GST

12:23 - November 5, 2018

హైదరాబాద్ : దీపావళి సీజన్ లో కళకళలాడుతుండే టపాకాయల విక్రయ దుకాణాలు వెలవెలబోతున్నాయి. సాధారణ ధరకు, జీఎస్టీ కూడా అధనం కావడంతో, ప్రతియేటా 10 నుంచి 12 శాతం మేరకు పెరిగే ధరలు, ఈ సంవత్సరం 20 శాతానికి పైగా పెరగడమే ఇందుకు కారణం. ఇదే సమయంలో సుప్రీంకోర్టు ఆంక్షలు కూడా ఉండటంతో వ్యాపారం తక్కువగా సాగుతోంది. ఈ సంవత్సరం ఎన్నడూ లేనంత అధిక ధరలకు టపాకాయలను విక్రయించాల్సి వస్తోందని వ్యాపారులే అంటున్నారు. లక్షల రూపాయలు పెట్టి, సరుకు తెచ్చుకున్నామని, వాటిని కొనుగోలు చేసే వారు కనిపించడం లేదని వాపోతున్నారు.
 

15:27 - October 27, 2018

ఢిల్లీ : దేశ రాజధాని వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వంపై పోరు ఉధృతం చేశారు. శనివారం ఆయన ఢిల్లీకి చేరుకున్న అనంతరం మధ్యాహ్నం జాతీయ మీడియాతో మాట్లాడారు.  ఈ సందర్భంగా గత నాలుగున్నర సంవత్సరాల బీజేపీ పాలనలో ఎలాంటి పరిణామాలు సంభవించాయి ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పడుతున్న ఇబ్బందులను తెలియచేశారు. 
ప్రతి అకౌంట్‌లో రూ. 15 లక్షల నగదు వేస్తామని చెప్పారని మరి ఆ నగదు ఏమైందని ప్రశ్నించారు. దేశంలో ఏమి జరుగుతోంది ? ప్రదానంగా ఏపీలో ఏం జరుగుతోందనే దానిపై వెల్లడించానికి తాను ఢిల్లీకి రావడం జరిగిందన్నారు. బీజేపీ - ఎన్డీయే ఎన్నికలకు రాకముందు ప్రజాస్వామ్యం రక్షిస్తామని..దేశంలో ఉన్న రాష్ట్రాలను బలోపేతం చేస్తామని..అవినీతిని అంతమొందిస్తామని..దేశాన్ని అభివృద్ధి దిశగా పయనించే విధంగా చర్యలు తీసుకుంటామని...యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని..ఇలా అనేక హామీలిచ్చిందని తెలిపారు. 
ఎన్నికలకు ముందు అచ్చే దిన్ అంటూ హామీలిచ్చిందని..ఆ మంచి రోజులు ఎప్పుడొస్తాయని సూటిగా ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. బ్లాక్ మనీ కోసం నోట్ల రద్దు చేస్తున్నామంటు పేర్కొన్నారని, కానీ బ్లాక్ మనీ ఎక్కడా అని ప్రశ్నించారు. అనంతరం రెండు వేల రూపాయల నోటును తీసుకొచ్చారని, తిత్లీ తుపాన్ కారణంగా రాష్ట్రంలో డబ్బు విషయంలో ఏర్పడిన సమస్యపై ఆర్బీఐతో మాట్లాడడం జరిగిందన్నారు. 

11:07 - October 24, 2018

విజయవాడ : నగర మేయర్ నివాసంలో జీఎస్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. జీఎస్టీ శాఖకు పన్ను చెల్లించకపోవటంతో మేయర్ కోనేరు శ్రీధర్ నివాసంలో మూడు గంటలపాటు ఎనిమిదిమంది  జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలలో విలువైన పత్రాలు, హార్డ్ డిస్క్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేఎంకే ఈవెంట్స్ సంస్థకు డైరెక్టర్ గా వున్న మేయర్ భార్య వున్నారు. ఈ క్రమంలో కేఎంకే ఈవెంట్స్ సంస్థ జీఎస్టీ పన్ను చెల్లించకపోవటంతో అధికారులు తనిఖీలు నిర్వహించి విలువైన పత్రాలు, హార్డ్ డిస్క్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా కేఎంకే ఈవెంట్స్ కు సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోవటంతో జీఎస్టీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. కాగా ఈ దాడులపై మేయర్ కోనేరు శ్రీధర్ స్పందిస్తు..తమ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేసారనే వార్తలు వస్తున్నాయనీ..కానీ జీఎస్టీ అధికారులు మాత్రమే తనిఖీలు చేశారని స్పష్టం చేశారు. కాగా తాము ఐటీ పన్నులు కూడా సక్రమంగానే చెల్లిస్తామని ఇటువంటి తనిఖీలు సాధారణమేనని తెలపారు.
 

