delhi

16:50 - September 21, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర సూది మొనంతైనా లేదంటూ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నుంచి కౌంటర్ మొదలైంది. ఈ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంపై గులాం నబీ ఆజాద్ తప్పుగా మాట్లాడుతున్నారనీ..అది సరికాదని మండిపడ్డారు.  ప్రాణాలకు తెగించి ప్రజలు పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారని..కేసీఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్రంపై బురద  చల్లేందుకు యత్నిస్తు లేనిపోని వ్యాఖ్యలు చేయటం సరికాదని మంత్రి హరీశ్ రావు ఆజాద్‌పై తీవ్రంగా మండిపడ్డారు. 
తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రజలు తిరగబడితే, కేసీఆర్ దీక్ష చేయడం వల్లే కొత్త రాష్ట్రం ఏర్పాటుకు నాడు కాంగ్రెస్ అంగీకారం తెలిపిందని అన్నారు. టీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేవారా? అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? ఈ ప్రశ్నకు ఆజాద్ సమాధానం చెప్పాలి? అంటూ హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

 

11:29 - September 21, 2018

ఢిల్లీ : భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రం గురువారం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఆమె మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన పురందేశ్వరి ప్రస్తుతం మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు.

 

20:57 - September 20, 2018

ఢిల్లీ : ప్రతిభకు తగిన గుర్తింపు వుంటే అది మరింతగా రాణిస్తుంది. ప్రతిభను ప్రోత్సహిస్తే మరింతగా విజయాలను అందుకుంటుంది. ప్రోత్సాహం వుంటే ఎంతటివారైనా విజయాలను అందుకోవచ్చు. విజయకేతనాలను ఎగురవేయవచ్చు. ఈనేపథ్యంలో క్రీడల్లో రాణించినవారికి అవార్డులను ఇచ్చి ప్రోత్సహించేందుకు ప్రకటించే అర్జున అవార్డుల బాజితాను కేంద్ర  మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 
వివిధ క్రీడా రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర క్రీడాశాఖ ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే అర్జున అవార్డు గ్రహీతల విడుదల చేసింది. 2018లో వివిధ క్రీడా రంగాలకు చెందిన 20 మంది క్రీడాకారులు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ నెల 25న రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. కాగా ఈ ఏడాది ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డును టీం ఇండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెయిట్ లిఫ్టర్ మీరా భాయ్ చాను అందుకోనున్నారు. ఇంకా అథ్లెటిక్స్-జావెలిన్ త్రో నీరజ్ చోప్రా, జిన్‌సన్ జాన్సన్ (అథ్లెటిక్స్- స్ప్రింటర్),హిమదాస్,(అథ్లెటిక్స్-స్ప్రింటర్),ఎన్.సిక్కీ రెడ్డి (బ్యాడ్మింటన్),సతీష్ కుమార్ (బాక్సింగ్),స్మృతి మందన్న (క్రికెట్),శుభంకర్ శర్మ (గోల్ఫ్),మన్‌ప్రీత్ సింగ్ (హాకీ),సవితా (హాకీ),కల్నల్ రవీ రాథోడ్ (పోలో),రహీ సర్నోబత్ (షూటింగ్),అన్‌కూర్ మిట్టల్ (షూటింగ్),శ్రేయసీ సింగ్ (షూటింగ్),మానికా బత్రా (టేబుల్ టెన్నీస్),జీ.సథియన్ (టేబుల్ టెన్నీస్),రోహన్ బొపన్న (టెన్నీస్),సుమిత్ (రెజ్లింగ్),పూజా కడియన్ (వూషూ),అన్‌కూర్ ధర్మ (ప్యారా అథ్లెటిక్స్),మనోజ్ సర్కార్ (ప్యారా బ్యాడ్మింటన్) అర్జున అవార్డులు సాధించారు. 

