CM Chandrababu Naidu

06:52 - August 20, 2018

విజయవాడ : కోట్లాది రూపాయలు రాబడి.. వేలాది సంఖ్యలో బస్సులు.. లక్షలాది మంది ప్రయాణికులతో నిత్యం కళకళలాడే విజయవాడ బస్టాండ్‌లో భద్రత కరువైంది. పండిట్ నెహ్రూ బస్టేషన్‌లో చోరీలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పేరుకు సీసీ కెమెరాలు ఉన్నా.. అవి అలంకార ప్రాయంగా మారాయి. భద్రత కరువైన విజయవాడ బస్టాండ్‌పై టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ.

రాష్ట్ర విభజన అనంతరం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ రూపురేఖలే ఆసాంతం మారిపోయాయి. కోట్లాది రూపాయలు వెచ్చించిన అధికారులు బస్టాండ్‌లో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వేలాది సంఖ్యలో బస్సులు నడుపుతుండటంతో రాబడి కూడా అధికంగానే వస్తుంది. అయితే ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన అధికారులు భద్రతను ఏర్పాటు చేయటం మర్చిపోయారు. దీంతో బస్టాప్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు తెచ్చుకున్న లగేజీకి, ఒంటిమీద ఉన్న బంగారానికి, వారి ప్రాణాలకే భరోసా లేకుండాపోతుంది. వేలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన 58 సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా మారాయి. సీసీ కెమెరాలు కంట్రోల్ చేసే గదిలో పర్యవేక్షణ కొరవడటంతో అవి ఎప్పుడు ఎలా పనిచేస్తున్నాయో తెలియటం లేదు. సీసీ కెమెరాలు పర్యవేక్షించాల్సిన పోలీసులు, టెక్నీషియన్స్‌ అందుబాటులో లేకపోవటంతో వాటి పర్యవేక్షణ కరువైంది. మరోవైపు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీతో చోరీలు, నేరాలు పెరుగుతున్నాయి. రెండ్రోజుల క్రితం బస్టాండ్‌లో ఓ వృద్ధ మహిళ మెడలోని నాలుగు కాసుల బంగారాన్ని మరో మహిళ దోచుకుని అక్కడ్నుంచి ఉడాయించింది.

అవనిగడ్డ బస్సెక్కేందుకు వేచి ఉన్న నాంచారమ్మకు అపరిచిత మహిళ మత్తు పదార్థాలతో కూడిన తినుబండారం ఇచ్చింది. ఇది తిన్న వృద్ధురాలు అస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమె మెడలోని బంగారు గొలుసును మహిళ ఎత్తుకుపోయింది. చోరీ జరిగిన చాలాసేపటి తరువాత పోలీసులు సీసీ టీవీని పరిశీలించి.. నిందితురాలని పట్టుకుంటామని చెప్పుకొచ్చారు. అయితే ఇంతవరకు ఆ మహిళను పట్టుకొలేకపోయారు. ఇది కేవలం మచ్చుకే అని.. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద బస్టేషన్‌గా పేరొందిన విజయవాడ బస్టాండ్‌లో ఇలాంటి చోరీలు జరగటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. వెంటనే భద్రతను కట్టుదిట్టం చేయాలని.. సీసీ కెమెరాలు పనిచేసేలా చేసి ప్రమాదాలు నివారించాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు, పోలీసులు భద్రతను ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. 

13:20 - August 14, 2018
10:52 - August 14, 2018

అమరావతి : ఒకప్పుడు ఆయన నుంచి సహాయం పొందాలంటే కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. ఆయనను కలిసి సహాయం పొందాలంటే ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. అంత చేసినా వారికి అరకొర సాయమే దక్కేంది. కానీ నేడు ఆ వ్యక్తిలో పూర్తిగా మార్పు వచ్చింది. అడిగిందే తడవుగా సాయం అందిస్తున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఏమా సాయం.. లెట్స్‌ వాచ్‌దిస్‌ స్టోరీ...

