chiru

10:56 - September 12, 2018

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రంపై ఓ వార్త సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ‘సైరా’ సినిమాను నిషేధిస్తారనే వార్త కలకలం రేపుతోంది. తెలుగు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో ఇతర భాష నటీనటులు కూడా నటిస్తున్నారు. శాండల్‌వుడ్ కు సంబంధించిన స్టార్ హీరో సుదీప్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘సైరా నరసింహారెడ్డి' సినిమాపై నిషేధం విధించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.  భారీ బడ్జెట్‌తో తెరకెక్కే తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల డబ్బింగ్ వెర్షన్ ని కన్నడలో విడుదల చేయాలని నిషేధించాలని అక్కడ సినీ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందంట. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించే వరకు తెలియదు. 

11:35 - March 19, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' 151వ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. సుదీర్ఘ విరామం అనంతరం 'చిరు' 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150’ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో 'చిరు' నెక్ట్స్ సినిమాపై దృష్టి సారించారు. తదుపరి చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. 151వ చిత్రంగా 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' ఉంటుందని తెలిసిందే. సురేందర్‌రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఓ పోస్టర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ప్రీలుక్‌గా ఓ సరికొత్త శక్తివంతమైన పోస్టర్‌ను విడుదల చేశారని ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు అంటున్నాయి. 'యుఎన్‌-ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' అనే ఇంగ్లీష్‌ టైటిల్‌తో, ఆంగ్లేయులతో కొంతమంది పోరాడుతున్న దృశ్యం..చిరంజీవి కంటిచూపు..రక్తం కారుతున్న గొడ్డలితో ఉన్న పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకొంది. ఏప్రిల్‌లో సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ పోస్టర్ చిరు నెక్ట్స్ సినిమాలోనేదేనా ? కాదా ? అనేది కొద్ది రోజుల్తో తెలియనుంది.

13:36 - November 4, 2016

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' 'కాటమరాయుడు' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 'సర్ధార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ తరువాత నటిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రానికి 'కాటమరాయుడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. 'పవన్' సరసన మరోసారి 'శృతి హాసన్' నటిస్తోంది. ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి మెగాస్టార్ 'చిరంజీవి' వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. 'ఖైదీ నంబర్ 150' సినిమాలోని కొన్ని సీన్స్ ను 'కాటమరాయుడు' సెట్ లో షూట్ చేస్తుండడంతో 'చిరు' 'పవన్'ని కలిసినట్లు తెలుస్తోంది. ఒకే సెట్ లో కలుసుకున్న 'చిరు', 'పవన్' లు చాలాసేపు విడిగా మాట్లాడుకునట్లు టాక్. మాట్లాడుకున్నారు. మరి ఈ విషయం నిజమా ? కాదా ? అనేది ఫొటోలు బయటపడితే తెలుస్తుంది. 

19:56 - November 3, 2016

హైదరాబాద్ : మెగాస్టార్ ఇక రాజకీయాలుకు గుడ్ బై చెప్పబోతున్నారా..? ఇప్పటి నుంచి సినిమాలపైనే పూర్తిగా దృష్టి పెట్టబోతున్నారా...? అటు ఇండస్ట్రీలో.. ఇటు ఏపీ రాజకీయ వర్గాల్లోనూ ఇప్పుడిదే హాట్‌ టాఫిక్‌గా మారింది. ఇంతకీ అసలు చిరు మనస్సులో ఏముందో మరి...? జస్ట్‌ వాచ్‌ దిస్ స్టోరీ...!

2009 ఎన్నికల్లో చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి 18 శాతం ఓటింగ్
మెగాస్టార్ చిరంజీవి... ఇండస్ట్రీలో ఆయనకున్నంత ఇమేజ్ అంతా ఇంతా కాదు. పరిశ్రమలో చాలా ఏళ్లపాటు నంబర్ వన్‌గా ఏకఛత్రాధిపత్యం కొనసాగించిన మెగాస్టార్‌కి.. ఆ ఇమేజ్ పొలిటికల్ మైలేజ్ ఇవ్వలేకపోయింది. 2009 ఎన్నికల్లో చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ 18 శాతం ఓటింగ్ సంపాదించుకున్నా.. గెలిచిన కొద్ది పాటి ఎమ్మెల్యేల్లో కొందరు కాంగ్రెస్ వైపు వెళ్లారు.. ఇక పార్టీని నడపడం కష్టం అనుకున్న.. చిరంజీవి తన ఎమ్మెల్యేలతో సహా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో ఆయనకు కేంద్రంలో స్వతంత్ర హోదాలో కేబినెట్‌ మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

2017 ఏప్రిల్ 2 నాటికి ముగియనున్న చిరు రాజ్యసభ సభ్యత్వం
2017 ఏప్రిల్ 2 నాటికి చిరు రాజ్యసభ సభ్యత్వం ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పూర్తిగా రాజకీయాలకు దూరం కావాలనే యోచనలో ఉన్నారని తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఒక విధంగా ఇది ఆయన అభిమానులకు రుచించని అంశమే అయినా... మళ్లీ ఖైదీ నెంబర్ 150 అంటూ తెరపైకి రానుండటం, మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటం, అలాగే చరణ్ చిరు నటించబోయే తదుపరి సినిమాల స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొంటుండటం.. వంటి అంశాలు.. చిరు మళ్లీ సినిమాలవైపు పూర్తిగా దృష్టి సారిస్తున్నారనే సంకేతాలు పంపుతున్నాయి.

