drugs

21:52 - October 9, 2018

హైదరాబాద్ : నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. అమీర్‌పేట్‌లో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. రాహుల్ అనే వ్యక్తి నుంచి 12 గ్రాముల ఎల్‌సీడీ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాహుల్ స్నేహితులు రిషబ్, ప్రవీణ్ దగ్గర కూడా డ్రగ్స్ ఉందన్న సమాచారంతో వారిపై కూడా అధికారులు దాడులు చేశారు. వారి నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు లక్ష విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాహుల్, రిషబ్, ప్రవీణ్‌లతోపాటు డ్రగ్స్ కొనడానికి వచ్చిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. 

 

13:59 - September 27, 2018

హైదరాబాద్ : దేశ వ్యాపితంగా శుక్రవారం మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. మెడికల్ షాపుల బంద్ కు ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్్ట డ్రగ్ డీలర్్స అసోసియేషన్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ ఫార్మసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ తరహా వ్యాపారానికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం డ్రగ్‌ అండ్‌ కాస్మొటిక్‌ యాక్ట్‌ (1940) మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని నిరసిస్తూ ఈనెల 20 నుంచి మెడికల్‌ షాపుల నిర్వాహకులంతా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఔషధ వ్యాపారంలో ఉన్న 8లక్షల మంది కెమి్‌స్టలు, వారిపై 80లక్షల మంది ఉద్యోగులు ఆధారపడి ఉన్నారని అసోసియేషన్ పేర్కొంటోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యవసరంగా మందులు మాత్రం అందిస్తామిన, వెబ్‌సైట్ల నుంచి తీసుకున్న మందులు వికటిస్తే ఎవరు కారణమని పలువురు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు

16:26 - September 8, 2018

జీవితం అనేది అందరికి వడ్డించిన విస్తరికాదు. కష్టంతో, కమిట్ మెంట్ తో..కష్టాన్నే ఇష్టంగా మార్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తి చిన్ని చిన్నివాటికే బేజారైపోయి జీవితాన్ని నాశనం చేసుకుని ఆఖిరి ఆ జీవితాన్నే అంతం చేసుకునే పరిస్థితులకు దిగజారిపోతున్న నేటితరం యువతను చూస్తుంటే ఆత్మస్థైర్యం తగ్గిపోతుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే ఉన్నత స్థానాన్ని అధిరోహించి కోట్లాది మంది సంగీత అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ అమెరికన్‌ ర్యాప్‌ సింగర్ మ్యాక్‌ మిల్లర్ మృతి చెందాడు. డ్రగ్స్‌ మోతాదు అధికం తీసుకోవటంతో తన 26 ఏళ్ల వయసులోనే మిల్లర్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. చిన్ననాటే పెద్ద పేరు..ప్రేమలో పడటం..ప్రియురాలితో బ్రేకప్‌...హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అరెస్టులు వంటి పలు సమస్యలతో మిల్లర్ తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఈ ర్యాపర్‌ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. లాస్‌ ఏంజిల్స్‌లోని తన నివాసంలో ఆపస్మారక స్థితిలో పడివున్న మ్యాక్‌ మిల్లర్ ను కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించేసరికే డ్రగ్స్ మోతాదు ఎక్కువ కావటంతో అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ తెలిపారు.

ప్రియురాలు అరియానా గ్రాండే తనకు బ్రేఇకప్ చెప్పి అమెరికా కమేడియన్‌ పిటె డేవిడ్సన్‌తో ఎగేజ్ మెంట్ ఫిక్స్ చేసుకోవడాన్ని మ్యాక్‌ మిల్లర్ తట్టుకోలేకపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమెతో విడిపోయినప్పటి నుండి మిల్లర్ తీవ్రంగా కృంగిపోయాడని..తన చివరి ఇంటర్వ్యూలో కూడా మిల్లర్ డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలిపాడు.

