family problems

20:38 - August 8, 2018
09:47 - August 7, 2018

హైదరాబాద్ : వేధింపులు తాళలేక భర్తను భార్య హతమార్చింది. గుంటూరు జిల్లాకు చెందిన ఉష, జగన్ దంపతులు ఫిల్మ్ నగర్ లో రెండు సంవత్సరాలుగా నివాసముంటున్నారు. గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. జగన్ తరచూ ఉషను వేధిస్తున్నాడు. వేధింపులు తాళ లేక మద్యంలో మత్తులో ఉన్న భర్త నోట్లో హిట్ స్ప్రే చల్లడంతో అతను అపస్మాకరక స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతన్ని చంపేసింది. అనంతరం అక్కడి నుంచి ఉష పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జగన్ కుటుంబానికి సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

21:07 - July 5, 2018

వివాహబంధాల్లో తగ్గుతున్న ప్రేమలు..హింసకు కారణమవుతున్న వివాహేతర సంబంధాలు.. మనుషుల ఆలోచనల్లో తగ్గుతున్న మానసిక పరివర్తన..భయంకరంగా కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితులు.. ఈ బంధానికి ఏమైంది ? ఇదే అంశంపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్టు డా.జవహర్ లాల్ నెహ్రూ పాల్గొని, మాట్లాడారు. ఆయన తెలిపిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.... 

13:01 - July 4, 2018
12:17 - June 13, 2018

చిత్తూరు : జిల్లాలోని రూరల్‌ మండలం పెయనకండ్రిగలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు బిడ్డలతో సహా బావిలో దూకి గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. అత్తారింటి వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులు అంటున్నారు. మృతులు: సరళ(29), దేవిశ్రీ(2), జ్యోత్స్న(4)గా గుర్తించారు. భర్త గురునాథం పరారీలో ఉన్నాడు.

 

21:32 - June 6, 2018

బాధిత మహిళలు పోలీసు స్టేషన్లు, కోర్టులకు ఎలా వెళ్లాలి ? ఎవరిని అప్రోచ్ అవ్వాలి..? బాధిత మహిళలు న్యాయం పొందడం ఎలా ? ఇదే అంశంపై మావని మైరైట్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అడ్వకేట్ పార్వతి పాల్గొని, పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:24 - June 2, 2018

చిత్తూరు : జిల్లా మదన పల్లెలో సంచలనం సృష్టించిన మహిళా న్యాయవాది హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త జితేంద్రే ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు తేల్చారు. కిరాయి రౌడీలతో మే 30వ తేదీన బైక్‌పై వెళ్తున్న నాగజ్యోతిని కత్తితో దాడి చేయించాడు జితేంద్ర. దీంతో నాగజ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త జితేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు రౌడీ హంతకుల కోసం గాలిస్తున్నారు. 

14:51 - May 23, 2018

భారత రాజ్యాంగా జీవించే హక్కును అందరికి ఇచ్చింది. దీంట్లో ఎవ్వరికి మినహాయింపు లేదు. పిల్లలను కని,పెంచి, పెద్ద చేసి, విద్యాబుద్ధులు చెప్పించి, వారి భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడిన తల్లిదండ్రులను, వృద్దులను బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిది.  జీవితంలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని జీవితపు మలిసంధ్యలో వారు కోరుకునేవి ప్రేమ,ఆత్మీయత. అంతే వారు ఇంకేమీ ఆశించరు. కానీ ఆస్తుల కోసం, వారి బాధ్యత తీసుకోవాల్సి వస్తుందనే దురాచనతో వారిని నిరాశ్రయులను చేస్తున్న సందర్బాలు ఎన్నో, ఎన్నెన్నో. కానీ వారికి కూడా హక్కులున్నాయి. చట్టాలున్నాయి. వృద్ధులు వారికి ఉండే హక్కులు ఏమిటో ఈరోజు మైరైట్ లో తెలుసుకుందాం. తల్లిదండ్రుల పోషణను విస్మరిస్తే వారిని శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయి. వృద్ధులను పట్టించుకోకుంటే వారికి చట్టం అండగా ఉంటుంది. చట్టం పరిధిలో వారికి ఎటువంటి హక్కులుంటాయి? ఎటువంటి చట్టాలుంటాయి అనే అంశంపై ఎడ్వకేటే పార్వతిగారి సలహాలు, సూచనల కోసం చూడండి..మైరైట్..

