CM chandrababu

13:52 - September 21, 2018

మహారాష్ట్ర : ధర్మాబాద్ కోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు చుక్కెదురైంది. బాబ్లీ కేసులో చంద్రబాబుకు ఊరట లభించలేదు. చంద్రబాబు వేసిన రీకాల్ పిటిషన్‌ను ధర్మాబాద్ కోర్టు తిరస్కరించింది. అక్టోబర్ 15కు విచారణను వాయిదా వేశారు. నోలీసులు అందుకున్నవారంతా విచారణకు హాజరు కావాలని కోర్టు అదేశించింది. ప్రకాశ్‌గౌడ్, గంగుల కరుణాకర్, కేఎస్ రత్నానికి బెయిల్ మంజూరు అయింది. రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. 

 

08:36 - September 21, 2018

హైదరాబాద్ : ఎనిమిదేళ్ల క్రితం జరిగిన బాబ్లీ కేసు....మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు సహా మొత్తం 16 మందికి అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఇవాళ కోర్టు హాజరు కావాలని ధర్మాబాద్ కోర్టు వారెంట్ ఇవ్వడంతో....చంద్రబాబు, ఇతర నేతల తరపున రీకాల్ పిటిషన్ వేయాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసవెళ్లిన నేతలు...ధర్మాబాద్ కోర్టుకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. 

బాబ్లీ ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ...టీడీపీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఎనిమిదేళ్ల క్రితం ప్రాజెక్టు ముట్టడి కార్యక్రమం...అప్పట్లో సంచలనం సృష్టించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు 70 మంది నేతలను మహారాష్ట్ర పోలీసులు...ఐదు రోజుల పాటు నిర్బంధించారు. అంతా ఈ సంఘటనను మరచిపోయిన సమయంలో....అకస్మాత్తుగా చంద్రబాబు, ఇతర నేతలకు ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నోటీసులపై న్యాయనిపుణులు, సీనియర్ నేతలతో సుదీర్ఘంగ చర్చించిన చంద్రబాబు...రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు.  

అలాగే చంద్రబాబుతో పాటు వారెంట్లు అందుకున్నఏపీకి చెందిన మిగిలిన నేతల విషయంలోనూ... ఇదే థియరీని ఫాలో కావాలని టీడీపీ భావిస్తోంది. ధర్మాబాద్ కోర్టులో చంద్రబాబు తరపున హాజరయ్యే న్యాయవాదులు...టీడీపీ నేతల తరుపున కూడా రీకాల్ పిటిషన్ వేయనున్నారు. 2013లో కేసు నమోదు చేసినప్పటికీ....ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు, అరెస్ట్ వారెంట్లు తమకు అందలేదనే విషయాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లనున్నారు.  

అలాగే ఎఫ్ఐఆర్ కాపీలు.. ఇతర ఉత్తర ప్రత్యుత్తరాలు మరాఠీ భాషలో ఉండడంతో కేసు విషయంలో తమకు మరింత సమయం కావాలని కోరుతూ వాయిదా అడిగే ఛాన్స్ కన్పిస్తోంది. ఇక అరెస్ట్ వారెంట్లు అందుకున్నవారిలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గంగుల కమలాకర్ వంటి నేతలు... ధర్మాబాద్ కోర్టుకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయ్. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా హీటెక్కించిన అరెస్ట్ వారెంట్ల ఎపిసోడులో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

15:33 - September 18, 2018

హైదరాబాద్ : నిరుద్యోగ యువతకు ఏపీ సర్కార్ శుభవార్త అందించింది. మెగా రిక్రూట్ మెంట్కు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 20 వేల 10 ఉద్యోగాల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖ సహా వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. డీఎస్సీ ద్వారా 9275 పైగా టీచర్ల నియామకం జరుగనుంది. గ్రూప్ 1లో 150, గ్రూప్ 2లో 250, గ్రూప్ 3లో 1670, పోలీసు ఎగ్జిక్యూటివ్ డిపార్ట్‌మెంట్ లో 3 వేల ఉద్యోగాలు, వైద్య శాఖలో 1604 ఖాళీలు, ఇతర ఖాళీలు 1636, పాలిటెక్నిక్ లో లెక్షరర్ పోస్టులు 310,  జూనియర్ లెక్షరర్ పోస్టులు 200 పోస్టులతోపాటు ఇతర శాఖల్లోఖాళీగా ఉన్నపోస్టులను భర్తీ చేయనున్నారు. 

 

21:34 - September 14, 2018

కర్నూలు : బాబ్లీ వివాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ధర్మాబాద్‌ కోర్టు జారీ చేసిన నోటీసులను ఎలా ఎదుర్కోవాలో... అలానే ఎదుర్కొంటామన్నారు. బాబ్లీ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందన్న ఉద్దేశంతోనే పోరాటం చేశామని చెప్పారు. దీనిపై కేసులు పెట్టామని కొన్నిసార్లు, పెట్టలేదని మరికొన్నిసార్లు మహారాష్ట్ర పోలీసులు, ప్రభుత్వం చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు పంపిన కోర్టు నోటీసులపై ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. 

 

17:32 - September 14, 2018

కర్నూలు : స్మార్ట్ వాటర్ గ్రిడ్ కు శ్రీకారం చుట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాలో నిర్వహించిన ’జలసిరికి హారతి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం భావితరాలకు సంబంధించినదన్నారు. నీరు ఉంటే బంగారం పండించే అవకాశం ఉంటుందని తెలిపారు. నీరు ఉంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తయన్నారు. గోదావరి నదికి అఖండ హారతి ఇచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు నదులు కలిపామని చెప్పారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామన్నారు. కృష్ణమ్మ తల్లికి జల హారతి ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు జల హారతికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అనంతపురంకు నీటిని తీసుకెళ్లడానికి లిఫ్టు ద్వారా తప్ప వేరే మార్గంలేదని చెప్పారు. కుప్పం వరకు నీరును తీసుకెళ్తామన్నారు.

వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలని సూచించారు. కర్నూలు జిల్లాలో 45 గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించామని తెలిపారు. దేశంలో వ్యవసాయరంగంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని చెప్పారు. వేరుశనగ పంట ఎండిపోయి నష్టపోయిన రైతులను పూర్తిగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ’మన భవిష్యత్ మన చేతిలోనే ఉంది’ అని పేర్కొన్నారు. ప్రజల్లలో చైతన్యం తీసుకరావాలన్నారు. నీటి పరిశుభ్రతను కాపాడాలని సూచించారు. 

 

22:59 - September 13, 2018

హైదరాబాద్ : బాబ్లీ ప్రాజెక్టు కేసులో ఏసీ సీఎం చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 21న కోర్టు ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పట్లో చంద్రబాబుతో పాటు 15 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. అయితే దీని వెనకాల కేంద్రప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలేమైన ఉన్నాయా అన్నఅనుమానం కలుగుతుంది. చంద్రబాబుకు కోర్టు నోటీసులు జారీ చేయడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఉన్నారు. బీజేపీ నేతల చర్యలు కొండనుతవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 

 

12:40 - September 3, 2018

విజయవాడ : శ్రీకృష్ణాష్టమి వేడకలు వైభవంగా జరుగుతున్నాయి. వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణుడు విగ్రహానికి పాలు..పెరుగు..రకరకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పూజారీతో టెన్ టివి మాట్లాడింది. అభిషేకం చేసిన వారికి...చూసిన వారికి స్వామి ఆశీస్సులు అందుతాయని పేర్కొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:24 - September 1, 2018

నెల్లూరు : చదువు చెప్పి విద్యార్థులను భావి భారత పౌరులుగా మార్చాల్సిన ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. మాకు పెన్షన్ భరోసా ఏదంటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద భారీగా చేరిన ఉపాధ్యాయులు కలెక్టరేట్ ను ముట్టడించి ధర్నా చేపట్టారు. కలెక్టర్ ను విధుల్లోకి రాకుండా ఉపాధ్యాయులు అడ్డుకుని తమ డిమాండ్ విషయంలో హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సీపీఎస్ విధానంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి తమకు భరోసా ఇచ్చేంత వరకూ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టంచేశారు. తమ డిమాండ్స్ ను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. 

12:50 - September 1, 2018

చిత్తూరు : రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మోటార్‌ వెహికిల్‌ ఇన్స్‌పెక్టర్‌ విజయ్‌ భాస్కర్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు చేపట్టారు. విజయ్‌ భాస్కర్‌ ఇంటితో పాటు అతని బంధువులు, స్నేహితులు ఇళ్లపై అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అనంతపురం, బెంగళూరు, తిరుపతి సహా 14 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. చెక్‌పోస్ట్‌లో లభించిన 14 వేల రూపాయల అక్రమ నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

08:37 - September 1, 2018

అమరావతి : రాష్ట్ర విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటు రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతున్నా..కేంద్రం ఏమాత్రం ఖాతరు చేయటంలేదు. ఏపీకి న్యాయం చేసేందుకు ముందుకు రావటంలేదు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పలు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏపీ ప్రత్యేక హోదా కోరుతూ విశాఖపట్నం జిల్లా కాగిత గ్రామానికి చెందిన యువకుడు దొడ్డి త్రినాథ్ ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. త్రినాథ్ బలవన్మరణం సంఘటన గురించి తెలియగానే మనసు వికలమైందని, హృదయాన్ని కలచి వేసిందని అన్నారు. అతన్ని కన్నవారికి ఎంతటి శోకాన్ని మిగులుస్తుందో అర్థం చేసుకోగలనని..ప్రాణత్యాగం చేసిన త్రినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని,. కడుపు కోతను దిగమింగుకొనే ధైర్యాన్ని కన్నవారికి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు.

కాగా ప్రత్యేక హోదా సాధనలో పాలకులు అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి ప్రజల్లో... ముఖ్యంగా యువతలో అసహనాన్ని తీసుకువస్తుందని ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను. స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి హోదా, విభజన హామీల అమలును పట్టించుకోకపోవడం వల్లే ఇంతకు ముందు తిరుపతిలో ముని కోటి, ఇప్పుడు విశాఖ జిల్లాలో త్రినాథ్, ఒక చేనేత కార్మికుడు ప్రాణ త్యాగాలు చేసిన విషయం తెలిసిందే. ఇకనైనా పాలకులు ప్రత్యేక హోదా సాధించటంలో చిత్తశుద్దితో వ్యవహరించాల్సిన అవుసరం వుంది. ఈ నేపథ్యంలో యువకుల ప్రాణ త్యాగాలతోనైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ప్రత్యేక హోదా విషయంలో ఎవరు ఎన్ని మాటలు మార్చినా, సాధనలో విఫలమైనా మనందరం బలంగా ప్రజల ఆకాంక్షను వినిపిద్దాం. దయచేసి ఎవరూ బలి దానాలకు పాల్పడవద్దు. ఆంధ్రప్రదేశ్ కు హోదా దక్కే వరకూ పోరాడదాం’ అని ఆ ప్రకటనలో పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.

Pages

Don't Miss

Subscribe to RSS - CM chandrababu