finance minister

13:20 - November 8, 2018

న్యూఢిల్లీ: నోట్ల రద్దుకు రెండేళ్లు నిండింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నోట్ల రద్దు అసలు ఉద్దేశాన్ని విశదీకరించారు. డీమానిటైజేషన్ అదే పెద్ద నోట్ల రద్దు అసలు ఉద్దేశం నగదును సీజ్ చేయటం కాదు.. ఎక్కువ నగదు కలిగిఉన్న వారిచేత పన్ను చెల్లించేవిధంగా చేయడమేనని ఆర్థికమంత్రి వివరణ ఇచ్చారు. ‘‘లెక్కలోలేని నగదును ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంతోపాటు.. వారిచేత పన్ను చెల్లింపచేయడమే ప్రధాన ఉద్దేశం. అయితే దేశంలో నగదు వినియోగాన్ని తగ్గించి.. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను పెంచే విధానం అవసరం దేశానికి ఉంది’’ అంటూ గురువారం జైట్లీ వివరించారు. 

Image result for old indian currency notes
డీమానిటైజేషన్ తర్వాత యూపీఐ యాప్ విడుదలచేయడం ద్వారా ఢిజిటల్ లావాదేవీల్లో భారీ మార్పులు వచ్చాయి. ఇంతకుముందు కేవలం 50 లక్షల లావాదేవీలు అక్టోబర్ 2016 సంవత్సరం జరగగా..వీటి సంఖ్య సెప్టెంబర్, 2018 నాటికి 598 లక్షలకు చేరింది.   అలాగే డీమానిటైజైషన్ తర్వాత భీమ్ లావాదేవీలు కూడా భారీగా పెరిగాయి. 
 

 

19:48 - September 12, 2018

న్యూఢిల్లీ: దాదాపు రూ 9 వేల కోట్ల పై చిలుకు బ్యాంకులకు టోకరావేసి విదేశాలలో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఈ సారి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీను ఇరుకున పెట్టేవిధంగా వ్యాఖ్యలు చేశాడు. లండన్ కోర్టులో కేసు విచారణకు హాజరైన సందర్భంగా మాల్యా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి.

తాను జెనీవాకు తరలి వెళ్లేముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి బ్యాంకులతో ఆర్థిక వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా కోరినట్టు మాల్యా వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఈ కుంభకోణంలో బీజేపీ నేతల హస్తం ఉందని రుజువైందని విమర్సలకు దిగారు. దీనిపై స్పందించిన అరుణ్ జైట్లీ తన ఫేస్ బుక్ పోస్టింగ్ లో మాల్యా ఆరోపణలను ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవం.. సత్యదూరమని పేర్కొన్నారు.

15:52 - August 23, 2018

ఢిల్లీ : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ మూడు నెలల విరామం తర్వాత ఇవాళ తిరిగి తన శాఖ బాధ్యతలను చేపట్టారు. కిడ్నీ శస్త్ర చికిత్స కారణంగా ఆయన 3 నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అరుణ్‌జైట్లీ మే 14న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి కోవింద్‌.. అరుణ్ జైట్లీకి ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖలను అప్పగించారు. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ ఇవాళ విడుదల చేశారు. జైట్లీ స్థానంలో మూడు నెలల పాటు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అదనంగా ఆర్థిక శాఖ బాధ్యతలను చూసిన విషయం తెలిసిందే.

06:27 - May 8, 2018

హైదరాబాద్ : రైతు బంధు పథకంపై టీఆర్‌ఎస్‌ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాల్చే పథకంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే పథకం ఉద్దేశం మంచిదైనా... నిబంధనలతో సర్కారుకు కొత్త చిక్కులు తప్పవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కౌలు రైతులను విస్మరించడం అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. రైతు బంధు పథకం అమలును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. వచ్చే ఎన్నికలకు ఈ పథకం శ్రీరామరక్ష అవుతుందన్న భావన టీఆర్‌ఎస్‌ నేతల్లో ఉంది.