 

 

 

వృద్ధుల్లో 50 శాతానికిపైగా వేధింపులకు గురి అవుతున్నట్టుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం వృద్ధుల కోసం పలు చట్టాలను రూపొందించింది. కుమారులు , కోడళ్లు ఇతర బంధువుల ధూషణలు , చిత్ర హింసలతో ఇబ్బంది పడేవారి కోసం జాతీయ వయోశ్రీ యోజన పేరిట నూతన పథకాన్ని ప్రవేశ పెట్టింది. వృద్ధుల్లో అధిక శాతం వైకల్యాలు , వ్యాధులతో పాటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారే ఉన్నారు. మలిదశలో ఆ సరాగా నిలివాల్సిన పిల్లలు కన్న వారిని ఆశ్రమాలు ఇతర చోట్ల చేరుస్తున్న ఘటనలో కోకొల ్లలు దీంతో వృద్ధులకు ఒటరితనం శాపంగా మారింది. సామాజిక భద్రత పథకాలు వారికి అంతగా ఉపయోగపడడం లేదు. అందుకే మన దేశంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు సంరక్షన కోసం 2007లో కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రులు , పెద్దల పోషణ సంక్షేమ చట్టం పేరిట తెచ్చిన దీనిని అమలు చేయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంది. 

 

13:41 - May 20, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నర్సాపురం 5వార్డు భూపతివారి వీధిలో బొడ్డు సుధ అనే మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులకు తాళలేకే ఆత్మహత్మకు పాల్పడినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే సుధ తల్లిదండ్రులు, బంధువులు మాత్రం భర్త బొడ్డు రామకృష్ణనే హత్య చేసి ఉంటాడని ఆరోపింస్తున్నారు. 2012లో సుధకు రామకృష్ణతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానంతో రామకృష్ణ తరుచూ వేధించేవాడని బంధువులు అంటున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

06:36 - May 8, 2018

నిజామాబాద్‌ : జిల్లా పల్లెచెరువు తండాలో తల్లీ, కొడుకుల మృతి మిస్టరీగా మారింది. అత్తింటివారే హత్య చేశారంటూ వారి ఇంటిపై మృతురాలి బంధువులు దాడి చేశారు. ఇంటికి నిప్పుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు తండాలో 144 సెక్షన్‌ విధించి పరిస్థితిని చక్కదిద్దారు. ధర్పల్లి మండలం పల్లె చెరువు తండాకు చెందిన మహిపాల్‌కు, మద్దిల తండాకు చెందిన బదావత్‌ లావణ్యకు ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి రెండేళ్ల బాలుడు అఖిల్‌ ఉన్నాడు. బతుకు దెరువు కోసం భర్త మహిపాల్ ఏడాది క్రితం గల్ఫ్‌ వెళ్లగా.. లావణ్య తన కొడుకుతో అత్తింట్లో ఉంటోంది. అయితే గత 6 నెలలుగా లావణ్యను అత్త, తోడికోడలు, బావలు వరకట్నం కోసం వేధిస్తున్నారని మృతురాలి బంధువులు తెలిపారు. రాత్రిఫోన్‌లో మాట్లాడిన లావణ్య.. తెల్లారేసరికి విగత జీవిగా మారడంతో.. మృతురాలి కుటుంబ సభ్యులు తండాలో ఆందోళన చేపట్టారు. మహిపాల్‌ ఇంటితో పాటు గుడిసె, వరికుప్పలకు నిప్పు పెట్టారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో అత్తింటి వారు పరారయ్యారు. తండాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.

కన్న కొడుకును అల్లారుముద్దుగా చూసుకునే లావణ్య కొడుకుతో కలిసి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుందని మృతురాలి కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. భర్త గల్ఫ్‌కు వెళ్లినప్పటి నుంచి అత్త, బావలతో పాటు తోడి కోడళ్లు వరకట్నం కోసం వేధింపులకు గురి చేశారని .. వేధింపులు తాళలేక ఒకటి రెండుసార్లు లావణ్య పుట్టింటి వచ్చినట్టు బంధువులు తెలిపారు. తల్లి కొడుకులను కొట్టి చంపారని వారు ఆరోపించారు. మరో వైపు వరకట్న వేధింపులు తాళలేక తల్లి, కొడుకు విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నారా ? లేక అత్తా బావలు బలవంతంగా విష గుళికలు మింగించి హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. తల్లి బిడ్డల మృతికి ఆస్తి తగాదాలు, వరకట్న వేధింపులు కారణమా అనేది తేలాల్సి ఉంది. పోలీసులు తండాలో సాధారణ పరిస్థితి తెచ్చేందుకు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - family problems