gandhi

11:15 - September 20, 2018

        ప్రతీ చరిత్ర వెనకా కొన్ని ఊహించని మలుపులు ఉంటాయి. నెహ్రూకు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూ బాగా కష్టపడ్డాడని ఇటీవల బహిర్గతమైన కొన్ని ఉత్తరాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ల్యాండ్‌ఫోన్‌లు అంతగా లేవు..  సెల్‌ఫోన్‌లు అసలే లేవు కాబట్టి... ఖచ్చితంగా ఉత్తరాలు, ప్రత్యుత్తరాలే ఏకైక సమాచార వారధులు.

        నెహ్రూకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి కట్టబెట్టాల్సిందిగా మహాత్మా గాంధీతో ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూ లాబీయింగ్ చేశాడని అప్పటి ఉత్తరాల ద్వారా తెలుస్తోంది. ఇది స్వాత్యంత్రం రాకముందే మోతీలాల్ లాబీయింగ్ చేసినట్టు ఆధారాలు లభించాయి.  

1928 జూన్ 11 :   నెహ్రూ తండ్రి మోతీలాల్ గాంధీకి నెహ్రూకు అధ్యక్షపదవి కట్టబెట్టే విషయమై పరిశీలించాల్సిందిగా కోరారు. దాని సారాంశం ఇది.

‘‘నాకు స్పష్టత ఉంది ప్రస్తుతం వల్లభాయ్ పటేల్ మాత్రమే పార్టీలో హీరో. అతనికి ప్రజల్లో ఉన్న పాపులారిటీ దృష్ట్యా అతనికి అధ్యక్ష పీఠం దక్కాల్సిందే. ఇది తప్పితే.. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూకు మాత్రమే ఆ అర్హత ఉంది. జవహర్ లాంటి యువత ఆధ్వర్యంలో స్వాతంత్ర ఉద్యమం ముందుకు సాగవలసిందే. ఇటువంటి వారు ఎంత ముందుగా రంగంలోకి దిగితే అంత మంచిది.’’

1928 జులై : మహాత్మా గాంధీని తన కుమారుడు నెహ్రూకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందిగా అభ్యర్ధిస్తూ మోతీలాల్ నెహ్రూ మరో ఉత్తరం రాశారు.

1928 డిసెంబర్ : అదే సంవత్సరం డిసెంబర్‌లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో మోతీలాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

1929 మార్చి: లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

స్వాతంత్ర్యానంతరం జరిగిన ఎన్నికల్లో  సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నెహ్రూ కంటే అత్యధికంగా ఓట్లు వచ్చినప్పటికీ.. నెహ్రూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 90 ఏళ్ల క్రితం పడిన ఈ బీజం నేటికీ నెహ్రూ కుటుంబ పాలన నేటికీ కొనసాగుతోంది. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, పోనియా గాంధీ.. ఇప్పుడు రాహుల్ గాంధీ.

