house arrest

14:36 - September 12, 2018

న్యూఢిల్లీ: వరవరరావు సహా ఇతర నలుగురు మానవ హక్కుల నేతలకు గృహనిర్బంధాన్ని వచ్చే సోమవారం (సెప్టెంబరు 17) వరకు కొనసాగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.  ఐదుగురు మానవ హక్కుల నేతల విడుదల కోసం దాఖలైన పిటీషన్ ను విచారించిన కోర్టు వారి గృహనిర్బంధాన్ని పొడిగించాలని ఆదేశాలు జారీచేసింది.

చరిత్రకారుడు రోమిల థాపర్ హక్కుల నేతలు ఐదుగురిని విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తెలుగ రచయిత వరవరరావు, హక్కుల నేతలు వెర్నాన్, అరుణ్ ఫెర్రీరా, లాయర్ సుధా భరధ్వాజ్, పౌరహక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను మహారాష్ట్ర పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.   

13:52 - September 11, 2018
కరీంనగర్ : టీఆర్ఎస్ తనకు టికెట్ కేటాయించలేదని ఓ నేత గృహ నిర్భందం చేసుకున్నారు. ఆయన ఎవరో కాదు..కేసీఆర్ పై తనకు అపారమైన నమ్మకం  ఉందని...బాల్క సుమన్ కు సపోర్టు ఇచ్చేది లేదని స్పష్టం చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. ఇటీవలే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియజకవర్గ టికెట్ బాల్క సుమన్ కు దక్కింది. దీనితో నల్లా ఓదేలు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వెంటనే తనకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అధిష్టానం స్పందించకపోయే సరికి గృహ నిర్భందం విధించుకున్నారు. స్పష్టమైన హామీనిస్తే గాని గృహ నిర్భందం విరమిస్తానని తేగేసి చెబుతున్నారు. స్థానిక నేతలు, కార్యకర్తలు నల్లాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో సిట్టింగులు అందరికీ టికెట్లు కేటాయించి తనకు ఇవ్వకపోవడం బాధించిందని, బాల్క సుమన్ వల్లే తనకు టికెట్ రాలేదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 
08:20 - October 28, 2017

హైదరాబాద్ : ప్రొ.కంచ ఐలయ్య బయటకు వస్తే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు ఆయన్ను గృహ నిర్భందం చేశారు. కంచ ఐలయ్య సన్మాన సభ..ఆర్యవైశ్య సంఘాల సభ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కంచ ఐలయ్య టెన్ టివితో మాట్లాడారు. ఇద్దరు పోలీసు ఆఫీసర్లు తన ఇంటి ఎదుట ఉండడంతో తనకు రాత్రి నిద్ర పట్టలేదన్నారు. ప్రైవేటు రంగం రిజర్వేషన్లపై చర్చ పెట్టుకోవడం జరిగిందని...కానీ ఈ సభపై దుష్ర్పచారం చేసిందన్నారు. ఆదివాసీ ప్రాంతంలో ఇంగ్లీషు మీడియం స్కూళ్లు పెట్టవద్దా ? అని ప్రశ్నించారు. ఆయన పుస్తకాన్ని కనబడనీయకుండా చేయాలని అనుకున్నారని..ప్రస్తుతం ఆయన గొంతు విననీయకుండా చేయాలని అనుకుంటున్నారని..ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని టీ మాస్ నేతలు పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమౌతుందని, బహుజన శక్తి వీధుల్లోకి వస్తే వైశ్యులు..బ్రాహ్మణులకు..ఏపీ సీఎం చంద్రబాబుకు భయం ఉందన్నారు.

విజయవాడలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కంచ ఐలయ్య సన్మాన సభ, ఆర్యవైశ్య సంఘాల సభ నేపథ్యంలో జింఖానా నగర్‌ ఏరియాలో పోలీసులు ఆంక్షలు విధించారు. 144, 30 సెక్షన్లు విధించారు. సభలు, సమావేశాలకు అనుమతి లేదని .. చట్టాన్ని అతిక్రమిస్తే అరెస్టుల తప్పవని ఏపీ డీజీపీ స్పష్టం చేశారు. మరోవైపు హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యను గృహనిర్బంధలో ఉంచారు. తార్నాకలోని ఐలయ్య ఇంటి ముందు ఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై కంచ ఐలయ్య ఫైర్‌ అయ్యారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఐలయ్య హౌస్‌ అరెస్టును వామపక్షాలు, టీమాస్‌ ఖండించాయి. భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తున్నారని లెఫ్ట్‌పార్టీల నేతలు విమర్శించారు. 

