cpim

16:35 - September 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగబోయే ఎన్నికలపై జనసేనానీ 'పవన్ కళ్యాణ్' దృష్టి సారించారు. ఆదివారం పార్టీ రాజకీయ వ్యవహార కమిటీతో పవన్ సుదీర్ఘంగా చర్చించారు. మాదాపూర్ లోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఎన్నికలపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి ? ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనే దానిపై చర్చించారు. గతంలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో జరిపిన చర్చల వివరాలను పవన్ కు సభ్యులు వివరించారు. తదుపరి చర్చలు పవన్ తో జరపాలని సీపీఎం సభ్యులు పేర్కొన్నారని వారు తెలిపారు. దీనితో చర్చలకు పవన్ అంగీకరించారు. సీపీఎం నేతలను చర్చలకు ఆహ్వానించాల్సిందిగా పవన్ సూచించారు. మంగళ, బుధ వారాల్లో ఈ సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. 

22:09 - May 10, 2018

ఢిల్లీ : మార్క్సిజం అంటే అభివృద్ధికి మూలసూత్రం... మార్క్సిజం అంటే పోరాట ఆలోచనా విధానం.. మార్క్సిజం అంటే  క్యాపిటలిజం వెనుక ఉన్న అసత్యాన్ని నిలదీస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 'ఆసియాఖండం- భారత్‌లో మార్క్సిజం అవసరం ' అనే అంశంపై ఢిల్లీలో జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. అస్ట్రో ఫిజిక్స్‌ నుంచి నానో టెక్నాలజీ వరకు ప్రపంచం సాధిస్తున్న అభివృద్ధి వెనుక మార్క్సిజం ఇమిడి ఉందన్నారు.  ఒకప్పుడు ఆసియా జబ్బుమనిషిగా పేరుపడి.. అత్యంత వెనుకబడిన దేశంగా ఉన్న చైనా.. మార్క్సిజం బాటలో నడిచి నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించిందన్నారు.

 

08:49 - May 3, 2018

హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు బీఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌ ఎస్వీకేలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కలిసొచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోతామన్నారు. సమాజ్‌వాదీపార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ కేసీఆర్‌ నేతృత్వంలోని ఫెడరల్‌ ఫ్రంట్‌లో కలవడం సామాజిక న్యాయానికి అర్థం లేదన్నారు. 
 

 

15:42 - May 2, 2018

హైదరాబాద్ : రానున్న రోజుల్లో బిఎల్ఎఫ్ విస్తృతంగా సమావేశాలు..కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి వెళుతుందని కన్వీనర్ తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిఎల్ఎఫ్ జనరల్ బాడీ సమావేశంలో సుదీర్ఘంగా పలు అంశాలపై చర్చించడం జరిగిందని, బిఎల్ఎప్ లో 28 పార్టీలున్నాయని, భావజాలం ఉన్న పార్టీలు కూడా చేరాలని కోరారు. సీపీఐ పార్టీ ఇంకా చేరలేదని వారితో మాట్లాడుతున్నామని, అందులో భాగంగా మంగళవారం సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తుందని కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన కోదండరాం పేర్కొంటున్నారని తెలిపారు. దీనితో బీఎల్ఎఫ్ కు దూరంగా ఉండాల్సినవసరం లేదని..వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. మందకృష్ణ మాదిగ, బీసీ సంఘం నేత కృష్ణయ్య...ఇతర పార్టీల నేతలతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు.

సమాజ్ వాది పార్టీ నేతలతో చర్చలు జరుపుతామని, ఆ పార్టీకి సంబంధించిన జాతీయ నేత అఖిలేష్ యాదవ్ నగరానికి వచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేయదలిచిన ఫెడరల్ ఫ్రంట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయని, ఒకవేళ మద్దతు పలికితే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా పనిచేసిన వారవుతారని తెలిపారు.

ఇక బిఎల్ఎఫ్ రాబోయే మూడు నెలల పాటు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ప్రజలతో సమావేశాలు..బహిరంగసభలు..ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు..మండలానికి..గ్రామానికి...బూత్ లకు కమిటీలు వేస్తామన్నారు. 17 పార్లమెంటరీ నియోజకవర్గాలకు కమిటీలు ప్రకటించడం జరిగిందని, రంజాన్ మాసంలో ఇఫ్తార్ పార్టీలు నిర్వహించి ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తామని...వారికి రక్షణ ఇచ్చేది కేవలం బిఎల్ఎఫ్ మాత్రమేనని తెలిపారు.