14:58 - October 22, 2017

'రాముడు'లో మంచితనం లేదని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ తెలిపారు. రంగనాయకమ్మతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె రచించిన 'రామయణ విషవృక్షం' పై స్పందించారు. రాజు అనే పెద్ద దొర అని..అతనికి ఆస్తి..భూమి విపరీతంగా ఉంటుందన్నారు. రాముడు..రావణుడులు ఇద్దరు రాజులని, ఇందులో గొప్ప ఏముందన్నారు. రాజు అనే వాడు దోపిడి దారుడని..రాముడులో ఒక మంచితనం లేదని స్పష్టం చేశారు. ఇక్కడ రాముడిపై కవి ఎందుకు రాశాడు అంటే అతనికి అంతకంటే జ్ఞానం లేదన్నారు. రామాయణంలో ఏ చెడ్డ క్యారెక్టర్లు అన్నారో అవి మంచి క్యారెక్టర్లు అని..ఏవీ గొప్ప క్యారెక్టుర్లు అని పేర్కొన్నారో..అవి చెడ్డ క్యారెక్టర్లని విమర్శించారు. సీత..ఊర్మిళ..వీరి తప్పేమి లేదని..భర్తలు ఎలా చెబితే అలా విన్నారని పేర్కొనడం జరిగిందన్నారు. మతం అనేది ద్రోహం..రాజు పెద్ద ద్రోహి అని, మార్క్సిజం చదివిన అనంతరం ఈ పుస్తకం రాసి 'రామాయణ విషవృక్షం' అని పేరు పెట్టడం జరిగిందన్నారు. ఇలాంటి పేరు పెట్టవద్దని ముద్రణ చేసే వ్యక్తి కోరడం జరిగిందన్నారు. ముందు శ్రీశ్రీతో మాట్లాడాలని అతను సూచించడం జరిగిందని కానీ తాను శ్రీశ్రీని ఇష్టపడనని..అతని కవిత్వం బాగుండొచ్చన్నారు. ఎవరితోనూ మాట్లాడనని ఖరాఖండిగా చెప్పడం జరిగిందన్నారు. చివరకు ముద్రణ వేయడం..మంచి అమ్మకాలు జరిగాయన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:49 - October 22, 2017

దేవుడనేది అబద్ధమని ప్రముఖ రచయిత్రి రంగానాయకమ్మ పేర్కొన్నారు. టెన్ టివి రంగనాయకమ్మతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా పలు విశేషాలు తెలియచేశారు. అందులో నాస్తికత్వంపై స్పందించారు. 20 ఏళ్ల వరకు నమ్మకాలు..ఉండేవన్నారు. కానీ కందుకూరి వీరేశిలింగం గారి పుస్తకం తమ ఇంటికి వచ్చిందని తెలిపారు. కందుకూరి నాస్తికుడు కారని, కానీ ఆ బుక్ లో కొన్ని ప్రశ్నలున్నాయన్నారు. అందులో కొన్ని ప్రశ్నలు తాను అప్పటి వరకు గ్రహించలేదని..ఎవరూ తనకూ చెప్పలేదన్నారు. తనకు..కుటుంబసభ్యులకు -14 కంటి సైట్ ఉందని..సూర్య నమస్కారం చేస్తే సమస్య పరిష్కారమౌతుందని పలువురు చెప్పారని పేర్కొన్నారు. కానీ చేసినా మార్పు రాలేదన్నారు. తరువాత నాస్తికత్వం అలవాటై పోయిందని..అలా నాస్తికత్వం పుస్తకాలు చదువుతూ చివరకు దేవుడు అబద్ధమనే అభిప్రాయం వచ్చిందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:41 - April 20, 2017

లండన్ : భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీని విదేశాల్లో కూడా ఆదరిస్తుంటారు. పలు దేశాల్లో ఆయన విగ్రహాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. గాంధీ చిత్ర పేరిట ఉన్న అరుదైన స్టాంపులు యూకేలో రికార్డు ధర పలికాయి. స్టాన్లీ గిబ్బన్స్ అనే స్టాంప్ కలెక్టింగ్ కంపెనీ మహాత్ముడి చిత్రం పేరిట ఉన్న నాలుగు స్టాంపుల వేలం వేసింది. ఈ వేలంలో పలువురు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 5లక్షల పౌండ్లు పాడి చేజిక్కించుకున్నాడు. భారత కరెన్సీలో దాదాపు రూ. 4.1 కోట్లు. ఓ భారత స్టాంప్ కు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి అని పలువురు పేర్కొంటున్నారు. 1948 నాటి పది రూపాయల విలువ గల మహాత్ముడి స్టాంపులు కేవలం 13 మాత్రమే చలామణిలో ఉన్నట్లు అక్కడి నిర్వాహకులు పేర్కొనట్లు తెలుస్తోంది. ఇందులో కేవలం నాలుగింటిని మాత్రమే వేలం వేయగా మరో నాలుగు ఫిలాటెలిక్ కలెక్షన్ హౌస్ లో ఉన్నట్లు సమాచారం.

