elections

20:30 - November 16, 2018

హైదరాబాద్ : రాజకీయాల్లో వినూత్న శైలిని అనుసరిస్తేనే టీఆర్ఎస్ ఓటమి సాధ్యమవుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు.ఎన్నికల్లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తామని ప్రకటించిన నేతలు అందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ నేతలకు కోదండరామ్ పిలుపునిచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కోదండరామ్ శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతు ఈ వ్యాఖ్యలు చేశారు.  
మహాకూటమిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తనకు నచ్చడం లేదన్నారు. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ జాప్యంతో ఇప్పటికే టీజేఎస్‌కు చాలా నష్టం జరిగిందని పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటులో 8 సీట్లలో 6 సీట్లపై స్పష్టత వచ్చిందన్నారు. ఈ క్రమంలో నవంబర్ 16న టీజేఎస్ ఆరుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. మరో రెండు స్థానాల్లో టీజేఎస్ స్నేహపూర్వక పోటీ ఉంటుందన్నారు. కాగా పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు జనగామ స్థానం ఖరారు చేసినట్లు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా తెలిపారు. అయితే జనగామ స్థానం విషయంలో కోదండరాం ఇంతవరకూ అధికార ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో 6 సీట్లపై స్పష్టత వచ్చిందనీ..నవంబర్ 16న టీజేఎస్ ఆరుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. మరో రెండు స్థానాల్లో టీజేఎస్ స్నేహపూర్వక పోటీ ఉంటుందని కోదంరాం తెలిపటం గమనార్హం.
 

 

18:31 - November 16, 2018

హైదరాబాద్ : అనుకోకుండా అదృష్టం వరించి రావటమంటే ఇదే. ఏమాత్రం రాజకీయ అనుభవం లేదు..అసలు ఆమె ఎవరో ప్రజలకు తెలీదు. ఎన్నికల్లో సీట్ కోసం నేతలు నానా పాట్లు పడుతుంటే  రాత్రికి రాత్రే ఎమ్మెల్యే అభ్యర్థిగా అవతంరించింది దివంగత నేత, టీడీపీ మాజీ ఎంపీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వయానా బావమరిది అయిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని. చంద్రబాబు ఆమెను కుకట్ పల్లి సీట్ కేటాయించటంతో సుహాసిని ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ ప్రతినిధులు ఆమెకు నామినేషన్ పత్రాలను అందించారు. రేపు ఉదయం తాత ఎన్టీఆర్, నాన్న హరికృష్ణలకు నివాళి అర్పించిన అనంతరం ఆమె నామినేషన్ వేయనున్నారు. మరోవైపు, సుహాసిని సడన్ ఎంట్రీతో కూకట్ పల్లి నియోజకర్గ ఎన్నికల పర్వం వేడెక్కింది. టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఆమె తరపున ప్రచారానికి ఆమె సోదరులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు కూడా వచ్చే అవకాశం ఉంది. 
 

18:27 - November 16, 2018

హైదరాబాద్: అసెంబ్లీ సీట్లు ఆశించి భంగపడ్డ దాదాపు 40 మంది కాంగ్రెస్ అసమ్మతి నేతలు ఒక్కటయ్యారు. వీరంతా రెబెల్స్ ఫ్రంట్‌గా ఏర్పటి ఎన్నికల్లో పోటీచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్లే తమకు సీట్లు రాలేదని శుక్రవారం (నవంబర్ 16) మీడియా సమావేశంలో వారు వాపోయారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కుంతియా ఒక కూటమిగా ఏర్పడి సీట్లు దక్కకుండా అంతా మాయచేశారని మాజీ మంత్రి విజయా రామారావు. రవీందర్, బోడా జనార్థన్ తదితరులు ఘాటుగా విమర్శించారు. రేపటి బీసీ నేతలు ఇచ్చిన బంద్‌కు తమ మద్ధతు ఉంటుందని.. అసమ్మతి నేతలు 40 మంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి తమ సత్తాచాటుతామని ప్రకటించారు. చివరి నిమిషంలో పార్టీలో చేరిన వారిక్ సీట్లు ఇచ్చి నిజాయితీగా పార్టీకి పనిచేసే నాయకులకు మొండిచెయ్యి చూపించారని అసమ్మతి నేతలు వాపోయారు. డబ్బే పరమావధిగా సీట్ల కేటాయింపులు చేశారని వారు విమర్శించారు. 
 