పేదల బాధలను తీర్చడమే లక్ష్యంగా సీఎంఆర్‌ ఏర్పాటు
ప్రజలు అన్నాక కష్టాలు వస్తూ ఉంటాయి. పెద్ద కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వ సాయం కోరుతారు. ఇందుకోసమే ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధిని ఏర్పాటు చేశాయి. సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి సాయం చేస్తారు. చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ తొలిసారి ఏర్పాటైంది. నాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సాయం పొందాలంటే ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సచివాలయానికి వచ్చినా వారికి అరకొర సాయమే దక్కేది. ఎమ్మెల్యేలు సైతం ఒకటికి పదిసార్లు కలిసి కోరితేనే పది వేల నుంచి 20వేల సాయం అందేది.

ఏపీలో నేడు పూర్తిగా పరిస్థితి మార్పు..సీఎంఆర్‌ఎఫ్‌ కింది లక్షల్లో సాయం
ఏపీలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సహాయం అర్ధించిన వారికి ఇప్పుడు సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి లక్షలు అందుతున్నాయి. ఒకప్పుడు కఠినంగా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా మారారు. నాడు అరకొర సాయం అందించిన చంద్రబాబు.. ఇప్పుడు ఎవరు దరఖాస్తు చేసుకున్నా ఎక్కువ మొత్తంలో సాయం అందిస్తున్నారు. కాలయాపన చేయకుండా కొన్ని సమస్యలు 24 గంటల్లోనే పరిష్కారం అవుతున్నాయి. రోగం వచ్చిందంటే చాలు ముందస్తు లేఖలు ఎల్‌ఓసీ రూపంలో ఇస్తుంటే... గంటల వ్యవధిలోనే అవి పరిష్కారం అవుతున్నాయి. లక్షలు రూపాయలు వెచ్చింది వైద్యం చేయించుకుంటున్నామని వేడుకుంటుంటే వారికి ఎంతో కొంత రీఎంబర్స్‌మెంట్‌ చేస్తున్నారు. చంద్రబాబులో ఇంతమార్పా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు సీఎంగా పనిచేసిన దానికి... నేటికీ చంద్రబాబులో ఎంతో మార్పు వచ్చిందని, చాలా తేడా కనిపిస్తోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రిలో వచ్చిన మార్పు ప్రభుత్వ ప్రతిష్టను కూడా పెంచుతోంది. ఇప్పటి వరకు దాదాపు లక్షన్నర కుటుంబాలకు వెయ్యికోట్ల రూపాయల మేర నిధులు మంజూరు చేశారు. ఒక్క వైద్యానికే సంబంధంలేకుండా ఆర్థికంగా వివిధ కారణాలతో చికితిపోయిన కుటుంబాలకు తన చేయూత అందించారు. ఇవేకాదు.. రాష్ట్రంలో వివిధ వర్గాల ఉద్యోగులకు గణనీయంగా జీతాలు పెంచారు. గతంలో ఎంతమొరపెట్టుకున్నా స్పందించని చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తున్న మార్పును చూసి అంతా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు.

18:55 - August 12, 2018

విజయవాడ : ఒకప్పుడు వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను మట్టి కరిపించిన నేతలు... పదునైన మాటలతో ఎదుటి వారికి చెమటలు పట్టించిన నాయకులు.... వారు మైక్‌ పట్టుకుంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. కానీ అదంతా గతం... ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. మాటలు మరాఠీలు మూగబోయారు. ఇంతకీ ఎవరా నాయకులు ? ఏంటా స్టోరీ. దృఢమైన దేహం కాదు... పదునైన మాట కలిగినవాడే నిజమైన నాయకుడు అంటారు. ఎంత వాక్చాతుర్యం ఉంటే అంత పవర్‌ఫుల్‌ లీడర్‌ అవుతారన్నది జగమెరిగిన సత్యం. ఆనాడు నందమూరి తారక రామారావు ఢిల్లీ మెడలు వంచాలి అన్న పిలుపు... ప్రజల్ని ఎంతగానో ప్రభావితం చేసింది. యువత రాజకీయాల్లోకి రావాలంటూ ఆయనిచ్చిన సందేశం తెలుగు నేలపై ఎంతో బలమైన వాగ్ధాటి కలిగిన నాయకులకు రూపునిచ్చింది.

ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించిన తొలినాళ్లలో యువతను పెద్ద ఎత్తున టీడీపీలోకి ఆహ్వానించారు. బలమైన నాయకత్వ లక్షణాలున్న యువనేతల్ని పార్టీలోకి చేర్చుకున్నారు. వాగ్ధాటి కలిగిన వారిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కోటగిరి విద్యాధరరావు, మోత్కుపల్లి, నాగం, ఉమ్మారెడ్డి, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంటి ఎంతో పదునైన మాటతీరు కలిగిన నేతలంతా రూపుదిద్దుకున్నారు. ఫలితంగా టీడీపీ స్థాపించిన తొలినాళ్లలోనే అనేక విజయాలను సొంతం చేసుకుంది.

అప్పట్లో మెడికల్‌ కాలేజీల కేటాయింపులో జరిగిన అవినీతిపై పెద్ద ఎత్తున పోరాటం చేసి నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి ప్రభుత్వాన్నే మార్చిన చరిత్ర నాటి తెలుగుదేశం నేతలది. కోడెల, యనమల, విద్యాధర్‌ రావు, అశోక్‌గజపతిరాజు, మోత్కుపల్లి, ఇంద్రారెడ్డి, కరణం బలరాం, దేవినేని లాంటి నేతలు అసెంబ్లీలో బలమైన వానిని వినిపించగా... తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నాగం జనార్ధన్‌ రెడ్డి, దేవేందర్‌ గైడ్‌ లాంటి నేతలు అసెంబ్లీ బయట ప్రజాక్షేత్రంలో తమ వాగ్ధాటితో నాటి అధికార పార్టీని ఎండగట్టేవారు.
2004 సంవత్సరం తర్వాత పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, దూళిపాళ్ల నరేందర్, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎర్రబెల్లి, రేవంత్‌ రెడ్డి వంటి నేతలు తమ వాగ్ధాటిని ప్రదర్శించేవారు. నన్నపనేని రాజకుమారి లాంటి నేతలు సైతం తమ వంతుగా ప్రతిపక్షాలపై మాటల తూటాలు పేలుస్తూ.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై పోరాటం చేశారు.

అయితే ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణలో బలమైన నాయకులు పార్టీకి దూరం కాగా.. ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ స్పందించే నేతల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. అధికారం వచ్చిన తొలినాళ్లలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పినప్పటికీ... ప్రస్తుతం నాయకులంతా మూగబోయారు. దీంతో ప్రతిపక్షాలకు సరైన సమాధానం చెప్పే వాగ్దాటి లేమి టీడీపీలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అటు రాజ్యసభలోనూ టీడీపీ ఎంపీల పేలవమైన ప్రదర్శన పార్టీకి మైనస్‌గా మారింది.

టీడీపీకి స్పీకర్‌ల లేమిపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సమస్యలను అధిగమించేందుకు యువతను ప్రోత్సహించాలని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యువ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, గల్లా జయదేవ్‌ లాంటి నేతలకు అవకాశం ఇవ్వడంతో పార్లమెంట్‌లో టీడీపీ సత్తా చాటారు. ఈ నేపథ్యంలో లోక్‌సభలో యువనేతలను ప్రోత్సహించి సక్సెస్‌ సాధించడంతో ఇటు రాష్ట్రంలోనూ ఇదే తరహా ఫార్ములా వర్కవుట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు చంద్రబాబు. పదునైన వాయిస్‌ ఉన్న నేతలకు ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

