత్రం తీసిపోని బ్యాటింగ్‌తో ఇప్పటికే ఎన్నోసార్లు క్రికెట్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ భారత స్టార్‌ బ్యాటర్‌ మరోసారి తన విశ్వరూపం చూపించింది. ఆరో ఓవర్లో క్రీజులోకి వచ్చి.. 15వ ఓవర్లో అర్ధసెంచరీ చేసిన హర్మన్‌.. 20వ ఓవర్‌కల్లా సెంచరీ మార్కును అందుకుందంటే ఆమె దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 
దొరికిన బంతిని దొరికినట్లుగా స్టాండ్స్‌లోకి తరలిస్తూ హర్మన్‌ చెలరేగిపోయిన తీరు మహిళల క్రికెట్లో నభూతో! న్యూజిలాండ్‌ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ కెప్టెన్‌ కౌర్‌ మెరుపు శతకం బాదడంతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఘనంగా బోణీ కొట్టింది.
మహిళల టీ20 ప్రపంచకప్‌ వేటను భారత్‌ ఘన విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ సేన 34 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. మహిళల టీ20ల్లో సెంచరీ చేసిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించిన హర్మన్‌ (103; 51 బంతుల్లో 7×4, 8×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమెతో పాటు జెమిమా రోడ్రిగ్స్‌ (59; 45 బంతుల్లో 7×4) కూడా సత్తా చాటడంతో మొదట భారత్‌.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం కివీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. సుజీ బేట్స్‌ (67; 50 బంతుల్లో 8×4) మెరుపులు మెరిపించినా.. ఆమెకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడంతో కివీస్‌కు ఓటమి తప్పలేదు. హేమలత (3/26), పూనమ్‌ యాదవ్‌ (3/33) ప్రత్యర్థిని కట్టడి చేశారు. హర్మన్‌కు తీసిపోని రీతిలో సుజీ చెలరేగి ఆడింది. పురుషుల తరహాలోనే సుజీ.. వికెట్‌కు అడ్డం తిరిగి స్కూప్‌ షాట్లతో భారత బౌలర్లను బెంబేలెత్తించింది. ఆమె ఉన్నంతసేపూ కివీస్‌ రేసులోనే ఉంది. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి (1/36) 14వ ఓవర్లో సుజీని ఔట్‌ చేయడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత కివీస్‌ పోటీలోనే లేదు. కేటీ మార్టిన్‌ (39) పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. హర్మన్‌కే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. భారత్‌ ఆదివారం తన తర్వాతి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఢీకొనబోతుండటం విశేషం.
 

11:12 - November 9, 2018

వెస్ట్ ఇండీస్ : మహిళ క్రికెట్ కు పురుషుల క్రికెట్ కున్న క్రేజ్ గతంలో వుండేది కాదు..కానీ 2017లో మహిళా క్రికెట్ వరల్డ్ కప్ లో మిథాలీ సేన కనబరిచిన ఆట తీరుకు భారతదేశం యావత్తు ఫిదా అయిపోయింది.  వరల్డ్ కప్ గెలవకపోయినా..అమ్మాయిల క్రికెట్ టీమ్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది. గతంలో ఎప్పుడు కనీసం ఫైనల్ కూడా చేరుకోని మహిళా టీమ్ 2017లో ఫైనల్ లో పోరాడి ఓడింది. అయినా వారి కృషిని, పట్టుదలను భారత్ యావత్తు గుర్తించింది. ఒక్కసారిగా మహిళా క్రికెట్ పై అభిమానం తారాస్థాయికి చేరుకుంది. మిథాలీ సేనకు దేశం పట్టం కట్టింది. ఆ టీమ్ మొత్తానికి ఆయా ప్రాంతాలల్లో విశేష ఆదరణ లభించింది. అప్పటి వరకూ మహిళా క్రికెట్ టీమ్ లో వున్నవారి కనీసం పేర్లు కూడా ఎవరికి తెలియదు. కానీ 2017 వరల్డ్ సిరిస్ జరుగున్న నేపథ్యంలో అమ్మాయిల ఆటతీరుకు ఫిదా అయిపోయిన ప్రజలు గూగుల్ లో ఆ టీమ్ లోని అమ్మాయిల వివరాల కోసం విపరీతంగా సర్చ్ చేసినట్లుగా వార్తలు పెద్ద మొత్తంలో వచ్చాయంటే వారిపై అభిమానం ఎలా వుందో ఊహించుకోవచ్చు. 

