dead

12:59 - October 10, 2018

చత్తీస్‌గఢ్‌ : పరిశ్రమల్లో అగ్రిప్రమాదాలు సంభవించి తొమ్మిది మంది మృతి చెందిన ఘటన స్థానికింగా భయాందోళనలకు గురిచేసింది. కర్మాగారంలోని గ్యాస్ పైపులైను పేలడంతో భిలాయ్ ఉక్కు పరిశ్రమలో సంభవించిన ఘోర ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. కర్మాగారంలోని గ్యాస్ పైపులైను పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్లాంటులోని కోక్ ఓవెన్ సెక్షన్ సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం సంభవించింది. ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్నవెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు దుర్గ్‌ రేంజ్‌ ఐజీ జీపీ సింగ్‌ వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లో 24 మందికిపైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది.
 

13:11 - October 7, 2018

హైదరాబాద్ : ఠాగూర్ సినిమాలోని ఆస్పత్రి సీన్ గుర్తుందా.. శవానికి వైద్యం చేసినట్లు డాక్టర్లు నటించడం. సేమ్ అదే సీన్ హైదరాబాద్‌లో జరిగింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థి చనిపోయిన విషయాన్ని కటుంబ సభ్యులకు చెప్పకుండా వైద్యం చేస్తున్నట్లుగా వైద్యలు నటించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. శస్త్ర చికిత్స చేస్తుండగా విద్యార్థి మ‌ృతి చెందాడు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వరకు డాక్టర్లు హడావిడి చేశారు. చివరికి మృతి చెందాడని చెప్పారు. 

సాత్విక్ రెడ్డి అనే విద్యార్థి కూకట్ పల్లిలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఆరోగ్యం బాగాలేకపోతే నిన్న మధ్యాహ్నం కూకట్ పల్లిలోని ల్యాండ్ మార్క్ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ టెస్టులు చేసుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి కొంపల్లిలోని శ్రీకర ఆస్పత్రికి వెళ్లాడు. కొన్ని పరీక్షల అనంతరం యువకుడికి అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. అందుకు వారు అంగీకరించారు. సాయంత్రం 5 గంటలకు సాత్విక్ రెడ్డికి వైద్యులు శస్త్ర చికిత్స ప్రారంభించారు. అయితే అతనికి అనస్తీషియా ఇచ్చిన డాక్టర్ డ్యూటీ అయిపోయిందంటూ హడావిడిగా ఆపరేషన్ మధ్యలోనే వెళ్లిపోయాడు. అతని స్థానంలో సబంధంలేని మరో డాక్టర్ వచ్చాడు. ఈ నేపథ్యంలో శస్త్ర చికిత్స చేస్తుండగానే సాత్విక్ రెడ్డి మృతి చెందాడు. అయితే అతడు మరణించిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా సాయంత్రం 5 గంటల నుంచి వైద్యం చేస్తున్నట్లు హడావిడి చేసి.. రాత్రి 10 గంటలకు సాత్విక్ రెడ్డి మరణించాడని అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆపరేషన్ చేస్తుండగా గుండెపోటు రావడంతో చనిపోయాడని తెలిపారు. కాగా సాయంత్రం 7 గంటలకే అతను మరణించినట్లు ఈసీజే రిపోర్టు రావడం గమనార్హం. 

అయితే సాయంత్రం 7 గంటలకు సాత్విక్ రెడ్డి బాగానే ఉన్నాడని, చికిత్స చేస్తున్నామని చెప్పి..రాత్రి 10 గంటలకు మరణించాడని వైద్యులు చెప్పారని అతని కుటుంబ సభ్యులు వాపోయారు. సంబంధంలేని ఆపరేషన్ చేయడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థి చనిపోయాడని అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

 

22:23 - September 11, 2018

జగిత్యాల : జిల్లా కొండగట్టు బస్సు ప్రమాదానికి కారణాలేంటీ ? భారీ స్థాయిలో మృతుల సంఖ్య పెరగడానికి...డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా ? లేదంటే ఘాట్ రోడ్డులోని చివరి మలుపు కొంపముంచిందా ? ఘాట్ రోడ్డయినప్పటికీ....పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నారా ? 

గతంలో ఎన్నడూ చోటు చేసుకొని...వినని విషాదమిది...ఒకరు కాదు ఇద్దరు కాదు...పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లోకి...జగిత్యాల జిల్లాలోనే అతి పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం...కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లు...బస్సు ప్రమాదానికి కారణాలెన్నో. బస్సు చాలా పాతది కావడంతో పాటు కండీషన్ లో ఉందా లేదా అనేక సందేహాలకు తావిస్తోంది. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు చాలా పాతది కావడంతోనే ప్రమాదం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.

