High Court

16:38 - September 4, 2018

ఢిల్లీ : కొంతమందికి డ్రైవ్ చేయటంలో మజా ఫీలవుతుంటారు. ఈ క్రమంలో వారు ర్యాష్ గా..స్టైల్ గా..కేర్ లెస్ గా డ్రైవ్ చేస్తుంటారు. దీంతో వాహనాలు పలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు వున్నాయి. ఈ క్రమంలో వాహనం పూర్తిగా డేమేజ్ కావచ్చు. ఆ ఏముందిలే..బీమా వుందిగా..మనకెందుకు చింత అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు యాక్సిలేటర్ మీద కాలేసినట్లే. ర్యాష్ డ్రైవింగ్ చేసిన సమయంలో యాక్సిడెంట్ అయిన వాహనాలకు బీమా వర్తించదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి గురైన వారు బీమా క్లెయిమ్‌ చేసుకోవద్దని చెప్పింది. జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. అయితే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి ‘పర్సనల్‌ యాక్సిడెంట్‌’ పాలసీ కింద పరిహారం అందుతుందని కోర్టు వెల్లడించింది.

జాతీయ బీమా కంపెనీ దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై విచారణ చేప్టిన సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. దిలీప్‌ భౌమిక్‌ అనే వ్యక్తి 2012 మే 20న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబసభ్యులు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన స్వయం తప్పిదం వల్లే ప్రమాదానికి గురయ్యారని బీమా కంపెనీ వాదించింది. అయితే త్రిపుర హైకోర్టు మృతుడి కుటుంబసభ్యులకు రూ.10.57లక్షల ఇన్స్యూరెన్స్‌ చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. దీనిపై బీమా కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిపుర హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. మృతుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసినట్లు గుర్తించింది. స్వయం తప్పిదంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ప్రమాదానికి గురైతే బీమా ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అటువంటి సందర్భాల్లో మోటార్‌ వాహనాల చట్టం సెక్షన్‌ 166 ప్రకారం బాధిత కుటుంబసభ్యులు కూడా ఇన్స్యూరెన్స్‌ కోరొద్దని పేర్కొంది. అయితే పర్సనల్‌ యాక్సిడెంట్‌ కవర్‌ కింద భౌమిక్‌ కుటుంబానికి రూ.2లక్షల బీమా ఇవ్వాలని కోర్టు జాతీయ బీమా కంపెనీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

07:32 - September 1, 2018

ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుపై కేంద్రం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎకె సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరురాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్‌లో వేరే భవనంలో వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుపై కేంద్రం ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఎందుకు హైకోర్టులను ఏర్పాటు చేయకూడదని కేంద్రం ఈ పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు విభజన ఎంతమాత్రం జాప్యం చేయటం వీలులేదని తెలంగాణ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి, రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్ర న్యాయశాఖ తరపున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌లు వాదించారు. కేంద్రం వాదనలతో తెలంగాణ ఏకీభవించింది. దీనిపై ఏపిలో హైకోర్టు భవన నిర్మాణాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా..దీనికి సంబంధించిన నిర్మాణాలు పూర్తి కాలేదని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు రెండు ప్రతిపాదనలు పెట్టింది. ప్రస్తుత హైకోర్టు భవనంలో ఖాళీగా ఉన్న 24 హాళ్లలో ఏపికి వేరుగా హైకోర్టు ఏర్పాటు చేయవచ్చునని, లేదంటే రెండో ప్రత్యామ్నాయంగా ప్రస్తుత హైకోర్టు భవనాన్ని తాము ఖాళీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. చట్టసభలు, అధికారుల విభజన జరిగిందని, కానీ న్యాయవ్యవస్థ విభజన జరగలేదని ముకుల్‌ రోహత్గి కోర్టుకు విన్నవించారు. హైకోర్టు విభజన ఆలస్యం కావడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, న్యాయమూర్తుల్లో 40 శాతం ఉండాల్సిన తెలంగాణ వాటా కూడా లేదని కోర్టుకు తెలిపింది. కేసు వాదనల సమయంలో ఏపి ప్రభుత్వం తరపు న్యాయవాది గైర్హాజయ్యారు. దీంతో ఏపి ప్రభుత్వానికి, హైకోర్టుకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం రెండు వారాలపాటు వాయిదా వేసింది. ఈ అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఏపీ బీజేపీ అధికార ప్రతినిథి ఆర్.డి. విల్సన్, కాంగ్రెస్ మాజీ ఎంపీ, తులసిరెడ్డి, టీఆర్ఎస్ నేత రాకేశ్ , టీడీపీ నేత లాల్ వజీర్ పాల్గొన్నారు. 