12:31 - November 8, 2016

మహాత్మాగాంధీ మనవడు కానూ రాందాస్ (87) ఇక లేరు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొద్ది రోజుల క్రితం చికిత్స నిమిత్తం చేరిన ఆయన సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. పక్షవాతంతో గత నెల 22న కనూ రామ్‌దాస్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆయన కోమాలోకి వెళ్లారు. అయితే ఆయనకు మెరుగైన వైద్యం అందిచేందుకు ఎవరూ చొరవ చూపలేదని చిరకాల మిత్రుడు బాదియా ఆవేదన వ్యక్తం చేశారు.
1930 మార్చి - ఎప్రిల్ మాసంలో నిర్వహించిన 'దండి' సత్యాగ్రహం సమయంలో గుజరాత్ లోని దండి గ్రామంలో 'గాంధీ'తో కలిసి చిన్నారి 'కనూ రాందాస్ గాంధీ' నడిచివెళుతున్న ఫొటో ఎంతగానే పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ ఫొటోలో 'గాంధీ' చేతిలో ఉన్న కర్రను 'కనూ రాందాస్' పట్టుకుని ముందుకు నడిచి వెళుతుండడం కనిపిస్తుంది. దండి సత్యాగ్రహానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉండి బతికున్న అతికొద్ది మందిలో కానూ గాంధీ ఒకరు. జాతిపిత మనవడిగా, నాసా శాస్త్రవేత్తగా ఘనమైన చరిత్ర ఉంది. కానీ ఆయనెవరూ పట్టించుకునేవారెవరూ లేక సూరత్‌లోని ఓ ట్రస్టు ఆస్పత్రిలో దీనావస్థలో గడిపారు. భార్య శివలక్ష్మి(90) తప్ప నా అనేవారెవరూ ఆయనకు లేరు. ప్రభుత్వాలు పట్టించుకోవాలని పలువురు కోరారు కూడా. కనూ రాందాస్‌ దాదాపు 40 ఏండ్ల పాటు అమెరికాలో ఉండి 2014లో భారత్‌కు వచ్చారు. నేషనల్‌ ఎరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మిషన్‌(నాసా)కు ఆయన 25 ఏండ్లపాటు సేవలందించారు. కనూ రాందాస్‌ అంత్యక్రియలు మంగళవారం(నేడు) సూరత్‌లో జరగనున్నాయి.