రైతు బంధు పథకం ద్వారా పార్టీకి అన్నదాతల మద్దతు కూడగట్టేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రైతుల సంక్షేమమే పరమావధిగా పెట్టుకుని పనిచేస్తోంది. గతంలో రైతులు ఎదుర్కొన్న ఎరువులు, విత్తనాలు, విద్యుత్ సమస్యలను తాము పరిష్కరించామన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో కూడా అన్నదాతలను తమ దారికి తెచ్చుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. రైతు బంధు పథకం అమలు ద్వారా అన్నదాతల అండ తమకే అన్న ధీమాతో టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.

రైతు బంధు పథకం సమర్ధవంతంగా అమలు చేసే చర్యల్లో భాగంగానే భూ రికార్డులను ప్రక్షాళన చేసింది. అర్హులైన రైతులకు ప్రభుత్వం ఏటా రెండు సార్లు అందించేందుకు నిర్ణయించిన పెట్టుబడి సాయం పథకాన్ని ఈనెల 10 అమలు చేయనుంది. ఎకరానికి 8 వేల రూపాయల పెట్టుబడి సాయం చేస్తారు. ఖరీఫ్‌లో 4 వేల రూపాయలు, రబీలో మరో 4 వేల రూపాయలు అందిస్తారు ఎక్కువ మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

రైతు బంధు పథకం ద్వారా ఎలాంటి వివాదాలు లేని భూములకు మాత్రమే పెట్టుబడి సాయం చెక్కులు అందించాలని నిర్ణయించింది. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు. భూ యజమానికే సాయం అందిస్తారు. క్షేత్ర స్థాయిలో కైలు రైతులే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీరి ఆగ్రహానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గురయ్యే అవకాశాలు లేకపోలేదన్న భయంతో పార్టీ నేతల్లో ఉంది. ఈ అంశం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సహాయం అందని రైతులు ఐక్యమైతే పరిస్థితి మరోలా ఉంటుందని భావిస్తున్నారు. రైతు సమన్వయ సమితులతో ఇప్పటికే రైతుల్లో వర్గవిభేదాలు తలెత్తగా.. కౌలు రైతుల సమస్యల ఇప్పుడు మరో కొత్త వివాదానికి దారితీసే అకాశంలేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయం చేసే రైతులందరికీ ఈ పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటే ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తం అవుతోంది. సర్కారు ఏం చేస్తుందో చూడాలి. 

07:59 - May 7, 2018

హైదరాబాద్ : రైతు బంధు పథకం అమలును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దీనిని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈనెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. టీఆర్‌ఎస్‌కు  రైతుల మద్దతు కూడగట్టేలా ఈ పథకం పనిచేస్తుందన్న అంచనాతో అధికార పార్టీ నేతలున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల వర్షం కురుపిస్తుందని భావిస్తున్నారు. 
రైతు బంధు పథకం అమలును సీరియస్‌గా రాష్ట్ర ప్రభుత్వం 
రైతు బంధు పథకం అమలును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ఇది వరంగా మారుతుందని టీఆర్‌ఎస్‌ నేతలు ఆశిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే విధంగా చర్యలు చేపట్టని  ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకం అమలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఏడాది క్రితం  నుంచి ఈ పథకంపై  కసరత్తు చేసిన కేసీఆర్‌...  ఎన్నికల ఏడాది నుంచి అమలు చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈనెల 10 నుంచి రైతలకు బ్యాంకు చెక్‌లు పంపిణీ చేసంఏదుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఎకరానికి  ఏటా ఎనిమిది వేల రుపాయల పెట్టుబడి సహాయాన్ని అందించే పథకానికి ప్రభుత్వం రైతు బంధు పథకానికి రూపకల్పన చేశారు. ఖరీఫ్‌, రబీ సీజన్లలో రెండు విడతులుగా ఈ మొత్తాన్ని రైతులుకు ఇస్తారు.
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్‌ల పంపిణీ
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వచ్చే గురువారం నుంచి చెక్‌ల పంపిణీ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌, జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడను ఆహ్వానించారు.  అయితే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేవెగౌడ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశంలేదని భావిస్తున్నారు.  
రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా : సీఎం కేసీఆర్
జాతీయ రాజకీయల్లో కూడా రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి హాజరయ్యే సభకు భారీ ఎత్తున రైతులను సమీకరించాలని అధికార టీఆర్‌ఎస్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. పథకం ప్రారంభం రోజు నిర్వహించే సభ ద్వారానే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని టిఆర్ఎస్ భావిస్తోంది.

