child

12:46 - October 31, 2018

భూపాల్ : మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాసేపు ప్రచారానికి విరామం ఇచ్చి సరదాగా గడిపారు. ఈ క్రమంలో రాహుల్‌ ఇండోర్‌లోని 56 దుకాణ్‌ అనే షాప్‌లో ఐస్‌క్రీం తినేందుకు వెళ్లారు. రాహుల్‌ కోసం అక్కడి సిబ్బంది ప్రత్యేక ఐస్‌క్రీంను తయారు చేసి ఇచ్చారు. దాన్ని తీసుకుని తినడానికి సిద్ధమైన రాహుల్‌‌.. అక్కడే ఉన్న ఓ చిన్నారిని గమనించారు. హలో.. ఐస్‌క్రీం తింటావా? అంటూ ప్రశ్నించి ఆ బాలునికి ఐస్‌ క్రీం తినిపించారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. ఆ సమయంలో రాహుల్‌ వెంట కాంగ్రెస్‌ నేతలు కమల్‌నాథ్‌, జ్యోతిరాదిత్య సింథియా తదితరులు ఉన్నారు. 

 

15:04 - March 23, 2018
10:50 - August 18, 2017

హైదరాబాద్ : కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు హుద్రోగంతో బాధపడుతున్న 15 ఏళ్ల బాలికకు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. గుండెజబ్బుతో బాధపడుతున్న ఆదిలాబాద్‌కు చెందిన త్రిషకు తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. వ్యాధి తీవ్రంకావడంతో చివరికి హైదరాబాద్‌ కాంటినెంటల్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు చేసిన వైద్యులు గుండె మార్చాలని నిర్ణయించారు. ఆరోగ్య శ్రీ, జీవన్‌ధాన్‌ ట్రస్ట్‌ కింద నమోదు చేశారు. అవేర్‌ గ్లోబల్‌ ఆస్పత్రిలో గుండె ఉందని తెలుసుకున్న వైద్యులు అక్కడ నుంచి తీసుకొచ్చి అమర్చారు. ఇప్పుడు త్రిష పూర్తిగా కోలుకుంది. 

13:40 - August 4, 2017

పెద్దపల్లి : జిల్లా మంథని పట్టణంలోని హన్‌మాన్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలుడు అగ్నికి ఆహుతయ్యాడు. రాపెల్లి కాశి విశ్వనాథ్ ఆరవ తరగతి చదువుతున్నాడు. గత 3 రోజుల క్రితం తన అమ్మమ్మ ఇంట్లో ఓ టీవీ చానెల్‌లో వచ్చిన రియాలిటీ షో చూశాడు. గ్యాస్‌ నూనె నోట్లో పోసుకొని పైకి ఊది అగ్గిపుల్ల వెలిగించాడు. దీంతో మంటలు శరీరమంతా వ్యాపించాయి. విశ్వనాథ్‌ను వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ విశ్వనాథ్‌ మృతి చెందాడు. బాలుడు పెద్దపల్లిలో ఓ ప్రైవేట్‌ హాస్టల్లో చదువుతున్నాడు. విశ్వనాథ్‌ తల్లి కుటుంబ కలహాలతో ఉరేసుకొని చనిపోయింది. దీంతో విశ్వనాథ్‌ అతని చెల్లి అమ్మమ్మ ఇంట్లోనే ఉంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:51 - July 21, 2017

హైదరాబాద్ : పూర్ణిమసాయి నగరంలోని తన తల్లిదండ్రుల చెంతకు చేరింది. జువైనల్ హోమ్ లో పూర్ణిమసాయికి సీడబ్ల్యుసీ కౌన్సిలింగ్ ఇచ్చారు. హోమ్ నుంచి తన తల్లిదండ్రులతో కలిసి పూర్ణిమసాయి బయల్దేరింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

