chandrababu naidu

11:27 - September 17, 2018

విజయవాడ :  బాబ్లీ ప్రాజెక్టు వారంట్లను తెలుగు రాష్ట్రాల ప్రజలను నిరసించారని, ఒకవైపు పాత కేసులు తవ్వితోడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. మరోవైపు తప్పుడు సర్వేలు చేయిస్తున్నారని, ఇంకోవైపు శాంతిభద్రతలను దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. కొందరిని రెచ్చగొట్టి అశాంతి సృష్టించాలని చూస్తున్నారని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
అసెంబ్లీ వ్యూహ కమిటీ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్్స నిర్వహించారు. ఇంకా మూడు రోజులు మాత్రమే సమావేశాలున్నాయని, అర్థవంతమైన చర్చతో ప్రజలను ఆకట్టుకోవాలని ఈ విరామంలో ‘జలసిరికి హారతి’ నిర్వహించడం జరిగిందన్నారు. రైతుల నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. జలసంరక్షణపై ప్రజలను చైతన్యపరచడం జరిగిందని పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ వెబ్ సైట్ కు స్పందన బాగుందని చెప్పుకొచ్చారు.

07:04 - September 11, 2018

విజయవాడ : ఆపరేషన్‌ గరుడ.  ఏపీలో అధికారంలోకి రావడానికి బీజేపీ పెట్టుకున్న పేరు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ లబ్ది పొందేందుకు తీసుకొచ్చిన ఆపరేషనే గరుడ. బీజేపీ ఆపరేషన్‌ గరుడను ఏపీ ప్రయోగిస్తోందని బయటపెట్టింది హీరో శివాజీ. ఆపరేషన్‌ గరుడ ప్రయోగించి ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోందని ఆయన పలుమార్లు ఆరోపించారు. గరుడ ఎలా ఉండబోతోందో వీడియో చేసి చూపించారు.  మొన్నటికి మొన్న  ఆపరేషన్‌ గరుడ మరో రూపం దాల్చిందని చెప్పారు.  అతి త్వరలో చంద్రబాబుకు నోటీసులు వస్తాయని.... ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేయడం కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆయన ప్రధాన ఆరోపణ. 

ఆపరేషన్‌ గరుడపై ఏకంగా ఏపీ అసెంబ్లీలోనూ చర్చకొచ్చింది. సీఎం చంద్రబాబు బీజేపీ ఆపరేషనైన గరుడపై నోరు విప్పారు.  కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్‌ గరుడను చంద్రబాబే సృష్టించారని బీజేపీ నేతలు సభలో అన్నారు. దీంతో కోపోద్రిక్తుడైన చంద్రబాబు... తనను దెబ్బతీసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ గరుడ ప్రయోగిస్తోందని మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని విపక్షాలను భయపెట్టాలని బీజేపీ నేతలు చూస్తోన్నారని చెప్పారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని బీజేపీ నేతలు  గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం సరైందికాదన్నారు. ఆపరేషన్‌ గరుడకు సంబంధించిన  సాక్ష్యాధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. మోదీ ముసుగు వేసుకుని కొందరు డ్రామాలాడుతున్నారని... ముసుగువీరుల ఆటలు ఏపీలో సాగబోవని ఆయన హెచ్చరించారు. మొత్తానికి ఏపీ అసెంబ్లీలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఆపరేషన్‌ గరుడపై మాటలయుద్ధం సాగింది. దీంతో మరోసారి ఆపరేషన్‌ గరుడ తెరపైకి వచ్చింది.

15:44 - September 10, 2018

విజయవాడ : పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అన్ని వర్గాలకు భారంగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన ఓ ప్రకటన చేశారు. పెట్రోల్ ధరలపై రూ. 2 వ్యాట్ ను తగ్గించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు రూ. 1200 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుందని తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ప్రస్తుతం రూ. 4లను ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇంధన ధరలు తగ్గించేందుకు నాలుగేళ్లుగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కేంద్రం బాధ్యతగా వహించి ఎక్సైజ్ పన్నును తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగానే ఉన్నాయని, రూ. 20 లక్షల కోట్లకు పైగా ప్రజలపై కేంద్రం అదనంగా భారం వేస్తోందన్నారు. 

12:03 - September 10, 2018

విజయవాడ : మాజీ మంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శికి వసంత ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై సోమవారం అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో సీఎం బాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై బాబు సీరియస్ గా స్పందించారు. బెదిరింపులు..హత్యలతో ఏమీ సాధించలేరని...ఇలాంటి చర్యలను సహించేది లేదని..ఎంతటి వారైనా తీవ్రస్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు. మంత్రిని హత్య చేస్తామనే ధోరణిలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని వ్యూహ కమిటీకి సూచించారు. ఇప్పటికే కేసు నమోదైందని వ్యూహ కమిటీ సభ్యులు బాబు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలోనూ ఈ ప్రస్తావన తీసుకరావాలని బాబు సూచించారు. 

09:14 - September 10, 2018

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. సభకు ఎవరూ గైర్హాజర్ కావొద్దని, చర్చలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సమావేశాలకు వైసీపీ గైర్హాజర్ అయిన సంగతి తెలిసిందే. 

20:26 - September 6, 2018

విజయవాడ : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం చంద్రబాబునాయుడు క్లాస్ పీకినట్లు వార్తలు వస్తున్నాయి. పదవులు పొందిన తర్వాత బాధ్యతలు విస్మరిస్తున్నారంటు ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్. వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించేందుక బాబు యోచించారు. నివాళి అర్పించే సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆగ్రహానికి కారణమైందని తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయాలు మారిపోతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. 

22:10 - January 5, 2018

తూర్పుగోదావరి : జిల్లాలోని టీడీపీలో వర్గ పోరు బయటపడింది. అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి మండలం పెద్దాడ జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు మధ్య వాగ్వాదం జరిగింది. గతంలో జరిగిన 'మన ఇంటికి మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో తనను దూషించారని బొడ్డు భాస్కరరామారావు... వాదనకు దిగడంతో ఘర్షణ వాతావారణం నెలకొంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ మధ్య మాటామాట పెరగడంతో.. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. దీంతో కార్యక్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెల్లాచెదురు చేసి... భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

 

16:41 - October 9, 2017
15:36 - October 8, 2017

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ వెళ్లారు. మీడియా ప్రతినిధులు పలకరించగానే.. దారిలో వెళ్తూ ఇటువైపు వచ్చానని మాట మార్చారు. తరువాత అల్టిమేట్‌గా ప్రజలే న్యాయ నిర్ణేతలని తలసాని అన్నారు. ఎవరి స్థాయి ఏంటో ప్రజలు నిర్ణయిస్తారని జానారెడ్డికి చురకలంటించారు. తమ ప్రభుత్వం బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని.. ప్రతిపక్షాల నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

19:19 - October 7, 2017

పశ్చిమగోదావరి : జిల్లా భీమవరం మండలం, తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఏర్పాట్లు చేసుకున్నారు. గత కొంత కాలంగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా 32 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యే కనీసం ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లాలని తెలపడంతో.. తుందుర్రు గ్రామానికి వెళ్ళడానికి రామాంజనేయులు ఏర్పాట్లు చేశారు. పనిలో పనిగా అధికారులు కూడా గ్రామంలో నిర్మించిన రోడ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసి.. శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. కానీ తెల్లవారే సరికి గ్రామస్తులు శిలాఫలకాన్ని కూల్చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - chandrababu naidu