Hyderabad

09:17 - November 17, 2018

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని అనూహ్యంగా కూకట్‌పల్లి టికెట్ దక్కించుకున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనున్నారు. నందమూరి సుహాసిని నేడు నామినేషన్ వేయనున్నారు. సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి ఆమె తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌లో సుహాసిని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. బాలకృష్ణ, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఇతర టీడీపీ నేతలతో కలిసి సుహాసిని కూకట్‌పల్లి చేరుకుంటారు. 11:21 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. ఎటువంటి హడావుడి లేకుండా చాలా నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నందమూరి కుటుంబం భావిస్తోంది.

కాగా పలు అనూహ్య పరిణామాల తర్వాత కూకట్‌పల్లి నుంచి సుహాసినిని బరిలోకి దింపారు. అప్పటి వరకు ప్రచారంలో ఉన్న పెద్దిరెడ్డిని కాదని, సుహాసినికి టికెట్ ఇచ్చారు. ఆమెను బరిలోకి దింపడం వ్యూహాత్మకమేనని, ఆ ప్రభావం మొత్తం మహాకూటమి నేతలపై పడుతుందని, వారి గెలుపు మరింత సులభం అవుతుందని టీడీపీ భావిస్తోంది. సుహాసిని గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు.

 

08:56 - November 17, 2018

హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల చేసింది. ఏడుగురితో కూడిన జాబితా విడుదల నిన్న రాత్రి ప్రకటించింది. బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ కార్యదర్శి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఏడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పోటీగా గజ్వేల్‌లో బీజేపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆకుల విజయను బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో ఆమె సిరిసిల్లలో కేటీఆర్‌పై పోటీ చేసి ఓడి పోయారు. టీఆర్ఎస్‌లో టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు టికెట్ దక్కలేదు. 
నాలుగో జాబితాలోని అభ్యర్థులు వీరే...
ఎ.శ్రీనివాసులు...(చెన్నూరు)
జంగం గోపి...(జహీరాబాద్) 
ఆకుల విజయ...(గజ్వేల్)
శ్రీధర్ రెడ్డి...(జూబ్లీహిల్స్) 
భవర్‌లాల్ వర్మ...(సనత్ నగర్) 
సోమయ్య గౌడ్...(పాలకుర్తి)
ఎడ్ల అశోక్ రెడ్డి...(నర్సంపేట) 

 

08:04 - November 17, 2018

హైదరాబాద్ : ఎట్టకేలకు జనగామ సీటుపై ఉత్కంఠ వీడింది. పీసీసీ చీఫ్ మాజీ పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్  లైన్ క్లియర్ చేశారు. జనగామ సీటును వదిలేయడానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అంగీకరించారు. జనగామ నుంచి పోటీ చేసేందుకు పొన్నాల లక్ష్మయ్యకు మార్గం సుగమం అయింది. జనగామ నుంచి పొన్నాల బరిలోకి దిగనున్నారు. టీజేఎస్ కార్యాలయంలో కోదండరామ్‌తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహార ఇంచార్జ్ కుంతియా, పొన్నాల లక్ష్మయ్య చర్చలు జరిపారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు చర్చలు జరిపారు. 
జనగామ సీటు వదులుకున్న కోదండరామ్  
జనగామ సీటుపై తెల్లవారు జామున 3 గంటల దాకా ఉత్కంఠ కొనసాగింది. మొదటగా టీజేఎస్ కార్యాలయంలో కోదండరామ్‌తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపారు. ప్రధానంగా జనగామ సీటుపైనే సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కొంతసేపటికి కుంతియా కూడా వీరికి జత కలిశారు. ముగ్గురు నేతలు చర్చించారు. రాత్రి 1.30 గంటల తర్వాత చర్చలకు పొన్నాల లక్ష్మయ్య కూడా హాజరయ్యారు. నలుగురు కలిసి జనగామలో కాంగ్రెస్ పార్టీ బలాబలాపై చర్చించారు. జనగామ సీటును కాంగ్రెస్‌కు ఇవ్వాలంటూ కోదండరామ్‌కు ప్రతిపాదించారు. దాదాపు నాలుగు గంటలకు పైగా చర్చించిన తర్వాత జనగామ సీటుపై కుంతియా క్లారిటీ ఇచ్చారు. జనగామ సీటును వదులుకునేందుకు కోదండరామ్ అంగీకరించినట్లు కుంతియా ప్రకటించారు. దీంతో పొన్నాల లక్ల్మయ్యకు లైన్ క్లియర్ అయినట్లుగా కుంతియా తెలిపారు.
కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌ కన్వీనర్‌గా కోదండరామ్.. 
కామన్ మినిమమ్ ఎజెండాను రెడీ చేశామని...దీనికి భాగస్వామ్య పార్టీలు అంగీకారం తెలిపాయని కుంతియా అన్నారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో కో..ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని కుంతియా తెలిపారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌ను కోదండరాం లీడ్ చేస్తారని..కోదండరాం కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ప్రకటించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ప్రభుత్వంలోనూ భాగస్వాములు అవుతారని తెలిపారు. కామన్ మినిమమ్ ప్రోగ్రాం కమిటీకి కేబినెట్ హోదా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి కోదండరామ్ అంగీకరించారని కుంతియా వెల్లడించారు. 