women's cricket కోసం చిత్ర ఫలితంఈ నేపథ్యంలో మహిళా క్రికెట్ సేన కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఓ చరిత్రను సృష్టించింది. 6వేల పరుగులు చేసిన మొదటి మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో మిథాలీ పురుషుల టీమ్ కు వున్నట్లుగా నే మహిళా టీమ్ కు కూడా టీ20 వుండాలని కోరింది. అది ఈనాటికి నెరవేరింది. ఈ నేపథ్యంలో కరీబియన్ దీవుల్లో అమ్మాయి టీ20 షురూ అయ్యింది. ఇది మహిళా క్రికెట్  తమ కృషితో..పట్టుదదలతో తెచ్చుకున్న గుర్తింపుకు వచ్చిన అసలైన నిర్వచనంగా భావించవచ్చు. 
 పురుషులేనా మేమూ కొడతాం సిక్సులు అంటున్నారు మన అమ్మాయిల క్రికెట్ టీమ్.సిక్స్ లతో, ఫోర్లతో మెరుపులు మెరిపించేందుకు వారికీ ఓ అవకాశం చిక్కింది.. నేటి నుంచే ప్రపంచ టీ20 టోర్నమెంట్‌! వెస్టిండీస్‌ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో భారత్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతోంది. 10 దేశాలు పోటీపడుతున్న ఈ సమరం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.

women's cricket కోసం చిత్ర ఫలితంమహిళల ప్రపంచ టీ20 టోర్నీకి వేళైంది.. కరీబియన్‌ దీవుల వేదికగా అమ్మాయిలు సమరానికి సై అంటున్నారు. టోర్నీ తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత్‌ జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది.2009, 10 టోర్నీలో సెమీఫైనల్‌ చేరడమే టీమ్‌ఇండియాకు ఉత్తమ ఫలితాలు. అయితే ఇటీవల ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ ఈ కప్‌లో ఫేవరెట్ల జాబితాలో నిలుస్తుంది. శ్రీలంకను ఓడించి.. సొంతగడ్డపై ఆస్ట్రేలియా-ఎపై గెలిచి మంచి ఊపు మీదుంది భారత్‌. ప్రపంచ టీ20 టోర్నీ వార్మప్‌ పోటీల్లో బలమైన వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌లపై గెలవడం టీమ్‌ఇండియా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.

punam yadav and julian goswami కోసం చిత్ర ఫలితం
బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ భారత్‌ మునుపటికంటే మెరుగైంది. లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌తో పాటు వెటరన్‌ జులన్‌ గోస్వామి రాణించడం జట్టుకు కీలకం. అయితే సుజె బేట్స్‌, సోఫి డివైజ్‌ లాంటి బ్యాటర్లతో కూడిన కివీస్‌ను ఓడించడం భారత్‌కు అంత సులభమేం కాదు. మొత్తం మీద పోటీ హోరాహోరీ సాగే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌ తర్వాత భారత్‌ ఈనెల 11న పాకిస్థాన్‌తో, 15న ఐర్లాండ్‌తో, 17న మూడుసార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో తలపడనుంది.
 -మైలవరపు నాగమణి

