CM KCR

13:09 - November 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన గులాబీ బాస్ ముందే అభ్యర్థులను ప్రకటించేసి ప్రతిపక్షాలను అయోమయంలో పడేశారు. అంతేకాదు..ప్రచారంలో కూడా గులాబీ అభ్యర్థులు దూసుకెళుతున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలున్న తెలంగాణలో 117 స్థానాలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. మరో రెండు స్థానాలకు తొందరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ప్రకటించిన 117 సీట్లలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించారనేది చూద్దాం...
ఓసీలు - 58  ఎస్సీ - 19 ఎస్టీ 12 సిక్కు - 1 బీసీ - 24 ముస్లిం - 3.
సామాజిక వర్గాల వారీగా
మాల - 7 నేతకాని - 1 యాదవ - 5 ముదిరాజ్‌ - 1 పద్మశాలి - 1 వెలమ - 12 రెడ్డి - 37 ఠాకూర్‌ - 1 కమ్మ– 6, బ్రాహ్మణ– 1, విశ్వబ్రాహ్మణ - 1 లంబాడ - 7 కోయ - 4 గోండు - 1 ముస్లిం -3 సిక్కు- 1 వైశ్య– 1  మున్నూరు కాపు - 8 గౌడ - 6 పెరిక - 1 వంజర - 1 మాదిగ - 11 

10:03 - November 15, 2018
సొంత కారు లేదు
ఆస్తుల విలువ రరూ. 22.60 కోట్లు
బంగారం..భూములు పెరిగాయి. 
కొడుకు..కోడలకు అప్పులు చెల్లించాలి.
గతంతో పోలిస్తే కేసీఆర్ అప్పులు పెరిగాయి.
అప్పులు రూ. 8.88 కోట్లు...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సొంతకారు లేదంట. అంతేగాకుండా..కొడుకు..కోడలకు అప్పులు చెల్లించాల్సి ఉందంట. అవునండి..ఇవన్నీ కేసీఆర్ దాఖలు చేసిన ప్రమాణపత్రంలో వెల్లడించారు. గజ్వేల్ నియోజకవర్గం నుండి బరిలో ఉంటున్న కేసీఆర్ నవంబర్ 14వ తేదీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆస్తులు..అప్పులు..కేసులు..ఇతర వివరాలతో ప్రమాణపత్రం సమర్పించారు. 
సొంతకారు లేదని, కొడుకు కేటీఆర్ కు రూ. 82 లక్షలు, కోడలు శైలిమకు రూ. 24.65 లక్షలు అప్పు కింద చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. మొత్తం ఆస్తుల విలువ రూ. 94.59 లక్షలుగా ఉందని, అప్పులు రూ. 8.88 కోట్లున్నాయని తెలిపారు. 
2018లో... 2014లో...

వ్యవసాయ భూమి 54.21 ఎకరాలు.
భూమి విలువ రూ. 6.50 కోట్లు.

వ్యవసాయ భూమి 37.70 ఎకరాలు
భూమి విలువ రూ. 4.50 కోట్లు
కేసీఆర్ పేరిట భూమి  37.70 ఎకరాలు కేసీఆర్ పేరిట భూమి  48 ఎకరాలు
వ్యవసాయేతర భూమి 2.04 ఎకరాలు వ్యవసాయేతర భూమి 2.04 ఎకరాలు
అప్పులు రూ. 8,88,47,570  రూ. 7,87,53,620
నగదు రూ. 9.90 లక్షలు  రూ. 2.40 లక్షలు
బ్యాంకు డిపాజిట్లు రూ. 4,25,61,452 రూ. 44,66,327
బంగారం 7.5 తులాలు  6 తులాలు
తెలంగాణ పబ్లికేషన్స్ లో పెట్టుబడి రూ. 4,16,25,000 రూ. 4,16,25,000 తెలంగాణ పబ్లికేషన్స్ లో పెట్టుబడి రూ. 4,16,25,000
తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ లో పెట్టుబడి రూ. 55 లక్షలు రూ. 55 లక్షలు తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ లో పెట్టుబడి రూ. 55 లక్షలు రూ. 55 లక్షలు

