hrc

16:53 - September 12, 2018

హైదరాబాద్ : కొండగట్టు బస్సు ప్రమాదంపై మానవ హక్కుల కమిషన్(హెచ్ ఆర్ సీ)లో ఫిర్యాదు నమోదు అయింది. బస్సు ప్రమాదంపై హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ హెచ్ ఆర్ సీలో పిటిషన్ వేశారు. ప్రమాదంలో 57 మంది చనిపోవడానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల బస్ డిపో మేనేజర్, సూపర్ వైజర్, ఆర్టీవోపై కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. అధికారులపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ డీజీపికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలని మానవ హక్కుల కమిషన్ ను అరుణ్ కుమార్ కోరారు.

జగిత్యాల జిల్లాలో కొండగట్టు వద్ద ఘాట్‌రోడ్డులో బ్రేక్ లు ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ప్రమాదంలో 57 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల్లో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 

 

16:51 - April 12, 2018

హైదరాబాద్ : గత కొన్నిరోజులుగా సినీనటి శ్రీరెడ్డి చేస్తున్న ఆందోళనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. తెలంగాణ, కేంద్రం సమాచారా ప్రసారాల శాలకు హెచ్ఆర్సీ నోటీసులు జారీచేసింది. టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, లైంగిక దోపిడీలపై నటి శ్రీరెడ్డి చేస్తున్న ఆందోళనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరిచింది. అనంతరం తెలంగాణ, కేంద్రం సమాచారా ప్రసారాల శాఖలకు హెచ్ఆర్సీ నోటీసులు జారీచేసింది. నాలుగు వారాలలో సమగ్ర నివేదిక సమర్పించాలని తెలంగాణ, కేంద్రం సమాచారా ప్రసారాల శాఖలకు ఆదేశించింది. కాగా గత కొంత కాలంగా నటి శ్రీరెడ్డి తనకు అన్యాయం జరిగిందనీ, తనపై వివక్ష చూపుతున్నారనీ..తనకు మా అసోసియేషణ్ సభ్యత్వం కూడా ఇవ్వటంలేదనీ శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

16:25 - April 12, 2018

హైదరాబాద్ : గత కొన్నిరోజులుగా సినీనటి శ్రీరెడ్డి చేస్తున్న ఆందోళనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. తెలంగాణ, కేంద్రం సమాచారా ప్రసారాల శాలకు హెచ్ఆర్సీ నోటీసులు జారీచేసింది. టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, లైంగిక దోపిడీలపై నటి శ్రీరెడ్డి చేస్తున్న ఆందోళనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరిచింది. అనంతరం తెలంగాణ, కేంద్రం సమాచారా ప్రసారాల శాఖలకు హెచ్ఆర్సీ నోటీసులు జారీచేసింది. నాలుగు వారాలలో సమగ్ర నివేదిక సమర్పించాలని తెలంగాణ, కేంద్రం సమాచారా ప్రసారాల శాఖలకు ఆదేశించింది. కాగా గత కొంత కాలంగా నటి శ్రీరెడ్డి తనకు అన్యాయం జరిగిందనీ, తనపై వివక్ష చూపుతున్నారనీ..తనకు మా అసోసియేషణ్ సభ్యత్వం కూడా ఇవ్వటంలేదనీ శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

12:23 - December 4, 2017

హైదరాబాద్ : నారాయణ కాలేజీ ఆడియోటేపుల వ్యవహారం హెచ్‌ఆర్‌సీకి చేరింది. నారాయణ కాలేజీ ఆడియోటేపుల వ్యవహారంపై ఇవాళ మానవహక్కుల కమిషన్‌లో వాదనలు జరగనున్నాయి. విద్యార్థుల  ఆత్మహత్యలు, లైంగిక వేధింపులు, డబ్బుల మార్పిడీపై..విచారణకు బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:54 - August 14, 2017

ఢిల్లీ : గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. చిన్నారుల మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని యోగి సర్కార్‌ను ఆదేశించింది. ఈ ఘటన జీవించే హక్కుకు విఘాతం కల్పించిందని ఎన్‌హెచ్‌ఆర్‌సి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీఆర్డీ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఐదు రోజుల్లోనే 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం విదితమే. మరో తొమ్మిది మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 72కి చేరింది.

11:42 - August 7, 2017

హైదరాబాద్: ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా రూపొందుతున్న టాలీవుడ్ బిగ్ బాస్ పై వివాదాలు మొదలవుతున్నాయి. ఈ షోలో కంటెస్టెంట్ లకు విధించే శిక్షలు అమానవీయం గా ఉన్నాయంటూ సామాజిక కార్యకర్త అచ్యుతరావు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బిగ్ బాస్ షోపై తనకు అభ్యంతరాలను తెలియజేస్తూ పిటీషన్ దాఖలు చేశారు.