 

18:39 - May 6, 2018

కరీంనగర్ : జిల్లాలో హుజురాబాద్ లో ఈనెల పదో తేదీన జరిగే రైతు బందు చెక్కుల పంపిణీ చేసే సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆదివారం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి ఈటెల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...9వ తేదీన సీఎం కేసీఆర్ జిల్లాకు చేరుకుని పదో తేదీన ఉదయం 11గంటలకు సభకు హాజరౌతారని తెలిపారు. సభకు లక్ష మంది హాజరౌతారని అంచనా వేస్తున్నట్లు, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ. 8000 వేలు ఇస్తామని, రాష్ట్రంలో రూ. 12వేల కోట్లను రైతులకు ఇన్వెస్ట్ మెంట్ సపోర్టు ఇస్తున్నట్లు వెల్లడించారు. 

08:43 - December 10, 2017

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్ని శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై రెండు రోజులపాటు క్షేత్రస్థాయి పర్యటన అనంతరం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తక్కువ వ్యవధిలో అనుమతులు సాధించడానికి కృషి చేసిన మంత్రి హరీష్‌రావుతో పాటు అధికారులను ఈ సందర్భంగా కేసీఆర్ అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్పీ సింగ్, మిషన్ భగీరధ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు, ట్రాన్స్‌కో డైరెక్టర్లు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బ్యారేజీలు, కాలువలు, టన్నెళ్లు, పంప్‌ హౌజ్‌లు, సబ్ స్టేషన్ల పనులను ఒక్కొక్కటిగా కేసీఆర్ సమీక్షించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతులు తదితర అంశాల్లో ఎలాంటి అవాంతరాలు లేనందున ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చివరి దశ పర్యావరణ అనుమతి త్వరలోనే వస్తుందని.. అప్పటికి డిజైన్లు, ఇతర నిర్మాణాల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కోర్టులో సమర్పించిన అఫడవిట్‌కు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించామని, మరో రూ. 20 వేల కోట్లు బ్యాంకుల ద్వారా సమకూర్చినట్టు కేసీఆర్‌ తెలిపారు.

పంపు హౌజ్‌లలో మోటార్లను పరిశీలించేందుకు 26 మంది ఇంజనీర్లతో కూడిన ప్యానెల్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. రైతుల సమన్వయంతో విద్యుత్ లైన్లు వేయాలని.. దీనికి సంబంధించి ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులతో కరీంనగర్‌లో సమావేశం నిర్వహించాలని మంత్రి ఈటెల రాజేందర్‌ను కేసీఆర్ కోరారు. వరద కాలువలోకి కాళేశ్వరం నుంచి నీరు వచ్చిన తరువాత ఉండే పరిస్థితిని అంచనా వేసి డిజైన్లు రూపొందించే బాధ్యతను ఇఎస్పీ మురళీధర్‌కు సీఎం అప్పగించారు.