నివాస భవనాలు
బంజారాహిల్స్ నందినగర్ (584 చ.అ)
కరీంనగర్ తీగలగుట్టపల్లి (1,449 చ. అ) 
భవనాల విలువ : రూ. 5.10 కోట్లు

నివాస భవనాలు
బంజారాహిల్స్ నందినగర్ (584 చ.అ)
కరీంనగర్ తీగలగుట్టపల్లి (1,449 చ. అ) 
భవనాల విలువ : రూ. 5.10 కోట్లు
 
16:22 - November 14, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల దాఖలుతో సందడి నెలకొంది. వెంకటేశ్వర స్వామి తిరునక్షత్రం కావడంతో పలువురు మంచిరోజుగా భావించి నామినేషన్ దాఖలుకు పయనమయ్యారు. కొందరు హంగు ఆర్భాటంగా వెళ్లగా..మరికొందరు నిరాడంబరంగా ఎన్నికల అధికారులకు నామినేషన్ సెట్‌లను అందచేశారు. ముందే అభ్యర్థులను ప్రకటించేసిన గులాబీ దళం..అభ్యర్థులు నామినేషన్ దాఖలులో ముందున్నారు. 

  • తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు సెంటిమెంట్‌ను అనుసరించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నుండి బరిలోకి దిగుతున్న కేసీఆర్ నవంబర్ 14వ తేదీ బుధవారం ఉదయం కోనాయిపల్లికి చేరుకుని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈయన వెంట హరీష్ రావు కూడా ఉన్నారు. అనంతరం నిర్ణయించిన ముహూర్తం (2.34నిమిషాలకు) గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. 
  • కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా నవంబర్ 14వ తేదీ బుధవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. కోనాయిపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన హరీష్ ఈద్గా..చర్చీల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సిద్ధిపేట ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. 
  • కోరుట్ల నియోజకవర్గ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నామినేషన్ పత్రాలు అధికారులకు అందచేశారు. ర్యాలీగా వెళ్లకుండా మెట్‌పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సబ్ కలెక్టర్‌కు అందచేశారు. ఈయన వెంట ఎంపీ కవిత ఉన్నారు. 
  • చెన్నూరులో ఎంపీ బాల్క సుమన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈయనతో మరో ఎంపీ వినోద్ కూడా ఉన్నారు. 
  • దేవరకద్రలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్, మక్తల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అచ్చంపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు,  గద్వాలలో టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు నామినేషన్ దాఖలు చేశారు. 
  • పరిగిలో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేష్‌రెడ్డి, తాండూరులో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి, జడ్చర్లలో టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి లక్ష్మారెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు.
  • భూపాలపల్లి నుండి బరిలో నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 

 

17:41 - October 3, 2018

నిజామాబాద్ :  టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ తట్టుకోలేని ప్రభుత్వంపై కేసులు పెడుతోందనీ..కాంగ్రెస్ పార్టీ అంటేనే కేసుల పార్టీ అని ఉ అంటే కేసు..ఆ అంటే కేసులు..కూర్చుంటే నిల్చుంటే..బాత్రూమ్ కెల్లినా కేసులు పెట్టేలా కాంగ్రెస్ తయారయ్యిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతీ విషయానికి పొద్దున్న లేచినకాడ్నుండి కాంగ్రెస్ లొల్లి లొల్లి చేయటమే కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతల బతుకే కేసులు.. ఊ అంటే కేసు.. ఉ.. పోస్తే కేసులు వేస్తారని ఎద్దెవా చేశారు కేసీఆర్. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. రైతుబంధు పథకం కింద నవంబర్ నెలలో యాసంగి పంటకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున ఇస్తామని చెప్పినం. దీనిపై కాంగ్రెస్ పార్టీ వాళ్లు కేసు వేశారు. వాళ్ల బతుకే కేసు. ఊ అంటే కేసు.. ఉ.. పోస్తే కేసు. సొల్లు పురాణం చేస్తారు కాంగ్రెసోళ్లు. సొల్లు పురాణం మాట్లాడితే నాకు తిక్కరెగి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు పోదామని చెప్పిన. ప్రజల వద్దకు వెళ్దామని చెప్పిన వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయంగానే గిలగిల కొట్టుకుంటున్నారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ వద్దకు పోయి అడ్డుకుంటున్నారు. ఎన్నికలకు పోదామా? అని ప్రశ్నించిన వారే.. ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 
 