 

17:51 - November 16, 2018

హైదరాబాద్ : జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైకిల్ ఎక్కనున్నారు. సైకిల్ అంటే టీడీపీ పార్టీ ఎన్నికల గుర్తు అనే విషయం తెలిసిందే. అంటే మహాకూటమితో ఒక్కటైన కాంగ్రెస్ - టీడీపీలు తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా విజయం సాధించి.. రానున్న ఎన్నికల్లో కూటమి బలాన్ని చూపించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు కలిసి తెలంగాణలో  ‘రోడ్ షో’లు చేయనున్నట్లుగా సమాచారం. అంతేకాదు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ కూడా వస్తారనే వార్తలు వస్తున్నాయి. 

Image result for rahul gandhi and chandrababuతెలంగాణలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ నెలాఖరులో ఈ రోడ్ షోలు నిర్వహించాలనేది మహా కూటమి భావిస్తోంది.  2019లో జరిగే ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలన్నీ ‘మహాకూటమి’గా ఏర్పడేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణలో జరిగే ఈ ఎన్నికలను రాహుల్, బాబులు ఓ  ప్రయోగంగా భావిస్తున్నారు. కాగా ఈ ప్రచారానికి ముందుగానే చంద్రబాబు, రాహుల్ గాంధీలు ఈ నెల 22న ఢిల్లీలో జరిగే బీజేపీయేతర పార్టీల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఈ వేదిక కీలకం కానుంది. 
ఇప్పటికే ఒక విడత రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారాన్ని పూర్తి చేశారు. మరోపక్క తెలంగాణలో మహాకూటమి తరఫున ప్రచారం చేస్తానని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ క్రమంలో 17వ తేదీ శనివారం నాడు కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాను కూడా ప్రకటించి వారికి  బీ-ఫారాలు అందించనున్నారు. నామినేషన్ల పర్వం ముగియగానే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం మొదలుకానుంది. 
 

16:32 - November 16, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు రోజురోజుకు  రసవత్తరంగా మారుతున్నాయి. ఆయా పార్టీలు..నేతలు, సీట్లు, కేటాయింపులు, జంపింగ్ జిలానీలు వంటి పలు అంశాలపై వేడి వేడిగా కొనసాగుతు ఎన్నికల స్టంట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరో అంశం హాట్ టాపింగ్ గా మారింది. రాజకీయ వ్యూహాలలో కేసీఆర్ దిట్ట. అతనికంటే  ఇంకో పైమెట్టుగానే వుండే ఏపీ సీఎం చంద్రబాబు చాణక్య వ్యూహాలకు కేరాఫ్ అడ్రస్ గా వుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు రాత్రికి రాత్రే ఓ నిర్ణయం తీసుకుని రాజకీయాలలో మరింత వేడిని రాజేశారు. అదే! దివంగత నేత, చంద్రబాబు బావమరిది, టీడీపీ మాజీ ఎంపీ అయిన హరికృష్ణ కుమార్తెకు కుకట్ పల్లి సీటును కేటాయించటం. ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ సీటును ఆశించిన టీడీపీ నేతలకు కూడా మారు మాట్లాడలేని పరిస్థితి. బాబు వ్యూహం అటు సెంటిమెంట్ ను ఇటు రాజకీయ లబ్ది రెండు నెరవేర్చేలా వుండటం గమనించాల్సిన విషయం. 
Image result for kcr and chandrababuఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల్లో ఏర్పడిన మహాకూటమిలో భాగస్వామిగా వున్న టీడీపీపై టీఆర్ఎస్ పార్టీ ఏకధాటిగా విమర్శిస్తూ వస్తోంది.. చంద్రబాబు తెలంగాణను అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నాడంటూ చెప్పుకొస్తోంది.. తెరాస  విమర్శలకు బలం చేకూరేలా కూటమిలో బాబు పావులు కదుపుతున్నాడేందుకు కూకట్ పల్లి సీటే నిదర్శనం.. అమరావతిలో కూర్చుని చర్చల మీద చర్చలు జరిపి.. నయానో - భయానో అందరినీ ఒప్పించి మరీ కూకట్ పల్లి టిక్కెట్ హరికృష్ణ కూతురు సుహాసినికి దక్కేట్టు చేసుకున్నాడు..కానీ అసలు కథ ఇక్కడే ఉంది..