07:39 - August 12, 2018

విజయవాడ : దుర్గగుడిలో నెలకొన్న వివాదాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆలయంలో అమ్మవారి చీర మాయం కావడం వివాదాస్పదంగా మారింది. చీర మాయం వెనుక ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రస్ట్ బోర్డు సభ్యురాలు సూర్యలతపై వేటుగా పడగా, తాజాగా ఆలయ ఈవో పద్మను తప్పించి ఆమె స్థానంలో ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను ఈవోగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. 
ఆలయంలో తగువులు, వివాదాలపై సీఎం చంద్రబాబు సీరియస్ 
రాష్ట్రంలోనే టీటీడీ తర్వాత రెండో అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు పొందిన  విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో తరచూ వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ వివాదాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్‌ పెట్టింది. వాటిని  చక్కదిద్దేందుకు  ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆలయంలో ఈ తగువులు, వివాదాలు ఏమిటని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దుర్గగుడి కమిటీ సభ్యులు దేవస్థానంలో ఇష్టారాజ్యంగా వ్యవహారించడంతో ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.  ఇంద్రకీలాద్రిలో పరిణామాలను ఎప్పటికప్పుడు సాక్షాత్తు సీఎం చంద్రబాబు తెలుసుకుంటూ ప్రక్షాళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 
చీర మాయం కావడంపై వివాదం
ఆలయంలో భక్తురాలు సమర్పించిన చీర మాయం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో గత వారం రోజులుగా ఈ వివాదం పెద్దది కావడంతో సీఎం చంద్రబాబు పాలకవర్గంపై, ఆలయ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. అసలు ఆలయంలో ఈ తగాదా ఏంటని ప్రశ్నించారు. ఈవోగా ఉన్న పద్మ ఆలయంలో పాలనపరమైన  పనుల్లో లేకపోవడంతో  ఆమెను ఈవో పదవి నుంచి  తప్పించారు. చీర మాయం వెనుక ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యలతతోపాటు..  ఈవో పద్మపై వేటు వేయాల్సి వచ్చింది. 
ఈవోగా ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మ నియామకం 
కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్ పై రాష్ట్రానికి వచ్చిన ఐఆర్ఎస్ అధికారిణి వలనుకొండ కోటేశ్వరమ్మను ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా దుర్గగుడి ఈవో పోస్టింగ్ కోసం ఈమె ఎదురుచూస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే ఆలయంలో పాలకవర్గాన్ని నియమించింది. పాలకవర్గం నియమించిన నాటినుంచి దేవాలయంలో వివాదాలు, వివాదాస్పద నిర్ణయాలు, అరాచకాలు పెరిగాయన్న ఆరోపణలున్నాయి. గతంలో దేవాలయంలో అంతర్గత విభేదాలతో అధికారులు, అర్చకులు, సిబ్బంది మధ్య చిన్నపాటి మనస్పర్థలు ఉండేవి.
ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన దుర్గగుడి వివాదాలు
టీటీడీ, దుర్గగుడి ఆలయాలు వివాదాలమయం కావడంతో తెలుగుదేశం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఆలయాల చుట్టూ రాజకీయాలు చోటుచేసుకోవడంతో సీఎం చంద్రబాబు స్వయంగా తలదూర్చాల్సి వస్తోంది.  టీడీపీ సర్కార్ పై విమర్శలు తారస్థాయికి చేరడంతో ఐఏఎస్ అధికారిని అయిన ఈవో సూర్యకుమారిని బదిలీ చేశారు.  చిల్లర వివాదాలు, సీసీ కెమెరాల రగడ, ఖరీదైన చీర మాయం కావడం వంటి ఘటనలు టీడీపీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చాయి.  కోటేశ్వరమ్మ హయాంలోనైనా ఆలయ పరిస్థితి మెరుగు పడుతుందా లేదో చూడాలి.

 

21:20 - August 9, 2018
18:34 - August 9, 2018

విశాఖపట్టణం : గిరిజనులకు పెన్షన్లు ఇచ్చే వయసును ఏపీ ప్రభుత్వం తగ్గించింది. యాభై ఏళ్లు నిండిన ప్రతి గిరిజనుడికి పెన్షన్‌ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా పాడేరులో జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు... గిరిజనుకు ప్రస్తుతం ఇస్తున్న 75 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను వంద యూనిట్లకు పెంచుతున్నట్టు చెప్పారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్రాన్ని ఆదుకోవడంలో విఫలమైన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ధర్మపోరాటం ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లా పాడేరులో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు.. కేంద ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రంపై చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. 