 

08:34 - September 18, 2018

హైదరాబాద్ : కేసీఆర్ ప్రకటించిన మొదటి జాబితాలో పేరు రాకపోవడంతో ఆశావశులు టీఆర్ ఎస్ పై తిరుగుబావుటా ఎగరవేశారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలందరూ కేసీఆర్ పై భగ్గుమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనకు దిగారు. కేసీఆర్ పై విమర్శనాస్త్రాశాలు సందిస్తున్నారు. జాబితాలో తమ పేరు ప్రకటించకపోవడంతో కొండా సురేఖ దంపతులు టీఆర్ ఎస్, కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అసమ్మతి నేతలను దారిలోకి తెచ్చుకునేపనిలో పడింది గులాబీపార్టీ. 105 నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకే  మరోసారి ఛాన్స్‌ ఇవ్వడంతో నేతల్లో అసంతృప్త జ్వాలలు రగులుకున్నాయి. చాలా చోట్ల నేతల అసమ్మతి తార స్థాయికి చేరుకుంది. ప్రచారపర్వం మొదలు పెట్టేలోపే అసమ్మతి నేతలను శాంతింపచేయాలని గులాబీపార్టీ పావులు కదుపుతోంది.
 
అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష పార్టీల కంటే ముందుగానే  మెజార్టీ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ ఎస్ అధినేత కేసిఆర్......ఆ పరిణామాలను కూడా ఎదుర్కొంటున్నారు. పార్టీలో నిన్న మొన్నటి వరకు టికెట్లు ఆశించిన నేతలకు  స్థానాలు దక్కకపోవడంతో పార్టీ అగ్రనాయకత్వంపై  వారంతా  అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో స్వతంత్రంగా రంగంలో నిలిచేందుకు ఇప్పటి నుంచే  పావులు కదుపుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి కూడా  పరిస్థితి ఇదే విధంగా ఉంటే..... ఖచ్చితంగా బరిలో ఉంటామన్న సంకేతాలను   అసమ్మతి నేతలు పార్టీ  పెద్దలకు పంపుతున్నారు.

టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు....ఓ వైపు ప్రచారం నిర్వహిస్తూనే మరో వైపు అసమ్మతి నేతల నిరసనలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవే పరిస్థితులు కొనసాగితే..... ఎన్నికల నాటికి ఇబ్బందులు తప్పవన్న   అంచనాతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించే పనిని మంత్రి కేటిఆర్ కు ముఖ్యమంత్రి కేసిఆర్ అప్పగించారు. గత నాలుగైదు రోజులుగా క్యాంపు కార్యాలయంలో  మంత్రి కేటిఆర్ అసమ్మతి నేతలను హైదరాబాద్ పిలిపించుకుని బుజ్జగింపులు మొదలు పెట్టారు.  ఇప్పటికే చెన్నూరు నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే ఓదేలును దారిలోకి తెచ్చుకున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నా.....వారందరినీ ఏకం చేశారు. గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో కూడా ఉన్న అసంతృప్తులను  శాంతింప చేశారు. మంత్రి బుజ్జగింపులతో అసమ్మతి నేతలు కొంత వరకు చల్లబడుతున్నారు. మంత్రి కేటిఆర్ అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యతలను తీసుకోవడంతో..... వచ్చే ఎన్నికల తర్వాత కేటిఆర్ మరింత కీలకం గా మారనున్నారన్న ప్రచారం కూడా  మొదలైంది.
 

