dollar

18:40 - October 9, 2018

ముంబయి: రూపాయి విలువ మరింత దిగజారింది. ఈ ఏడాది ఇప్పటివరకు డాలర్‌తో పోల్చితే 16 శాతం మేరకు తగ్గిపోయింది. ఈ రోజు ఒక్కసారిగా..33 పైసలు తగ్గి.. డాలర్ విలువలో 74.39 వద్ద నిలిచింది. ఇది ఇప్పటి వరకు జరిగిన తగ్గుదలలో అత్యధికంగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

13:31 - September 12, 2018

ముంబై : రూపాయి మరింత క్షీణించింది. గత కొన్ని రోజులుగా రూపాయి కనిష్టస్థాయికి పడిపోతున్న సంగతి తెలిసిందే. అమెరికా డాలర్ తో పొలిస్తే రూపాయి విలువ 72.91గా నమోదైంది. బుధవారం మరో 22 పైసలు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, అమెరికా డాలర్‌కు గిరాకీ పెరగడం వంటి కారణాలతో రూపాయి విలువ మరింత బక్కచిక్కిపోతోంది. డాలర్ కు డిమాండ్ పెరిగిపోతుండడంతో పాటు ముడి, చమురు ధరలు పెరగడం..కరెంటు ఖాతా లోటు ఎక్కువగా ఉండడం రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని బిజినెస్ విశ్లేషకులు పేర్కొటున్నారు. 

 

16:10 - September 11, 2018

ముంబయి: రూపాయి మరింత క్షీణించి డాలరు విలువలో రూ 72.73 స్థాయికి పడిపోయింది. రూపాయి విలువ మంగళవారం నాడు 28 పైసలు మేరకు తగ్గింది, ప్రారంభంలో 15 పైసలు తగ్గినా.. సాయంత్రం ట్రేడింగ్ లో 28 పైసలు మేర పడిపోయింది. ఈ ఏడాది ఇంతవరకు డాలరు విలువలో 13 శాతం మేర తగ్గింది. ఆసియా కరెన్సీలలోనే రూపాయి అత్యంత బలహీనమైన పనితీరును కనబరిచింది. 

ఇదిలాఉండగా, కేంద్ర ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిందిగా రిజర్వు బ్యాంకు అధికారులను ఆదేశించింది.

15:57 - September 10, 2018

హైదరాబాద్ : డాలరు విలువతో పోల్చితే రూపాయి విలువ సోమవారం మరింత దిగజారింది. రూపాయి మరింత పతనమై డాలర్ రేటుతో 72.67 స్థాయికి పడిపోయింది. వాణిజ్య లోటుతోపాటు అమెరికా డాలర్ కు ఎగుమతి  దారుల వల్ల డిమాండ్ పెరగటంతో రూపాయి విలువ పడినట్టు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

దేశీయ ద్రవ్య విలువ ఈరోజు డాలర్ రేట్ పై 71.73 దగ్గర మొదలై అత్యల్పంగా 72.15 వద్ద ముగిసింది. నిన్నటి 72.11 విలువను రికార్డు స్థాయిలో దాటి 72.67 గా నమోదయ్యింది.

11:43 - September 10, 2018

ఢిల్లీ : రూపాయి విలువ మరింత క్షీణిస్తోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మరింత పతనమవుతోంది. సోమవారం 64 పైసలు నష్టపోయి 72.37 స్థాయిని డాలర్ విలువ తాకింది. ట్రేడ్ వార్ పరిణామాలతో రూపాయి విలువ పతనమవుతోందని బిజినెస్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆల్‌ టైమ్ లో రూపాయి పతనం రికార్డులు సృష్టిస్తోంది. చివరి సెషన్‌లో రూ.71.74 దగ్గర ముగిసిన రూపాయి విలువ ఈరోజు 42 పైసల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. రూ.72.15 దగ్గర మొదలై ప్రస్తుతం రూ.72.37 దగ్గర కొనసాగుతోంది రూపాయి విలువ. మరోవైపు స్టాక్ మార్కెట్లు అలాంటి పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మరోవైపు పెట్రోల్ ధరలు పెరిగిపోతుండడంతో స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. 

