health secrets

11:09 - September 12, 2018

వంటల్లో కరివేపాకు కీలకం. ప్రతి కూరగాయి..ఇతర ఆహార పదార్థాల్లో దీనిని వాడుతుంటారు. కానీ చాలా మంది కరివేపాకును తీసి పారేస్తుంటారు. దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. మరి ఒకసారి ఉపయోగాలు...తెలుసుకోండి...

  • కరివేపాకు శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకొనే వారు విరివిగా దీనిని ఆహారపదార్థంలో తీసుకుని చూడండి. అంతేగాకుండా ఆకులను నమిలి మింగినా ఫలితం ఉంటుందంట. 
  • ఇందులో విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది. కళ్లకు సంబంధించిన సమస్యలను పొగొడుతుంది. కంటిచూపును కూడా మెరుగుపరచడంతో పాటు రేచీకటి సమస్యను దూరం చేస్తుంది. 
  • ఇక వెంట్రుకలు రాలడం...పలచబడడం..తదితర సమస్యలను చాలా మంది ఎదుర్కొంటుంటారు. వీరికి కరివేపాకు మంచి ఔషధం అని చెప్పవచ్చు. వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు కరివెపాకు సహాయ పడుతుంది. 
  • ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించేందుకు కృషి చేస్తుంది. చక్కెర నియంత్రణలో ఉంటుంది. మూత్రసంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది.
12:31 - November 14, 2016

ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు పెద్దలు. కానీ నేడు ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం లేదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు పనుల్లో బిజీ బిజీగా మారిపోతున్నారు. దీనివల్ల కొంతమంది తరచూ అనారోగ్యాలకు గురవుతుంటారు. మంచి ఆరోగ్యానికి ఈ ఐదు చిట్కాలు పాటించి చూడండి..

  • రోజుకు మూడు లీటర్ల నీరు తాగితే రోగాలు దగ్గరకు రాకుండా ఉంటాయి.
  • రోజుకు ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వును తీసివేస్తుంది.
  • రోజుకు ఒక కప్పు పాలు సేవించడం వల్ల ఎముకలను ధృడంగా ఉంటాయి.
  • రోజుకు ఒక తులసి ఆకును తినడం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
  • రోజుకు ఒక యాపిల్ భుజించడం వల్ల డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరం ఉండదు.

అంతేగాకుండా తక్కువ ఒత్తిడి..ఎక్కువగా నిద్ర పోవడం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడుతారు. అలాగే వీలైనంత సేపు నడవాలి. తక్కువ కోపంగా ఉండి ఎక్కువగా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. 

15:33 - October 25, 2016

ఆకు కూరలలో కెరోటిన్‌ అనే పదార్ధం సమృద్ధిగా ఉం టుంది. శరీరంలో కెరోటిన్‌ విటమిన్‌ 'ఎ'గా మారుతుం ది. విటమిన్‌ 'ఎ' చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కళ్ళకు సరైన చూపును ఇస్తూ రేచీకటి రాకుండ కాపాడుతుంది. ఆకు కూరల్లో తోట కూర ఒకటి. ఈ తోటకూర తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి.
అధిక రక్తపోటుకు చెక్ పెడుతుంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది.
రెగ్యులర్ గా తోటకూర తింటే రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ ఆకుకూరను భుజించడం ఉత్తమం. పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికి తోడు కొవ్వును తగ్గిస్తుంది.
తోటకూర తక్షణశక్తినివ్వడంలో తోడ్పడుతుంది. కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివీ సమకూరుతాయి.
తోటకూరలోని 'విటమిన్‌ సి' రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. తాజా తోటకూర  ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక.. తలకు పట్టించుకుంటే మంచిది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే జుట్టు రాలదు. మాడు మీద చుండ్రు తగ్గుతుంది.
విటమిన్ల ఖని తోటకూర అని చెప్పవచ్చు. విటమిన్‌ ఎ, సి, డి, ఇ, కె, విటమిన్‌ బి12, బి6 వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు. ఇవన్నీ సమకూరుతాయి.
వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీలశక్తి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ దొరుకుతాయి.