08:14 - September 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్.. 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఇద్దరికి తప్ప...అందరికీ మళ్లీ అవకాశం కల్పించారు. బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న తెలంగాణలో....ఆ వర్గాలకు ఎన్ని సీట్లు కేటాయించారు. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించారా ? లేదంటే గెలుపు గుర్రాలకే మళ్లీ అవకాశం ఇచ్చారా ? 
9శాతం జనాభా ఉన్న కులాలకు 55 సీట్లు..
దేశంలోనే ఎక్కువ బలహీన వర్గాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ. అసెంబ్లీని అర్ధాంతరంగా రద్దు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. అంతేకాదు, ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైన కేసీఆర్‌.. 119 స్థానాల్లో 105 స్థానాలకూ అభ్యర్థులనూ ప్రకటించేశారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీలో...బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించారన్న దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీని రద్దు చేసిన 105 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.... సిట్టింగ్ అభ్యర్థులకు మళ్లీ అవకాశం కల్పించారు. నిన్న మొన్నటి వరకు సామాజిక న్యాయం అంటూ మాట్లాడిన కేసీఆర్...సీట్ల కేటాయింపులో బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్న విమర్శలు ఆ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో 9శాతం జనాభా ఉన్న కులాలకు 55 సీట్లు దక్కితే...91శాతం ఉన్న బలహీన వర్గాలకు దక్కింది 50 సీట్లు. 
52శాతం బీసీలకు 20 సీట్లే.. 
తెలంగాణలో 52శాతం బీసీల జనాభా  ఉంటే...వారికి దక్కింది మాత్రం 20 సీట్లే. ఎస్సీలకు 16, ఎస్టీలకు 12 సీట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు జనరల్ కేటగిరి సీట్లు కేటాయించకూడదా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు బలహీనవర్గాల ప్రజలు. మున్నూరుకాపులు, గౌడ సామాజిక వర్గాలకు చెరో ఆరు సీట్లు దక్కాయ్. యాదవులకు 4 సీట్లు, ముదిరాజ్‌, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, పెరిక కులాలకు ఒక్కో చోట ప్రాతినిధ్యం కల్పించారు. 16 ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాల్లో 8 మాదిగ. మరో ఏడు చోట్ల మాల, ఒక స్థానం నేతకాని వర్గానికి కేటాయించడం ద్వారా సమతూకం పాటించారు. ఎస్టీలకు 12 స్థానాలుంటే...ఏడుగురు లంబాడ, ఐదుగురు ఆదివాసీ అభ్యర్థులను ఎంపిక చేశారు. రెండు సీట్లు ముస్లిం మైనారిటీలకు కేటాయించారు. 
ఎక్కువభాగం రెడ్లకే  
టీఆర్‌ఎస్‌ టికెట్లలో ఎక్కువభాగం రెడ్లకే దక్కాయి. 6శాతం జనాభా ఉన్న రెడ్లకు 35 సీట్లు,  0.5శాతం ఉన్న వెలమలకు 10, ఒక శాతం లోపున్న కమ్మ సామాజిక వర్గానికి 6 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు కేసీఆర్. హైదరాబాద్‌లో స్థిరపడ్డ రాజపుత్ర వంశానికి ఒక సీటిచ్చారు. అభ్యర్థులు ప్రకటించని 14 టికెట్లు ఎవరికి కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 
సకల జనుల సర్వే.. 91శాతం బలహీన వర్గాలు 
సకల జనుల సర్వే చేయించిన కేసీఆర్....రాష్ట్రంలో 91శాతం బలహీన వర్గాల జనాభా ఉన్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ తర్వాత జనాభాకు అనుగుణంగా ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. సామాజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్ల పెంచుకునే అధికారం రాష్ట్రాలకే ఉండాలని కొత్త వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే చేతిలో ఉన్న అధికారంతో ఎంత వరకు సామాజిక న్యాయం చేస్తున్నారో ఆలోచించుకోవాలని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 

 