15:43 - August 21, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారిపై ఉన్న సస్పెన్షన్ వేటుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్టు డివిజన్ బెంచ్ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో, మండలి చైర్ పర్సన్ స్వామిగౌడ్ పై మైకులు విసిరిన ఘటనలో ఆయన కంటికి గాయం అయింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వారిరువురూ హైకోర్టును ఆశ్రయించగా..విచారణ జరిపిన సింగిల్ జడ్జ్, వారిపై అనర్హత వేటు కుదరదని తీర్పిచ్చారు. దీంతో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తు టీ.సర్కార్ పిటీషన్ దాఖలు చేసింది. దీంతో ఘటనకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశించింది. ఈ వీడియో సాక్ష్యాలను కోర్టుకు అందించడంలో అసెంబ్లీ అధికారులు విఫలం కావడంతో..వారు ఎమ్మెల్యేలుగా కొనసాగవచ్చని కోర్టు పేర్కొంది. ఇదే కేసులో అసెంబ్లీ స్పీకర్ కు న్యాయస్థానం నోటీసులు కూడా జారీ చేసంది. దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం..సింగిల్ బెంచ్ తీర్పును రెండు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో తెలంగాణ సర్కార్ కు తాత్కాలికంగా ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్ లకు ఎదురు దెబ్బ తగిలింది. కాగా ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం రెండు నెలలకు వాయిదా వేసింది.

16:34 - August 10, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని న్యాయవాది జంధ్యాల పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో ముచ్చటించారు. అసెంబ్లీ లా సెక్రటరీ కోర్టుకు డైరెక్ట్ గా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. అభ్యంతరాలు తెలపాలని కోర్టు ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేసిందని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:56 - July 30, 2018

హైదరాబాద్ : విభజన హామీలు సాధించుకోవడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్‌ ఆరోపించింది. విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా సాధించులేకపోవడం టీఆర్‌ఎస్‌ నేతల అసమర్థతకు నిదర్శనమని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని కేంద్రం ఇవ్వలేదని విమర్శించారు. హైకోర్టు విభజన కాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని తెలిపారు.

 

08:43 - July 16, 2018

పార్లమెంట్ ఎన్నికలు.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ సమాయత్తం అవుతుంది. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్  మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత దినకర్, బీజేపీ అధికార ప్రతినిధి కుమార్, వైసీపీ నేత రాజశేఖర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

16:10 - July 15, 2018

హైదరాబాద్ : ఏపీకి జరిగిన అన్యాయం..విభజన హామీల అమలుపై తెలంగాణ ఎంపీ కేకేతో చర్చించడం జరిగిందని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెడుతామని, అవిశ్వాసంపై టీఆర్ఎస్ మద్దతు అడిగామన్నారు. త్వరలో జరిగే ఆల్ పార్టీ సమావేశంలో ఈ అంశాలు లేవనెత్తాలని కోరడం జరిగిందన్నారు. తమ విజ్ఞప్తులకు టీఆర్ఎస్ నేతలు సానుకూలంగా స్పందించారన్నారు.

అవిశ్వాసం కోసం మద్దతు అడిగారు - కేకే...
హైదరాబాద్ : ఏపీ సమస్యలు, విభజన హామీలపై చర్చించడం జరిగిందని టీఆర్ఎస్ ఎంపీ కేకే పేర్కొన్నారు. అవిశ్వాసం కోసం మద్దతు అడిగారని...తెలంగాణకు కూడా సమస్యలున్నాయన్నారు.