అన్ని యూనివర్సిటీలతో..కాలేజీలకు చెందిన వారు ప్రతి మండలానికి ప్రతి ఐదుగురు చొప్పున 400 మండలాల్లో బిఎల్ఎఫ్ విధానాలు ప్రచారం చేస్తారని తెలిపారు. తెలంగాణ రచ్చ బండ పేరిట సభలు నిర్వహిస్తామని...జులై ఆఖరి తరువాత అసెంబ్లీ స్థాయిలో పదివేల మందికి తగ్గకుండా బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజలకు తెలియచేయాలంటే మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, ఈ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి చేరువయ్యే విధంగా చేయాలని కోరారు.

పార్టీ నేత జలగం వెంకట్రావు మాట్లాడుతూ...అధికారం ఒక్కటే అడగొద్దు అంటున్నారని..కానీ బిఎల్ఎఫ్ మాత్రం అధికారం కోసం పోరాడుదామని పేర్కొంటోందన్నారు. ఓట్లు మావి..సీట్లు మావే..అని, బహుజన ఓట్లన్నీ పడుతాయనే భావిస్తున్నట్లు, ఓసీల్లో కూడా పేదవారు ఉన్నారని..సామాజిక న్యాయం కావాలని కోరుకొనే వారున్నారని వారందరినీ సమదృష్టితో చూడడం జరుగుతుందన్నారు. 

19:35 - May 1, 2018

హైదరాబాద్ : కేరళలో జరిగిన సీపీఐ మహాసభలు విజయవంతమయ్యాయన్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి. మరోసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత హైదరాబాద్‌ వచ్చిన సురవరానికి సీపీఐ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. వామపక్ష శక్తులను ఏకం చేసి... విశాల వేదికను నిర్మించడం ద్వారా బీజేపీని ఓడించాలని మహాసభల్లో నిర్ణయం తీసుకున్నామని సురవరం తెలిపారు. అమిత్‌షా వ్యాఖ్యలు చూస్తుంటే.. కేసీఆర్‌ ఏర్పాటు చేయబోతున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ బీజేపీకి లాభం చేకూర్చేందుకేనని స్పష్టమైందన్నారు సురవరం.

08:33 - April 28, 2018

ఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలపై సీపీఎం సమరశంఖం పూరించింది. వచ్చే నెల 8న డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెరుగులను నిరసిస్తూ దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. పార్టీతోపాటు.. అన్ని అనుబంధ సంఘాలు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని సీపీఎం పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు, బహుళజాతి కంపెనీలకు భారీ రాయితీలనిస్తూ.. సామాన్యులపై భారం మోపుతున్నాయని పొలిట్‌బ్యూరో ఆరోపించింది. చమురు ధరలు పెరగడంతో సామాన్యులకు భారంగా మారిందని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం స్పందించిన వెంటనే ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేసింది. 

07:32 - April 13, 2018

ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇంకా సెగలు పుట్టిస్తోంది. హోదా ఇవ్వాల్సిందేనంటూ రాజకీయ పార్టీలు ఆందోళనలో పాల్గొంటున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. ఏపీ ప్రభుత్వం కేంద్రంపై పలు విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

అధికారం కావాలనే కాంక్ష అక్కడి పార్టీల్లో ఉందని..ప్రజలను ఏదీ ఆకర్షిస్తుంది ? తదితర విషయాలపై రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను బలంగా ఉపయోగపడుతుందని అనుకున్న పార్టీలు ఆ దిశగా వ్యూహాలు రచించాయన్నారు. ప్రస్తుతం హోదాపై మాట్లాడుతున్న పార్టీలు నాలుగేళ్లు ఎందుకు మాట్లాడలేదు ? అని ప్రశ్నించారు. ఇక్కడ వైసీపీ..టిడిపి రెండు పార్టీలు బీజేపీతో మితృత్వం మెంటేన్ చేశాయని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కూడా ఇచ్చాయని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన తరువాత కూడా మద్దతినిచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ వద్దు..హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

హోదా అన్న వారిపై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టిందని, కానీ ఇదే ప్రభుత్వం హోదా కావాలంటూ ప్రజాప్రతినిధులు రోడ్లపైకి వస్తున్నారన్నారు. టిడిపికి కోరిక కలిగినప్పుడే అందరికీ కోరిక కలగాలనే విధంగా వ్యవహరిస్తోందన్నారు. హోదా ముగిసిన అధ్యాయం..అంతకన్నా గొప్పది ప్యాకేజీ అంటూ టిడిపి సవాలక్ష మాటలు చెప్పిందని గుర్తు చేశారు. వామపక్షాలిచ్చిన బంద్ విజయవంతం కాగానే టర్న్ తీసుకుందని తెలిపారు.

ఇందులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తున్నారని కానీ నరేంద్ర మోడీ దుర్మార్గం..అన్యాయం..నమ్మక ద్రోహం చేశాడని అనడం లేదన్నారు. కేంద్రం..బిజెపి అంటూ విమర్శలు గుప్పిస్తారని..ఎక్కడో ఒకసారి మోడీ అంటారని తెలిపారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది....ప్రామీస్ చేసింది మోడీ అని తెలిపారు. ఎక్కడైనా నరేంద్ర మోడీ ద్రోహం చేశాడని పవన్ కళ్యాణ్ అన్నాడా ? అని ప్రశ్నించారు.

కర్నాటకలో ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని జగన్ ఎందుకు పిలుపు ఇవ్వడని సూటిగా ప్రశ్నించారు. వైసీపీకి చంద్రబాబు నాయుడు మాత్రమే శత్రువు..బీజేపీ మాత్రం శత్రువు కాదన్నారు. స్వాతంత్రం ఇవ్వనని బ్రిటీష్...తెలంగాణ ఇవ్వదని కాంగ్రెస్...చెప్పిందని మరి ఎందుకు పోరాడారు ? ఏం చేస్తే హోదా వస్తుందో చెప్పాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఒత్తిడి పెడుతుంటే సాధ్యమయ్యే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా వచ్చే ప్రభుత్వమైనా ఇవ్వాల్సి ఉంటుందని,

కర్నాటక రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే మాత్రం జనతాదళ్ సెక్యూలర్ కాంగ్రెస్...బీజేపీతో కలిసే అవకాశం ఉంటుందని..ఇక్కడ కేసీఆర్ ఆశించింది జరగదు కదా ? అని తెలిపారు. ఆంధ్రా జేఏసీగా ఎందుకు ఏర్పాటు కాదు ? అని తెలిపారు. ఇంకా మరింత విశ్లేషణ కోసం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

22:19 - April 11, 2018
16:50 - April 10, 2018

హైదరాబాద్ : ఖమ్మం నగరంలో భారీ అరుణపతాక రెపరెపలాడింది. సీపీఎం 22వ జాతీయ మహాసభల సందర్భంగా ఖమ్మం నగరంలో అతిపెద్ద ఎర్రజెండాను ప్రదర్శించారు. 11వందల అడుగుల పొడవైన రెడ్‌ఫ్లాగ్‌ను చేతబట్టిన వందలాదిమంది .. భారీ ర్యాలీ నిర్వహించారు. ఈనెల 18న  హైదరాబాద్‌లో జరిగే జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ.. అదిపెద్ద రెడ్‌ఫ్లాగ్‌ను సీపీఎం కార్యకర్తలు ప్రదర్శించారు.

22:04 - April 2, 2018

హైదరాబాద్ : ప్రధాని నేతృత్వంలో దేశంలో సాగుతున్న అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలందరూ ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వ మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు సమరశీల పోరాటాలు  చేయాల్సిన అవసరమని ఉందన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే బలమైన ఉద్యమాలతోనే మోదీ పాలనలో జరుగుతున్న మోసాలకు ముగింపు పలకొచ్చని సీపీఐ తెలంగాణ మహాసభల ప్రారంభోత్సవంలో సురవరం చెప్పారు. 
సీపీఐ తెలంగాణ 2వ మహాసభలు
హైదరాబాద్‌లో సీపీఐ తెలంగాణ 2వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ కల్యాణ మండపంలో జరుగుతున్న ఈ మహాసభల్లో  పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, అమరులకు నివాళులర్పించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 
సురవరం ప్రారంభోపన్యాసం
ఈ సందర్భంగా సురవరం సుధాకర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. వ్యవసాయరంగ సంక్షోభం, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, రైతులు ఆత్మహత్యలు, ఆర్థిక అసమానతల వరకు పలు అంశాలను ప్రస్తావించారు. ఆర్థిక నేరాలు, మోసాలు పెరిగిపోయాయని  సురవరం సుధాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ, వీటన్నింటికీ వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. 
రాజ్యాధికారం బహుజనులకు దక్కితేనే సామాజిక న్యాయం : తమ్మినేని
ప్రస్తుతం కులాలకే పరిమితమైన రాజ్యాధికారం బహుజనులకు దక్కితేనే సామాజిక న్యాయం సాధమవుందని మహాసభలకు హాజరైన సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. 
ప్రజా సమస్యలపై వామపక్షాలు సమరశీల పాత్ర : రామకృష్ణ  
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో నెలకొన్న ప్రజా సమస్యలపై వామపక్షాలు సమరశీల పాత్ర పోషిస్తున్నాయని, వీటిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో  ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తారు. రాజకీయ, ఆర్థిక అంశాలతోపాటు పలు విషయాలపై తీర్మానాలు చేస్తారు. 
 

Pages

Don't Miss

Subscribe to RSS - cpim