08:42 - August 15, 2016

విశాఖ : బ్రిటీష్‌ పాలకుల క్రూర పాలన నుంచి విముక్తి కలిగిన దినం... ఎన్నో పోరాటాల శ్రమ ఫలితం.. ఎంతోమంది అమర వీరుల త్యాగఫలమే..స్వాతంత్ర్య దినోత్సవం...దేశ ప్రజల స్వేచ్ఛకోసం పోరాటం చేసిన నాటి నాయకుల కృషిని ఎంత కీర్తించినా సరిపోదు.. కనీసం నాటి స్మృతులనైనా తలచుకుంటే...కొంతైనా స్ఫూర్తి పొందొచ్చు.. అలాంటిదే జాతిపిత గాంధీజీ ఆయా ప్రాంతాల పర్యటన... మహాత్మాగాంధీకి విశాఖ జిల్లా భీమిలికి ప్రత్యేక అనుబంధం ఉంది. భీమిలిని సందర్శించిన మహాత్ముడు... ఇక్కడి ప్రజల్లో స్వాతంత్ర్యాకాంక్ష  జ్వాలను రగిలించిన సంఘటనపై 10టీవీ ప్రత్యేక కథనం..!
ప్రజల్లో స్ఫూర్తిని నింపిన గాంధీ
దేశప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపేందుకు మహాత్మగాంధీ..దేశనలుమూలలా పర్యటించారు. తన పోరాట పటిమతో దేశప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు. అలా ఎన్నో ప్రాంతాల్లో పర్యటిస్తూ..ప్రజల్లో స్వాతంత్ర్యాకాంక్ష  జ్వాలను రగిలించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి అహింసా మార్గం ద్వారా పోరాటం చేసిన మహాత్మాగాంధీకి భీమిలి ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన భీమిలిలో రెండుసార్లు పర్యటించారు..
దళితులకు ఆలయ ప్రవేశం కల్పించిన బాపూజీ
మహాత్మగాంధీ భీమిలిలో మొదటిసారి 1930 లో ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న రోజుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా భీమిలి తీరం దగ్గర జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తరువాత 1942 లో క్విట్ ఇండియా పోరాటంలో మరోసారి ఇక్కడకు వచ్చారు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా గంటస్తంభం వద్దకు విదేశీ వస్త్రాలను తీసుకు వచ్చి  ఆయన సమక్షంలో తగులబెట్టారు. తరువాత  రొట్టెల వీధిలోని శ్రీరామ మందిరానికి ఈ మార్గంలోనే కాలినడక వచ్చారు. అంతవరకు అంటరానివారుగా దూరంగా ఉంచిన దళితులు, మత్స్యకారులకు ఈ మందిరంలో ప్రవేశం కల్పించి పూజలు చేశారు.
ప్రజలందరికీ ఆలయ ప్రవేశం కల్పించిన బాపూజీ... 
ప్రజలందరికీ ఆలయ ప్రవేశం కల్పించిన బాపూజీ... వారితోపాటు కలసి ఇక్కడే సహపంక్తి భోజనం చేశారు. దాంతో ఈ రామ మందిరానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. అప్పటి నుంచి ఈ మందిరంలో మహాత్ముని చిత్రపటం ఉంటుంది. అలాగే ఈ మందిరానికి పక్కనే ఆయన దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ప్రదేశం ఇప్పటికీ అలాగే ఉంది. మహాత్ముడు ఇక్కడకు రావడం పట్ల స్థానికులు ఎంతో గర్వపడుతున్నారు. మహాత్ముడు ఇచ్చిన పిలుపుమేరకు ప్రతీ గురువారం  ఇక్కడి తీర ప్రాంతంలో చేపల వేట నిషేధించారు. అలాగే ప్రతీ గురువారం మాంసాహారాన్ని ముట్టుకోకూడదని ఒట్టు పెట్టుకున్నారు. భీమిలిలోని ఈ గుడిలో జరిగే వేడుకల్లో  తప్పనిసరిగా గాంధీజీకి కూడా పూజలు చెయ్యడం ఇప్పటికీ ఆనవాయితీగా వస్తోంది. పూజ జరిగిన తరువాత జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని, ఆయనపట్ల ఉన్న గౌరవాన్ని చాటుకుంటున్నారు. ఎన్ని తరాలు మారినా ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగుతుండడం విశేషం..

 

21:31 - July 19, 2016

ఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహాత్మాగాంధీని ఆరెస్సెస్ హత్య చేసిందంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై రాహుల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌కు క్షమాపణ చెప్పాలని, లేదా విచారణను ఎదుర్కోవాలని కోర్టు స్పష్టం చేసింది. జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణమని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆరెస్సెస్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో కోర్టు ఘాటుగా స్పందించింది. ఆరెస్సెస్‌కు క్షమాపణలు చెబుతారా? లేక పరువునష్టం కేసులో విచారణ ఎదుర్కొంటారా?- అంటూ రాహుల్‌గాంధీని ప్రశ్నించింది. నేరుగా ఓ సంస్థపై అలాంటి నిందలు ఎలా వేస్తారని కోర్టు నిలదీసింది.

