devendra fadnavis

16:50 - November 3, 2018

మహారాష్ట్ర : కోరుకున్న పాపులర్ బ్రాండ్స్ సిగరేట్లు కావాలంటే దుకాణాలకు వెళ్లాల్సినవసరం లేదు. నేరుగా ఇంటికే పంపిణీ చేయనున్నారు. మహారాష్ట్రలో త్వరలో ఇది అమలు కానుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే మోడల్ మేఘా శర్మ చేసిన ఉదంతం తెలిసిందే. ముంబైలోని కీలక ప్రాంతాలు బాంద్రా, వర్లి, కొలబా ఇతర ప్రాంతాలను మొదట ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 2019 జనవరి 1వ తేద నుండి దీనిని ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 
Image result for Maharashtra Govt Doorstep Delivery Of Cigarettesముంబైలోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉంటున్న మోడల్ మేఘా శర్మ అక్టోబర్ 25 అర్థరాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డు అలోక్‌కు ఫోన్ చేసింది. కానీ అతను నిరాకరించడంతో మేఘా శర్మ తీవ్ర ఆగ్రహానికి గురైంది. అతనితో ఘర్షణకు దిగింది. అలోక్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి మగ పోలీసులు చేరుకున్నారు. స్టేషన్ కు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. దీనికి మేఘా శర్మ నిరాకరించింది. అది కూడా మహిళా కానిస్టేబుల్ కూడా లేనందున పోలీస్ స్టేషన్‌కు తెల్లారగానే వస్తానని చెప్పింది. అయినా పోలీసులు వినకపోవడంతో వేసుకున్న దుస్తులను మేఘా శర్మ తొలగించింది. చివరకు పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు. మరి మహా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఎలాటి వివాదం చెలరేగుతుందో చూడాలి. 

10:54 - October 22, 2018

ముంబయి: సెల్ఫీ మోజులో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఎందర్నో చూసాం. ఈ ఫోటోలో సెల్ఫీ తీసుకుంటున్న మహిళ పేరు అమృత. ఈమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి. ఓడలో ప్రయాణిస్తూ సెల్ఫీ బాగారావాలని భద్రతకోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి ఓడ చివర భాగాన సెల్ఫీ తీసుకొనేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉన్న భద్రతాధికారులకు కాసేపు చెమటలు పట్టాయి. సీఎం భార్య.. చెబితే ఏమన్నా అనుకుంటుందేమో అనే భయంతోనే ఇది చాలా ప్రమాదమని చెప్పేందుకు సాహసించారు. అమృత ఓడ రైలింగ్ మీద ప్రమాదం అంచున కూర్చొని సెల్ఫీదిగటం ఏఎన్ఐ వీడియోలో రికార్డింగ్ అయ్యింది. అలాగే.. అంటూ మరో సెల్ఫీ తీసుకొనేందుకు ప్రయత్నించడం పోలీసులనే కాదు ఓడలో ఉన్న జనాలకూ కాసేపు దడ పుట్టించింది.

Image result for AMRUTA FADNAVIS DARINGయాంగ్రియా అనే మొదటి దేశీయ షిప్ ప్రారంభం సందర్భంగా ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ ఓడను అమృత భర్త ముఖ్యమంత్రి ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబయిలోని విక్టోరియా పోర్టులో ప్రారంభించారు. ప్రతీ వారం ముంబయి నుంచి గోవా ప్రయాణించేందుకు యాంగ్రియా షిప్‌ను ప్రారంభించారు. ఇందులో 400 మంది ప్రయాణించే అవకాశం ఉంది. 
 

15:58 - September 9, 2018

ముంబై : చమురు ధరల పెరుగుదలపై మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా చూస్తామని సీఎం పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానెల్ తో ఆయన మాట్లాడారు. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ తీసుకురావడం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోందని..ధరలు తగ్గే మార్గాలను చూస్తున్నట్లు వెల్లడించారు. జీఎస్టీలోకి తీసుకొస్తే మహారాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తుందని, ఎన్డీయే ప్రభుత్వ హాయాంలో 13 సార్లు ధరలు పెరిగాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ధరల పెరుగుదల ఉంటుందన్నారు.