 

08:10 - January 22, 2017

హైదరాబాద్ : కార్పొరేట్‌ ఆస్పత్రి కాటుకు మరో అభాగ్యురాలు బలైంది. నీరసంగా ఉందని ఆస్పత్రిలో.. కాళ్లూ చేతులూ కోల్పోవాల్సి వచ్చింది. ఆసుపత్రి వైద్యులు ఎక్కించిన రక్తం వల్ల.. ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో.. కుందనాల బొమ్మ అవిటిదైపోయింది. ఇప్పటికే ఒక చేతిని తీసేసిన వైద్యులు.. ఇప్పుడు రెండు కాళ్లూ మరో చేతినీ తొలగిస్తే తప్ప ఆ అమ్మాయి బతకదని నిర్ధారించారు. దీంతో కూతురు బతుకుతుందో లేదోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. 17 ఏళ్ల అమ్మాయి పేరు వైష్ణవి. నాచారానికి చెందిన ఈ అమ్మాయి సికింద్రాబాద్‌ కస్తూర్బా కాలేజీలో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతోంది. చదువుల్లోనూ.. ఆటపాటల్లనూ చురుగ్గా ఉండే వైష్ణవి.. ఇటీవల కొంత నలతగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆమెను నాచారంలోని ప్రసాద్‌ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. వైష్ణవిని పరీక్షించిన వైద్యులు.. ఆమె బలహీనంగా ఉందని.. ఓ యూనిట్ రక్తం ఎక్కించాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు వైష్ణవి, జనవరి 2వ తేదీన ఆస్పత్రిలో అడ్మిట్‌ అయింది.

రక్తం ఎక్కించే ప్రయత్నాలు..
వైష్ణవికి రక్తం ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నించారు. అయితే ఎంతకీ రక్తం ఆమె దేహంలోకి వెళ్లలేదు. అయినా వైద్యులు బలవంతంగా ఆమెకు రక్తం ఎక్కించారు. రక్తం ఎక్కించేప్పుడు దురద, మంట ఉందని వైష్ణవి ఏడ్చింది. అయినా వైద్యులు పట్టించుకోలేదు. రక్త స్రావం జరిగింది. ఒక్క రోజులోనే చేయి వాచింది. దీంతో ఇన్ఫెక్షన్ సోకిందని అర్థం చేసుకున్న ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు చేతులెత్తేశారు. ఆమెను మరో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ కుడి చేయి తీసివేశారు. 15 రోజుల తర్వాత.. ఇప్పుడు వైష్ణవి శరీరంలోని మిగతా భాగాలకూ ఇన్ఫెక్షన్‌ సోకిందని, ఉన్న ఒక్కచేతితో పాటు, రెండు కాళ్లూ తీసేస్తే తప్ప ఆమె బతకదని తేల్చి చెప్పారు. దీంతో వైష్ణవి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

కనువిప్పు కలిగేనా..
కార్పొరేట్ వైద్యుల నిర్లక్ష్యం విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రసాద్ ఆస్పత్రి వైద్యుల మీద మెడికల్ కౌన్సిల్‌కుకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. తమ బిడ్డలాంటి పరిస్థితి మరొకరికి రాకుండా ఉంటాలంటే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ హెచ్‌ఆర్సీకీ ఫిర్యాదు చేశారు. అటు నాచారం పోలీస్ స్టేషన్ లోనూ వైద్యుల నిర్లక్ష్యంపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు 120 యూనిట్ల రక్తం ఎక్కించినా వైష్ణవి ప్రమాదపు అంచులోంచి బయటపడటం లేదు. నాచారంలో ఉన్న ఇల్లు అమ్మి 25 లక్షలు ఖర్చు చేసినా.. వైష్ణవి బతుకుతుందో లేదో తెలియడం లేదు. బతికినా రెండు కాళ్లూ, చేతూలు లేకుండా తల, మొండెంతోనే జీవితాంతమూ నరకయాతన అనుభవించాల్సిన దయనీయ స్థితి. నిర్లక్ష్యపు వైద్యం ద్వారా.. కుందనపు బొమ్మను అవిటిదానిగా మార్చేసిన వైద్యులపైనా.. ప్రసాద్‌ ఆసుపత్రిపైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు యావే తప్ప.. పేషెంట్ల వెతలు పట్టించుకోని ఇలాంటి వైద్యులకు కనువిప్పు కలిగేలా ఆ శిక్ష ఉండాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

16:21 - October 24, 2016

హైదరాబాద్‌ : ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై ఏపీ సీఎల్‌సీ వేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తుందో తేలే వరకు మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని కోర్టు తెలిపింది. గురువారం వరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించొద్దని ఆదేశించింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:29 - October 24, 2016

హైదరాబాద్ : ఏవోబీ లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌ బూటకమంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మధ్యాహ్నం రెండున్నరగంటలకు ఈ పిటిషన్‌ విచారణకు రాబోతోంది.. పోస్ట్ మార్టం నిబంధనలు పాటించి మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించాలని ఏపీ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది.. 

13:32 - June 7, 2016

హైదరాబాద్ : సచివాలయ ఉద్యోగుల తరలింపుపై సందిగ్ధత తొలిగిపోనున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. ఈ నెలాఖరుకల్లా ఉద్యోగులు అమరావతికి తరలిరావాలని సీఎం గట్టి నిర్ణయంతో వున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెచ్ఆర్ఏ, స్థానికత, వర్క్ ప్లేస్ లో సౌకర్యాలు ఇటువంటి విషయాలలను సాకుగా చూపిస్తూ ఉద్యోగులు పలువురు పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఏపీ సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అమరావతి తరలివెళ్లే ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్టంగా రూ.20వేలు హెచ్ఆర్ఏను ప్రకటించింది. ఇప్పటి వరకూ హెచ్ఆర్ఏ ప్రకటించటంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికత విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇస్తే మరింత సంతోషంగా వుంటామని వారు పేర్కొంటున్నారు. మరింతగా వున్న చిన్న చిన్న సమస్యలను కూడా త్వరలో తొలగిపోతాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - hrc