07:58 - September 8, 2018

హైదరాబాద్ : అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీఆర్ ఎస్... విపక్ష పార్టీలను మరింత బలహీనం చేసే పనిలో పడింది. మరోసారి టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ అస్త్రం ప్రయోగిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న కాంగ్రెస్‌కు మరోషాక్‌ ఇచ్చింది. అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజునే... కాంగ్రెస్‌ నేతలను కారెక్కించుకునేలా పావులు కదిపి విజయంవంతం అయ్యింది.
ప్రతిపక్ష పార్టీలపై పైచేయి సాధించాలన్న వ్యూహం 
ఎన్నికల వేడి రాజుకున్న తెలంగాణాలో అధికార పార్టీ మరో సారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. ప్రతిపక్ష పార్టీలపై  మాసికంగా పై చేయి సాధించాలన్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. తొలిసారి అధికార పగ్గాలు దక్కించుకున్న గులాబి పార్టీ....ఆ వెంటనే పెద్ద ఎత్తున విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకుని  ఆ పార్టీలు కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది. 63 మంది శాసనసభ్యులతో అసెంబ్లీలో అడుగు పెట్టిన టీఆర్ ఎస్.. తన సంఖ్యా బలాన్ని 90 కి పెంచుకుంది.  టిడిపి, కాంగ్రెస్,  వైసిపి, సిపిఐ, సమాజ్ వాది పార్టీలకు  చెందిన శాసనసభ్యులు  అధికార పార్టీలో చేరారు. .
టీఆర్ ఎస్ గూటికి సురేష్‌రెడ్డి 
మొన్నటికి మొన్న అసెంబ్లీని రద్దు చేసిన గులాబీపార్టీ..  మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టింది. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలను కారెక్కించుకుంటే ఆ ప్రభావం ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందన్న ధీమాలో అధికార పార్టీ ఉంది. ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే మాజీ మంత్రి దానం నాగేందర్‌ను కారెక్కించుకున్న గులాబీ బాస్‌... ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌నేత, మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. సురేష్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని  మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణా గత నాలుగేళ్లుగా అభివృద్ధిలో దూసుకు పోతుందని, అభివృద్ధికి ఎక్కడా ఆటంకం కలుగరాదన్న అభిప్రాయంతో తాను టిఆర్ ఎస్ లో చేరుతున్నట్లు సురేష్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరి కొంత మంది నేతలతోనే అధికార పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే మరికొంతమంది నేతలు గులాబి గూటికి చేరడం ఖాయమన్న ధీమా అధికార పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

 

10:59 - September 7, 2018

గుంటూరు : ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన నేపధ్యంలో తెలంగాణలో పార్టీల హడావుడి మొదలైంది. దీంతో అన్ని పార్టీల నాయకులు ఎన్నికల ప్రచార రధాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ప్రచార రధాల తయారీలో పేరుగాంచిన గుంటూరులోని ఎంపి రాయపాటి సాంబశివరావుకు చెందిన జయలక్ష్మీ డిజైనర్స్ తమ ఖార్ఖానాలో అందమైన ఎన్నికల ప్రచార రధాలను పెద్ద ఎత్తున సిద్ధం చేస్తోంది. టిఆర్ఎస్ నేతల నుండి వాహనాల తయారీ అర్డర్లు అధికంగా వస్తుండటంతో వాటిని సిద్ధం చేసే పనిలో వర్కర్లు రాత్రింభవళ్ళు పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం రథం తయారవుతుంది. అన్ని హంగులతో రథాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఆ రథంతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. 
ప్రచారానికి సిద్ధమవతున్న నేతలు  
తెలంగాణా అసెంబ్లీ రద్దుతో నేతలంతా ఇక ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అభ్యర్థి జయాపజయాల్లో ప్రచారం చాలా కీలకం. ప్రచారంలో సక్సస్ అయితే సగం గెలిచేసినట్లే. అందులో భాగంగా తమ కోసం ప్రత్యేకంగా ఎన్నికల రధాలను సిద్ధం చేసుకోవడంలో నేతలు అప్పుడే నిమగ్నమయ్యారు. మోడరన్ స్టైళ్లో ప్రచార రధాల తయారీకి పెట్టింది పేరైన గుంటూరులోని జయలక్ష్మీ డిజైనర్స్ ఖార్ఖానాలో ప్రస్తుతం ఈ ఎన్నికల ప్రచార రధాల తయారీ చాలా స్పీడుగా జరుగుతోంది. 

