first list

12:43 - November 13, 2018

హైదరాబాద్ : మహాకూటమిలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా చిచ్చు రేపింది. 65 మందితో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. రెండు వారాల సుదీర్ఘ కసరత్తు అనంతరం తొలి జాబితా విడుదలైంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేశారు. కూటమి పక్షాలకు కాంగ్రెస్ మొండి చేయి చూపింది. సీపీఐ కోరిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. రామగుండం, ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. కాంగ్రెస్ జాబితాపై సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీజేఎస్ కోరిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టింది. మునుగోడు, కొత్తగూడెంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులను బరిలో దింపింది. దీంతో కాంగ్రెస్ తీరుపై సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీలు ఫైర్ అయ్యాయి. 

కోమటిరెడ్డి బ్రదర్స్ అల్టిమేటంకు పార్టీ తలొగ్గింది. అయితే మొదటి జాబితాలో పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి జాబితాలో చోటు దక్కలేదు. పొన్నాల లక్ష్మయ్య హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్న జానారెడ్డి కుమారుడిని పక్కనపెట్టారు. రాజేంద్ర నగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పేరు కూడా పెండింగ్‌లోనే ఉంది. దీంతో కాంగ్రెస్‌తోపాటు మహాకూటమిలోని ఇతర పార్టీల్లో అసంత‌ృప్తులు వ్యక్తం అవుతున్నాయి. తొలి జాబితాలో టికెట్ రాని ఆశావహులు పలు చోట్ల నిరసనలు తెలుపుతున్నారు. 

 

08:51 - November 13, 2018

హైదరాబాద్‌ : మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు మహాకూటమి అభ్యర్థుల జాబితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ 65 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయగా, టీడీపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది. 9 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీడీపీ విడుదల చేసింది. సోమవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కాంగ్రెస్‌ 65 మందితో తొలి జాబితా విడుదల చేసిన వెంటనే.. తెలుగుదేశం పార్టీ తొమ్మిది మందితో తన తొలి జాబితా ప్రకటించింది. అయితే కూకట్‌పల్లి స్థానాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. రెండో విడత జాబితాలో కూకట్‌పల్లి అభ్యర్థిని ప్రకటించనున్నారు.
కూటమికి సంబంధించిన మొత్తం 74 స్థానాలకు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌ జాబితా విడుదలయ్యే సరికి రాత్రి కావడంతో టీజేఎస్, సీపీఐలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ పార్టీలు ఇవాళా తమ జాబితాలను విడుదల చేసే అవకాశముంది.
టీడీపీ తొలి జాబితాలోని అభ్యర్థుల వీరే... 
ఖమ్మం.. నామా నాగేశ్వరరావు
సత్తుపల్లి.. సండ్ర వెంకట వీరయ్య, 
అశ్వారావుపేట... మచ్చ నాగేశ్వర రావు
వరంగల్ పశ్చిమ... రేవూరి ప్రకాష్ రెడ్డి
మక్తల్.. కొత్తకోట దయాకర్ రెడ్డి
మహబూబ్ నగర్... ఎర్ర శేఖర్ 
ఉప్పల్.. వీరేందర్ గౌడ్ 
శేరిలింగంపల్లి.. భవ్య ఆనంద్ ప్రసాద్ 
మలక్‌పేట..ముజఫర్

08:29 - November 13, 2018

హైదరాబాద్ : ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఇన్నాళ్లు అందరూ ఆశగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థలు తొలి జాబితా విడుదలైంది. 65 మందితో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. రెండు వారాల సుదీర్ఘ కసరత్తు అనంతరం తొలి జాబితా విడుదలైంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సోమవారం రాత్రి 11 గంటల వరకు జాబితాపై కసరత్తు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోద ముద్ర చేయడంతో రాత్రి పొద్దుపోయిన తర్వాత 65 మందితో కాంగ్రెస్ తొలి జాబితాను ప్రకటించారు. ఉమ్మడి 10 జిల్లాలోని 65 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. పార్టీలో కొనసాగిన సిట్టింగులందరికీ టికెట్లు దక్కాయి. కాంగ్రెస్ ప్రకటించిన 65 స్థానాల్లో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి 23 సీట్లు కేటాయించగా, 13 సీట్లు బీసీలకు కేటాయించారు. 
కూటమి పక్షాలకు కాంగ్రెస్ మొండి చేయి 
కూటమి పక్షాలకు కాంగ్రెస్ మొండి చేయి చూపింది. సీపీఐ కోరిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. రామగుండం, ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. టీజేఎస్ కోరిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టింది. మునుగోడు, కొత్తగూడెంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులను బరిలో దింపింది. కాంగ్రెస్ తీరుపై సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీ ఫైర్ అయ్యాయి. సీపీఐ, టీజేఎస్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉంది.

