cheating

12:08 - October 25, 2018

లూథియానా: ఖరీదైన బట్టలతో.. నోట్ల కట్టలతో ఓ జువెలెరీ షాపులోకి అడుగుపెట్టారు. మంచి గిరాకీ కదా అనుకున్నాడు పాపం ఆ షాపు యజమాని. దాదాపు రూ రెండు లక్షలకు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించారు ఆ ఖరీదైన దంపతులు. తీరా వారిచ్చిన నోట్లను పరిశీలించగా అవి ‘‘ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాంకు ఆఫ్ ఇండియా’’ పేరుతో ఉన్న నకిలీ నోట్లగా గుర్తించారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ సంఘటన పంజాబ్‌లోని లుథియానాలో జరిగింది.  
వివరాల్లోకి వెళితే.. ఓ జంట లుథియానాలోని ఓ జువెలరీ షాపుకు వెళ్ళారు. వారు 56 గ్రాముల బంగారం రూ. 1.90 లక్షలు పెట్టి ఖరీదు చేశారు. క్యాష్ పే చేశారు.. వెళ్ళిపోయారు. తీరా వాళ్లు వెళ్లిన తర్వాత చూసుకుంటే అవి నకిలీ నోట్లుగా గుర్తించాడు షాపు యజమాని శ్యామ్ సుందర్ వర్మ. దంపతులు నోట్లను పాలిథిన్ బ్యాగులో చుట్టి తెచ్చారు. లెక్క చూసిన తర్వాత డబ్బులు చెల్లించి వారు వెళ్లిపోయారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఆ కిలాడీ దంపతులు కారులో వచ్చినట్టు గమనించారు. కనీసం కారు మీద రిజిస్ట్రేషన్ నెంబరు కూడా లేకపోవడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఆ దంపతుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. 

 

 

19:50 - October 22, 2018

హైదరాబాద్ : సైబర్ క్రైమ్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ క్రైమ్ నేరగాళ్లు మూడు విధాలుగా అటాక్ చేస్తున్నారు. ’మనకు తెలియకుండానే మన ఖాతాలో డబ్బులు మాయం’ అవుతున్నాయి. వెయ్యి రూపాయలు డ్రా చేస్తే క్షణాల్లో అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉంటుంది. సైబర్ క్రైమ్ నేరగాళ్ల మెసాలపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. అనుమానం వస్తే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల మెసాలపై పోలీసులు ఒక వీడియోను విడుదల చేశారు. 

 

13:59 - October 7, 2018

సూర్యాపేట : జిల్లాలో ఆంధ్రాబ్యాంకు ఏటీఎంలో పెట్టే నగదులో అవకతవకలు జరిగాయి. సొంత సంస్థకే క్యాషియర్ కన్నం పెట్టాడు. ఆంధ్రాబ్యాంక్‌ను బురిడీ కొట్టించాడు. ఆంధ్రాబ్యాంకు హుజూర్‌నగర్ బ్రాంచ్‌లో గంగాధర రామకృష్ణ 3 సంవత్సరాలుగా హెడ్ క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ఈనేపథ్యంలో రామకృష్ణ చేలివాటం ప్రదర్శించారు. రూ.58.89 లక్షలతో రామకృష్ణ పరాయ్యారు. బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

 

17:40 - September 25, 2018

హైదరాబాద్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్‌తో కేటుగాళ్లు కోట్లు కొట్టేశారు. అమ్మాయిలతో ఫోన్లు మాట్లాడించి జేబులకు చిల్లు పెట్టారు. కేటుగాళ్ల చేతిలో సుమారు 150 మందికి పైగా బాధితులు మోసపోయారు. ఒక్కొకరి నుంచి రూ.10 వేల నుంచి రూ.15 లక్షల వరకు దోపిడీ చేశారు. లవ్ పేరుతో పలు వెబ్‌సైట్‌లను ముఠా క్రియేట్ చేసింది. అమ్మాయిలతో బాధితులకు ఎర వేశారు. హీరోయిన్ ఫొటోలు పెట్టి మోసాలకు పాల్పడ్డారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో ముఠా మోసం బయటపడింది. 15 లక్షలు మోసపోయిన బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ముఠా డొంక కదిలింది. పరువుతో చాలా మంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాని వైనం నెలకొంది. సైబరాబాద్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.