 

07:59 - July 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సమాఖ్యకు హైకోర్టులు చుక్కెదురైంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ కళల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉ్రరూతలూగించి... స్వరాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన కళాకారులకు ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు వివాదంలో పడ్డాయి. ఎలాంటి నియమాలను పాటించకుండా కళాకారులను నియమించారని హైకోర్టు సీరియస్‌ అయ్యింది. నిజమైన కళాకారులను గుర్తించకుండా... తమకు అనుకూలంగా ఉన్నవారికే ఉద్యోగాలు కల్పించారని.. ఆ నియామకాలను వెంటనే రద్దు చేయాలని కోరింది. మూడు నెలల్లో కొత్త నియామకాలు చేపట్టాలని సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్‌ను ఆదేశించింది.
కళాకారుల నియామకాలు పారదర్శకంగా లేవన్న హైకోర్టు
తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యలో కళాకారుల నియామకాలు ఇప్పుడు వివాదంలో పడ్డాయి. తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యలో 550 మంది కళాకారుల నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్‌గా... కళాకారులకు ఉద్యోగాలు కల్పించింది. అయితే కళాకారుల ఉద్యోగ నియామకాల్లో ఏమాత్రం పారదర్శకత లేదని ... అసలైన కళాకారులకు అన్యాయం జరిగిందంటూ శంకరన్‌తోపాటు మరికొంతమంది నిరుద్యోగ కళాకారులు మూడేళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. దఫ దఫాలుగా విచారణ చేపట్టిన ధర్మాసనం గతంలో తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి విచారణ జరిపిన హైకోర్టు... తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సమాఖ్య కళాకారుల నియామకాలు పారదర్శకంగా లేవని ప్రభుత్వానికి సూచించింది. పూర్తి నియమ నిబంధనలతో కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చి.. నియామకాలు చేపట్టాలని చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ను ఆదేశించింది.
తమ అనుయాయులకే ఉద్యోగావకాశాలు కల్పించారన్న పిటిషనర్‌ 
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులను కాదని.. తమ అనుయాయులకే ఉద్యోగావకాశాలు కల్పించారని పిటిషనర్‌ హైకోర్టుకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన కళాకారులు ఉద్యోగాలన్నీ రద్దు చేసి అసలైన కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని విన్నవించారు. దీనిపై విచారించిన ధర్మాసనం కళాకారుల నియామకాలు పారదర్శకంగా జరుగలేదని అభిప్రాయపడింది. మళ్లీ రెండు వారాల్లో నూతన నోటిఫికేషన్‌ ఇచ్చి మూడు నెలల్లో ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యకు ఒక విధంగా షాకే. ఉన్న వారందరినీ తొలగించి... మళ్లీ నూతనంగా నియామకాలు చేపట్టాల్సి ఉంది. మరి హైకోర్టు తీర్పుపై సాంస్కృతిక సారధి ఏం చేస్తారో వేచి చూడాలి.

19:23 - July 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యలు హైకోర్టు షాక్ ఇచ్చింది. సాంస్కృతిక సమాఖ్య నియమించిన 550 మంది కళాకారుల నియామకాలు పారదర్శకంగా లేవని తెలంగాణ సర్కార్ కు హైకోర్టు మొట్టికాయలు వేసింది. మరోసారి నోటిషికేషన్ ఇచ్చి మళ్లీ నియామకాలను చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో ప్రకటన ఇచ్చి 3 నెలల్లో ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ రసమయి బాలకిషన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో పాల్గొన్న పలువురు కళాకారులకు న్యాయం జరగలేదంటు కొంతమంది కళాకారులు వేసిన పిటీషన్ పై విచారణ చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యలు ఆదేశాలు జారీ చేసింది. 

12:33 - July 2, 2018

హైదరాబాద్ : ఉపాధ్యాయ బదిలీలపై లైన్ క్లియర్ అయ్యింది. ఉపాధ్యా బదిలీలపై వున్న పిటీషన్స్ అన్నింటిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కొట్టివేసింది. ఈ బదిలీలకు సంబంధించిన ఆర్డర్ ను ఉమ్మడి జిల్లా డీఈఓలు కాకుండా ఆర్జేడీలకు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయ బదిలీలపై లైన్ క్లియర్ అయ్యింది. కాగా ఉమ్మడి జిల్లాలలో డీఈవోలకు మాత్రమే వుండేది కానీ ఇప్పుడు ఆర్జేడీలకు ఇవ్వాలని..వారికి మాత్రమే న్యాయస్థానం స్పష్టంచేసింది.

Pages

Don't Miss

Subscribe to RSS - High Court