15:22 - June 20, 2017

భారీ తలతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన చిన్నారి ఇక లేదు. సోమవారం రాత్రి ఆ చిన్నారి తుదిశ్వాస విడిచింది. త్రిపురకు చెందిన అబ్దుల్లా రెహమన్, ఫాతిమాలకు 'రూనా' కూతురు ఉంది. కానీ రూనా జననంతోనే పే...ద్ద తలకాయతో జన్మించింది. అరుదైన వ్యాధితో మంచమెక్కిన కూతురును బతికించుకోవాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రులకు తిరిగారు. రూనాను ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ లోని ఎఫ్ఎమ్ఆర్ఐ ఆసుపత్రిలో చేరిపించారు. 2013 నుండి రూనాకి ఉచితంగా చికిత్స అందిస్తోంది. రూనాకు వందలకొద్ది వైద్యులు ఆపరేషన్లు చేశారు. అయినా లాభం లేదని వైద్యులు పేర్కొనడంతో తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ ఓ సందర్భంలో చిన్నారి రూనా హాయిగా నవ్వుతుండడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. వైద్యచరిత్రలో రూనా ఒక అద్భుతం అంటూ వైద్యులు తెగపొడిగారు. దీనితో రూనాను త్వరలోనే స్కూల్ లో చేరిపించాలని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ చికిత్స మధ్యలోనే రూనా కన్నుమూయడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. సోమవారం తాను పనికి వెళ్లడం జరిగిందని సాయంత్రం 8:30 సమయంలో తన భార్య ఫోన్ చేసి.. రూనా బాగోలేదని చెప్పడంతో ఇంటికొచ్చానని తండ్రి తెలిపారు. కానీ అప్పటికే బిడ్డ ఊపిరి పీల్చడం ఆగిపోయిందని గద్గత స్వరంతో పేర్కొన్నారు. రూనా చికిత్స కోసం 'మై గుడ్ యాక్ట్' పేరిట సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఇందుకు రూ. 40 లక్షల వరకు డబ్బులు సమకూరాయి. కానీ రూనా ప్రాణాలు కోల్పోవడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు.

17:32 - June 12, 2017

చిత్తూరు : తిరుమలలో చిన్నారి రాధ మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. రాధ అనే నాలుగేళ్ల చిన్నారిని సవతి తల్లి అతి కిరాతకంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కర్ణాటకకు చెందిన దేవరాజు తిరుమలలో కూలి పని చేస్తుంటాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కూతురు రాధ గతేడాది ఆగస్ట్ 24న అదృశ్యమైనట్లు తిరుమల టూటౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసుని పలుకోణాల్లో దర్యాప్తు చేసిన పోలిసులు..చివరకు సవతి తల్లిని గట్టిగా విచారించగా తానే చిన్నారిని మట్టుబెట్టినట్లు ఆమె నేరాన్ని అంగీకరించింది. మృతదేహాన్ని పాపవినాశనం నడకదారిలో పూడ్చినట్లు తెలిపింది. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హత్యకు గురైన బాలిక అస్థికలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి తరలించారు.

21:19 - June 9, 2017

పశ్చిమగోదావరి : ట్రైన్‌లో ఇద్దరు చిన్నారుల్ని కుటుంబ సభ్యులు వదిలిపెట్టి వెళ్లిపోయిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నవాబ్‌ పాలెం రైల్వేస్టేషన్‌లో జరిగింది. ఒంగోలు పాసింజర్‌ ట్రైన్‌లో ఒంటరిగా కనిపించిన చిన్నారుల్ని గమనించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు అప్పగించారు. చిన్నారులు తమ పేర్లు, జోత్స్న, భానుగా చెబుతున్నారు. తాతతో ఇద్దరూ ట్రైన్ ఎక్కారని .. అయితే తాత మనవరాళ్లను వదిలి మధ్యలో ట్రైన్ దిగిపోయాడని తెలుస్తోంది. చిన్నారుల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించే పనిలో పడ్డారు. 

 

20:40 - March 30, 2017

ప్రకాశం : జిల్లాలోని బెస్తవారిపేట మండలం నేకునాంబాద్‌ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వాడాల నరేంద్ర అనే వ్యక్తి మూడో తరగతి చదువుతున్న బాలుడిని కాల్చి.. హింసించాడు. మెట్టెల వెంకట్రావు అనే అబ్బాయిని రాత్రంతా ఇంట్లో నిర్బంధించి ..ఒళ్లంతా సిగరెట్‌తో కాల్చాడు. గాయాలపాలైన బాలుడిని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా కేవలం పది రూపాయలు తీసుకుని.. తిరిగి ఇవ్వలేదనే నెపంతోనే ఇలా చేశాడని సమాచారం. 

 

15:15 - March 2, 2017

హైదరాబాద్ : నగరంలో మరో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓ చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జవహార్ నగర్ పరిధిలోని బాలాజీనగర్ లో చోటు చేసుకుంది. భరత్ నగర్ లో జిల్లా పరిషత్ లో కరుణ ఒకటో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం కరుణనను బలవంతంగా తీసుకెళుతుండగా అక్కడనే ఉన్న విద్యార్థులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కానీ వారిని ఎదుర్కొన్న మహిళ ఆటోలో పారిపోయేందుకు ప్రయత్నించింది. వెంటనే ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్స్ పాల్ కు తెలియచేశారు. స్పందించిన ప్రిన్స్ పాల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ కు పాల్పడిన మహిళను పట్టుకొనేందుకు ప్రయత్నించారు. ఆటోను వెంబడించి కిడ్నాప్ కు యత్నించిన మహిళను అదుపులోకి తీసుకుని చిన్నారిని రక్షించారు. ఆమెతో పాటు మరో చిన్నారి ఉన్నాడు. కిడ్నాప్ కు యత్నించిన మహిళ రజిత అని తేలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Pages

Don't Miss

Subscribe to RSS - child