 

10:29 - October 28, 2017

మహారాష్ట్ర : రాష్ట్రంలో బిజెపి, శివసేన పార్టీల మధ్య వివాదం ముదురుతోంది. తరచూ బిజెపిపై విమర్శలు చేసే శివసేన ఈసారి ఏకంగా ప్రధాని మోదినే టార్గెట్‌ చేసింది. జిఎస్‌టి, నోట్లరద్దు నిర్ణయాలతో మోది పనైపోయిందని.... ఈ దేశానికి రాహులే దిక్కని పేర్కొంది. శివసేన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్‌ సీరియస్‌గా స్పందించారు. బిజెపి ప్రభుత్వంలో కొనసాగుతారా...లేదా... అన్నది తేల్చుకోవాలని శివసేనకు సవాల్‌ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి శివసేన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వంద మంది రాహుల్‌గాంధీలు కూడా మోదీని ఏమీ చేయలేరని రెండేళ్ల క్రితం పొగడ్తలతో ముంచెత్తిన శివసేన ఇపుడు మాట మార్చింది. మోదీ ప్రతిష్ట మసకబారుతోందని... కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించేలా కనిపిస్తున్నారని శివసేన వ్యాఖ్యానించింది.

మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపట్ల దేశ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌.. ఒక టీవీ షోలో అన్నారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలు.. ప్రజలను ఆలోచనలో పడేశాయని ఆయన చెప్పారు. జిఎస్‌టి కారణంగా హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవం తప్పదని సంజయ్‌ అభిప్రాయపడ్డారు. రాహుల్‌గాంధీపై సంజయ్‌రౌతే ప్రశంసలు కురిపించారు. ఆయనను పప్పు అనడం సరికాదన్నారు. ఈ దేశంలో అతిపెద్ద రాజకీయ శక్తి ప్రజలే. ఎవరినైనా పప్పును చేసే శక్తి ప్రజలకు ఉందని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి రౌత్ అన్నారు. శివసేన ఎంపీ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ తీవ్రంగా స్పందించారు. బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో కొనాసాగాలా...లేదా అన్నది ఉద్ధవ్‌ ఠాక్రే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. తాము చేసే ప్రతి నిర్ణయాన్ని శివసేన వ్యతిరేకిస్తూనే ఉంది...కానీ ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం సరికాదన్నారు.

మహారాష్ట్రలో బీజేపీతో కలిసి శివసేన అధికారంలో భాగస్వామిగా ఉంది. ఇటీవల శివసేన- ప్రధాని మోదిని, బిజెపిని టార్గెట్‌ చేస్తూ చురకలు అంటిస్తోంది. సంజయ్‌ రౌత్ వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం మరింత ముదిరింది. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం నుంచి శివసేన వైదొలిగితే ఫడ్నవిస్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. శరద్‌ పవార్‌ మద్దతుపైనే బిజెపి ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంది.

18:11 - January 27, 2017

హైదరాబాద్: మహారాష్ట్రలో బిజెపి, శివసేనల మధ్య పొత్తు తెగిపోయిన నేపథ్యంలో ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌పవార్‌ బిజెపికి అండగా నిలిచారు. స్థానిక మున్సిపల్‌ ఎన్నికల తర్వాత శివసేన బిజెపి ప్రభుత్వం నుంచి వైదొలిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బిజెపి ఎన్సీపికి దగ్గరవుతోంది. గత కొన్నేళ్లుగా కలిసి పనిచేసిన బిజెపి-శివసేన కూటమి విడిపోవడం బాధాకరమని శరద్‌ పవార్‌ అన్నారు. ఇకపై బిజెపితో కలిసి మహారాష్ట్ర ఎన్నికల్లో పాల్గొనేది లేదని శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. పాతికేళ్లుగా కూటమిలో ఉండి తాము నష్టపోయామని ఠాక్రే అన్నారు. మార్పు అనేది సహజమని...మాతో ఎవరు కలిసి వస్తే వారితో ముందుకు వెళ్తామని మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ పేర్కొన్నారు.