21:14 - January 20, 2017

ట్రంప్ ప్రమాణస్వీకారంపై 10 టివి డిబేట్ నిర్వహిచింది. ఈ కార్యక్రమంలో విశ్లేషకులు పూర్ణచంద్రశాస్త్రీ, పద్మజా షా ( ప్రొఫెసర్ ఇన్ జర్నలిజం ఫ్రం ఉస్మానియా యూనివర్సిటీ)లు పాల్గొని, మాట్లాడారు. భిన్నవాదనలు వినిపించారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:25 - January 2, 2016

హైదరాబాద్ : కారణం తెలీదు. మీ దేశానికి మీరు వెళ్లిపోండని పంపించేస్తున్నారు. ఉగ్రవాదులను అనుమానించినట్టుగా చెకింగ్ చేస్తున్నారు. అన్నీ పత్రాలు సక్రమంగా ఉన్నా..ఇండియాకు వెళ్లిపొమ్మంటుటున్నారు. ఏ దేశం విద్యార్థులనూ టచ్ చేయకుండా...కేవలం మనదేశం వారు, అందులోనూ తెలుగు విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారు. అవమానభారంతో తెలుగు విద్యార్థుల తిరుగుముఖం పడుతున్నారు. భవిష్యత్ పై ఎన్నో ఆశలతో అమెరికా ఫ్లైటెక్కిన తెలుగు విద్యార్థుల చేదు అనుభవమిది.

అమెరికాలో తెలుగు విద్యార్థుల కోసం వేట .......

వివిధ యూనివర్సిటీల్లో తెలుగు విద్యార్థుల కోసం వేట ముమ్మరం చేశారు. దొరికినవారిని దొరికినట్టుగా ప్రశ్నిస్తున్నారు. ఎయిర్‌పోర్టుల్లో ల్యాండైన స్టూడెంట్స్ ను అటు నుంచి అటే తిరిగి ఇండియా పంపించేస్తున్నారు.

ఇండియా వెళ్లిపోవాలని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారుల హుకుం.....

ఇదీ హయ్యర్ ఎడ్యుకేషన్‌ కోసం అమెరికా ఫ్లైటెక్కిన తెలుగు విద్యార్థుల అనుభవం. ఇండియన్ స్టూడెంట్స్ అందులోనూ తెలుగు విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే క్షుణ్ణంగా తనిఖీ చేసి, కారణాలు ఏవీ చెప్పకుండానే ఇండియా వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక గత కొన్ని రోజులుగా అమెరికా ఎయిర్‌పోర్టుల నుంచి పదుల సంఖ్యలో మన విద్యార్థులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్నారు.

శనివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు 15 మంది విద్యార్థులు ...........

అమెరికా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు శనివారం ఉదయం 15 మంది విద్యార్థులు తిరిగి వచ్చారు. వీరంతా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా అమెరికా అధికారులు తమను వెనక్కి పంపారని విద్యార్థులు ఆవేనద వ్యక్తం చేస్తున్నారు. సియాటెల్‌ వర్సిటీలో తమను బంధించారని చెబుతున్నారు. అమెరికాలో తాము నరకం అనుభవించామని విద్యార్థులు ఆవేదనగా చెబుతున్నారు. అయితే, తమను ఎందుకు వెనక్కి పంపుతున్నారనే విషయాన్ని అధికారులు వెల్లడించడంలేదని విద్యార్థులంటున్నారు.

......................................