Image result for harikrishna death kcr talasaniహరికృష్ణ దుర్మరణం పాలైనప్పుడు తెరాస  ప్రభుత్వం చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. హరికృష్ణ మృతి నుండి అంత్యక్రియలవరకూ అంతా తానే అయి కార్యక్రమాలను దగ్గరుండి మరీ జరిపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాదు ఇప్పుడు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా వున్న కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో హరికృష్ణ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. స్మారక స్థూపానికి కూడా ప్రామిస్ చేశారు..టీడీపీ అంటేనే గిట్టని టీఆర్ఎస్ ఇదంతా ఎందుకు చేసినట్లు? టీఆర్ఎస్ మంత్రులే కాదు సాక్షాత్తు సీఎం కేసీఆరే స్వయంగా వెళ్లి చంద్రబాబును, ఎన్టీఆర్, కళ్యాణ రామ్ లను పరామర్శించారు. అప్పట్లో చర్చనీయాంశం కూడా అయ్యింది. జనం మరిచిపోయింటారులే అని అంత తేలిగ్గా తీసేయటానికి కూడా లేదు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో సరిగ్గా ఇప్పుడే చంద్రబాబు చాణక్య వ్యూహాన్ని అమలు చేశారు. అదే హరికృష్ణ కుమార్తె సుహాసినికి కుకట్ పల్లి సీటు ఖరారు చేయటం!!.ఈ అంశం టీఆర్ఎస్ ను కూడా ఇరుకున పెట్టేలా వుండటం మరో విశేషంగా చెప్పుకోకతప్పదు. అదెలాగో చూద్దాం...

హరికృష్ణకు అంత చేసిన టీఆర్ఎస్ పౌ టీడీపీ నేతలకు కాస్తో కూస్తో అభిమానం ఏర్పడకపోదు. ఒక వేళ అది కనుక జరిగి వుంటే టీడీపీ  ఓట్లు చేజారతాయనే నేపథ్యం..హరికృష్ణ గౌరవం ఇచ్చినట్లుగాను వుంటుంది..మరోపక్క అతనికి సరై గుర్తింపు ఇచ్చినట్లుగాను వుంటుంది. అలాగే వారి కుటుంబాల పరంగా చూస్తే అందరినీ ఒకతాటిపైకి తెచ్చినట్లుగా వుంటుంది. అంతేకాదు..హరికృష్ణ కుటుంబంలో పురుషులు వున్నాగానీ..అటు కుటుంబంలోను..ఇటు సమాజంలోను మహిళ సెంటిమెంట్ ను గౌరవించినట్లుగా..ఇలా చెప్పుకుంటు పోతే చంద్రబాబు ఒక దెబ్బకు అంటే ఒకే ఒక్క ఆలోచనకు...సముచిత నిర్ణయానికి ఒకే దెబ్బకు ఎన్ని ప్రయోజనాలో లెక్క వేసుకోవాలంటే ఎన్నైనా వుంటాయి..