కాంగ్రెస్ తొలి జాబితాలోని అభ్యర్థులు వీరే..

క్రమ సంఖ్య నియోజకవర్గం అభ్యర్థి పేరు
1 సిర్పూర్   పాల్వాయి హరీశ్ బాబు
2 చెన్నూరు   వెంకటేశ్ నేత బోర్లకుంట
3 మంచిర్యాల   కొక్కిరాల ప్రేమ సాగర్ రావు
4 ఆసిఫాబాద్ :   ఆత్రం సక్కు

5

ఆదిలాబాద్
 

 సుజాత గండ్రత్

6 నిర్మల్   అల్లేటి మహేశ్వర్ రెడ్డి
7 ముదోల్ :  రామారావు పటేల్ పవార్
8 ఆర్మూర్   ఆకుల లలిత
9 బోధన్   పి. సుదర్శన్ రెడ్డి
10 జుక్కల్   ఎస్. గంగారం
11 బాన్సువాడ   కాసుల బాలరాజు
12 కామారెడ్డి   షబ్బీర్ అలీ
13 జగిత్యాల   జీవన్ రెడ్డి
14 రామగుండం   ఎమ్మెస్ రాజ్‌ఠాకూర్
15 మంథని   శ్రీధర్ బాబు దుద్దిల్ల
16 పెద్దపల్లి   సి. విజయ రమణారావు
17 కరీంనగర్   పొన్నం ప్రభాకర్
18 చొప్పదండి   మేడిపల్లి సత్యం
19 వేములవాడ  ఆది శ్రీనివాస్
20

మానకొండూరు 

 ఆరేపల్లి మోహన్
21 ఆందోల్   దామోదర రాజనర్సింహ
22 నర్సాపూర్   సునీతా లక్ష్మారెడ్డి
23 జహీరాబాద్   గీతారెడ్డి
24 సంగారెడ్డి   జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)
25 గజ్వేల్   వంటేరు ప్రతాప్ రెడ్డి
26 కుత్బుల్లాపూర్   కూన శ్రీశైలం గౌడ్
27 మహేశ్వరం  పి. సబితా ఇంద్రారెడ్డి
28 చేవెళ్ల   కేఎస్ రత్నం
29 పరిగి   రామ్మోహన్ రెడ్డి
30 వికారాబాద్  గడ్డం ప్రసాద్ కుమార్
31 తాండూరు   పైలట్ రోహిత్ రెడ్డి
32 ముషీరాబాద్   ఎం. అనిల్ కుమార్ యాదవ్
33 నాంపల్లి   ఫిరోజ్ ఖాన్
34 గోషామహాల్ 

