Congress Plenary Sessions

21:41 - March 18, 2018

ఢిల్లీ : ప్రధాని మోదీ, బీజేపీలపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ - ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధునిక కౌరవులని విమర్శించారు. తాము సత్యంకోసం పోరాడిన పాండవుల వంటివారమని అభివర్ణించారు. బీజేపీ ఓ సంస్థ గొంతుకగా నిలిస్తే... తాము దేశ ప్రజల గొంతుగా పనిచేస్తున్నామన్నారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాల్లో ముగింపు ఉపన్యాసం చేసిన ఆయన... దేశ భవిష్యత్తును మార్చే శక్తి కాంగ్రెస్‌కే ఉందని ఉద్ఘాటించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు ఉత్సాహంగా ముగిశాయి. ప్లీనరీ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన ప్రసంగంతో కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుత రాజకీయాలను ఆయన మహాభారతంతో పోల్చారు. బీజేపీ - ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధునిక కౌరవులని రాహుల్‌ అభివర్ణించారు. తాము సత్యం కోసం పోరాడిన పాండవుల వంటి వారమన్నారు. కౌరవుల మాదిరిగా బీజేపీ అధికారం కోసం పాకులాడుతోందని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో దేశంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కార్పొరేట్ల కోసమే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. దేశానికి అన్నంపెట్టే రైతులు చనిపోతుంటే ఇండియా గేటు ముందు యోగాలు చేస్తున్నారని మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చాక హామీలు విస్మరించారు : రాహుల్
ఎన్నికలకు ముందు బ్లాక్‌మనీ బయటపెడతామంటూ ఊదరగొట్టిన మోదీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించారని విమర్శించారు. అవినీతిని అంతం చేస్తామన్న మోదీ... ఇప్పుడు అవినీతిపరులకు అండగా నిలుస్తున్నారన్నారు. 33వేల కోట్లు దోచుకున్న నీరవ్‌మోదీ, లలిత్‌మోదీలను ప్రధాని కాపాడుతున్నారని ఆరోపించారు.

నిరుద్యోగం పెరిగింది : రాహుల్
దేశంలో నిరుద్యోగం పెరిగిందని.... యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతుందని రాహుల్‌ అన్నారు. దేశంలో అభివృద్ధి ఎక్కడుందో చెప్పాలని బీజేపీని ప్రశ్నించారు. దేశంలో ఏ వస్తువు చూసినా ఇతర దేశాల్లో తయారైందే కనిపిస్తోందన్నారు. దీంతో మా ఉపాధి సంగతేంటని దేశ యువత ప్రశ్నిస్తోందన్నారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్నారు. ప్లీనరీ సమావేశంలో అక్కడక్కడ ఖాళీ ప్రదేశం ఉందని.. దాన్నంతా యువతతో నింపుతామని ఛమత్కరించారు. పార్టీలో యువతకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.

అచ్చేదిన్‌ పేరుతో మోసాలు : రాహుల్
ముఖ్యమైన సమస్యలపై ప్రధాని మౌనం దాలుస్తున్నారని రాహుల్‌ విమర్శించారు. అచ్చేదిన్‌ పేరుతో అందరినీ మోసగిస్తున్నారన్నారు. రైతులు , నిరుద్యోగులపై మోదీకి ఏమాత్రం ప్రేమలేదని.. కాంగ్రెస్‌ పార్టీయే వారికి మేలు చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలకు దేశ భవితవ్యాన్ని మార్చే శక్తి ఉందన్నారు. రాజకీయ, ఆర్థిక, విదేశాంగ, భద్రతా, వ్యవసాయ విధానాలపై ప్లీనరీలో తీర్మానాలు ఆమోదించారు. మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు క్యాడర్‌లో నూతనోత్తేజం నింపాయి.