16:16 - August 9, 2018

విశాఖపట్టణం : గిరిజన, ఆదివాసీలకు ఏపీ ప్రభుత్వం తోడుగా ఉంటుందని..వారి మేలు కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖ జిల్లాలోని అడారిమెట్టలో నిర్వహించిన గ్రామ దర్శినిలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రామాల్లో ప్రజలను కూర్చొబెట్టి ప్రతి దానిపై సమీక్ష చేయడం జరిగిందని, 175 నియోజకవర్గాలోని 800-900 మండలాలకు నోడల్ ఆఫీసర్లను పెట్టడం జరిగిందని, గురు, శుక్రవారాల్లో గ్రామాలకు వెళ్లాలని వారిని ఆదేశించడం జరిగిందన్నారు. అధికారుల పనితనం..వారి యొక్క సేవల వల్ల ప్రజల తృప్తిని కనుక్కోవడం జరుగుతోందన్నారు. అమరావతికి దూరంగా ఉన్న పాడేరు..ఇతర కొన్ని నియోజకవర్గాలపై కూడా సమీక్ష జరుపుతున్నామన్నారు.

పాడేరులో బల్బు వెలుగుతుందా ? లేదా ? అనేది అమరావతిలో కూర్చొని సమీక్షిస్తానని...ఫించన్ సరిగ్గా వస్తుందా ? లేదా ? ఫించన్ అధికారి సక్రమంగా వ్యవహరించారా ? లేదా అని తాను పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. పలువురికి పేద వారికి అండగా ఉంటూ..సేవలందిస్తున్నట్లు, అంగన్ వాడీ..మెప్నా..వీఆర్ఏ లకు వేతనాలు పెంచడం జరిగిందన్నారు. గిరిజనులకు తాను తోడుగా ఉంటానని హామీనిచ్చారు. రాబోయే తరాలు బాగుండాలనే ఉద్దేశ్యంతో పనులు చేయడం జరుగుతోందన్నారు.

08:00 - August 7, 2018

గుంటూరు : కాలుష్యరహిత ఇంధనానికి ఆంధ్రప్రదేశ్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అతి తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్‌ను అందించాలన్నది తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. మరింత చవకగా విద్యుత్‌ను ఎలా అందించగలమనే అంశంపై విద్యార్థులు ఆలోచలను చేయాలని పిలుపునిచ్చారు. 
అసాధ్యాలను సుసాధ్యం చేయాలి : సీఎం చంద్రబాబు 
అమరావతి ప్రజావేదిక హాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత్‌ ఎనర్జీ స్టోరేజీ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చిన అతి భారీ బ్యాటరీని.. పారిశ్రామిక వేత్తలు, విద్యార్థుల సమక్షంలో చంద్రబాబు ఆవిష్కరించారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడంపై యువత దృష్టి సారించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధ్యం కాదన్న స్థాయి నుంచి.. చౌక ధరకే కాలుష్య రహిత ఇంధనం ఇచ్చే పరిస్థితులు వచ్చాయని అన్నారు. కాలుష్య రహిత ఇంధనానికి ఏపీ కేరాఫ్‌ అడ్రస్‌గా మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు. నాణ్యమైన విద్యుత్‌ ఇప్పుడు ఐదు రూపాయలకే లభిస్తోందని, దీన్ని రూపాయిన్నరకు తగ్గించగలిగితే మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చన్న చంద్రబాబు.. ఈ దిశగా విద్యార్థులు సరికొత్త ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు. 
అవయవదాన కార్యక్రమంలో చంద్రబాబు 
బ్యాటరీ ఆవిష్కరణ కార్యక్రమానంతరం, అక్కడే జరిగిన అవయవదాన కార్యక్రమంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. తన అవయవాలను దానం చేసేందుకు ముఖ్యమంత్రి ముందుకొచ్చారు.అవయవదానాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెడతామని, డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీలో ఈ అంశాన్ని ఓ షరతుగా పెట్టే అవకాశాన్ని పరిశీలస్తామని చంద్రబాబు చెప్పారు. 
అవయవదానానికి ముందుకొచ్చిన లక్షా ఇరవై వేల మంది 
పది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు లక్షా ఇరవై వేల మంది అవయవ దాతలు ముందుకు వచ్చారు. వారికి ఇచ్చిన పత్రాలను ముఖ్యమంత్రి సమక్షంలో.. మెప్మా... జీవన్‌దాన్‌ సంస్థకు అందజేసింది. ఇంత భారీస్థాయిలో అవయవదాతలు ముందుకు రావడాన్ని ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. తన పిలుపునకు స్పందించి ఇంతమంది అవయవదానానికి ముందుకు రావడం పట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. 

 

12:26 - August 6, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - CM Chandrababu Naidu