 

14:43 - September 20, 2018

ఢిల్లీ : ప్రస్తుత రోజుల్లో అన్నింటి ధరలు సామాన్యుడి చుక్కలు చూపిస్తున్నాయి. అసలే పెట్రోలు ధరలు పెరిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్న నేపథ్యంలో సామాన్యుడి ప్రయాణ సాధనాల్లో ఒకటి అయిన రైల్‌లో కనీసం ఒక్క టీగానీ, కాఫీగానీ తాగాలంటే కూడా అదనపు డబ్బులు చెల్లించుకుంటేనే గానీ గొంతులో టీ నీళ్లు పడే అవకాశం లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియాలోని రైళ్లలో టీ, కాఫీల ధరను పెంచుతున్నట్టు ఐఆర్సీటీసీ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రస్తుతం రూ. 7గా ఉన్న ధరను రూ. 10కి పెంచుతున్నామని తెలిపింది. డిప్ టీ కాకుండా, మామూలు టీని రూ. 5కే అందిస్తామని రైల్వే బోర్టు పేర్కొంది. 

 

14:19 - September 20, 2018

ఢిల్లీ : పాకిస్థాన్‌పై  టీమ్ఇండియా ప్ర‌తీకారం తీర్చుకుంది. ఉత్కంఠ‌గా సాగుతుంద‌నుకున్న మ్యాచ్‌ను భార‌త్ బౌల‌ర్లు ఏక‌ప‌క్షంగా మార్చేశారు. భువ‌నేశ్వ‌ర్‌, కేదార్ జాద‌వ్ బౌలింగ్ ధాటికి  పాకిస్థాన్‌ను కేవ‌లం 162 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. భార‌త్ స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని సునాయ‌సంగా ఛేదించింది. 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఓపెన‌ర్ రోహిత్‌శ‌ర్మ హాఫ్ సెంచ‌రీ చేసి విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. భువ‌నేశ్వ‌ర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ద‌క్కింది.
ఉత్కంఠ లేదు..పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ మెరుపులూ లేవు...దాయాది బౌల‌ర్ల ఆట‌లూ సాగ‌లేదు..ఒక్క‌మాట‌లో చెప్పాలంటే వార్ వ‌న్‌సైడ్ అయింది. అభిమానులు సైతం పాకిస్థాన్‌ను భార‌త్ ఇంత చిత్తుగా ఓడిస్తుంద‌ని ఊహించ‌లేదు. గ‌త మ్యాచ్‌లో హాంకాంగ్ ఎత్తిచూపిన లోపాల‌ను స‌వ‌రించుకున్న రోహిత్ సేన‌...పాకిస్థాన్‌కు ఏమాత్రం చాన్స్ ఇవ్వ‌లేదు. స‌మ‌ష్టిగా ఆడి విజ‌యం సాధించింది.

టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకోగానే, భార‌త్‌కు అదిరిపోయే టార్గెట్‌ను ఇస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ భార‌త్ పేస్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్‌కుమార్ ఆదిలోనే ఓపెన‌ర్ల వికెట్ల ప‌డ‌గొట్టి పాక్‌ను దెబ్బ‌తీశాడు. చాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్‌పై సెంచ‌రీ చేసిన ఫ‌క్హ‌ర్ జ‌మాన్ ను ఈసారి భువీ డ‌కౌట్ చేశాడు. 3 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయిన పాక్‌ను బాబార్ అజామ్‌, షోయ‌బ్ మాలిక్ ఆదుకున్నారు. ఈ ఇద్ద‌రూ మూడో వికెట్‌కు 82 ప‌రుగులు జోడించారు. ఇన్నింగ్స్ 18వ ఓవ‌ర్‌ బౌలింగ్ వేస్తున్న స‌మ‌యంలో హార్దిక్ పాండ్య పిచ్‌పై కుప్ప‌కూలాడు. వెన్నుముక కింది భాగంలో భ‌రించ‌లేని నొప్పి ఉండ‌టంతో క‌ద‌ల్లేక అలాగే ఉండిపోయాడు. దీంతో అత‌డిని స్ట్రెచ్చ‌ర్‌పై మైదానం నుంచి బ‌య‌ట‌కు తీసుకెళ్లారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న హార్దిక్ కొంత మేర కోలుకున్న‌ట్టు తెలిసింది. 