19:58 - July 29, 2018

ఉమ్మడి మెదక్‌ : జిల్లాలో జాతీయ రహదారుల వెంట ఉన్న దాబాలు... బార్‌ అండ్‌ రెస్టారెంట్లుగా మారిపోతున్నాయి. ఇరవై నాలుగు గంటలు మద్యం అందుబాటులో ఉండటంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఎక్సైజ్‌ శాఖ కూడా మొక్కుబడి తనిఖీలతో కాలం వెళ్లదీస్తోంది. దాబాలలో విచ్చలవిడిగా కొనసాగుతున్న మద్యం అమ్మకాలపై స్పెషల్ స్టోరీ. 

ఉమ్మడి మెదక్‌ జిల్లా జాతీయ రహదారుల వెంట ఉన్న వందలాది దాబాలలో మద్యం అమ్మకం యథేచ్ఛగా కొనసాగుతుంది. ఫ్యామిలీ దాబాలంటూ బోర్డులు తగిలించి మందుబాబులకు అడ్డాగా మార్చేశారు. పసందైన వంటకాలతో పాటు లిక్కర్‌ కిక్‌ అందిస్తున్నారు. దీంతో ఉమ్మడి మెదక్‌ జిల్లా వెంట షోలాపూర్‌, పూణే, ముంబయి, బెంగుళూర్‌, బీదర్, షిరిడీ వంటి ప్రాంతాలకు ప్రయాణించే వందలాది బస్సులు, లారీలు ప్రమాదాలకు గురవుతున్నాయి. దాబాలలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుగుతున్న  ఎక్సైజ్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంగారెడ్డిలోని పసల్‌ వాది, గణేష్ గడ్డ ప్రాంతాలలో ఉన్న దాబాలలో ఇటీవల మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ రహదారి వెంట నిత్యం ప్రమాదాలు కూడా అంతేస్థాయిలో జరుగుతున్నాయి. ప్రమాదాల అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు.... డ్రైవర్లు మద్యం సేవించి మితిమీరిన వేగంతో నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తేల్చారు. దీంతో ఎక్సైజ్‌ శాఖ అధికారుల తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. 

ఇక జాతీయ రహదారుల వెంట ఉన్న కొన్ని వైన్‌షాపుల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు.  పర్మినెంట్‌ రూమ్‌ల పేరుతో నిబంధనలను పాతరేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

12:38 - June 18, 2018

అనంతపురం : పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అనంతపురం జిల్లా పామిడి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి అరకిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారుజ. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం తెలికి గ్రామానికి చెందిన బిసిరెడ్డి రమేశ్‌రెడ్డిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, చోరీల తోపాటు మూడు హత్యకేసులు కూడా రమేశ్‌రెడ్డిపై ఉన్నాయని పోలీసులు తెలిపారు. 

06:41 - March 4, 2018

హైదరాబాద్‌ : నగరం విష సంస్కృతి వడిలోకి వెళుతోంది. విదేశీ సంస్కృతి నగర వాసులను పెడ దారి పట్టిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పబ్‌, హుక్కా కల్చర్ విస్తరిస్తోంది. దీనికి అలవాటు పడుతున్న నగర యువత రేవ్ పార్టీలతో మజా చేస్తున్నారు.హుక్కాతో మత్తులో తూగుతున్నారు. డ్రగ్స్, గంజాయి, హెరాయిన్, తాజాగా ఎల్ఎస్డి అన్నీ నగర యువతను ఓ గమ్మత్తైన లోకానికి తీసుకెళ్లి మత్తులో చిత్తు చేస్తోంది. చాలా గుట్టుగా సాగిపోతున్న హుక్కా కల్చర్ ఈ మధ్య కాలంలో పోలీసుల దాడుల్లో బయటపడింది. హుక్కా సెంటర్లు పైకి చూడడానికి కాఫీబార్లు, టీ స్పాట్లు, ఐస్ క్రీం పార్లర్లు ,గేమింగ్ పార్లర్ లాగా కనిపిస్తాయి. లోపల మాత్రం హుక్కా పొగలు గుప్పు గుప్పు మంటున్నాయి. ఒక్కో ఫ్లేవర్కు ఒక్కో రేట్ ఫిక్స్ చేసి యజమానులు డబ్బులు దండుకుంటున్నారు. ఈ ఫ్లేవర్లకు తంబాకు, గంజాయి,కొకైన్, హెరాయిన్ మిక్స్ చేసి యూత్ ను మత్తులో ముంచెత్తుతున్నారు.