 

19:48 - September 12, 2018

న్యూఢిల్లీ: దాదాపు రూ 9 వేల కోట్ల పై చిలుకు బ్యాంకులకు టోకరావేసి విదేశాలలో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఈ సారి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీను ఇరుకున పెట్టేవిధంగా వ్యాఖ్యలు చేశాడు. లండన్ కోర్టులో కేసు విచారణకు హాజరైన సందర్భంగా మాల్యా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి.

తాను జెనీవాకు తరలి వెళ్లేముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి బ్యాంకులతో ఆర్థిక వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా కోరినట్టు మాల్యా వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఈ కుంభకోణంలో బీజేపీ నేతల హస్తం ఉందని రుజువైందని విమర్సలకు దిగారు. దీనిపై స్పందించిన అరుణ్ జైట్లీ తన ఫేస్ బుక్ పోస్టింగ్ లో మాల్యా ఆరోపణలను ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవం.. సత్యదూరమని పేర్కొన్నారు.

13:59 - July 12, 2017

కామారెడ్డి :  పట్టణంలో విత్తనాల వ్యాపారం చేస్తున్న మోహన్‌ ఊర్లో నుంచి ఉడాయించాడు. తీరా కారణాలు వెలికితీస్తే 16 కోట్ల రూపాయల మేర టోకరా వేసినట్లు బయటపడింది. గత నాలుగు రోజుల నుంచి మోహన్‌ పత్తా లేకుండా పోయాడు. మరోవైపు షాపుకు తాళాలు వేసి ఉండడంతో పాటు.. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. తాము మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. డైలీ మార్కెట్‌లో నివాసం ఉండే మోహన్‌... 20 ఏళ్లుగా కామారెడ్డి జిల్లాతో పాటు.. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో రైతుల దగ్గర నుంచి ధాన్యం, సోయ, పెసర్లు, మినుములు కొనుగోలు చేస్తున్నాడు. ఇతరుల కంటే కొద్దిగా ఎక్కువ ధర ఇస్తానని చెప్పడంతో అందరూ ఈయనకే పంటలు అమ్ముతున్నారు. అయితే.. ఒకేసారి డబ్బులు చెల్లించకుండా విడతలవారీగా చెల్లిస్తానని రైతులను నమ్మించాడు. ఇలా అనేక లక్షల మేర పంటలను రైతుల నుంచి కొనుగోలు చేశాడు. మరోవైపు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ఇతర వ్యాపారుల వద్ద కూడా భారీగా అప్పులు చేశాడు. రైతులకు పంటలు వేసుకునే సమయానికి డబ్బులు ఇస్తానన్నాడు. గత నాలుగైదు రోజుల నుంచి మోహన్‌ కనిపించకుండాపోవడంతో... రైతులు షాపు వద్దకు వచ్చారు. తాళాలు వేసి ఉండడంతో ఫోన్లు చేశారు. ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ చేసి ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులను అడిగితే తమకు కూడా ఎలాంటి సమాచారం లేదంటున్నారు. దీంతో తామంతా మోసపోయామని బాధితులంటున్నారు.