18:35 - March 18, 2018

ఢిల్లీ : ప్రధాని మోదీ, బీజేపీలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జరగుతున్న పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఆయన బీజేపీపై మునుపెన్నడూ చేయని విధంగా ఆరోపణలు చేశారు. ఓ నిందితుడిని అధ్యక్షుడిగా చేసుకున్న పార్టీ బీజేపీ అంటూ విమర్శించారు. తాము మహాభారతంలోని పాండవుల్లా ధర్మం కోసం పోరాడుతుంటే... బీజేపీ, ఆర్ఎస్ఎస్ కౌరవుల్లా అధికారం కోసం పాకులాడుతున్నాయన్నారు. మోదీపై యువత పెట్టుకున్న నమ్మకం తొలగిపోతోందన్నారు. అవినీతిపై యుద్ధం చేస్తామన్న ప్రధాని.. లలిత్ మోదీ, నీరవ్ మోదీ విదేశాలకు పారిపోతే ఏం చేశారని ప్రశ్నించారు. 

07:22 - March 18, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశం మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ మతం పేరిట దేశాన్ని రెండుగా విభజించే కుట్రకు పాల్పడుతోందని ఆరోపించింది. రాజ్యాంగ సంస్థలపై దాడులు పెరిగిపోయాయని, విపక్షాలను టార్గెట్‌ చేస్తోందని కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. 2014 ఎన్నికల్లో మోదీ ఇచ్చిన నినాదాలు 'సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌, న ఖావుంగా...న ఖానేదూంగా'...నాటకమేనని తేలిపోయిందని విమర్శించింది. దేశ ప్రజల ఆకాంక్షలను కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే నెరవేర్చగలదని పేర్కొంది. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ ఏఐసీసీ ప్లీనరీ రాజకీయ తీర్మానంలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్లీనరీ సమావేశంలో యూపీఏ ఛైర్మన్ సోనియాగాంధీ మోది పాలనపై నిప్పులు చెరిగారు. రాజ్యాంగ సంస్థలపై దాడులు, పార్లమెంట్‌ను నిర్లక్ష్యం చేయడం, మతపరంగా దేశాన్ని విభజించడం, విపక్షాలను టార్గెట్‌ చేసే మోది ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని సోనియా స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాలను నీరుగార్చడం మినహా మోది ప్రభుత్వం చేసింది ఏమి లేదన్నారు. మోది హయాంలో చోటుచేసుకున్న అవినీతిని కాంగ్రెస్‌ బయటపెడుతుందని సోనియా స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో మోది నినాదాలు 'సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌, న ఖావుంగా...న ఖానేదూంగా'... ఓ నాటకమేనని తేలిపోయిందన్నారు. 2019 ఎన్నికల్లో విజయాన్ని ఆహ్వానిస్తూ... కాంగ్రెస్‌ విజయమే దేశ విజయమని సోనియా పేర్కొన్నారు. త్వరలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.

అంతకుముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ..మోది ప్రభుత్వ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ దేశాన్ని రెండుగా విడగొట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా అసంతృప్తి, ఆగ్రహం కనిపిస్తోందన్నారు. ఈ పరిస్థితులను మార్చి, మళ్లీ దేశాన్ని ఒక్కటిగా చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపైనే ఉందని రాహుల్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే దేశానికి సరైన దిశా నిర్దేశం చేయగలదని చెప్పారు.

కాంగ్రెస్‌ ప్లీనరీ పలు తీర్మానాలు చేసింది. 2019 ఎన్నికల్లో మోది ప్రభుత్వాన్ని ఓడించడానికి భావ సారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందాలని నిర్ణయించింది. ఎన్నికల్లో పారదర్శకతపై భరోసా కల్పించేందుకు మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమల్లోకి తేవాలని ఈసీని కోరుతూ ప్లీనరీ రాజకీయ తీర్మానం చేసింది. ఈవీఎంల దుర్వినియోగంపై రాజకీయ పార్టీలు, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని కాంగ్రెస్ పేర్కొంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ నిర్ణయాన్ని కూడా ప్లీనరీ తప్పుపట్టింది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన విధానం. కార్యాచరణ కూడా అసాధ్యమేనని పేర్కొంది.