క్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకున్న సెంటర్లు కొన్ని మాత్రమే ఉండగా.. అనధికారికంగా నడుస్తున్న సెంటర్లే అధికంగా ఉన్నాయి. వాటిపై నిఘా కొరవడడంతో మైనర్లు సైతం హుక్కా కు బానిసలవుతున్నారు. మత్తులో జోగుతున్నారు. తాజాగా షాలిబండ లోని నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో పట్టుబడిని వారు 12 మంది మైనర్లే ఉండటం ఆందోళన కలిగించే అంశం.

వాస్తవానికి హుక్క సెంటర్‌ నడపాలంటే విధిలా లైసెన్స్‌ తీసుకోవాలి. ప్రతీ సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మైనర్లను అనుమతించకూడదు. 18 ఏళ్లలోపు పిల్లలకు హుక్కా ఇవ్వడం నేరం కనుక సెంటర్‌కు వస్తున్న వారి పూర్తి వివరాలు వయసుతో సహా రిజిస్టర్‌లో నమోదు చేయాలి. దాంతోపాటు హుక్కాలో ఉపయోగించే పదార్థాలు,ఫ్లేవర్స్‌ వివరాలను బోర్డులో ప్రదర్శించాలి.. రాత్రి 9 గంటలకే హుక్కా సెంటర్లు బంద్‌ చేయాలి. కాని నగరంలో ఈ నిబంధనలేవీ పాటించిన దాఖలాలు కనిపించడంల లేదు. అసలు లైసెన్స్‌ లేకుండానే హుక్కా సెంటర్లు నడుస్తుంటే.. అధికారులు ఏంచేస్తున్నారని హైదరాబాద్‌ పబ్లిక్‌ ప్రశ్నిస్తున్నారు.

సిగరెట్ వల్ల ఎలాంటి హాని ఉంటుందో హుక్కావల్ల కూడా అంతే ప్రమాదం పొంచి ఉందని, ఇక అందులో మత్తుపదార్థాలు కలిపి సేవిస్తే వారి పని అంతే అంటున్నారు వైద్యులు. హుక్కా ద్వారా తంబాకు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని పీల్చినప్పుడు మనిషి కంట్రోల్ తప్పుతాడు. ఏం చేయడానికైనా తెగబడతారు. దోపిడీలకు, దొమ్మీలకు, చైన్ స్నాచింగ్లకు సైతం పాల్పడతారని వైద్య నిపుణలు అంటున్నారు. మత్తు పదార్థాల వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని మెదడుకు కుంచించుకు పోతుందని హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తులపై పొగ ప్రభావం పడి కేన్సర్‌ బారిన పడే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇప్పటికైనా .. అధికారులు హుక్కా సెంటర్ల ఆగడాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అనుమతి లేకుండా హుక్కా సెంటర్లు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. దాంతోపాటు ఇప్పటికే మత్తుకు బానిసలుగా మారిన యువత, మైనర్లకు కౌన్సిలింగ్‌ ఇప్పించి పెడమార్గం పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. 

20:06 - September 8, 2017

విశాఖ : గంజాయి నిర్మూలించేందుకు ప్రజలు, అధికారులు కలిసిరావాలన్నారు మంత్రి అయ్యన్న పాత్రుడు. గంజాయి అక్రమ రవాణాలో పట్టుబడితే ఎలాంటి వారినైనా పీడీ యాక్ట్‌ కింద నమోదు చేయాలని సూచించారు. గంజాయి రవాణా వలన యువత జీవితాలు నాశనమైపోతాయన్నారు. జీవీఎంపీ ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. డిసెంబర్‌లో ఎన్నికలు పెట్టాలని ఇప్పటికే సీఎంను కోరామని త్వరలో దీనిపై ఓ నిర్ణయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

21:04 - August 16, 2017

యువత డ్రగ్స్ కు బానిస అవుతోంది. ఈమధ్య డ్రగ్స్ మాఫియా సినీ రంగాన్ని కుదిపేసింది. ఈనేపథ్యంలో రఘు కుంచె  'ఓ యువత' పేరుతో పాట రూపొందించారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ఓ యువత పాట రూపొందించారు. ఈమేరకు రఘు కుంచె, సంజీవరెడ్డిలతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  పలు అసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