 

16:00 - November 30, 2016

మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య అమృత ఫడ్నవీస్. భర్త సీఎం అయినా ఈమె మాత్రం బ్యాంక్ ఎంప్లాయిగా కొనసాగుతున్నారు. ఈమెకు పాటలు పాడడం చాలా ఇష్టమంట. దీనితో పలు చిత్రాల్లో గానం అందించారు. కునాల్ కోహ్లీ తీసిన 'ఫిర్ సే', ప్రకాస్ ఝూ సినిమా 'జై గంగాజల్' కోసం ఆమె పాటలు పాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఫొటో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బితో ఈమె స్టెప్పులు వేస్తున్న ఓ ఫొటో వైరల్ అవుతోంది. సౌత్ ముంబాయిలోని ఓపెరా హౌస్ దగ్గర అహ్మద్ ఖాన్ ఓ మ్యూజిక్ వీడియో తీస్తున్నాడు. ఇందులో 'బిగ్ బి' కూడా నటిస్తున్నారు. రెడ్ కలర్ మినీ స్కర్ట్ వేసుకున్న 'అమృత'..'అమితాబ్'తో స్టెప్పులేసింది. ఆర్ట్స్ ఇనిస్టిట్యూట్ హెడ్ గా అమితాబ్ కనిపిస్తాడంట. ఈ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయేందుకు అమృత రావడం..సంభాషణలో భాగంగా ఈ పాట వస్తుందంట. 'ఫిర్ సే' అంటూ సాగే ఓ మ్యూజిక్ వీడియో కోసం ఇదంతా షూటింగ్ చేశారని టాక్. 

21:01 - September 6, 2016

ముంబై: రియో ఒలింపిక్స్‌లో రజత పతకంతో భారత్‌ పరువును నిలిపిన సింధుపై కనకవర్షం కురుస్తూనే ఉంది. ఇటీవలనే డిల్లీ సీఎం కేజ్రీవాల్ నగదు బహుమానం అందించగా తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సింధును, ఆమె కోచ్‌ గోపీచంద్‌ను ముంబైలో ఘనంగా సన్మానించారు. అనంతరం సింధుకు 75 లక్షల రూపాయల చెక్ అందజేశారు. కోచ్ గోపీచంద్‌కు 25లక్షల రూపాయల చెక్ ఇచ్చారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం 5 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు పీవీ సింధూకు ఇచ్చిన విషయం తెలిసిందే .  

06:34 - August 17, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ సర్కార్‌ మహారాష్ట్రతో ప్రాజెక్టులపై కీలక ఒప్పందం చేసుకోనుంది. ఈనెల 23న రెండు రాష్ట్రాల మధ్య గోదావరి అంతరాష్ట్రమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంలు, ఇరిగేషన్‌ మంత్రులు పాల్గొననున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఒప్పందం చేసుకోనున్నాయి. రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు కాళేశ్వరం, చనాఖా కొరాటా, ప్రాణహిత ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ముంబైలో సమావేశం జరగనుంది.

ప్రాణహిత చేవేళ్లతో ఆదిలాబాద్‌కు సాగునీరు..
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను రెండు ప్రాజెక్టులుగా విభజించి, ఆదిలాబాద్ జిల్లా అవసరాల కోసం తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మించనున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ద్వారా లక్ష ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు అందించేలా ప్రభుత్వం ప్లాన్‌ చేసింది. కరీంనగర్ జిల్లా మేడిగడ్డ దగ్గర రిజర్వాయర్ నిర్మించనున్నారు. మేడిగడ్డ దగ్గర 101 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఇంజనీర్లు సానుకూలంగా స్పందించారు. అంతరాష్ట్ర బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