12:43 - August 12, 2015

నిండు నూరేళ్లు జీవించమని దీవిస్తుంటారు పెద్దలు. అలాగే జీవించాలని ఆశపడుతుంటాడు ప్రతీ మనిషి. అయితే.. అందరికీ సాధ్యం కాదు ఆ మైలురాయిని చేరడం..! వివిధ కారణాలతో నూటికి తొంభై మందికిపైగా తొంభై దరిదాపుల్లోనే జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తుంటారు. కానీ.. కొందరుంటారు. బతుకు బండిని వందేళ్లకు పైబడి అవలీలగా లాగేస్తారు..! ఆ కొందరిని మాత్రమే వరించే ఈ అదృష్టం వెనకున్న కారణాలు ఎవరికీ తెలీదు. తాజాగా.. దాన్ని ఛేదించిందో పరిశోధన.

వంద... ఇది అన్నింటా ప్రత్యేకమే..!

వంద... ఇది అన్నింటా ప్రత్యేకమే..! కొట్టినవారిది హవా..వంద రోజుల ఆడిన సినిమాదే హంగామా...మరి, మనిషి వయస్సు వందేళ్లు దాటితే..? అదో అద్భుతం. కానీ.. ఈ అద్భుతం అందరి జీవితాల్లోనూ చోటు చేసుకోదు. క్రికెట్లో మాదిరిగా.. కొందరు హాఫ్ సెంచరీ లోపే మైదానం వీడిపోతుంటే.. ఆ తర్వాత సెంచరీ చేయకుండానే పెవిలియన్‌ చేరుతుంటారు నూటికి 95 మంది. ఇక ఏ కొద్ది మంది మాత్రమో.. అనారోగ్యం అడ్డంకుల్ని దాటుకుంటూ, వృద్ధాప్యం అవరోధాల్ని ఛేదిస్తూ దిగ్విజయంగా వందేళ్ల మైలురాయిని చేరుకుంటారు.

వందేళ్లు దాటిని తర్వాత కూడా వారి ఇన్నింగ్స్‌....

ఇక మరికొందరు ఉంటారు. వందేళ్లు దాటిని తర్వాత కూడా వారి ఇన్నింగ్స్‌ కొనసాగుతూనే ఉంటుంది. నూటా ఐదు, నూట పది.. అంటూ జీవితం నడుస్తూనే ఉంటుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వయసులోనూ వారి పని వారే చేసుకునే వారు కూడా ఉంటారు. ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తుంటుంది ఈ అంశం. కానీ.. ఈ అద్భుతం వెనకున్న కారణాలు ఇప్పటి వరకూ తెలియరాలేదు. అయితే.. తాజాగా దీనికి గల కారణాలను కనిపెట్టిందో అధ్యయనం.

ఈ అంశంపై శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు...

టోక్యోలోని కెయో యూనివర్సిటీ స్కూల్‌ ఆప్‌ మెడిసిన్‌, న్యూక్యాజిల్‌ యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఏజింగ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు నిర్వహించారు. చాలాకాలం పాటు పరిశోధన సాగించిన శాస్త్రవేత్తలు.. శతాధిక జీవనానికి సంబంధించిన రహస్యాన్ని ఛేదించారు.

మానవ కణాల్లో ఉంటే టెలోమేర్లు పొడవుగా ఉండడం....

మానవ కణాల్లో ఉంటే టెలోమేర్లు పొడవుగా ఉండడం, అలాగే.. ఇన్‌ ఫ్లమేషన్ స్థాయి గణనీయంగా తగ్గి ఉండడం వల్లే వందేళ్ల జీవనం సాధ్యమవుతోందని తేల్చారు. టెలోమేర్లు పొడవుగా ఉన్న వారిలో వృద్ధాప్య ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుందని, ఇతరులతో పోలిస్తే.. వీరు ఎక్కువ కాలం పాటు వ్యాధులకు దూరంగా ఉంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. వందేళ్లు, అంతకు పైబడిన వారిపైన శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఇతరులతో పోలిస్తే.. వీరిలో టెలోమేర్లు పొడవు ఎక్కువగా ఉండడం, ఇన్‌ ఫ్లమేషన్‌ స్థాయి తక్కువగా ఉండడాన్ని గమనించారు. వయసు పెరిగే కొద్ది అందరిలోనూ ఇన్‌ ఫ్లమేషన్ స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఇది తక్కువగా ఉన్నవారు దీర్ఘకాలం జీవిస్తారని తేల్చారు శాస్త్రవేత్తలు.

Don't Miss

Subscribe to RSS - health secrets