మ‌రోవైపు పాకిస్థాన్ కుదురుకుంటున్న స‌మ‌యంలో కుల్దీప్ యాద‌వ్ చావుదెబ్బ కొట్టాడు. బాబ‌ర్ అజామ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి భార‌త్‌కు బ్రేక్ అందించాడు. ఆ వెంట‌నే షోయ‌బ్ మాలిక్‌ను  రాయుడు ర‌నౌట్ చేశాడు. పార్ట్ టైమ్ బౌల‌ర్ కేదార్ జాద‌వ్ ఎంట్రీతో పాకిస్థాన్ బ్యాటింగ్ లైన‌ప్ కుప్ప‌కూలింది. స‌ర్ఫ‌రాజ్‌, ఆసిఫ్ అలీ, ష‌ద‌బ్ ఖాన్ ల‌ను జాద‌వ్‌ వెంట‌వెంట‌నే ఔట్ చేయ‌డంతో పాక్ కోలుకోలేక‌పోయింది. ఆఖ‌ర్లో ఫ‌హీమ్‌, అమీర్ కాసేపు పోరాడ‌టంతో ఆ మాత్రం స్కోరైనా వ‌చ్చింది. బుమ్రా త‌న‌దైన స్టైల్లో టెయిలెండ‌ర్ల‌ను ఔట్ చేసి పాకిస్థాన్ ఇన్నింగ్స్‌కు ముగింపు ప‌లికాడు. పాకిస్థాన్ 43.1 ఓవ‌ర్‌లో 162 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. భార‌త్ బౌల‌ర్లలో జాద‌వ్‌, భువ‌నేశ్వ‌ర్‌కు చెరో మూడు వికెట్లు ద‌క్కాయి. పాక్ ఇన్నింగ్స్‌లో బాబార్ అజామ్ సాధించిన 47 ప‌రుగులే అత్య‌ధిక స్కోరు.

163 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్‌తో క‌లిసి ఇన్నింగ్స్‌కు బ‌ల‌మైన పునాది వేశాడు. రోహిత్ సిక్స‌ర్లు, ఫోర్ల‌తో పాక్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. 36 బంతుల్లో 3 సిక్స‌ర్లు, 6 ఫోర్ల‌తో హాఫ్ సెంచ‌రీ సాధించాడు. ఆ త‌ర్వాత రోహిత్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ ఔటైన త‌ర్వాత ధావ‌న్‌కు, రాయుడు జ‌త‌క‌లిశాడు. ఈ ఇద్ద‌రూ స్కోర్ బోర్డును ముందుకు న‌డిపారు. 46 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ధావ‌న్ ఔట‌య్యాడు. ఐతే రాయుడు, దినేశ్ కార్తీక్ పాక్ బౌల‌ర్ల‌ను అల‌వోక‌గా ఎదుర్కొని ప‌రుగులు సాధించారు. షోయ‌బ్ మాలిక్ వేసిన ఇన్నింగ్స్ 29వ ఓవ‌ర్‌లో కార్తీక్ ఒక ఫోర్ కొట్టి విజ‌యానికి చేరువ చేయ‌గా..రాయుడు సైతం ఫోర్ బాది ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చాడు. మ‌రో 126 బంతులు మిగిలి ఉండ‌గానే భార‌త్ ల‌క్ష్యాన్ని ఛేదించింది. వ‌న్డేల్లో పాకిస్థాన్‌పై భార‌త్‌కు ఇదే అతిపెద్ద విజ‌యం. 