మిడ్ మానేరు డ్యామ్ నిర్మాణంపైనా కేసీఆర్ చర్చించారు. డ్యామ్ నిర్మాణం పూర్తైందని.. రివిట్‌మెంట్ చేస్తున్నామని.. 25 గేట్లకు గానూ.. 10 గేట్లు బిగించామని.. అధికారులు సీఎంకు తెలిపారు. జనవరి నెలాఖరుకల్లా మిడ్ మానేరుకు సంబంధించిన పనులన్నీ వంద శాతం పూర్తి కావాలని సీఎం అధికారులకు ఆదేశించారు. మిడ్‌మానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్ వరకు వెళ్లే టన్నెల్ నిర్మాణ పనులను, రిజర్వాయర్ పనులను కేసీఆర్ సమీక్షించారు. ఆగస్టు నాటికి టన్నెల్ నిర్మాణం పూర్తి చేస్తామని.. సెప్టెంబర్ నాటికి రిజర్వాయర్ పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. సమావేశంలో మంత్రి హరీష్‌ రావుతో పాటు అధికారులపై కేసీఆర్‌ ప్రశంసలు కురిపించారు. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో ఒప్పందాలు కుదర్చడంలో హరీష్‌ ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్‌ కితాబిచ్చారు. 

21:47 - November 17, 2017

ఢిల్లీ : అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ భారత రేటింగ్‌ను పెంచడంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ హర్షం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలను గుర్తించి మూడీస్ ఈ నిర్ణయం తీసుకుందని జైట్లీ అన్నారు. ఇది భారతదేశ ఆర్థికవ్యవస్థకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. గత మూడేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. మూడీ రేటింగ్‌తో పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి, ఆధార్‌ వంటి సంస్కరణలకు ఆమోదం లభించినట్లయిందని జైట్లీ చెప్పారు. గతంలో బీఏఏ3గా ఉన్న రేటింగ్‌ను బీఏఏ2కు పెంచుతూ మూడీస్ నిర్ణయం తీసుకుంది. మూడీస్‌ భారత్ రేటింగ్‌ను 14 ఏళ్ల తర్వాత పెంచింది. 

20:10 - November 8, 2017

కర్నూలు : పెద్దనోట్ల రద్దుతో దేశంలోని నల్లధనాన్ని బయటకు రప్పిస్తామని ప్రధాని మోడీ దేశ ప్రజలను మోసం చేశారని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు గఫూర్ మండిపడ్డారు. పెద్ద నోట్లు రద్దై ఏడాది పూర్తైన సందర్భంగా కర్నూలులో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం జరగలేదంటున్న వామపక్ష నేతలతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
'గత నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. సం.లో ఫలితాలు రాలేదు. నల్లధనం తెల్లడబ్బుగా మారింది. అంబానీ, అదానీల కోసం మోడీ పేదలను చంపారు. నల్లధనం ఎక్కడ ఉందో తమకంటే మోడీకి ఎక్కువగా తెలుసు. అంబానీ, టాటా, బిర్లా, అదానీల దగ్గర నల్లడబ్బు ఉంది. విదేశాల నుంచి ఒక్క రూపాయ నల్లడబ్బు తీసుకురాలేదు. మోడీ పెట్టుబడిదారులకు తొత్తుగా మారాడు అని అన్నారు. 

 

16:34 - November 8, 2017

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు నల్లధనంపై చేపట్టిన ఓ యుద్ధమని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. 'నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా 125కోట్ల మంది భారత ప్రజలు నిర్ణయాత్మక యుద్ధం చేసి.. గెలిచారు. నల్లధనాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన  ప్రతి భారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా' అని ప్రధాని ట్వీట్‌ చేశారు. పెద్ద నోట్ల రద్దుతో చేకూరిన ప్రయోజనాలకు సంబంధించిన షార్ట్‌ ఫిల్మ్‌ వీడియోను మోది ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ప్రయోజనాలు కనిపించాయని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో పేర్కొంది. గత ఏడాది ఇదే రోజున1000, 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు  ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నవంబర్‌8న బిజెపి నల్లధనం వ్యతిరేకం దినంగా ప్రకటించింది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - finance minister