 ముకేశ్ గౌడ్

35 చార్మినార్  మహ్మద్ గౌస్
36 చాంద్రాయణగుట్ట 

 ఇసా బినోబాయిద్ మిస్రీ

37 సికింద్రాబాబ్ కంటోన్మెంట్  సర్వే సత్యనారాయణ
38 కొడంగల్   రేవంత్ రెడ్డి
39 జడ్చర్ల  మల్లు రవి
40 వనపర్తి   జి. చిన్నారెడ్డి
41 గద్వాల   డీ.కే అరుణ
42 అలంపూర్   సంపత్ కుమార్
43 నాగర్ కర్నూలు  నాగం జనార్ధన్ రెడ్డి
44 అచ్చంపేట   సీ.హెచ్ వంశీకృష్ణ
45 కల్వకుర్తి  వంశీ చంద్‌రెడ్డి
46 నాగార్జున సాగర్  జానారెడ్డి
47 హుజుర్ నగర్   ఉత్తమ్ కుమార్ రెడ్డి
48 కోదాడ   పద్మావతి రెడ్డి
49 సూర్యాపేట  ఆర్. దామోదర్ రెడ్డి
50 నల్గొండ   కోమటిరెడ్డి వెంకట్ ‌రెడ్డి
51 మునుగోడు  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
52 భువనగిరి   కుంభం అనిల్ కుమార్ రెడ్డి
53 నకిరేకల్   చిరుముర్తి లింగయ్య
54 ఆలేరు   భిక్షమయ్య గౌడ్
55 స్టేషన్ ఘన్‌పూర్   సింగపూర్ ఇందిర
56 పాలకుర్తి   జంగా రాఘవరెడ్డి
57 డోర్నకల్  జాటోత్ రామచంద్రు నాయక్
58 మహబూబాబాద్  పోరిక బలరాం నాయక్
59 నర్సంపేట   దొంతి మాధవ్ రెడ్డి
60 పరకాల  కొండా సురేఖ
61 ములుగు  డి.అనసూయ అలియాస్ సీతక్క
62 పినపాక   రేగ కాంతారావు
63 మధిర   మల్లు భట్టి విక్రమార్క
64 కొత్తగూడెం  వనమా వెంకటేశ్వరరావు
65 భద్రాచలం   పోడెం వీరయ్య



 
 

 

15:34 - October 31, 2018

హైదరాబాద్: ఎట్టకేలకు కసరత్తు ముగిసింది. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. ఎన్నో రోజులుగా చర్చించిన అనంతరం అభ్యర్థులను భక్తచరణ్ దాస్ కమిటీ ఖరారు చేసినట్టు తెలస్తోంది. 40మందితో తొలి జాబితా సిద్ధం చేసినట్టు సమాచారం. నవంబర్ తొలి వారంలో తొలి జాబితా విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఎక్స్‌క్లూజివ్‌గా 10 టీవీ సంపాదించింది. కాగా,  తొలి జాబితాలో అధికారికంగా ఎంతమంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

కాంగ్రెస్ తొలి జాబితా..

నెం. అభ్యర్థి నియోజకవర్గం
1 గోషామహల్ ముఖేష్‌గౌడ్
2 సనత్‌నగర్ మర్రి శశిధర్‌రెడ్డి
3 నాంపల్లి ఫిరోజ్‌ఖాన్
4 జూబ్లీహిల్స్ విష్ణువర్ధన్‌రెడ్డి
5 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి
6 పరిగి రామ్మోహన్‌రెడ్డి
7 జహీరాబాద్ గీతారెడ్డి
8 ఆందోల్ దామోదర రాజనర్సింహ
9 సంగారెడ్డి జగ్గారెడ్డి
10 నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి
11 గజ్వేల్ ప్రతాప్‌రెడ్డి
12 మధిర భట్టి విక్రమార్క
13 కొడంగల్ రేవంత్‌రెడ్డి
14 గద్వాల్ డీకే అరుణ
15 వనపర్తి చిన్నారెడ్డి
16 కల్వకుర్తి వంశీచంద్‌రెడ్డి
17 ఆలంపూర్ సంపత్
18 నాగర్‌కర్నూల్ నాగం జనార్దన్‌రెడ్డి
19 కామారెడ్డి షబ్బీర్‌అలీ
20 బోధన్ సుదర్శన్‌రెడ్డి
21 బాల్కొండ అనిల్
22 నిర్మల్ మహేశ్వర్‌రెడ్డి
23 ఖానాపూర్ రమేశ్ రాథోడ్
24 బోధ్ సోయం బాబూరావు
25 ఆసిఫాబాద్ ఆత్రం సక్కు
26 జగిత్యాల జీవన్ రెడ్డి
27 మంథని శ్రీధర్ బాబు
28 కరీనంగర్ పొన్నం ప్రభాకర్
29 సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి
30 పెద్దపల్లి విజయ రమణారావు
31 భూపాలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డి
32 నర్సంపేట దొంతి మాధవరెడ్డి
33 ములుగు సీతక్క
34 జనగామ పొన్నాల లక్ష్మయ్య
35 హుజూర్‌నగర్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
36 నాగార్జునసాగర్ జానారెడ్డి

 