2014 మార్చి 6న వివాదాస్పద వ్యాఖ్యలు...
క్షమాపణలు చెప్పి కేసు సెటిల్‌ చేసుకోవాలని కోర్టు రాహుల్‌కు సూచించినప్పటికీ ఆయన అంగీకరించలేదు. పైగా తనపై కేసు కొట్టేయాలని రాహుల్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు జులై 27న వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది. సంజాయిషీ ఇచ్చేందుకు రెండు వారాల గడువు కావాలని రాహుల్ తరఫున న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. 2014, మార్చి 6న భివండిలో జరిగిన సభలో 'మహాత్మాగాంధీని హత్య చేసింది ఆరెస్సెస్‌' అని రాహుల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆరెస్సెస్‌ రాహుల్‌పై కోర్టులో పరువునష్టం దావా వేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌కు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, న్యాయపరంగానే ఆయన కేసును ఎదుర్కొంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

08:53 - May 27, 2016

హైదరాబాద్ : ఇద్దరూ జాతీయ నాయకులు , ఒక‌రూ రాజ‌కీయ నాయ‌కుడు. వారి విగ్రహాల ఏర్పాటులో రాజ‌కీయ ర‌గ‌డ‌. వెర‌సి ఐదేళ్లుగా విగ్రహాలపై తొలగని ముసుగులు. జీహెచ్‌ఎంసీ ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన ఆ మూడు విగ్రహాలు నేటికి ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. తాజాగా ఏర్పడ్డ పాల‌క‌మండ‌లి ఏం చేయబోతుంది .

ఐదేళ్లుగా ముసుగుతో వున్న మూడు విగ్రహాలు ...
బ‌ల్దియా ప్రధాన కార్యాల‌య ప్రాంగ‌ణం ముందు గ‌డిచిన ఐదేళ్లుగా మూడు విగ్రహాలు ముసుగుతో ఉన్నాయి. ఇందులో మ‌హాత్మ గాంధీ, అంబేద్కర్, తో పాటు ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్‌ఆర్‌ విగ్రహాలు ఉన్నాయి. అప్పటి మేయర్‌ బండా కార్తీకా రెడ్డి దివంగత నేత వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముందు ప్రతిష్టించాలని నిర్ణయించింది ఇప్పటికైనా విగ్రహాల తెర‌తొలుగుతుందా.

మేయర్‌ నిర్ణయానికి వ్యతిరేకత....
అయితే ప్రతిప‌క్షాలు మేయర్‌ నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘ‌టించాయి. వైఎస్‌ విగ్రహం పక్కన రాత్రికి రాత్రి అంబేద్కర్‌, మహాత్మ గాంధీ విగ్రహాలు నిలబెట్టారు. అయితే ఈ వ్యవహారం వివాదాస్పదం అవ్వడంతో విగ్రహాలకు ముసుగులు వేశారు. ఐదేళ్లుగా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.

దృష్టి సారించిన పాల‌క‌మండ‌లి....
అయితే కొత్తగా ఏర్పాటైన పాల‌క‌మండ‌లి వీటిపై దృష్టి సారించింది. ఈ విగ్రహాల ఏర్పాటుకు ఎంచుకున్న స్థలం అనాలోచితంగా ఉంద‌నే అభిప్రాయానికి వ‌చ్చింది. ప్రధాన గేటు రోడ్డుపై అడ్డంగా ఉండ‌టంతో రాక‌పోక‌ల‌కు కూడా అంత‌రాయంగా మారిందంటున్నాయి బ‌ల్దియా వ‌ర్గాలు. దాంతో ఆ విగ్రహాల‌ను ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుండి మార్చి మ‌రో చోటా ఎర్పాటు చేయ్యాడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వ్యవ‌హారంతో బ‌ల్దియాలో విగ్రహాల రాజ‌కీయానికి తెర ప‌డుతుందా, లేక మరింత రాజ‌కీయ రంగు పులుముకుంటుందా అనేది కార్పొరేష‌న్ లో హాట్ టాపిక్ గా మారింది.