11:39 - August 10, 2018

వరంగల్‌ : జిల్లాలో ఐటీ శాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు. అధికార పార్టీ నేతల రియల్‌ వెంచర్స్‌పై ఐటీ  అధికారులు దాడులు చేశారు. ఆదాయపన్ను ఎగ్గొట్టారన్న ఆరోపణలతో ఐటీ శాఖ దాడులకు దిగింది. హన్మకొండ హంటర్‌రోడ్డులోని విల్లాస్‌ నిర్మాణ లావాదేవీలపై ఐటీ అధికారులు అర్ధరాత్రి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఎస్‌బీఐ, ఖాతాలను సీజ్‌ చేసిన ఐటీ అధికారులు.. విల్లా కొనుగోలుదారులకు నోటీసులు జారీ చేశారు.

 

12:06 - August 6, 2018

విజయవాడ : దేశంలో వ్యవసాయం తర్వాత అంతటి ప్రాధాన్యం గల చేనేత రంగంపై ప్రభుత్వం దృష్టిసారించాలని చేనేత కార్మికులు కోరుకుంటున్నారు. అయితే చేనేత రంగాన్ని ఆదుకునేవారే లేక ఈ రంగాన్నే నమ్ముకుని జీవిస్తున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. చేనేత కార్మికుల సంక్షేమం దిశగా పాలకులు మొగ్గు చూపాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు నామమాత్రంగానే మిగిలిపోతున్నాయి. ఏపీలో చేనేత కళకు, చేనేత తయారీకి కళాకారులు జీవం పోస్తున్నా..నేతన్నల బతుకు భారంగా మారుతున్న వైనంపై..10టీవీ ప్రత్యేక కథనం.

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికుల సంక్షేమం దిశగా పాలకులు మొగ్గు చూపాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు నామమాత్రంగానే మిగిలిపోతున్నాయి. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు చేనేతలకు రుణమాఫీ చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 110 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి కొంత ఉపశమనం కల్పించినా ... పూర్తిస్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో నేతన్నల్లో ఆందోళన వ్యక్తమౌతోంది.

ఆప్కోకు 150 కోట్ల రూపాయల నుంచి 250 కోట్లు కేటాయిస్తే..చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు 20 శాతం రిబేటు ఇస్తుండగా, దీన్ని ఆప్కోకు కూడా వర్తింపజేసి 30 శాతానికి పెంచేలా సర్కార్ చొరవ చూపాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. మరోవైపు కృష్ణాజిల్లాలో చేనేత రంగం నానాటికీ సంక్షోభంలో కూరుకుపోతోంది. జీఎస్టీతో నూలు ధరలు బాగా పెరిగాయి. దీనికి తోడు ఆప్కోకు విక్రయించిన ఉత్పత్తులు కొనుగోలు కావడం లేదు. దీంతో వాటికి సంబంధించిన బకాయిలు విడుదల చేయకపోవడంతో చేనేతలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆశించినమేర విక్రయాలు లేకపోవడంతో చేనేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ప్రస్తుతం చీరల తయారీ ఖర్చు రెట్టింపయ్యింది. ఈ ప్రభావం వినియోగదారులపై కూడా పడి విక్రయాలు తగ్గిపోయాయి. సాధారణంగా ఒక్కో చీర 500 నుంచి 1200ల వరకు ఉంటుంది. తయారీకి ఉపయోగించే నూలుపై 5 శాతం, జరీపై 15 శాతం ఇలా రంగులు, ఇతరత్రా కూడా జీఎస్టీ ఉండటంతో ధర పెంచి విక్రయించాల్సి వస్తోంది. . అయితే ప్రతినెలా జిల్లాలో సుమారు 1.60 కోట్ల రూపాయలు నూలుకే వెచ్చిస్తున్నారు. నూలుపై 5 శాతం పన్ను విధించడంతో ఇబ్బందులు పడుతున్నారు చేనేత కార్మికులు. దేశంలో వ్యవసాయం తర్వాత అంతటి ప్రాధాన్యం గల చేనేత రంగంపై ప్రభుత్వం దృష్టి సారించాలని,..కళాకారులను ఆదుకోవాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు కోరుతున్నారు. ఆగస్టు7న తేదీన చేనేత దినోత్సవం రోజు కావడంతో ప్రభుత్వం తమపై కనికరం చూపించి... సీఎం చంద్రబాబు ఓ ప్రకటన చేయాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. 