* హైదరాబాద్ నుంచి 4 స్థానాలకు అభ్యర్థులు ఖరారు
* మెదక్ నుంచి 5 స్థానాలకు
* నల్గొండ నుంచి 6 స్థానాలకు 
* మహబూబ్‌నగర్ నుంచి 6 స్థానాలకు
* నిజామాబాద్ నుంచి 3 స్థానాలకు
* ఆదిలాబాద్ నుంచి 4 స్థానాలకు
* కరీంనగర్ నుంచి 5 స్థానాలకు
* వరంగల్ జిల్లా నుంచి 4 స్థానాలకు అభ్యర్థులు ఖరారు

 

08:54 - October 30, 2018

హైదరాబాద్ : ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ సిద్ధం చేసింది. సుదీర్ఘ చర్చలు, వడపోతల తర్వాత 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. ఆ జాబితాతో ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ రాత్రి ఢిల్లీకి వెళ్లింది.  నవంబర్‌ 1న రాహుల్‌ నేతృత్వంలోని ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశమై తొలి జాబితాకు ఆమోదముద్ర వేయనుంది. అదే రోజు అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయనున్నారు. మొదటి జాబితాలో 35 మంది పేర్లు ప్రకటించే అవకాశముంది. 

 

17:56 - September 12, 2018

హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్టు ఈనెల 20వ తేదీలోపు ప్రకటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. 30 నుంచి 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో జీహెచ్ ఎంసీలో 10 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈనెల 15న హైదరాబాద్ కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రానున్నారు. అదే రోజున మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అయితే అమిత్ షా వచ్చాక అయినా లేదా రాకముందైన 20 వ తేదీ లోపు అభ్యర్థుల లిస్టును ప్రకటించనున్నారు. అభ్యర్థుపై ఖరారుపై కమిటీ వేశారు. ఆ రిపోర్టును బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు పంపనున్నారు. అనంతరం ఎన్నికల ఫైనల్ లిస్టును ప్రకటించనున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు సీటు ఖరారు చేశారు. ముషీరాబాద్ నుంచి బి.లక్ష్మణ్, అంబర్ పేట్ నుంచి జి.కిషన్ రెడ్డి, ఉప్పల్ నుంచి ఎన్ వీఎస్ ఎస్ ప్రభాకర్, గోషామహల్ నుంచి రాజాసింగ్, ఖైరతాబాద్ నుంచి చింతల రాంచంద్రారెడ్డిల పేర్లు ఖరారు అయ్యాయి. వీరు ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నారు.  వీరితోపాటు మల్కాజ్ గిరి నుంచి రామచంద్రారావు(బీజేపీ జీహెచ్ ఎంసీ అధ్యక్షుడు), సికింద్రాబాద్ నుంచి సతీష్ గౌడ్, కూకట్ పల్లి నుంచి మాతవరం కాంతారావు, మహబూబ్ నగర్ నుంచి పద్మజారెడ్డి, మునుగోడు నుంచి జి.మనోహర్ రెడ్డి, సూర్యపేట నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, మహేశ్వరం నుంచి సందీప్ శర్మ, పరిగి నుంచి ప్రహ్లాద్ పేర్లు ఫైనల్ అయ్యాయి. అభ్యర్థులు లేని చోట ఆశావహులు ఎవరైనా పోటీ చేసేందుకు ముందుకు వస్తే వారికి అవకాశం ఇస్తామని చెప్పారు. 

17:26 - January 15, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ తొలి జాబితా విడుదలైంది. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ నేత కె. కేశవరావు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని తెలిపారు. డివిజన్ల వారీగా అభిప్రాయాలను సేకరించి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. బలాబలాల మీద రెండుసార్లు సర్వే జరిపించామని పేర్కొన్నారు. ఇక తొలి జాబితాలో 60 మందికి అవకాశం కల్పించారు. ఇందులో.. 24 మంది బీసీలు, 5 మంది ఎస్సీలు, 16 మంది మైనార్టీలు, 15 మంది జనరల్ అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. 
 