11:14 - November 7, 2018

పాకిస్థాన్ : పాకిస్థాన్, భారతదేశాల మధ్య వుండే నిబంధలను ఉల్లంఘింటం పాకిస్థాన్ కు పరిపాటిగా మారిపోయింది. పలుమార్లు కాల్పుల ఒప్పందాలను ఉల్లంఘించిన పాకిస్థాన్ ఇప్పుడు మరో ఉల్లంగనకు పాల్పడింది. భారత్ అభ్యంతరాలను తోసిపుచ్చి పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనా, పాకిస్థాన్ మధ్య సోమవారం రాత్రి బస్సు సర్వీసు ప్రారంభమైంది. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న గుల్బర్గ్ ప్రాంతం నుంచి పీవోకే మీదుగా చైనా జిన్‌జియాంగ్ రాష్ట్రం కష్ఘర్ నగరానికి తొలి బస్సు సర్వీసు నడిచింది. చైనా- పాకిస్థాన్ ఎనకమిక్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా పాక్, చైనా ఈ బస్సు సర్వీసును నడుపుతున్నాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం నాడే బస్సు సర్వీసు ప్రారంభించాల్సి ఉంది. కానీ దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న మహిళ అసియా బీబీని పాక్ సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో దేశమంతటా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో సదరు బస్సు సర్వీసును సోమవారం రాత్రి ప్రారంభించారు. పాక్ ఎకనమిక్ ఫొరం చైర్మన్ ఇక్బాల్ షమీ ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు దేశాల సంబంధాల్లో ఇది చాలా మంచి రోజని పేర్కొన్నారు. పీవోకే మీదుగా పాక్- చైనా మధ్య బస్సు సర్వీసు నిర్వహించడంపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది.
 

19:57 - November 5, 2018

ఢిల్లీ: భారత రక్షణ రంగ అమ్ముల పొదిలోకి  ఐఎన్ఎస్ అరిహాంత్ జలాంతర్గామి వచ్చి చేరింది. ప్రపంచంలో అణు జలాంతర్గాములను తయారు చేసి నడపగలిగిన రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాడ్ దేశాల సరసన నేడు భారత్ చేరింది. మొదటిసారిగా గస్తీ పూర్తి చేసుకుని  విజయవంతంగా తిరిగి వచ్చిన సందర్భంగా ఐఎన్ఎస్ అరిహంత్ సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం సమావేశమై వారిని అభినందించారు.  ఐఎన్ఎస్ అరిహాంత్ విజయం దేశ భద్రత పటిష్టతలో మరో పెద్ద ముందడుగని  ప్రధాన మంత్రి అన్నారు. 
6,000 టన్నుల బరువున్న ఐఎన్ఎస్ అరిహంత్ ను ప్రధాని మోడీ నేతృత్వంలోని న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పర్యవేక్షణలో అభివృద్ధి చేశారు. ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ సాధించిన ఘనత దేశ చరిత్రలో ఎన్నటికీ గుర్తుండిపోతుందని ,. దేశభద్రత  విషయంలో  భారత్ మరో ముందడుగు వేసిందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. ఇక నుంచి న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు పాల్పడేవారికి  సరైన సమాధానం ఇవ్వగలిగిన స్ధాయికి మనం చేరాం అని మోడీ అన్నారు.  'ఐఎన్ఎస్ అరిహాంత్  సబ్‌మెరైన్ డిజైన్, నిర్మాణం, పరీక్షను సమర్ధవంతంగా నిర్వహించి ఇండియాను సొంత అణు జలాంతర్గాములున్న దేశాల స్థాయికి నిలిపిన యావన్మంది సిబ్బందికి ప్రధాని   ధన్యవాదాలు చెప్పారు.ఈ అణు జలాంతర్గామి అందుబాటులోకి రావడంతో ఉపరితల క్షిపణులు చేరుకోలేని లక్ష్యాలను సైతం ఇది చేధించగలదు.

 

 

11:54 - November 5, 2018

ఢిల్లీ : తొలి టీ-20లో వెస్టిండీస్‌పై భారత్‌ విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. భారత్‌కు ఆదిలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ దినేశ్‌ కార్తీక్‌ నిలదొక్కుకోవడంతో.. 17.5 ఓవర్లలో విజయం సాధించి.. మూడు టీ-20ల సీరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా వెస్టిండీస్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత తడబడిన భారత్‌ విండీస్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. 