09:11 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఆందోళన కార్యక్రమాలకు పిలుపినిస్తే పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరలేపుతున్నారు. రైతు సమస్యలు.. ఇతర సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టి.కాంగ్రెస్ శుక్రవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముందస్తు అరెస్టుల పర్వానికి తెరలేపారు. కోదాడలో 15 మందిని అదుపులోకి తీసుకోగా నకిరేకల్ లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గృహ నిర్భందం చేశారు. గరిడేపల్లి, హుజూర్ నగర్, సూర్యాపేట, మేళ్ల చెరువులో పలువురు నేతలను ముందస్తు అరెస్టు చేశారు. మేళచెరువులో పలువురు నేతలకు పోలీసులు ఫోన్ చేసినట్లు సమాచారం. ఎటూ వెళ్లవెద్దని పోలీసులు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని నేతలు పేర్కొంటున్నారు.

07:25 - August 4, 2017

తూర్పు గోదావరి : కాపులు బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో అమరావతికి పాదయాత్ర ప్రారంభించిన ముద్రగడ పద్మనాభంను పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. గృహ నిర్బంధం ముగియడంతో ఆయన గురువారం ఉదయం పాదయాత్రకు బయల్దేరారు. అయితే పాదయాత్రతో జిల్లాలో హింస జరిగే అవకాశం ఉందంటూ ముద్రగడను కిర్లంపూడిలోని ఇంటివద్దే పోలీసులు అడ్డుకున్నారు.పాదయాత్రను అడ్డుకోవడంపై... ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిర్లంపూడిలో ప్లేట్లను గరిటెలతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు.. శాంతియుతంగా పాదయాత్ర చేస్తామంటే అడ్డుకోవడం సరికాదని పోలీసుల తీరుపై ముద్రగడ ఫైర్ అయ్యారు.. యాత్రకు అనుమతి ఇచ్చేవరకూ తన ప్రయత్నం కొనసాగుతుందని ఆయన అన్నారు. కాపుల రిజర్వేషన్‌ హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ముద్రగడ పాదయాత్రకు మళ్లీ అడ్డుకోవడంతో కిర్లంపూడిలో మరోసారి టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ముద్రగడ నివాసం వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. 

13:35 - August 3, 2017

తూర్పు గోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ చెప్పారు. పాదయాత్ర దరఖాస్తు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ఇవాళ ఉదయం ముద్రగడ పాదయాత్ర కోసం బయటకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల కాపీని అందచేసినట్టు విశాల్‌ గున్నీ చెప్పారు. 

10:22 - August 3, 2017

తూర్పు గోదావరి : మరో సారి పాదయాత్ర కు సిద్దమైన ముద్రగడను పోలీసులు మరో సారి అడ్డుకున్నారు. ముద్రగడ నివాసం వద్దే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర ఎన్ని సార్లు అడ్డుకుంటారని పోలీసులను ముద్రగడ నిలదీశారు. ఇప్పటికే కిర్లంపూడికి కాపు జేఏసీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కిర్లంపూడిలో ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:14 - August 3, 2017

తూర్పుగోదావరి : కాపు ఉద్యమనేత ముద్రగడ పధ్మనాభం మరో సారి సాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ గత కొంత కాలంగా ఉద్యమం చేస్తున్నారు. ముద్రగడ గృహ నిర్భంధం నిన్నటితో ముగిసింది. కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్రకు సన్నాహాలు ఆయన చేసుకుంటున్నారు. కాపు జేఏసీ నేతలు, కార్యకర్తలు కిర్లంపూడికి ఇప్పటికే చేరకున్నారు. కిర్లంపూడిలో వాతవరణం ఉద్రిక్తతంగా మారడంతో పోలీసుల బలగాలను భారీగా మోహరించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

18:08 - July 31, 2017

తూర్పు గోదావరి : ముద్రగడకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కాపు యువత వినూత్న రీతిలో ఆందోళన చేపట్టింది. కాపు ఉద్యమ నేత కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో యువకులు ముఖానికి ముసుగులు ధరించి నిరనన తెలిపారు. రిజర్వేషన్లు కల్పించి ఆదుకోవాల్సిందిగా వేడుకుంటుంటే ప్రభుత్వం తమ ఉద్యమం అణచివేయాలని చూస్తోందని కల్వకొలను తాతాజీ ఆవేదన వ్యక్తం చేశారు. 

15:54 - July 31, 2017

తూర్పు గోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో వేలంక, భోగాపురం గ్రామాలకు చెందిన కాపుకులస్తులు ఆకలికేకలు పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముద్రగడ ఇంటి వద్దకు ర్యాలీగా చేరుకుని కంచాలు, గరిటెల చప్పుళ్లతో ఆందోళన చేశారు. ప్రభుత్వం ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవడంపై కాపు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అటు పశ్చిమ గోదావరిలోను కాపు ఉద్యమ నేత ముద్రగడ గృహనిర్బంధాన్ని నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో కాపు కులస్తులు ఆందోళన చేపట్టారు. గాంధీ బొమ్మల సెంటర్‌లో కంచాలు, గరిటెలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - house arrest