తన కూతురి పెళ్లి కోసం
ఇదిలావుంటే మరికొంతమంది స్థానికులు కూడా మోహన్‌ వద్ద డబ్బులు దాచుకున్నారు. తన కూతురి పెళ్లి కోసం డబ్బులు దాచుకుంటే... ఇప్పుడు ఇలా జరిగిందని.. ఏం చేయాలో అర్ధం కావడం లేదని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక మోహన్‌ మోసాలపై బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు.. ఇతర ప్రజాప్రతినిధులను కలిసేందుకు కూడా బాధితులు సిద్దమవుతున్నారు. ఎలాగైనా మోహన్‌ను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 

16:37 - June 13, 2017

హైదరాబాద్‌ : హబ్సిగూడలో స్వామిజీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి వ్యవహారం వెలుగుచూసుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన తపస్వి అలియాస్ ప్రభాకర్.. మాయమాటలతో తన వద్దకు వచ్చేవారిని మోసం చేస్తున్నాడు. తన వద్దకు వచ్చిన జలజాక్షి అనే మహిళను బురిడీ కొట్టింది... ఆమె ఆస్తులు అమ్మించాడు. డబ్బులు అడిగితే... తనకేం సంబందం లేదని చెప్పంతో... బాధితురాలు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయని పక్షంలో సూసైడ్ చేసుకుంటానని చెబుతోంది. 

18:12 - October 9, 2016

హైదరాబాద్ : '30 ఇయర్స్ ఇండ్రస్ట్రీ' అంటే ఠక్కున 'పృథ్వీ' పేరుకు గుర్తుకు వస్తుంది. అనతికాలంలోనే కమెడీయన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన నటుడు. ఈ నటుడిపై పోలీసు కేసు నమోదైంది. పెళ్లి పేరిట తనను వేధిస్తున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కానీ ఈ కేసును రాజీ కుదుర్చినట్లు తెలుస్తోంది. 2001లో కవిత అనే మహిళతో పృథ్వీకి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఇద్దరు పిల్లల బాద్యత తాను తీసుకుంటానని పృథ్వీ పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం పృథ్వీ మరో వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే తనను వేధిస్తున్నాడంటూ కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఇద్దరూ రాజీకి వచ్చారని తెలుస్తోంది. 

21:51 - June 18, 2016

హైదరాబాద్ : బురిడీ బాబా శివతో పాటు మరో ఇద్దరికి పదిరోజుల పాటు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. శివతో పాటు నిందితులు దామోదర్, శ్రీనివాస్ రెడ్డిలను చంచల్ గూడ జైలుకు తరలించారు. డబ్బు కోసం తాను మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని చంపాలనుకున్నానని శివ బంజారాహిల్స్ పోలీసుల విచారణలో చెప్పాడు. తనకు శ్రీనివాసరెడ్డి, దామోదర్ సహకరించినట్లు తెలిపాడు. పూజలో పెట్టిన 1.30 కోట్లను పది కోట్ల రూపాయలుగా చేస్తానని వాళ్లను నమ్మించానన్నాడు. మధుసూదన్ రెడ్డిని తనకు మొదట్లో పరిచయం చేసిన మోహన్‌రెడ్డి.. తన వద్ద 20 వేల రూపాయలు తీసుకున్నాడని చెప్పాడు. రైస్ పుల్లింగ్, డబ్బును డబుల్ చేయడం, బ్లాక్ మ్యాజిక్ పేర్లతో తాను ఇన్నాళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నట్లు వెల్లడించాడు. దొంగబాబా శివను ఐదురోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టును బంజారాహిల్స్ పోలీసులు కోరారు. దీనిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

16:58 - June 18, 2016

హైదరాబాద్ : బురిడీ బాబా శివతో పాటు మరో ఇద్దరికి పదిరోజుల పాటు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. శివతో పాటు నిందితులు దామోదర్, శ్రీనివాస్ రెడ్డిలను చంచల్ గూడ జైలుకు తరలించారు. 17 మంది సాక్షులను రిమాండ్ రిపోర్టులో చేర్చిన పోలీసులు వారం రోజుల పాటు తమకు కస్టడికి ఇవ్వాలని పిటిషన్ వేసేందుకు సిద్దమయ్యారు. న్యాయవాదుల కోర్టు బహిష్కరణ ఉండటంతో నిందుతులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోలేదు. 

Pages

Don't Miss

Subscribe to RSS - cheating