మంగళవారం కావడంతో ఎక్కువ మంది భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో...పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఎక్కారు. కొండగట్టు చివరి మలుపు వద్ద ప్రయాణికులందరూ డ్రైవర్‌ వైపు ఒరగడంతో...ఒకవైపే బస్సులో బరువు పెరిగింది. దీంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. బస్సు మరో నిమిషంలో ప్రధాన రహదారికి చేరుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదం జరిగిన ఘాట్ రోడ్డులో....బస్సు వెళ్లేందుకు అనుకూల పరిస్థితులు లేవంటున్నారు. అయితే పోలీసులు మాత్రం....అలాంటిది ఏమీ లేదని చెబుతున్నారు.

మరోవైపు ప్రమాదం సమయంలో బస్సును డ్రైవింగ్ చేసిన శ్రీనివాస్...ఘాట్ రోడ్ల డ్రైవింగ్ లో మంచి ప్రావీణ్యం ఉంది. తెలంగాణ ఆర్టీసీ నుంచి ఉత్తమ డ్రైవర్ గా ఇటీవలే అవార్డు కూడా అందుకున్నారు. బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో...ముందువైపు మొత్తం ధ్వంసమైంది. డ్రైవర్ సీట్లో కూర్చున్న శ్రీనివాస్ తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించినా...ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ డ్రైవర్ శ్రీనివాస్ మృతి చెందారు.  

21:51 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి...లోయలోకి దూసుకెళ్లడంతో 57 మృతి చెందారు. గాయపడ్డ క్షతగాత్రులకు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాదంపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు.
తప్పి లోయలో పడిన బస్సు 
కొండగట్టు ఘాట్ రోడ్డు నుంచి కిందికి దిగుతున్న బస్సు....చివరి మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడింది. దీంతో పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి కొందరి తీవ్ర గాయాలు కావడంతో...ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కరీంనగర్, హైదరాబాద్ కు తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతులు బంధువులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటన స్థలంలో తమ బంధువులను చూసి....కన్నీరుమున్నీరయ్యారు.
ఊపిరాడక పలువురు అక్కడికక్కడే మృతి 
బస్సు లోయలో పడటంతో ఊపిరాడక పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది పెద్దపల్లి, జగిత్యాల జిల్లా వాసులు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక యువకులు సహాయ చర్యల్లో పాల్గొని...ఆసుపత్రులకు తరలించారు. జగిత్యాల ఆస్పత్రి మొత్తం మృతుల బంధువులతోనే నిండిపోయింది. తమ వారి మృతదేహాలను...కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. 
ప్రమాదంపై కేసీఆర్, గవర్నర్ దిగ్భ్రాంతి 
కొండగట్టు రోడ్డు ప్రమాదంపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహాన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన కేసీఆర్...క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతులకు కుటుంబాలకు 5లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. తాజా మాజీ మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, మహేందర్ రెడ్డిలు...క్షతగాత్రులను పరామర్శించి...వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆర్టీసీ తరపున 3లక్షల రూపాయలు సాయం అందిస్తామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ , మహేశ్వర్ రెడ్డిలు పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పోస్టు మార్టం పూర్తి కావడంతో మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు ట్రాక్టర్ లో తరలించారు.

 

16:26 - September 8, 2018

జీవితం అనేది అందరికి వడ్డించిన విస్తరికాదు. కష్టంతో, కమిట్ మెంట్ తో..కష్టాన్నే ఇష్టంగా మార్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తి చిన్ని చిన్నివాటికే బేజారైపోయి జీవితాన్ని నాశనం చేసుకుని ఆఖిరి ఆ జీవితాన్నే అంతం చేసుకునే పరిస్థితులకు దిగజారిపోతున్న నేటితరం యువతను చూస్తుంటే ఆత్మస్థైర్యం తగ్గిపోతుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే ఉన్నత స్థానాన్ని అధిరోహించి కోట్లాది మంది సంగీత అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ అమెరికన్‌ ర్యాప్‌ సింగర్ మ్యాక్‌ మిల్లర్ మృతి చెందాడు. డ్రగ్స్‌ మోతాదు అధికం తీసుకోవటంతో తన 26 ఏళ్ల వయసులోనే మిల్లర్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. చిన్ననాటే పెద్ద పేరు..ప్రేమలో పడటం..ప్రియురాలితో బ్రేకప్‌...హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అరెస్టులు వంటి పలు సమస్యలతో మిల్లర్ తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఈ ర్యాపర్‌ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. లాస్‌ ఏంజిల్స్‌లోని తన నివాసంలో ఆపస్మారక స్థితిలో పడివున్న మ్యాక్‌ మిల్లర్ ను కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించేసరికే డ్రగ్స్ మోతాదు ఎక్కువ కావటంతో అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ తెలిపారు.