18:08 - August 12, 2017

హైదరాబాద్ : రైళ్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాని సికింద్రాబాద్‌ రైల్వే జీఆర్‌పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నుండి పుణేకి లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ యువతి కూడా ఉంది. వారి వద్ద నుండి దాదాపు 15 లక్షల విలువగల 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అసలు సూత్రదారులు ఢిల్లీ, ముంబయిలో పోలీసులకు దొరకకుండా తప్పించు తిరుగుతున్నారని వారికోసం గాలిస్తున్నట్లు సికింద్రాబాద్‌ రైల్వే ఎస్‌.పి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

20:17 - August 11, 2017

హైదరాబాద్ : గ్స్ వాడుతున్నారని 12 మంది టాలివుడ్‌ ప్రముఖులను విచారించిన సిట్ అధికారులు ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచి చూస్తున్నారు...రిపోర్టు అందిన వెంటనే సైంటిఫిక్ ఆధారాలతో చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు..ఇప్పటికే సిట్ అధికారులు విచారణ చేసిన తర్వాత ఓ నిర్ధారణకు రాగా...ఆధారాల కోసం చూస్తున్నట్లు కన్పిస్తుంది.టాలివుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారంపై జల్లెడ పట్టిన సిట్ బృందం చివరకు తొలివిడతగా 12 మందిని విచారించింది... ఇందులో ప్రధానంగా దర్శకుడు పూరీజగన్నాథ్‌,ప్రముఖ నటులు రవితేజ, చార్మి, ముమైత్‌ఖాన్, నవదీప్, తరుణ్ లతో పాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు, ఫోటోగ్రాఫర్ శ్యాం.కె.నాయుడు,సుబ్బరాజు తదితరులను విచారించిన సంగతి తెలిసిందే...వీరిని విచారించినప్పుడు సిట్ అధికారులు వేసిన క్రాస్‌ క్వశ్చన్స్‌తో అసలు కథ తెలిసిపోయింది..ఏదైతే అనుమానించారో అదే నిజాలు బయటపడ్డాయని సిట్ అధికారులంటున్నారు..దీంతోనే ఇప్పటికే ఆ 12 మందిలో ఇద్దరిపై పూర్తిగా నిర్ధారణకు వచ్చినా ఆధారాల కోసం వేచి చూస్తున్నట్లు ఎక్సైజ్ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్ చెబుతున్నారు.

చాలామందిని విచారించాల్సి ఉంది
సినిప్రముఖుల విచారణ పూర్తయినంత మాత్రానా... కేసు పూర్తయినట్టు కాదని ఇంకా చాలామందిని విచారించాల్సి వుందని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేస్తున్నారు...ఇప్పటికే 12 మంది పైన పూర్తి విచారణ నివేదికలు రెడీ చేశామంటున్నారు...అయితే విచారణతోనే కేసు క్లోజ్ చేశామన్న ప్రచారం సరైంది కాదంటున్నారు.డ్రగ్స్ కేసులో తెలంగాణా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలతో పాటు సిట్ బృందానికి పూర్తి స్వేచ్చను ఇవ్వడంతో దూకుడు పెంచుతున్నారు...12 మందిని విచారించిన అధికారులు వారి ద్వారా తెలుసుకున్న విషయాలతో పాటు స్వీయ శోధనలో చాలా మంది పేర్లు వచ్చాయి..ఇందులో కొందరు ప్రముఖులకు సంబంధించిన ఆధారాలు కూడా దొరికినట్లు తెలుస్తోంది...దీంతోనే ముందుకు పోతున్న సిట్ అధికారులు రెండో విడత విచారణకు సిద్దం చేస్తున్నట్లు సమాచారం... ఇప్పటికే జాబితా రెడీ చేసిన అధికారులు తొలివిడతలోని వారిపై చర్యలు తీసుకుంటూనే ఈ లిస్ట్‌ను బయటపెట్టే అవకాశం కన్పిస్తుంది...నవంబర్ చివరాఖరికల్లా ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం వుందంటున్నారు సిట్‌ అధికారులు.

Pages

Don't Miss

Subscribe to RSS - drugs