Image result for chandrababi suhasiniహఠాత్తుగా వెలుగులోకొచ్చిన సుహాసిని..ఎమ్మెల్యే అభ్యర్థి..
నిన్నటి దాకా ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలీదు.. ఇంకా చెప్పాలంటే హరికృష్ణకు కూతురున్న సంగతి కూడా చాలా మందికి తెలీదు.. ఇప్పుడామె ఎమ్మెల్యే అభ్యర్థి.. అదీ టీడీపి తరుపున.. గెలుపు కోసం ఆమె ఈ ఎన్నికల్లో ఏమని ప్రచారం చేస్తుంది.. అధికార పార్టీని విమర్శిస్తూ ప్రచారం చేయగలదా..? చేసి ఓట్లు రాబట్టగలదా? ఒక వేళ అదే చేస్తుందనుకుంటే.. మరి తెరాస  వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? హరికృష్ణ అవటానికి చంద్రబాబుకు బామ్మర్ది అయినా.. తమ సొంత బామ్మర్ది అయినంతగా స్పందించిన తెరాసను నందమూరి సుహాసిని ఘాటుగా విమర్శించగలదా? కోరి స్నేహ హస్తం చాచిన గులాబీతో తెగదెంపులకు సిద్ధ పడగలదా? ఇప్పుడు సిటీ జనాలందరినీ ఇదే ప్రశ్న తొలుస్తోంది.. నామినేషన్ ఇంకా వేయలేదు కానీ.. వేశాక ఏంటి పరిస్థితి? అనేదే హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి పెద్ద చిక్కొచ్చి పడిందే అని అటు టిడిపి క్యాడరు - ఇటు గులాబీ క్యాడరు పైకి చెప్పలేక..మనస్సులో దాచుకోలేని లోలోపలే ఆందోళన పడుతున్నట్లుగా తెలుస్తోంది.

-మైలవరపు నాగమణి

 
 
 
 
16:12 - November 15, 2018

హైదరాబాద్ : ఎన్నికలు సమయం సమీపించేకొద్ది తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. విమర్శలతో బాణాలు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు కేసీఆర్..దమ్ముంటే ఆపుకో మంటు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ స్పదిస్తు..ఇద్దరు టీఆర్‌ఎస్ ఎంపీలు పార్టీ మారుతున్నారని రేవంత్ చెప్పడం.. పేపర్లలో రావడం.. ఓ మైండ్‌గేమ్‌లా ఉందని ఎంపీ పేర్కొన్నారు. రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ మారుతున్న ఆ ఇద్దరు ఎంపీలేవరో చెప్పాలని సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. 

తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని  సీతారాం నాయక్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి దుర్మార్గపు పనులు చేస్తున్నారని.. అవి ఆయన ఎదుగుదలకు మంచికాదని సూచించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే తాను మహబూబాబాద్ ఎంపీగా గెలిచానని సీతారాం నాయక్ స్పష్టం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు.
 

12:25 - November 15, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మావోయిస్టులు కలకలం రేపుతున్నారు. తెలంగాణలో ఎన్నికల వేళ మావోయిస్టు యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. మాజీ మంత్రి, మాజీ స్పీకర్‌లే టార్గెట్‌గా మావోయిస్టులు ప్లాన్ చేసినట్లు తెలంగాణ ఎస్ఐబి పసిగట్టింది. టీఆర్ఎస్ తాడ్వాయి మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డిని హత్య చేసేందుకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. కిడారి హత్య తరహా ఘటనను ఎస్ఐబి పసిగట్టింది. తాజా మాజీలకు ముప్పు తప్పింది. 30 మంది మావోయిస్టులకు పొలంలో షెల్టర్ ఇచ్చిన ఇద్దరు స్థానికులను పోలీసులు అరెస్టు చేశారు. 

 

21:40 - November 14, 2018

జనగామ : జనగామ నియోజక వర్గంలో రాజకీయా రసవత్తరంగా మారింది. మహాకూటమిలో భాగస్వాములుగా వున్న కాంగ్రెస్, టీజేఎస్ రెండు పార్టీలు జనగామ నియోజకవర్గం నుండే పోటీకి సిద్ధపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జనగామలో రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. కూటమి కూలిపోకూడదనే యోచనతో పొన్నాల కోసం కోదండరాం తన పోటీ స్థానాన్ని మార్చుకున్నారనే వార్తల నేపత్యంలో పొన్నాలలో ఆశలు మళ్లీ చిగురించాయి.

Image result for ponnala and kodandaram in janaramకానీ మరోసారి పొన్నాలకు షాక్ తగిలింది. తెలంగాణ జన సమితి పార్టీ 12 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఆ స్థానాలను కూడా ప్రకటించింది. మరో 3 స్థానాల గురించి కూడా కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుగుతున్నాయని, అవి కూడా తమకే కేటాయించే అవకాశం ఉందని టీజేఎస్ నేత విశ్వేశ్వర్ రావు మీడియాకు తెలిపారు. టీజేఎస్ ప్రకటించిన 12 స్థానాల్లో జనగామ కూడా ఉండటం మరోసారి సంచలనానికి తావిచ్చింది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున టికెట్ కోసం పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోటీ పడుతుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. 