 

14:24 - November 16, 2018

ఢిల్లీతెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరుకుంది. రేపటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫాంలు అందజేయనున్నారు. ఈరోజు మూడో జాబితా వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు అశావహులతో రాహుల్ గాంధీ చర్చించారు. నాలుగు నియోజవర్గాల ఆశావహులతో ఢిల్లీలో రాహుల్ భేటీ అయ్యారు. ఇల్లెందు, హుజురాబాద్, మిర్యాలగూడ, తుంగతుర్తి ఆశావహుల బలాబలాలను రాహుల్ నేరుగా తెలుసుకున్నారు. గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తామని రాహుల్ స్పష్టం చేశారు.

నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన నేతలు రాహుల్ గాంధీని కలిశారు. తుంగతుర్తిని ఆశిస్తున్న అద్దంకి దయాకర్, వడ్డేపల్లి రవిలతో రాహుల్ సమావేశం అయ్యారు. వీరితో వన్ టూ వన్ నిర్వహించారు. మిర్యాలగూడ సీటు ఆశిస్తున్న రఘువీర్‌తో, ఇల్లందు స్థానాన్ని కోరుతున్న హరిప్రియ, వెంకటేష్‌లతో, అదే విధంగా హుజూరాబాద్ టికెట్ కోరుతున్న కౌశికరెడ్డిలతో రాహల్ గాంధీ భేటీ అయ్యారు. ఆశావహుల గెలుపు సామర్థ్యాలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. ఇవాళా 19 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేయనున్నారు.
ఇప్పటికే రెండు జాబితాల ప్రకటన
ఇప్పటికే రెండు జాబితాలను కాంగ్రెస్ ప్రకటించింది. మొదటి జాబితాలో 65 మందిని, రెండో జాబితాలో 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 75 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ 94 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. 

 

13:39 - November 16, 2018

ఢిల్లీ : మూడో జాబితాపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మూడో జాబితాలో ప్రకటించాల్సిన అభ్యర్థులను ఖరారు చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. రేపు 19 మంది అభ్యర్థులతో మూడో జాబితా విడుదల చేయనుంది. 
రాహుల్ గాంధీని కలిసిన ఆశావహులు  
రాహుల్ గాంధీని నాలుగు నియోజకవర్గాల ఆశావహులు కలిశారు. ఒక్క స్థానానికి ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. రాహుల్ వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. ఆశావహుల గెలుపు సామర్థ్యాలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. ఆశావహులను తన నివాసానికి పిలుపించుకుని, వారితో మాట్లాడుతున్నారు.
ఆశావహుల గెలుపు సామర్థ్యాలను అడిగి తెలుసుకున్న రాహుల్   
నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన నేతలు రాహుల్ గాంధీని కలిశారు. తుంగతుర్తిని ఆశిస్తున్న అద్దంకి దయాకర్, వడ్డేపల్లి రవిలతో రాహుల్ సమావేశం అయ్యారు. వీరితో వన్ టూ వన్ నిర్వహించారు. మిర్యాలగూడ సీటు ఆశిస్తున్న రఘువీర్‌తో, ఇల్లందు స్థానాన్ని కోరుతున్న హరిప్రియ, వెంకటేష్‌లతో, అదే విధంగా హుజూరాబాద్ టికెట్ కోరుతున్న కౌశికరెడ్డిలతో రాహల్ గాంధీ భేటీ అయ్యారు. ఆశావహుల గెలుపు సామర్థ్యాలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. రేపు 19 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేయనున్నారు.
ఇప్పటికే రెండు జాబితాల ప్రకటన
ఇప్పటికే రెండు జాబితాలను కాంగ్రెస్ ప్రకటించింది. మొదటి జాబితాలో 65 మందిని, రెండో జాబితాలో 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 75 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ 94 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. రేపు 19 మందితో మరో జాబితాను ప్రకటించనుంది. ఇదే తుది జాబితా అని పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా తెలిపారు. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయనున్నారు. రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.