17:37 - March 17, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోది ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోది హయాంలో చోటుచేసుకున్న అవినీతిని కాంగ్రెస్‌ బయటపెడుతుందని సోనియా స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో మోది 'సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌, నేను తినను...ఇతరులను తిననివ్వను' లాంటి హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ సంస్థలపై దాడులు, పార్లమెంట్‌ను నిర్లక్ష్యం చేయడం, మతపరంగా దేశాన్ని విభజించడం, విపక్షాలను టార్గెట్‌ చేసే మోది ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని సోనియా పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే నెరవేర్చగలదని సోనియాగాంధీ అన్నారు. 

13:36 - March 17, 2018

ఢిల్లీ : ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ 84 వ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు, రేపు సమావేశాలు జరుగనున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్షతన తొలిసారి ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నూతన శకం ఆరంభమైందన్నారు. తండ్రిని మించిన తనయుడిగా రాహుల్ గాంధీ రాణిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. రాహుల్ నాయకత్వం దేశానికే మార్గదర్శకం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

12:46 - March 17, 2018

ఢిల్లీ : ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ 84 వ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ, రేపు సమావేశాలు జరుగనున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్షతన తొలిసారి సమావేశాలు జరుతున్నాయి. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, ఎంపీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఏఐసీసీ సభ్యులు, పిసిసి నేతలు, యువ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఎన్డీఏ వైఫల్యాలు, యూపీఏ పాలన, కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణపై ప్లీనరీ చర్చించనుంది. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగం, పేదరిక నిర్మూళన, అవినీతిపై కాంగ్రెస్ తీర్మానాలు చేయనుంది. వ్యవసాయం, రాజకీయాల తీర్మానాలపై రేపు ప్లీనరీలో చర్చించనున్నారు. మన్మోహన్ సింగ్ రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. రేపు రాహుల్ గాంధీ ముగింపు ప్రసంగం చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

12:02 - March 17, 2018

ఢిల్లీ : ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ 84 వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ, రేపు సమావేశాలు జరుగనున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్షతన తొలిసారి సమావేశాలు జరుతున్నాయి. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, ఎంపీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఏఐసీసీ సభ్యులు, పిసిసి నేతలు, యువ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఎన్డీఏ వైఫల్యాలు, యూపీఏ పాలన, కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణపై ప్లీనరీ చర్చించనుంది. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగం, పేదరిక నిర్మూళన, అవినీతిపై కాంగ్రెస్ తీర్మానాలు చేయనుంది. వ్యవసాయం, రాజకీయాల తీర్మానాలపై రేపు ప్లీనరీలో చర్చించనున్నారు. మన్మోహన్ సింగ్ రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. రేపు రాహుల్ గాంధీ ముగింపు ప్రసంగం చేయనున్నారు. మరిన్ని వివరాలను   వీడియోలో చూద్దాం.. 

 

11:24 - March 17, 2018

ఢిల్లీ : నేటి నుండి ఢిల్లీలో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. రెండు రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. కాసేపట్లో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఏఐసీపీ ప్లీనరీ ప్రారంభం కానుంది. జెండా ఆవిష్కరణతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి పీసీపీ నేతలు, యువ కాంగ్రెస్ నాయకులు హాజరవుతున్నారు. మరణించిన నాయకులకు సంతాపం, స్వాతంత్య్ర సమరయోధులకు నేతలు నివాళులర్పించనున్నారు.  రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయ్యాక మొదటిసారి ప్లీనరీ సమావేశం జరుగనుంది. ఉదయం 9.30 గంటలకు ప్లీనరీలో రాహుల్ గాంధీ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఎన్డీఏ వైఫల్యాలు, యూపీఏ పాలన, కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణపై ప్లీనరీ చర్చించనుంది. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగం, పేదరిక నిర్మూళన, అవినీతిపై కాంగ్రెస్ తీర్మానాలు చేయనుంది. వ్యవసాయం, రాజకీయాల తీర్మానాలపై రేపు ప్లీనరీలో చర్చించనున్నారు. మన్మోహన్ సింగ్ రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. రేపు రాహుల్ గాంధీ ముగింపు ప్రసంగం చేయనున్నారు.

 

Don't Miss

Subscribe to RSS - Congress Plenary Sessions