10:20 - September 20, 2018

ఢిల్లీ : భారతదేశంలో నివసిస్తున్న వారంతా..గుర్తింపు ఉన్న భారతీయులేనన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్. కులతత్వంపై ఆర్ఎస్ఎస్ కు నమ్మకం లేదన్న ఆయన...కులమతాలకు అతీతంగా అందరూ ఎదగాల్సిన అవసరముందన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతికి రిజర్వేషన్లు అవసరమేనన్న భగవత్...రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఎప్పటివరకు కొనసాగాలనేది వారే నిర్ణయించుకోవాలని చెప్పారు. 
హిందూలందర్ని ఐక్యంగా ఉంచడానికే ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్‌ మోహన్ భగవత్. డిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ ముగింపు సమావేశాల్లో మోహన్ భగవత్ కీలకోపన్యాసం చేశారు. దేశంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి రిజర్వేషన్లు అవసరమేనని స్పష్టం చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. రిజర్వేషన్ విధానానికి సంఘ్ మద్దతిస్తుందన్న ఆయన.... ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేయరాదని చెప్పుకొచ్చారు. 

భారతదేశంలో నివసిస్తూ భారతీయులుగా గుర్తింపు ఉన్న వారంతా హిందువులేనని భగవత్ అన్నారు. అంతా మనవాళ్లే, అంతా కలిసిమెలిసి ఉండాలన్నదే భారతీయ సిద్ధాంతమన్న ఆయన...ఐక్యతను ప్రతి హిందువు నమ్ముతాడన్నారు. భారతీయులంతా హిందువులేన్న భగవత్... హిందువులందరినీ ఐక్యంగా ఉంచడానికే ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. హిందూ దేశం అంటే ముస్లింలకు స్థానం లేదని అర్థం చేసుకోరాదన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ ఎదగాల్సిన అవసరం ఉందన్నారు మోహన్ భగవత్, కులతత్వంపై ఆర్ఎస్ఎస్‌కు నమ్మకం లేదన్న ఆయన...అన్నిమతాలు సమానమేనని, మత మార్పిడులు అవసరం లేదన్నారు. మతమార్పిడుల కోసం మతాన్ని ఉపయోగించుకోరాదన్నారు. అసలు మతమార్పిడుల అవసరం ఏముందున్నారు. గోసంరక్షణ పేరుతో సాటి మనుషులను కొట్టిచంపడం సమర్ధనీయం కాదన్న ఆయన... మూకుమ్మడి హింసాకాండలు జరగరాదన్నారు.

20:23 - September 19, 2018

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ పై మరోసారి దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి.  ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ తీసుకురావడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇది ముస్లిం మహిళలకు వ్యతిరేకమైన ఆర్డినెన్స్ అని అన్నారు. ఆర్డినెన్స్‌తో ముస్లిం మహిళలకు న్యాయం చేకూరదని వ్యాఖ్యానించారు. ఇస్లాంలో వివాహం అనేది ఓ సివిల్ కాంట్రాక్ట్ అని, ఇందులో ప్యానెల్ ప్రొవిజన్లు తీసుకురావడం తప్పని ఒవైసీ అన్నారు. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు.
'ఈ ఆర్డినెన్స్ రాజ్యంగ విరుద్ధం. రాజ్యాంగం పేర్కొంటున్న సమాన హక్కుల విషయాన్ని ముస్లింలకు మాత్రమే వర్తింపజేయడం రాజ్యంగ విరుద్ధమే అవుతుంది. ఆ ఆర్డినెన్స్‌ను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, మహిళా సంస్థలు సవాలు చేయాలి' అని ఒవైసీ పిలుపునిచ్చారు. మరోపక్క ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసమే ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ట్రిపుల్ తలాక్ ను బీజేపీ పొలిటికల్ గేమ్ గా వాడుకుంటోందని కాంగ్రెస్ నేత కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా విమర్శించారు. 