16:12 - October 2, 2015

బెంగళూరు : భారత్ వేదికగా అక్టోబర్ 2 నుంచి 72 రోజులపాటు టెస్ట్ క్రికెట్ నెంబర్ వన్ టీమ్ సౌతాఫ్రికా ఆడే మెగా సిరీస్ కు సమయం దగ్గరపడింది. మూడు మ్యాచ్ ల టీ-20,ఐదుమ్యాచ్ ల వన్డే, నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ సమరానికి ఫ్రీడమ్ సిరీస్ అని రెండు దేశాల క్రికెట్ బోర్డులు కలసి నామకరణం చేశాయి. ఈ సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీని మహాత్మా గాంధీ - నెల్సన్ మండేలా ట్రోఫీగా నిర్ణయించారు. క్రికెట్టే ఊపిరిగా భావించే భారత గడ్డపై అతిపెద్ద సిరీస్ కు టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ సౌతాఫ్రికా, ఐదో ర్యాంకర్ టీమిండియా ఢీ అంటే ఢీ అంటున్నాయి.

అక్టోబర్ 2 నుండి డిసెంబర్ 7 వరకు..
అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 7 వరకూ 74రోజులపాటు సాగే ఈ మహాసమరంలో భాగంగా మూడు మ్యాచ్ ల తీన్మార్ టీ-20, ఐదు మ్యాచ్ ల వన్డే పాంచ్ పటాకా, నాలుగు మ్యాచ్ ల సాంప్రదాయ టెస్ట్ సిరీస్ లు నిర్వహిస్తారు. ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు భారత్, క్రికెట్ సౌతాఫ్రికా కలసి...రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ కు ఫ్రీడం సిరీస్ పేరుతో నామకరణం చేశాయి. అంతేకాదు సిరీస్ నెగ్గిన జట్టుకు మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా ట్రోఫీని ఇవ్వాలని కూడా నిర్ణయించాయి.

గాంధీ - నెల్సన్ మండేలా ట్రోఫీగా నామకరణం..
13 దశాబ్దాల క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ యాషెస్ సిరీస్, ఫ్రెండ్షిప్ సిరీస్, ట్రాన్స్ టాస్మన్ ట్రోఫీ , బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ, పటౌడీ ట్రోఫీ అన్నపేర్లు మాత్రమే మనకు తెలుసు. క్రికెట్ సిరీస్ ట్రోఫీలకు విఖ్యాత మాజీ క్రికెటర్ల పేర్లను మాత్రమే ఇప్పటి వరకూ పెడుతూ వచ్చారు. అయితే...తొలిసారిగా...రెండు దేశాల జాతి పితల పేర్లతో ట్రోఫీని ఏర్పాటు చేయాలని ఇటు భారత్, అటు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి. అందులో భాగంగానే..టీమిండియా, సౌతాఫ్రికా జట్ల సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీని మహాత్మాగాంధీ- నెల్సన్ మండేలా ట్రోఫీగా నామకరణం చేశాయి.

ట్రోఫి ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి..
అహింసే ఆయుధంగా పోరాడి..భారత్ కు స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రధానపాత్ర వహించిన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ... ఆధునిక ప్రపంచ రాజకీయ చరిత్రలోనే గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారు. మరోవైపు..సౌతాఫ్రికా గాంధీగా పేరుపొందిన నెల్సన్ మండేలా సైతం శ్వేత జాతిపాలకుల పై పోరాడి తమ దేశానికి జాతిపితగా నిలిచిపోయారు. ఇద్దరు నేతల పేర్లతో ఓ క్రికెట్ ట్రోఫీని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.