 

11:12 - November 16, 2018

హైదరాబాద్: మెట్రో జర్నీ నగర ప్రజల జీవితాలతో పెనవేసుకుపోతోంది. హైదరాబాద్ మెట్రో రైల్ తక్కువ సమయంలో ఎక్కువమంది ప్రయాణీకులను అక్కున చేర్చుకుంది. మెట్రో రైలు ప్రారంభమైన 351 రోజుల్లో 3 కోట్ల మంది ప్రయాణీకులు మెట్రోను ఉపయోగించుకోవడం విశేషం. 154 రోజుల్లో అంటే మే 1, 2018 నాటికి ఒక కోటి మంది ప్రయాణీకులు మెట్రో రైలు సేవలను వినియోగించుకోగా.. 280 రోజులకు అంటే సెప్టెంబర్ 4, 2018 నాటికి ఈ సంఖ్య రెండు కోట్లకు చేరుకుంది. నవంబర్ 14 నాటికి 3 కోట్ల మంది మెట్రో సేవలు ఉపయోగించుకొన్నారు. మెట్రో రైలు ప్రస్తతం రోజుకు 440 ట్రిప్పులు నడుస్తుండగా.. ఇవి 13 వేల కిలీమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం ఎల్బీనగర్ - మియాపూర్, నాగోల్-అమీర్‌పేట కారిడార్‌లో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. మెట్రో సేవలు ప్రారంభమైనప్పటినుండి ఇప్పటివరకు 351 రోజులు ప్రయాణించగా.. మొత్తం 25,53,422 కిమీ దూరం ప్రయాణించాయి. ఇక ఈ 351 రోజుల్లో 1 లక్షా 64 వేల 198 మొత్తం ట్రిప్పులు నడిపినట్టు మెట్రో అధికారులు తెలిపారు.

 

 

09:42 - November 16, 2018

హైదరాబాద్ : మహాకూటమిలో సీట్ల పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. టీజేఎస్ సీట్లపై ఇంకా సందిగ్ధత వీడడం లేదు. తమకు కేటాయించిన స్థానాల్లో కాంగ్రెస్ రెబల్స్ రంగంలోకి దిగకుండా చూడాలని టీజేఎస్ బెబుతతోంది. ఈమేరకు టీజేఎస్ అధినేత కోదండరాం ఢిల్లీకి చేరారు. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కోదండరాం సమావేశం కానున్నారు. జనగామ స్థానంపై చర్చించనున్నారు. అలాగా తమకు కేటాయించిన స్థానాల్లోనే కాకుండా వేరే చోట పోటీ చేయాలా లేదా అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది.

 

08:53 - November 16, 2018

హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న మరో 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 20 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు. ఇప్పటికే రెండు జాబితాలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 38 మంది, రెండో జాబితాలో 28 మంది అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు బీజేపీ 86 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. 
మూడో జాబితాలోని అభ్యర్థులు వీరే..
లక్ష్మారెడ్డి.. (ఎల్లారెడ్డి)
ప్రతాప రామకృష్ణ.. (వేములవాడ) 
పుప్పాల రఘు.. (హుజురాబాద్‌) 
చాడ శ్రీనివాస్‌రెడ్డి.. (హుస్నాబాద్‌) 
ఆకుల రాజయ్య.. (మెదక్‌) 
జి.రవికుమార్‌గౌడ్‌.. (నారాయణ్‌ఖేడ్‌), 
బి.రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే.. (సంగారెడ్డి), 
పి.కరుణాకర్‌రెడ్డి.. (పటాన్‌చెరు) 
కొత్త అశోక్‌గౌడ్‌.. (ఇబ్రహీంపట్నం) 
కంజెర్ల ప్రకాశ్‌.. (చేవెళ్ల-ఎస్సీ) 
దేవర కరుణాకర్‌.. (నాంపల్లి) 
సతీశ్‌గౌడ్‌.. (సికింద్రాబాద్‌) 
నాగురావు నామోజీ.. (కొడంగల్‌) 
పద్మజారెడ్డి.. (మహబూబ్‌నగర్‌) 
రజనీ మాధవరెడ్డి.. (ఆలంపూర్‌-ఎస్సీ) 
శ్రీరామోజు షణ్ముఖ.. (నల్లగొండ) 
కాసర్ల లింగయ్య.. (నకిరేకల్‌-ఎస్సీ) 
హుస్సేన్‌నాయక్‌..(మహబూబాబాద్‌-ఎస్టీ) 
ఉప్పాల శారద.. (ఖమ్మం) 
శ్యామల్‌రావు.. (మధిర-ఎస్సీ)