19:36 - June 30, 2018
15:31 - June 2, 2018

విశాఖపట్టణం : రోజు రోజుకు పెరుగుతున్న పెట్రో ధరలపై సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాలో శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. ఈసందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. పన్నుల పేరిట ప్రజలపై భారాలు ప్రభుత్వాలు మోపుతున్నాయని, జీఎస్టీతో పన్నులు వేస్తూ కార్పొరేట్ సంస్థలకు రాయితీలిస్తున్నారని తెలిపారు. పెంచిన ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. 

09:38 - May 21, 2018

ఢిల్లీ : ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర 80 రూపాలయలు దాటేసింది. డీజిల్ సైతం 73రూపాయలకు చేరుకుంది. పెట్రోరేట్ల పెరుగుదలతో .. నిత్యావసరాల ధరలు ఎక్కడ పెరుగుతాయోనని సామాన్యుడు ఆందోళన పడుతున్నాడు.

రికార్డు స్థాయిలో పెట్రో ధరలు..
పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజురోజుకి పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకుంటున్నాయి. దేశ రాజధానిలో పెట్రోల్‌ ధర 33 పైసలు పెరిగి రూ.76.24కు చేరింది. రోజువారీ ధరల సమీక్ష విధానాన్ని తీసుకొచ్చిన అనంతరం పెట్రోల్‌ ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. మరోవైపు డీజిల్‌ 26 పైసలు పెరిగి జీవితకాల గరిష్టం రూ.67.57కు చేరింది. ఢిల్లీలో 2014 సెప్టెంబర్‌ 14న పెట్రోల్‌ ధర రూ.76.06 ఉంది. ఇప్పుడు ఆ రికార్డును చెరిపేస్తూ 76.24 రూపాయలకు చేరింది.

పెట్రోల్ తో సమానంగా పెరుగుతున్న డీజిల్..
మరోవైపు డీజిల్‌ ధరలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల సందర్భంగా 9 రోజుల పాటు ధరలు పెంచని పెట్రోసంస్థలు ఎన్నికల ఫలితాల అనంతరం వాతలు పెట్టడం మొదలు పెట్టాయి. గత ఎనిమిది రోజులుగా వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నాయి. పన్నులను కలుపుకుంటే లీటరు పెట్రోలు ధర ముంబయిలో 84.07రూపాయలు, హైదరాబాద్‌లో 80.76 రూపాయలు, కోల్‌కతాలో 78.91రూపాయలు, చెన్నైలో 79.13 రూపాయలుగా ఉన్నాయి. డీజిల్‌ ధర హైదరాబాద్‌లో 73.45 రూపాయలుగా ఉండగా.. ముంబయిలో 71.94 రూపాయలు, కోల్‌కతాలో 70.12 రూపాయలు, చెన్నైలో 71.32 రూపాయలుగా ఉంది. పెట్రోల్‌ ధర తక్కువగా పనాజీలో 70.26 రూపాయలుగా ఉండగా.. అండమాన్‌ రాజధాని పోర్ట్‌బ్లెయర్‌లో డీజిల్‌ రేటు తక్కువగా 63.35 రూపాయలుగా నమోదైంది.

అనివార్యంగా పెంచాల్సి వస్తోంది : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
పెట్రోల్‌,డీజిల్‌ ధరల పెరుగదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా.. అనివార్యంగా ధరలు పెంచాల్సి వస్తోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. ఒపెక్ దేశాలు ఆయిల్ ఉత్పత్తిని తగ్గించేయడం, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు బాగా పెరిగిపోవడం ఇందుకు కారణం అన్నారు. మరోవైపు పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించే ఆలోచన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని కూడా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మొత్తానికి పెరుగుతున్న ధరలను తగ్గించే ఆలోచనేదీ లేదని, ప్రజలు పెట్రోభారాన్ని మోయాల్సిందేనని కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలతో స్పష్టం చేశారు.

జీవితకాల గరిష్టానికి చేరిన పెట్రోలు, డీజిల్‌ రేట్లు --
పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజురోజుకి పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకుంటున్నాయి. దేశ రాజధానిలో పెట్రోల్‌ ధర 33 పైసలు పెరిగి రూ.76.24కు చేరింది. రోజువారీ ధరల సమీక్ష విధానాన్ని తీసుకొచ్చిన అనంతరం పెట్రోల్‌ ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. మరోవైపు డీజిల్‌ 26 పైసలు పెరిగి జీవితకాల గరిష్టం రూ.67.57కు చేరింది. ఢిల్లీలో 2014 సెప్టెంబర్‌ 14న పెట్రోల్‌ ధర రూ.76.06 ఉంది. ఇప్పుడు ఆ రికార్డును చెరిపేస్తూ 76.24 రూపాయలకు చేరింది. మరోవైపు డీజిల్‌ ధరలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత చమురు సంస్థలు గత ఏడు రోజులుగా వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నాయి. పన్నులను కలుపుకుంటే లీటరు పెట్రోలు ధర ముంబయిలో 84.07రూపాయలు, హైదరాబాద్‌లో 80.76 రూపాయలు, కోల్‌కతాలో 78.91రూపాయలు, చెన్నైలో 79.13 రూపాయలుగా ఉన్నాయి. డీజిల్‌ ధర హైదరాబాద్‌లో 73.45 రూపాయలుగా ఉండగా.. ముంబయిలో 71.94 రూపాయలు, కోల్‌కతాలో 70.12 రూపాయలు, చెన్నైలో 71.32 రూపాయలుగా ఉంది. పెట్రోల్‌ ధర తక్కువగా పనాజీలో 70.26 రూపాయలుగా ఉండగా.. అండమాన్‌ రాజధాని పోర్ట్‌బ్లెయర్‌లో డీజిల్‌ రేటు తక్కువగా 63.35 రూపాయలుగా నమోదైంది.