21:40 - December 14, 2015

ఢిల్లీ : అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచాలని తీసుకున్న నిర్ణయం భారత కరెన్సీ విలువపై తీవ్ర ప్రభావం చూపింది. యూఎస్‌ ఫెడ్‌ రిజర్వు నిర్ణయంతో డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పతమయ్యింది. రెండేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. సోమవారం డాలరుతో రూపాయి మారకపు విలువ 67.09గా నమోదయ్యింది.
బుధవారం వడ్డీ రేట్లు పెంచనున్న అమెరికా ఫెడరల్‌ రిజర్వ్
మన కరెన్సీ రూపాయికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ పతనం దిశగా పయనిస్తోంది. అమెరికా ఫెడర్‌ రిజర్వు బుధవారం వడ్డీ రేట్లు పెంచనుంది. దీంతో విదేశీ సంస్థాగత మదుపర్లు మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి భారీగా ఈక్విటీలను అమ్ముతున్నారు. ఈ ప్రభావం రూపాయి మారకు విలువపై పడింది.
డాలరుతో రూపాయి మారకపు విలువ 67.09
సోమవారం రూపాయి మారకపు విలువ భారీగా పతనం అయ్యింది. ఒక అమెరికా డాలరు కొనుగోలుకు చేయడానికి మన 67.09 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. 2013 సెప్టెంబర్‌ 4 తర్వాత రూపాయి మారకపు విలువ ఈ స్థాయిలో పతనం అవ్వడం ఇదే మొదటిసారి. ఈనెలలో తొమ్మిది ట్రేడింగ్‌ సెషన్లలో ఏడుసార్లు రూపాయి విలువ పతనం అయ్యింది. గత నెలలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 2.1 శాతం పడిపోయింది. ఆసియా కరెన్సీల్లో మన రూపాయే డోలాయమాన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది.
మంగళవారం అమెరికా ఫెడరల్‌ రిజర్వ్ భేటీ
దాదాపు పదేళ్ల తర్వాత అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేటు పెంచాలని నిర్ణయించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఫెడరల్‌ రిజర్వు మంగళవారం సమావేశం కానుంది. ఈ నిర్ణయం తర్వాత విదేశీ సంస్థాగత మదుపర్లు గతనెల 1 నుంచి మన స్టాక్‌ మార్కెట్ల నుంచి 12 వేల కోట్ల రూపాయల ఈక్విటీలను అమ్మేశారు. రూపాయి విలువ పతనానికి ఇదే ప్రధాన కారణం. ఎఫ్‌ఐఐలు ఈక్విటీలను భారీగా అమ్మడం ద్వారా ఈనెలలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4 శాతం నష్టపోయింది. ఈ నెలలో ఎక్కువ రోజులు 7,575 పాయింట్ల దగ్గరే నిఫ్టీ ట్రేడ్‌ అయ్యింది. డాలరుతో రూపాయి మారకపు విలువ పతనం మరికొన్ని రోజులు కొనగాసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
చైనా కరెన్సీ యెన్‌ విలువ పతనం
రూపాయల విలువ పతనానికి మరో కారణం కూడా లేకపోలేదు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా విస్తరించిన చైనా కరెన్సీ యెన్‌ విలువ కూడా పడిపోయింది. యెన్‌ విలువ నాలుగున్నరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2011 జులై తర్వాత యన్‌ విలువ భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. ఇది కూడా రూపాయి విలువ పతనంపై ప్రభావం చూపింది. యెన్‌ విలువ మరింత క్షీణించే అవకాశం ఉందని పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా సోమవారం ప్రకటించింది. చైనా తమ ద్రవ్య విలువను తగ్గిస్తే అది.... రూపాయి విలువ పతనంపై మరింత ప్రభావం చూపుతుందని అంచనావేస్తున్నారు.
బాండ్లపై పెట్టుబడులకు అధిక వడ్డీ
రూపాయిల విలువ క్షీణిస్తుండటంతో రిజర్వు బ్యాంకు ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది మరింత పతనం కాకుండా చర్యలు చేపట్టింది. రూపాయి మరింతి ఒడిదొడుకులకు లోనుకాకుండా బాండ్ల రూపంలో పెట్టుబడులు పెట్టిన వారికి మరింత వడ్డీ చెల్లిస్తామని ఆర్‌బీఐ అధికారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్‌ నుంచి మరింత ఎక్కువగా బాండ్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

 

 

10:47 - August 24, 2015

హైదరాబాద్ : ముంబై స్టాక్‌మార్కెట్‌ కుప్పకూలింది. దాదాపు 9 వందల పాయింట్లు దిగజారి ఇన్వెస్టర్లను దెబ్బ తీసింది. నిఫ్టీ సైతం 3 వందల పాయింట్లు పడిపోయింది. రూపాయి విలువ దారుణంగా పడిపోయి డాలర్‌ మారకం విలువ 66కు చేరింది. చైనా కరెన్సీ వాల్యూ తగ్గించడంతో ఆ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌పై పడుతోంది. చైనా స్టాక్స్‌లో భారీ అమ్మకాలు జరగడంతో.. అది ఆసియా మార్కెట్‌పై ప్రభావం చూపడంతోనే.. ఈ పరిణామాలు జరిగాయని ప్రాథమికంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

16:22 - August 19, 2015

హైదరాబాద్ : చైనా కరెన్సీ దెబ్బకు రూపీ పతనం కొనసాగుతూనే ఉంది. ఫోరెక్స్ మార్కెట్లో డాలర్ తో పోల్చితే.. .దేశీయ కరెన్సీ 12 పైసలు క్షీణించి 65 రూపాయల 43 పైసలకు పడిపోయింది. దీంతో రూపీ విలువ రెండేళ్ల కనిష్ఠస్థాయికి చేరింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా రూపాయి పరిస్థితి బలహీనంగా ఉంది. ఎగుమతులు తగ్గడం, చైనా కరెన్సీ విలువ తగ్గించుకోవడంతో.. ఇన్వెస్టర్లు డాలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వచ్చే నెల 16న జరిగే అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశం వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఫోరెక్స్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - dollar