 

08:49 - September 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దుపై ఉత్కంఠ వీడింది. తెలంగాణ తొలి అసెంబ్లీ రద్దయింది. సాధారణ ఎలక్షన్ల కంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని.. అందుకనుగుణంగా అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ క్రమంలో అసెంబ్లీని రద్దు చేస్తూ క్యాబినెట్‌ తీర్మానించింది. తద్వారా దాదాపు రెండు నెలల నుంచి మీడియాలో వస్తున్న పలురకాల ఊహాగానాలకు తెరపడింది. కేసీఆర్‌ సర్కారు నాలుగేండ్ల మూడు నెలల నాలుగు రోజులపాటు కొనసాగిన అర్ధాంతరంగా రద్దయింది. తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. 
గవర్నర్ ఆమోదంతో అసెంబ్లీ రద్దు 
గురువారం మధ్యాహ్నం 1.10 గంటలకు కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం సమావేశమైంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు వీలుగా అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు కేసీఆర్‌ తన మంత్రివర్గ సహచరులకు తెలిపారు. అలాంటి నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను కేవలం ఒకట్రెండు మాటల్లో వివరించిన కేసీఆర్‌... ఆ వెంటనే అసెంబ్లీని రద్దు చేయాలని గవర్నర్‌ను కోరుతూ ఏకవాక్య తీర్మానాన్ని ప్రతిపాదించారు. దానికి అంగీకారం తెలుపుతూ మంత్రులందరూ తీర్మాన ప్రతిపై సంతకాలు చేశారు. ఆ వెంటనే కేసీఆర్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ముఖ్య సలహాదారుడు రాజీవ్‌శర్మ, రాజకీయ కార్యదర్శి శుభాష్‌రెడ్డితో కలిసి రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్ళారు. ఈ తతంగమంతా కేవలం 15 నిమిషాల్లోనే ముగిసింది. మధ్యాహ్నం 1.35 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్న కేసీఆర్‌... గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. మంత్రివర్గ తీర్మానాన్ని ఆయనకు అందజేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వాన్ని రద్దు చేశామని గవర్నర్‌కు వివరించారు. 
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ 
రాజ్యాంగ నిబంధనలు, సంప్రదాయాలకనుగుణంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడపాలని గవర్నర్‌ ఈ సందర్భంగా కేసీఆర్‌ను కోరారు. అందుకు కేసీఆర్‌ అంగీకరించారు. ఆ వెంటనే గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి హరిప్రీత్‌ సింగ్‌ ఉత్తర్వులను విడుదల చేశారు. మరోవైపు ప్రస్తుత మంత్రివర్గం ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగుతుందని పేర్కొంటూ సీఎస్‌ ఎస్‌కే జోషి జీవో నెంబర్‌ 134ను విడుదల చేశారు. మరోవైపు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు సభ రద్దయినట్టు పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిసి గెజిట్‌ నోటిఫికేషన్‌ను అందించారు. దీంతో అసెంబ్లీ రద్దు ప్రక్రియ పూర్తయింది. 
జూన్‌ 2, 2014న సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం 
జూన్‌ 2, 2014న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్‌... నాలుగేండ్ల 3 నెలల 4 రోజులపాటు ప్రభుత్వాన్ని నడిపారు. శుక్రవారం హుస్నాబాద్‌ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 50 రోజుల్లో 100 బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.

 

20:49 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దు అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడిన అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 105మంది అభ్యర్థులతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ భవన్ లో జరిగిన ఈ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈసందర్భంగా నేతలకు ఆయన దిశా..దశ నిర్ధేశం చేశారు. శుక్రవాం నుండే ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. క్యాంపు కార్యాలయాలు ఖాళీ చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. టికెట్ వచ్చిందని గర్వపడొద్దని, నియోజకవర్గంలోని అందరి నేతలతో కలుపుకొని పోవాలని, ప్రతి నియోజకవర్గానికి తాను రావడం జరుగుతుందని...ఒక్కటి..రెండు రోజుల్లో మూడు నియోజకవర్గాల్లో తాను ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించిన ఫీడ్ బ్యాంక్ తీసుకోవడం జరుగుతుందని..అలసత్వం ప్రదర్శిస్తే తనకు సమాచారం అందుతుందని...15 రోజుల తరువాత జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ఇక అసంతృప్తి నేతలను కూడా బుజ్జగించాలని సూచించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - CM KCR