చిరంజీవితో ఫోన్‌లో మాట్లాడిన ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
తాజా వార్తలపై చిరంజీవితో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. అయితే తానేమీ పార్టీ మారడం లేదని.. అదే సమయంలో రాజకీయాలపై అంత ఆసక్తి లేదన్నట్లు చిరంజీవి మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. సన్నిహితులు కూడా చిరు సినిమాల వైపే ఆసక్తి కనబరుస్తున్నారని చెబుతున్నారు. అలాగే జనసేన తరపున పనిచేయడానికి కూడా ఆయన సిద్ధంగా లేరంటున్నారు. సోదరుడు పవన్ సినిమాల నుంచి రాజకీయాల వైపు ఎక్కువ దృష్టి పెడుతుంటే.. చిరంజీవి మాత్రం పాలిటిక్స్‌ నుంచి సినిమాల వైపు దృష్టి సారిస్తున్నారన్న చర్చ అభిమానుల్లో మొదలైంది.

కాపు నేతల ఆత్మీయ సమావేశానికి హాజరుకాని చిరంజీవి
ఇటీవల విజయవాడలో పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ నిర్వహించిన కాపు నేతల ఆత్మీయ సమావేశానికి కూడా చిరు హాజరు కాలేదు. తన తండ్రి ఇప్పుడు కంఫర్టబుల్‌గా ఉన్నారు. ఇలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం.. అంటూ ఒకానొక సందర్భంలో చిరు కుమార్తె సుస్మిత కూడా వ్యాఖ్యానించారు. మరో వైపు కాపులు, రిజర్వేషన్ల అంశంతో ఉక్కిరిబిక్కిరవుతున్న టీడీపీ... చిరును ఆ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఏప్రిల్ 2 తో ఎలాగూ రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది.. వెంటనే టిడీపీ తరపున మళ్లీ ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తే.. కాపుల్లో ఉన్న అసంతృప్తిని కొంతమేరకైనా.. తగ్గించుకోవచ్చనే ఆలోచనలో బాబు ఉన్నారంటున్నారు.. సినిమాలవైపు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్న చిరు.. మరి టీడీపీ ఆఫర్‌ను స్వీకరిస్తారో లేదో చూడాలి.

 

17:22 - October 19, 2016

'బాహుబలి' రికార్డ్స్ బద్దలైయ్యాయి. 'మెగా' స్టామినా ముందు 'బాహుబలి' రికార్డ్స్ నిలువలేకపోయాయి. అసలు 'బాహుబలి' రికార్డ్స్ తిరగరాసే సినిమా వస్తుందా అనుకున్న వాళ్లకి 'ఖైదీ నెంబర్ 150'తో 'మెగాస్టార్' సమాధానం ఇచ్చాడు. ఏంటీ ఇంకా సినిమా రిలీజ్ కాలేదు..అప్పుడే బ్రేక్ లేంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? 'బాహుబలి' సినిమా అనేది టాలీవుడ్ ఉన్నంత కాలం సువర్ణక్షరాలతో లిఖించి ఉంటుంది. ఇంతటి విజయాన్ని ఏ తెలుగు ప్రేక్షకుడు ఊహించి ఉండడు. బాక్సాపీసు వద్ద ఈ మూవీ 600కోట్లు వసూల్ చేసి అబ్బురపరిచింది. ఇంతటి విజయం సాధించిన మూవీని 'చిరంజీవి' మూవీ బీట్ చేయడమేంటీ అనుకోవచ్చాంతా కానీ ఇది నిజం. ప్రీ రిలీజ్ లో 'చిరు' మూవీ 'బాహుబలి'ని బీట్ చేసింది.

రెండు రాష్ట్రాలకు...
'మెగాస్టార్ చిరంజీవి' 150 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లో 'బాహుబలి'ని క్రాస్ చేసింది. 'ఖైదీ నెం 150' మూవీ రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 32 కోట్లకు బిజినెస్ జరిగిందట. దాంతో ఇంతవరకూ రైట్స్ బిజినెస్ లో 'బాహుబలి' పేర వున్న 30 కోట్ల రికార్డ్ తుడిచిపెట్టుకుపోయింది. ఈ విధంగా మెగాస్టార్ 'ఖైదీ నెంబర్ 150'.. 'బాహుబలి'ని అధిగమించింది. ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో మూవీ ప్రొడ్యూసర్ 'చిరు' తనయుడు 'చెర్రీ' ఫుల్ ఖుషీగా ఉన్నాడట. 'చిరు' రీ ఎంట్రీని 'మెగా' వారసుడు 'రామ్ చరణ్' మొదటి నుంచి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీని ఖర్చుకు వెనుకాడకుండా గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు. ఆల్రెడీ ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ రికార్డు రేంజ్ 15కోట్లకు అమ్ముడుపోయాయి. ప్రీ బిజినేస్ లో 'బాహుబలి'ని అధిగమించిదేమో కానీ ఒవరాల్ బాక్సాపీసు కలెక్షన్లలో 'అన్నయ్య' మూవీ 'బాహుబలి' సినిమాను అధిగమించడం కలే అని చెప్పాలి. ఏదేమైన 9ఏళ్ల తరువాత 'చిరంజీవి' మూవీ చేస్తున్న ఈ రేంజ్ లో బిజినేస్ జరుగుతుందంటే దటీజ్ 'మెగాస్టార్' అనాల్సిందే.

Don't Miss

Subscribe to RSS - chiru