ప్రియురాలు అరియానా గ్రాండే తనకు బ్రేఇకప్ చెప్పి అమెరికా కమేడియన్‌ పిటె డేవిడ్సన్‌తో ఎగేజ్ మెంట్ ఫిక్స్ చేసుకోవడాన్ని మ్యాక్‌ మిల్లర్ తట్టుకోలేకపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమెతో విడిపోయినప్పటి నుండి మిల్లర్ తీవ్రంగా కృంగిపోయాడని..తన చివరి ఇంటర్వ్యూలో కూడా మిల్లర్ డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలిపాడు.

21:45 - July 10, 2017

నాగపూర్ : మహారాష్ట్రలోని నాగపూర్‌లో విషాదం నెలకొంది. కలమేశ్వర్‌ ప్రాంతంలోని వీనా డ్యామ్‌కు విహారయాత్రకు వచ్చిన కొంతమంది యువకులు పడవ మునిగి గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా ఏడుగురు గల్లంతయ్యారు. 11మంది యువకులు విహారయాత్ర కోసం ఆదివారం వీనా డ్యామ్‌కు వచ్చారు. సాయంత్రం సమయంలో బోట్‌ రైడింగ్‌ చేస్తుండగా... పడవ ఒక్కసారిగా మునిగిపోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ముగ్గురిని కాపాడారు. ఇప్పటి వరకు ఒకరి మృతదేహాన్ని గుర్తించగా.. మరో ఏడుగురు గల్లంతైనట్లు నిర్దారించారు. గజ ఈతగాళ్లతో కూడిన రెండు బృందాలు కూడా గాలింపు చేపట్టాయి. అయితే పడవ ఎలా మునిగిపోయిందో ఇంకా స్పష్టతరాలేదని అధికారులు చెప్తున్నారు. 

13:22 - July 9, 2017

విశాఖ : జిల్లా నాతవరం మండలం నాయుడుపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఏలేరు కాలువ గట్టుపై సైకిల్‌ తొక్కుతూ ఇద్దరు పిల్లలు కాలువలో పడ్డారు. నీళ్లలో మునిగి తరుణ్‌ రమేష్‌, సతీష్‌ మృతి చెందారు.

 

13:54 - June 24, 2017

కొమురం భీం ఆసిఫాబాద్‌ : జిల్లా చింతలమానేపల్లి మండలంలో.. విషాదం చోటు చేసుకుంది. బాలాజీ అనకోడ గ్రామంలో, పొలంలోని వ్యవసాయ బావిలో పడి.. ఏడేళ్ల వయస్సున్న బాలుడు మృతి చెందాడు. నిర్లక్ష్యానికి బాలుడి ప్రాణం బావిలో కలిసింది. ఆత్మరావు-పెంటక్క దంపతుల కుమారుడు గణేశ్‌.. తన తాత రామయ్యతో కలిసి పొలానికి వెళ్లాడు. గణేశ్‌ ఆడుకుంటుండటంతో.. అందరూ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఇంటికెళ్తానని చెప్పి వెళ్లిన బాలుడు.. ఇంటికి వెళ్లే సరికి అక్కడ లేడు. చివరకు పొలం దగ్గర ఉన్న బావిలో గణేశ్‌ మృతదేహం దొరికింది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేశారు. 

15:40 - May 7, 2017

చిత్తూరు : జిల్లాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఈత కొలనులో పడి 12ఏళ్ల బాలుడు మృతి చెందాడు. జిల్లా కీడాభివృద్ది అధికారి అనంత లక్ష్మీ ఈత వచ్చే పిల్లలు ఒంటరిగా రావాలని ఆదేశాలివ్వడంతో పిల్లలు ఒంటరిగా ఈత నేర్చుకుంటున్నారు. ఈతకొలను వద్ద పర్యవేక్షణ లేక ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.  దీంతో అనంతలక్ష్మీపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.  నెల్లూరు జిల్లాకు చెందిన రిషి వేసవి కావడంతో బాబాయి ఊరు చిత్తూరుకు వచ్చాడు. 

14:43 - April 5, 2017

హైదరాబాద్: యూపీలోని వారణాసిలో ఉన్న బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థి దారా రాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యూనివర్సిటీ భవనం మూడవ అంతస్థు నుంచి దూకి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని బీహెచ్‌యూ అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై రాజు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ యూనివర్సిటీలోని ఇంజినీరింగ్‌ కాలేజీని కేంద్ర ప్రభుత్వం ఐఐటీగా మార్పు చేసింది. మృతుడు రాజు బీటెక్‌ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. నెల్లూరు జిల్లా నాయుడుపేట స్వగ్రామం. రాజు తండ్రి కృష్ణయ్య నాయుడుపేటలో రైల్వే ఉద్యోగి పని చేస్తున్నారు. రాజు ఇకలేడన్న విషయం తెలుసుకున్న తల్లిందడ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - dead