ఈనెల 23న జరుగనున్న కీలక ఒప్పందం..
ప్రాజెక్టులకు సంబంధించి గతేడాది ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు ముంబై వెళ్లి చర్చించారు. తుమ్మిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర వ్యతిరేకించింది. గోదావరిలో 160 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని ఎత్తు విషయంలో మాత్రం అంగీకరించే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది. అయితే దీని విషయంలో మహారాష్ట్రతో చర్చించామని, వివాదాలు పరిష్కారమయ్యేందుకు ఈనెల 23న చారిత్రక ఒప్పందం జరగనుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రాజెక్టులకు సంబంధించి జూలై 15నే ఒప్పందం జరగాల్సి ఉన్నా..కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ప్రాజెక్టులపై మహారాష్ట్రతో వివాదాలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈనెల 23న జరిగే సమావేశంలో ఈ అంశం ఓ కొలిక్కి రానుంది.

06:44 - July 3, 2016

హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టులపై తెలంగాణ-మహారాష్ట్ర మధ్య మహా ఒప్పందానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు డీపీఆర్‌ రెడీ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రుల సమావేశం ఖరారైన నేపథ్యంలో తుమ్మిడిహట్టి, కాలేశ్వరం, కొరటా చనాఖా బ్యారేజీలు పూర్తి చేయడంపై ఇరిగేషన్‌ శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈనెల 15న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందం చేసుకోనున్నారు. దీని కోసం ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలపై కేసీఆర్‌ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.

మేడిగడ్డ..
ఇక మేడిగడ్డ దగ్గర తెలంగాణ నిర్మిస్తున్న బ్యారేజీకి మహారాష్ట్ర సర్కార్‌ ఇప్పటికే హైడ్రాలజీ అనుమతులిచ్చింది. దీంతో కీలక అంకం పూర్తయింది. తెలంగాణ పంపిన ప్రాజెక్టు డిజైన్లపై ఇప్పటికే మహారాష్ట్ర ఇంజనీర్లు, ఇరు రాష్ట్రాల సీడీవోల సంయుక్త భేటీలో అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ వల్ల మహారాష్ట్రలో కేవలం 55 హెక్టార్లు మాత్రమే ముంపు ఉండడంతో పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఇరురాష్ట్రాలకు నష్టం లేకుండా.. ప్రయోజనకరంగా ఉండేవిధంగా తెలంగాణ సర్కార్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ మేరకు ఈనెల 15న ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాలేశ్వరం పనులు..
మరోవైపు కాలేశ్వరం పనుల్లో వేగం పెంచాలని హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. 18 నెలల్లో 9 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి.. కేసీఆర్‌కు తెలిపారు. అదేవిధంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం రిజర్వాయర్ల పనులు కూడా వేగం పుంజుకున్నాయి. సబ్‌స్టేషన్ల నిర్మాణానికి భూసేకరణ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక ప్యాకేజీ 6, ప్యాకేజీ-8లకు చెందిన పంపుహౌస్‌లను వచ్చే ఏడాది జులై చివరినాటికి పూర్తి చేయాలని హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్యాకేజీ 10, 11, 12 పంప్‌హౌస్‌లను 2017 సెప్టెంబర్‌ నాటికి, ప్యాకేజీ-20 పంప్‌హౌస్‌ నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నారు.