 

13:47 - March 23, 2018
13:28 - February 10, 2018

ప.గో : దేశానికి ప్రత్యామ్నాయం అవసరమని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. వామపక్ష ప్రజాస్వామ్య శక్తుల ఆధారంగా ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజలను ఆకర్షించాలన్నారు. పార్టీ స్వతంత్ర శక్తిని పెంచుకోవాలని, వామపక్షాల ఐక్యతను పెంపొందించాలని తెలిపారు. భీమవరంలో జరుగుతున్న సీపీఎం ఏపీ రాష్ట్ర మహాసభల్లో ప్రారంభ ఉపన్యాసం చేశారు. దేశానికి నాయకులు కాదు...విధానాలు కావాలన్నారు. వామపక్ష ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేయాలన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ నిర్మాణాన్ని బలపర్చుకోవడం అనివార్యమన్నారు. మనది విప్లవకర, రెవెల్యూషనరీ, మాస్ లైన్ పార్టీ అని అన్నారు. మాస్ లైన్ ద్వారా ప్రజల వద్దకు వెళ్లాలని సూచించారు. నీళ్లల్లో చేప వెళ్లినట్లు ప్రజల్లో కూడా కమ్యూనిస్టులు వెళ్లాలని తెలిపారు. ప్రజా ఉద్యమాలను బలపర్చాలన్నారు. స్వతంత్ర శక్తి, వామపక్ష ఐక్యత, ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించాలన్నారు. మతతత్వ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఏపీలో వామపక్షాలు బలపడేందుకు పెద్ద ఎత్తున అవకాశాలు పెరిగాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఆర్థిక విధానాలు ఒకటేనని తెలిపారు. బీజేపీ కేరళను టార్గెట్ చేసి ఎల్ డీఎఫ్ ను బలహీనపర్చడం ధ్యేయంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. సీపీఎంకు సిద్ధాంతం ఉంది.. ప్రత్యామ్నాయ విధానాలలతో ముందుకు వెళ్తుంది కనుక అందుకే మన పార్టీని మెయిన్ టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. భారత్ మాతాకీ జై అంటూ, దేశభక్తి గురించి చెప్పే బీజేపీ త్రిపురలో దేశ ఐక్యతకు వ్యతిరేకమైన సంస్థతో పొత్తు పెట్టుకుందన్నారు. కేరళలో హింస, హత్యలు మొదలుపెట్టింది బీజీపీయే.. కానీ సీపీఎంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. గత ఐదు సం.రాల్లో ప.బెంగాల్ లో 175 మంది సీపీఎం కార్యకర్తలను హత మార్చారని తెలిపారు. ఉత్తర కేరళలో ఆర్ ఎస్ ఎస్ ఘర్షణలకు పాల్పడుతుందన్నారు. పెద్ద ఎత్తున ముస్లింలు ఉన్నచోట్ల రాజకీయ ఘర్షణలకు దిగుతున్నారని పేర్కొన్నారు. రాజకీయ హింస లేకుండా బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లకు సామాజిక ఆధారం లేదన్నారు. బీజేపీకి ఉన్న 280 ఎంపీల్లో 112 మంది
కాంగ్రెస్, మిగత పార్టీల నుంచి వెళ్లిన వారేనని తెలిపారు. తాము ఏపీ ప్రజలకు మద్దతుగా ఉంటామని చెప్పారు. గతంలో తాము ఏపీకి ప్రత్యేహోదా 5 ఏళ్లు ఉండాలని కోరామని...కానీ ఏపీకి 10 సం.రాలు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు. నాలుగు సం.రాలు గడిచినా ఏపీకి ఏమీ ఇవ్వలేదన్నారు. కేంద్రం ఏపీ ప్రజలకు చేసిన వాగ్దానాలకు ద్రోహం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - GST