 

15:45 - September 19, 2018

ఢిల్లీ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్రంలో గడువు కంటే ముందే ఎన్నికలు నిర్వహించడం వల్ల పౌరులకు నష్టమని పేర్కొంటూ సిద్ధిపేటకు చెందిన పోతుగంటి శశాంక్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

తెలంగాణలో సాధారణ ఎన్నికల సమయానికి దాదాపు 20లక్షల మందికి పైగా యువత ఓటుహక్కు పొందేందుకు అవకాశముంటుందని... ముందస్తు ఎన్నికల వల్ల వారంతా ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసే విధంగా ఉందన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న ప్రభుత్వమే అధికారంలో ఉందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. స్వయంగా ముఖ్యమంత్రే.. ఎన్నికల సంఘంతో మాట్లాడిన తర్వాతే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పడం అర్థరహితమన్నారు. ఫలానా సమయంలో ఎన్నికలు జరుగుతాయని, మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి, రాజకీయ సంక్షోభం లేకపోయినా... కేవలం రాజకీయ పరమైన లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైందని పిటిషనర్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలను దృష్టిలోకి తీసుకుని తెలంగాణలో గవర్నర్‌ పాలన విధించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని.. అప్పటివరకు గవర్నర్‌ పాలన అమల్లో ఉండటం వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందని పిటిషనర్‌ అభిప్రాయపడ్డారు.

15:16 - September 19, 2018

సన్ని లియోన్...బాలీవుడ్ అందాలతారల్లో ఈమె ఒకరు. జిస్మ్2తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ భామ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.  ఆమె కెరీర్ ప్రారంభం రోజుల్లో ఆమె ఫోర్న్ స్టార్ అనే విషయం తెలిసిందే. తన అందచందాలు..నటనతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఓ మ్యూజియాన్ని సందర్శించింది. తమ అభిమాన తారను చూడాలని ఎంతో మంది మ్యూజియానికి పోటెత్తారు. దీనితో ఆమెకున్న క్రేజ్ కు పోలీసులు విస్తుపోయారంట. 
మంగళవారం ఢిల్లిలోని టుస్సాడ్స్ మ్యూజియంలో సన్ని లియోన్ మైనపు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సన్నీ అక్కడకు చేరుకున్నారు. ఆ విగ్రహం ప్రక్కనే సన్నీ నిలిచి ఫోజునిచ్చింది.ఈ  ఫొటోను అభిమానులకు సోషల్ మీడియాలో  షేర్ చేసింది.

11:42 - September 19, 2018

ఢిల్లీ : చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ప్రతిష్టాత్మక పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్ ను తన వైపు తిప్పుకునే మ్యాచ్ పై అంతటా ఉత్కంఠ రేపుతోంది. క్రికెట్ ప్రేమికులను కనువిందు చేయడానికి దాయాది జట్లు రెడీ అయ్యాయి. ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్...ఓటమికి బదులు తీర్చుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏడాది తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ పోరుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్‌లో భాగంగా గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడనున్నాయి. రెండు జట్లు తలపడే అరుదైన మ్యాచ్‌లనూ ఏ క్రికెట్‌ అభిమానీ చూడకుండా ఉండలేడు. కేవలం రెండు దేశాల అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులందరూ ఈ మ్యాచ్‌పై ఆసక్తి చూపిస్తారు. గత ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీలో రెండు జట్లూ తలపడగా.. భారత్‌పై పాక్‌ భారీ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు పాక్‌ను ఓడించడం భారత్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది.

పటిష్టమైన బౌలింగ్ ఉన్న పాకిస్తాన్ భారత్ బ్యాట్స్ మెన్లు ఎలా ఎదుర్కొంటారన్న ఆసక్తికరంగా మారింది. ఓపెనర్లు రోహిత్‌, ధావన్‌ ఎలాంటి ఆరంభాన్నిస్తారన్నది కీలకంగా మారింది. హాంకాంగ్ పై రాణించిన ధావన్, అంబటి రాయుడుతో పాటు ఇతర బ్యాట్స్ మెన్లు రాణిస్తే...భారత్ జట్టు సునాయసంగా గెలుస్తుంది. బౌలింగ్ లో భువీ, కుల్దీప్, చాహల్ రాణిస్తే పాకిస్తాన్ కు కష్టాలు తప్పవు. 

Pages

Don't Miss

Subscribe to RSS - delhi