క్రికెట్ అభిమానులకు పండుగే..పండుగ..
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం..సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో సౌతాఫ్రికా నెంబర్ వన్ గా ఉంటే...టీమిండియా 5వ ర్యాంకులో కొనసాగుతోంది. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో టీమిండియా నాలుగు, సౌతాఫ్రికా ఆరు ర్యాంకుల్లో నిలిచాయి. వన్డే క్రికెట్లో...టీమిండియా రెండో ర్యాంకులో ఉంటే...సౌతాఫ్రికా మూడోర్యాంకు జట్టుగా ఉంది. సౌతాఫ్రికా టెస్ట్ జట్టుకు హషీమ్ ఆమ్లా, వన్డే జట్టుకు ఏబీ డివిలియర్స్, టీ-20 జట్టుకు డూప్లెసిస్ నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు..టీమిండియా టీ-20, వన్డే జట్లకు మహేంద్రసింగ్ ధోనీ, టెస్ట్ జట్టుకు విరాట్ కొహ్లీ కెప్టెన్లుగా ఉన్నారు. అక్టోబర్ 2 నుంచి పదివారాలపాటు జరిగే ఈ మారథాన్ సిరీస్ తో...ప్రపంచ క్రికెట్ అభిమానులకు పండుగే పండుగ.

21:20 - August 14, 2015

మెదక్: అహింసనే ఆయుధంగా చేసుకుని పోరాడిన యోధుడు. యావత్ ప్రపంచానికి ఆయనో దిక్సూచి. జాతిపితను కించపరిచేందుకు కొందరు కంకణం కట్టుకుంటే... మహాత్ముడు చనిపోయినా ఇంకా మా హృదయాల్లో బతికే ఉన్నాడని మరికొందరు చాటుతున్నారు. మహాత్మా మళ్లీ జన్మించు అంటూ కోరుకుంటూ గాంధీజీ బాటలోనే పయనిస్తున్నారు.
మహాత్ముడినే దేవుడిగా కొలుస్తూ
గాంధీగిరికి ఆయనో చిరునామా. మనసా వాచా కర్మనా అణువణువు గాంధీగిరిని పాటిస్తున్నడానికి ఆయనో అక్షర రూపం. మహాత్ముడినే దేవుడిగా కొలుస్తూ ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నాడు.
90 ఏళ్ల సంగి నాగయ్య..
మెదక్‌ జిల్లా రేగోడుకు చెందిన 90 ఏళ్ల సంగి నాగయ్యకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆ గ్రామంలో కోడి కూసినా... కూయకపోయినా...ఆయన మాత్రం గాంధీజీ విగ్రహానికి పూజలు చేయడం మానరు. కుండపోతగా వర్షం కురిసినా...నరాలు కొరికే చల్లని గాలులు వీచినా వెనక్కితగ్గరు. తెల్లవారుజామున 5 గంటలకే నిద్ర మేల్కొని గాంధీ విగ్రహం దగ్గర ప్రదక్షిణలు, పూజలు చేయడం ఆయన దినచర్యగా మారింది.
నాగయ్యకు చదువు రాదు
నాగయ్యకు చదువు రాదు. ఆయనకు తెలిసిందల్లా నిజాయితీగా, నిస్వార్థంగా గాంధీజీని నిండు మనస్సుతో పూజించడం. మహాత్ముడి అడుగుజాడల్లో నడవాలని పదిమందికి చెప్పడం. వృధ్యాప్యంలో తల్లిదండ్రులను బిడ్డలు భారంగా భావిస్తున్నారని.. వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని మహాత్ముడిని వేడుకుంటున్నట్లు నాగయ్య చెబుతాడు. గాంధీజీ తన కలలో కూడా వస్తారంటూ మురిసిపోతాడు.
నాగయ్యకు స్థానికుల ప్రశంసలు
ఏ పంద్రాగస్టుకో, చెబ్బీస్‌ జనవరికో గాంధీజీని స్మరించకుండా... నిత్యం గాంధీగిరిని పాటిస్తున్న నాగయ్యను స్థానికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సూక్తులు చెప్పడం వేరు. వాటిని పాటించడం వేరు. గాంధీగిరిని ఒంట్లోనూ, ఇంట్లోనూ నింపుకున్న నాగయ్య పలువురికి ఆదర్శంగా నిలుస్తూ దేశభక్తిని చాటుతున్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - gandhi