08:14 - November 16, 2018

హైదరాబాద్ : ఒక్క ఆడియో టేప్ కాంగ్రెస్‌లో ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తోంది. నిన్నటి దాకా అంతా బాగానే ఉన్నా.. అభ్యర్థుల ఎంపిక వ్యవహారంపై ఆడియో టేపు నిప్పులు పోసింది. టిక్కెట్ ఇవ్వాలంటే మూడు కోట్లు డిమాండ్ చేశారంటూ రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ రోడ్డెక్కడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో వణుకు మొదలైంది. 

కాంగ్రెస్‌లో టిక్కెట్ల వ్యవహారం చిచ్చురేపుతోంది. ఇప్పటికే పార్టీ ప్రకటించిన జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఆశావహులు గాంధీభవన్‌లో, ఢిల్లీలోనూ ఆందోళన, నిరసనలు చేస్తున్నారు. కొందరు నేతలు ఏకంగా ఢిల్లీలోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. భక్త చరణ్ దాస్ నేతృత్వంలోని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీపై ఆరోపణలు తారా స్థాయికి చేరాయి. ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించిన పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు క్యామ మల్లేశ్ టికెట్లు అమ్ముకున్నారంటూ ఆరోపించారు. మూడు కోట్లు ఇస్తే తనకు ఇబ్రహీంపట్నం టికెట్ ఇస్తానన్న ఆడియో టేపును మీడియాకు విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారంటూ మల్లేశ్ సంచలన ఆరోపణలు చేశారు. బీసీలకు టికెట్ ఇవ్వకుండా అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో బీసీలకు న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. యాదవ్‌ల, కరుముల ఓట్లు కావాలి కానీ, టికెట్లు మాత్ర ఇవ్వరా అంటూ శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ప్రశ్నించారు. టికెట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని అందుకే బీసీలను పక్కన పెట్టారంటూ ఆరోపించారు. 

మొదటి రెండు జాబితాలో టికెట్లు దక్కకపోవడంతో ఆశావాహులు చేస్తున్న ధర్నాలు, నిరసనలతో గాంధీభవన్ అట్టుడుకుతోంది. ఇంతలోనే క్యామ మల్లేశ్ ఆడియో రిలీజ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ వ్యవహారం నుంచి కాంగ్రెస్ ఎలా బయపడుతుందో చూడాలి. 

 

07:21 - November 16, 2018

హైదరాబాద్ : పాతబస్తీలో రౌడీషీటర్‌‌, అతని అనుచరులు రెచ్చిపోయారు. దారుణానికి ఒడి గట్టారు. అభంశుభం తెలియని ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. పాతబస్తీ కాలాపత్తర్‌కు చెందిన రౌడీషీటర్ నూర్‌ఘజీ అతని అనుచరులు మైలార్‌దేవ్ పల్లిలోని శాస్త్రీపురానికి వెళ్లారు. రౌడీషీటర్ నూర్‌ఘజీ, అతని అనుచరులు గంజాయి సేవిస్తూ మామూళ్లు వసూలు చేయడాన్ని ఓ వ్యక్తి సెల్ ఫోన్‌లో వీడియో తీశాడు. దీన్ని గమనించిన రౌడీ షీటర్ వీడియో తీస్తున్న వ్యక్తిని వెంబడించాడు. అదే దారిలో వెళ్తున్న ముస్సాక్, అతని స్నేహితుడు రౌడీ షీటర్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. అయితే అడ్డు వస్తావా..అంటూ రౌడీ షీటర్ నూర్‌గజీ కత్తితో ముస్సాక్ అనే వ్యక్తి గుండెల్లో పొడిచాడు. తర్వాత అతని స్నేహితుడిపైనా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ముస్సాక్ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య చేసిన రౌడీషీటర్ అక్కడి నుంచి పరారయ్యాడు. నూర్‌ గ్యాంగ్‌లోని ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూర్‌ఘజీ కోసం గాలింపు చేపట్టారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - Hyderabad