జనగామ, దుబ్బాక, మెదక్‌, మల్కాజ్‌గిరి, అంబర్‌పేట, సిద్దిపేట, వరంగల్‌ తూర్పు, వర్థన్నపేట, ఆసిఫాబాద్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌, మహబూబ్‌నగర్‌, మిర్యాలగూడలో టీజేఎస్ పోటీ చేయనున్నట్లు..ఈ 12 స్థానాలన్నీ అధికారికంగా తమకు కేటాయించినవని విశ్వేశ్వర్ రావు స్పష్టం చేశారు. మరికొన్ని స్థానాలను కూడా అడుగుతున్నామని తెలిపారు. టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ సూచనతో తాను వివరాలు వెల్లడిస్తున్నట్లు చెప్పారు. బుధవారం అంటే నవంబర్ 14 సాయంత్రం ఆయన మీడియాకు వివరించారు. 

Image result for ponnala and kodandaram in janaramపోటీ చేసే స్థానాలైతే ఖరారయ్యాయి గానీ.. సీట్లను ఎవరికి కేటాయించాలనే విషయం ఇంకా నిర్ణయించలేదని విశ్వేశ్వర రావు తెలిపారు. కూటమిలో అంతా సవ్యంగా జరుగుతోందని, పార్టీలు చాలా స్పష్టతతో ఉన్నాయని చెప్పారు. టీజేఎస్‌కు బలం ఉన్న స్థానాలను కచ్చితంగా కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. మహాకూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న తెలంగాణ జన సమితికి 8 స్థానాలు కేటాయించినట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా ఇప్పటికే ప్రకటించారు. కానీ ఊహించని విధంగా టీజేఎస్ 12 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించి షాక్ ఇచ్చింది. పోటీలో ఉండే స్థానాలను ప్రకటించమని తమ పార్టీ అధ్యక్షుడు కోదండరాం సూచించారని చెప్పడం గమనార్హం.

20:51 - November 14, 2018

హైదరాబాద్ : ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి దూకుడు ఏమాత్రం తగ్గలేదు. సరికదా ఇనుమడించిన ఉత్సాహంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి సవాళ్లు విసిరారు. టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్‌కు చేతనైతే అసెంబ్లీ ఎన్నికల లోపు ఆ ఇద్దరు ఎంపీలను ఆపుకోమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయాలన్నారు. నామినేషన్ వేసేందుకు ఇంకా సమయం ఉంది కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్‌కు సూచించారు. ఏనాడూ తాను కొండగల్ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించలేదని.. ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని..తాను గెలవడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ, ఎన్నికలు, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, కేసీఆర్, సవాల్, టీఆర్ఎస్, ఎంపీలు, 

19:48 - November 14, 2018

హైదరాబాద్: టీఆర్ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కలిసి ఏర్పడిన మహాకూటమిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు. మహాకూటమిని బేస్‌లెస్ ఆలోచనగా కొట్టిపారేశారు. మహాకూటమిలో సీపీఎం చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై తమ్మినేని వీరభద్రం మాట్లాడుతు..కేసీఆర్ స్వలాభం కోసమే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని..ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న తరుణంలో మళ్లీ కాంగ్రెస్‌కు వంత పలకటం మూర్ఖత్వం అని వ్యాఖ్యానించారు. దేశంలో కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలను తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ అని.. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌తో కలవటానికి తాము సిద్ధంగా లేమన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయం, చట్టసభల్లో బలహీనులకు అవకాశం కల్పించటమే తమ లక్ష్యమన్నారు. బీఎల్ఎఫ్‌తోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. జనసేన, ఆమ్‌ ఆద్మీ పార్టీ సహా.. కలిసి వచ్చే వారితో బీఎల్ఎఫ్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తమది మొదటిది లేదా మూడో ఫ్రంట్ అనికూడా  అనుకోవచ్చునని తమ్మినేని తెలిపారు.

Pages

Don't Miss

Subscribe to RSS - elections