డివిజన్ అభ్యర్థి పేరు

సనత్ నగర్

లక్ష్మీ బాల్ రెడ్డి

అమీర్ పేట్

శేషు కుమారి

భొలక్ పూర్

రామారావు

చైతన్యపురి 

జి.విఠల్ రెడ్డి

ముషీరాబాద్

భాగ్యలక్ష్మీ యాదవ్

గచ్చిబౌలి

సాయిబాబా

శేరిలింగంపల్లి

నాగేందర్ యాదవ్

ఉప్పుగూడ

శీనయ్య

కాచిగూడ

చైతన్య కన్నా యాదవ్

ఎర్రగడ్డ

అన్నపూర్ణ యాదవ్

అడ్డగుట్ట

విజయకుమారి

చవాని 

ఖలీం

ఓల్డ్ మలక్ పేట్ 

భువనేశ్వరి

జాహునుమా

గులాం నబీ

నవాబ్ షాహెబ్ కుంట

ఫర్హత్ సుల్తానా

రమ్నసపూరా

అజీమ్ పాషా

కిషన్ బాగ్

షకీల్ అహ్మద్

ఐఎస్సదన్

స్వప్న సుందర్ రెడ్డి

గౌలి పురా

మీనా

తలబ్ చంచలం

ఫాతిమా

చాంద్రయణగుట్ట

రాజేంద్ర కుమార్

పురానా పుల్

మల్లిఖార్జున యాదవ్

పత్తార్ ఘాట్

మిర్జా బకీర్ అలీ

మొఘల్ పూరా

వీరమణి

శాలి బండా

అన్వర్

మోండా మార్కెట్ 

ఆకుల రూప హరికృష్ణ

రైన్ బజార్ 

అజీజ్

సంతోష్ నగర్

మొహ్మద్ అక్రముద్దీన్

రియాసత్ నగర్ 

మొహ్మద్ యూసఫ్

డబీర్ పూరా

మొహ్మద్ అబ్దుల్ జీషన్

కుర్మాగూడ

పూజ అఖిల్ యాదవ్

ఘాన్సీ బజార్

మహాదేవి

గుడిమల్కాపూర్

బంగారు ప్రకాష్

హబ్సీగూడ

సుభాష్ రెడ్డి  

మీర్ పేట్

అంజయ్య

గాంధీనగర్ 

పద్మా నగేష్

సైదాబాద్ 

సింగిరెడ్డి స్వర్ణలత

జియాగూడ

ఎ కృష్ణ

కొండాపూర్

 హమీద పటేల్

జీడిమెట్ల

పద్మ ప్రతాప్ గౌడ్  

అల్వాల్

చింతల విజయశాంతి రెడ్డి

గోల్నాక

జయశ్రీ

మన్సురా బాద్

విఠల్ రెడ్డి
సోమాజిగూడ అట్లూరి విజయలక్ష్మి

బాలానగర్

నరేంద్ర చారి

కేపీహెచ్ బీ కాలనీ

అడుసుమిల్లి వెంకటేశ్వరరావు

కాప్రా

స్వర్ణరాజు శివమణి

ఎ.ఎస్.రావ్ నగర్

 పావని రెడ్డి

యూసుఫ్ గూడ

బి.సంజయ్ గౌడ్

తార్నాక

ఆలకుంట సర్వసతి హరి

బౌద్ధనగర్

బైరగోని ధనుంజయ దయానంద్ గౌడ్

అజంపురా

సిద్దా లక్ష్మి

బోరబండ

బాబా షంషుద్దీన్

రహమత్ నగర్

మహ్మద్ అబ్దుల్ షఫీ

అల్లాపూర్

సరియా బేగం

మూసారాంబాగ్

తీగల సునరితా రెడ్డి

ఉప్పల్

హన్మంత్ రెడ్డి

బన్సీలాల్ పేట

కుర్మ హేమలత

రాంగోపాల్ పేట

అత్తెల్లి అరుణ గౌడ్

సంతోష్ నగర్

మహ్మద్ అక్రముద్దీన్

రెయిన్ బజార్

మహ్మద్ ఐజాజ్

శాలిబండ

మహ్మద్ అన్వర్

 

16:38 - January 15, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ తొలి జాబితా విడుదలైంది. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ నేత కె. కేశవరావు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని తెలిపారు. డివిజన్ల వారీగా అభిప్రాయాలను సేకరించి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. బలాబలాల మీద రెండుసార్లు సర్వే జరిపించామని పేర్కొన్నారు. ఇక తొలి జాబితాలో 60 మందికి అవకాశం కల్పించారు. ఇందులో.. 24 మంది బీసీలు, 5 మంది ఎస్సీలు, 16 మంది మైనార్టీలు, 15 మంది జనరల్ అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. 

Don't Miss

Subscribe to RSS - first list