07:20 - March 21, 2016

హైదరాబాద్ : తెలంగాణ‌లో గోదావ‌రి న‌దిపై నిర్మించ‌ త‌ల‌పెట్టిన ప్రాజెక్టుల విష‌యంలో ఎవ‌రెన్ని విమ‌ర్శలు చేసినా ప‌ట్టించుకోకుండా జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్తోంది సర్కార్. ఒక వైపు మహారాష్ట్రతో ఒప్పందం పై అసెంబ్లీలో విప‌క్షాలు విరుచుకుప‌డుతుంటే...అవేమి ప‌ట్టన‌ట్లు సీఎం కేసిఆర్ త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. ఇటీవ‌ల మ‌హారాష్ట్రతో చర్చలు సఫలం కావడంతో..  త్వర‌లోనే మ‌హారాష్ట్ర సీఎం ను తెలంగాణ కు ఆహ్వానించిన‌ట్లు తెలిపారు. ఎవ‌రు అడ్డుప‌డిన మేడిగ‌డ్డ,కాళేశ్వరం నిర్మించి తీరుతామ‌ని స్పష్టం చేశారు.
బ్యారేజీల పై విప‌క్షాలు అభ్యంతరాలు 
గోదావరిపై నిర్మించాలనుకుంటున్న బ్యారేజీల పై విప‌క్షాలు అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నా కేసీఆర్ సర్కార్ తమ దైన స్టైల్ లో దూసుకెళ్లోంది. మ‌హారాష్ట్రతో చేసుకునే ఒప్పందంలో అనేక ఇబ్బందులు ఉన్నాయ‌ని ప్రతిపక్షాలు  ఆరోపిస్తున్నాయి. దీని పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల‌ని ఎంత కోరిన ప‌ట్టించుకోవ‌డం లేదని ఆరోపిస్తున్నాయి. కానీ ఇటు ప్రభుత్వం మాత్రం ఇవేమి ప‌ట్టన‌ట్లుగా త‌న ప‌ని తాను చేసుకుపోతుంది.
కరీంనగర్ జిల్లాలో రైతుల పాదయాత్ర
గోదావ‌రి పై నిర్మించ త‌ల పెట్టిన ప్రాజెక్టుల‌తో త‌మ ప్రాంతాలు సస్యశ్యామ‌లం అవుతాయ‌ని ...దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్నిఅభినందిస్తూ కరీంనగర్ జిల్లా రైతులు పాదయాత్ర నిర్వహించారు. క‌రీంనగర్ నుంచి హైద్రాబాద్ లోని సీఎం క్యాంపు కార్యాల‌యం వ‌రకు  210 కి.మీ  రైతులు యాత్ర చేశారు. ఇత్తడి, వెండి పాత్రల్లో పవిత్ర గోదావరి జలాలను సిఎం కు అందజేశారు. 
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను  ఆహ్వానించిన కేసీఆర్
ఇక మహారాష్ర్ట - తెలంగాణ రాష్ర్టాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి తదుపరి కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ఇందుకు  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి, అధికారులు త్వరలోనే హైదరాబాద్ వస్తున్నారని ముఖ్యమంత్రి  స్పష్టం చేశారు. ఈ ఎండాకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలు నిర్మిస్తామని సిఎం స్పష్టం చేశారు. పొరుగు రాష్ర్టంతో గత పాలకులు పరిష్కరించలేని దశాబ్దాల నీటి జగడానికి తెరపడడంతో తనకు ఎంతో ఆనందంగా వుందన్నారు సీఎం. 
కోటి ఎకరాలను సాగు నీరిస్తానన్న కేసీఆర్
తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొనాల్సిన చారిత్రక అవసరాన్ని కరీంనగర్ వాసుల పాదయాత్ర ప్రజలకు మరోసారి గుర్తు చేసిందన్నారు సీఎం. ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో తమకు పుట్టగతులు లేకుండా పోతాయనే నిరాశతో ప్రతిపక్ష నేతలు అడ్డగోలు వాఖ్యానాలు చేస్తున్నారని మండిపడ్డారు.  తెలంగాణకు సాగునీళ్లు అందివ్వాలనే చిత్తశుద్ది ప్రతిపక్షాలకు  యేనాడూ లేదన్నారు. ప్రాజెక్టులు కట్టుకోని ముందుకు పోకుండా ప్రాజెక్టు ఎత్తు పేరుతో సమస్యను సృష్టించి సాగతీయడం గత పాలకుల నైజమన్నారు. దాదాపు కోటి ఎకరాలకు సాగునీరు అందించి తెలంగాణను సస్యశ్యామలం చేసి వలస రహిత  తెలంగాణను తీర్చి దిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం తెలిపారు. రైతులు తెచ్చిన పవిత్ర గోదావరి జలాలలను స్వీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పాదయాద్రకు నాయకత్వం వహించిన జల్లేపల్లి రైతులు శాలువాతో సత్కరించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణను సస్యశ్యామలం చేసి తీరుతానని కేసీఆర్ అన్నార.  

Pages

Don't Miss

Subscribe to RSS - devendra fadnavis