110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ, ధావన్‌లు వెంటవెంటనే ఔట్‌ కావడంతో భారత్‌ కొద్దిగా కష్టాల్లో పడింది. ఓ దశలో విజయానికి భారత్‌ ఎదురీదింది. దినేశ్‌ కార్తీక్‌ నిలకడగా ఆడడం.. చివర్లో పాండ్యా విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడడంతో భారత్‌ 17.5 ఓవర్లలో విజయం సాధించింది. 

విండీస్‌ బౌలర్లలో థామస్‌, బ్రాత్‌వైట్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. పియరీకి ఒక వికెట్‌ దక్కింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు తీయగా, ఉమేశ్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌, బుమ్రా, కృనాల్‌ పాండ్యాలకు ఒక్కో వికెట్‌ దక్కింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0తో ముందంజలో ఉంది.

15:57 - November 1, 2018
తిరువనంతపురం: చివరి వన్డేలో... భారత బౌలర్లు విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడిపోయారు. వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 31.5 ఓవర్లలో 104 పరుగులకే వెస్టిండీస్ జట్టు ఆలౌట్ అయింది. భారత విజయలక్ష్యం 105 పరుగులు.
 
అంతకుముందు స్కోరు బోర్డుపై ఒక పరుగు చేరగానే తొలి వికెట్‌ను, మరో పరుగు చేరగానే రెండో వికెట్‌ను, 36 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయారు. 66 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కరేబియన్ జట్టు.. పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరకు 104 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ జడేజా 4 వికెట్లు తీసి విండీస్ వెన్ను విరిచాడు. భారత బౌలర్లలో బుమ్రా 2, ఖలీల్ 2, కుల్దీప్, భువనేశ్వర్ కుమార్ చెరో వికెట్ తీశారు. విండీస్ బ్యాట్స్‌మెన్లలో ముగ్గురు డకౌట్ అయ్యారు. విండీస్ బ్యాట్స్‌మెన్‌లో జేసన్ హోల్డర్ చేసిన 25 పరుగులే అత్యధిక స్కోర్.
15:18 - November 1, 2018

తిరువనంతపురం: చివరి వన్డేలో... భారత బౌలర్లు విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోయారు. వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్కోరు బోర్డుపై ఒక పరుగు చేరగానే తొలి వికెట్‌ను, మరో పరుగు చేరగానే రెండో వికెట్‌ను, 36 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయారు. 66 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కరేబియన్ జట్టు.. పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఓపెనర్ కీరన్ పావెల్ భువనేశ్వర్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిగాడు. అనంతరం హోప్ కూడా బుమ్రా బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్లన్ శామ్యూల్స్ ధాటిగా ఆడుతూ 24పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. జడేజా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అలెన్ 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. విండీస్ స్కోర్ 21.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 71 పరుగులు.

19:30 - October 31, 2018

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు ఇస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కేటగిరీ ర్యాంకింగ్‌లో భారత్ 77 వ స్థానాన్ని కైవసం చేసుకొంది. ఏకంగా 23 స్థానాలు దాటి 190 దేశాల పోటీలో 77 ర్యాంకుకు చేరింది. టాప్ 100 స్థానాల్లోకి రావడానికి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషి కారణంగా ఇది సాధ్యమయ్యింది. వ్యాపార సానుకూల వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఒకేసారి 23 ర్యాంకులను దాటుకొని 77వ స్థానంలో నిలిచింది. 
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 10 సూచీల్లో 6 పాయింట్లు సాధించడం ద్వారా అంటే వ్యాపారం మొదలు పెట్టడం, వ్యాపారం చేయడం అంశాల్లో ఈ ప్రగతి భారత్ కనబరించింది. వ్యాపార సరళీకరణ, నిర్మాణ రంగంలో త్వరితగతిన అనుమతులు, విద్యుత్ కనెక్షన్లు, రుణాల మంజూరు, టాక్స్ చెల్లింపులు, సరిహద్దు హద్దులు లేకుండా వ్యాపారం చేయడం, కాంట్రాక్టులను అప్పజెప్పటం, దివాలా సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలలో భారత్ మెరుగైన ఫలితాలను రాబట్టిందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - India