chandrababu government

13:56 - August 24, 2018

విజయవాడ : కౌన్సిలర్‌గా గెలవలేని బీజేపీ నేతలు కూడా మాట్లాడ్డం దురదృష్టకరమన్నారు మంత్రి నక్కా ఆనందబాబు. తగులబెట్టి మీదవేసి.. తుడిచుకోండి అన్నచందంగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి లబ్ది చేకూర్చేందుకే బీజేపీ నేతలు టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారంటున్న మంత్రి నక్కా ఆనందబాబుతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:32 - August 19, 2018

హైదరాబాద్ : మరోసారి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెలుగుదేశం పార్టీ తెర‌దీస్తోందా...? పార్టీ అవ‌స‌రాల మేర‌కు చేరిక‌ల‌కు అధినేత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా...? టీడీపీ తీర్ధం పుచ్చుక‌నేందుకు ఆస‌క్తి చూపుతొన్న నేత‌లెవ‌రు...? ఎవ‌రి రాక‌కై తెగుగుదేశం ఎదురుచూస్తొంది..? మ‌రి ప్ర‌స్తుతం పార్టీలొఉన్ నేత‌ల ప‌రిస్తితేంటి..? ఎన్నిక‌లు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేలా బాబు మార్కు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2 మాస్ట‌ర్ ప్లాన్ పై స్పెషల్ ఫొక‌స్ ఇప్పుడు చూద్దాం....!!!
ఆపరేషన్‌ ఆకర్ష్‌ 2 జాబితాలో ప‌లువురు సీనియ‌ర్లు
సార్వత్రిక ఎన్నిక‌లు సమీపిస్తుండడంతో..  చేరికలతో తనదైన వ్యూహాలకు పదునుపెడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ చేపట్టనున్న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్-2 జాబితాలో ప‌లువురు సీనియ‌ర్లు ఉన్నట్లు స‌మాచారం. శ్రీకాకుళం జిల్లానుంచి కొండ్రుముర‌ళీని  చేర్చుకోవాలని భావిస్తుండగా.. విశాఖ‌ నుంచి స‌బ్బం హ‌రితోపాటు.. కొణ‌తాల రామకృష్ణ టార్గెట్‌గా ఉన్నట్లు సమాచారం. స‌బ్బం హ‌రికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే సీటు, కొణ‌తాలకు అన‌కాప‌ల్లి పార్లమెంట్ సీటు ఇచ్చే అవ‌కాశం కనిపిస్తోంది. ఇక తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్‌ను సైకిలెక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఆయనకు రాజ‌మండ్రి ఎంపీ, లేదా  ఎమ్మెల్యే సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈమ‌ధ్య ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చంద్రబాబుతో బేటీ కావ‌డం ఈ వాద‌న‌కు బ‌లాన్నిస్తోంది. 
క‌డ‌ప జిల్లాలో పాగా వేసేయోచనలో టీడీపీ
వైసీపీకి కంచుకోట వంటి క‌డ‌ప జిల్లాలో పాగా వేయాల‌నీ చూస్తోంది. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డిని పార్టీలొ చేర్చుకొని మంత్రి పదవి కూడా బట్టబెట్టింది.  అలాగే ప్రజాద‌ర‌ణగల మాజీ మంత్రి డిఎల్ ర‌వీంద్రారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాల‌ని బావిస్తున్నట్లు తెలుస్తోంది. సుదీర్గ రాజ‌కీయ‌ అనుభ‌వంతోపాటు.. వైఎస్ వ్యతిరేఖిగా  గుర్తింపు ఉన్న  డీఎల్‌తో పార్టీకి కలిస కలిసొస్తుందని టీడీపీ భావిస్తోంది. సైకిలెక్కేందుకు డీఎల్‌ సైతం సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం.   మైనారిటీ వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా కూడా టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికోసం టీడీపీ ఎదురుచూపులు
ఇక మాజీ సీఎం కోట్ల విజ‌య‌భాస్కర్‌ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికోసం  టీడీపీ ఎప్పట్నుంచో ఎదురుచూస్తోంది. కాగా డిప్యూటీ సీఎం కేఈ వ్యతిరేకించడంతో వెన‌క్కి త‌గ్గిన‌ట్లు సమాచారం. అనంత జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న  యామిని బాల‌పై ప్రజల్లో వ్యతిరేకత దృష్ట్యా.. మాజీ మంత్రి శైలజా నాథ్‌ను  చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆయనకు సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే సీటు కేటాయించే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం.  ప్రకాశం జిల్లా లో క‌నిగిరి ఎమ్మెల్యే క‌దిరి బాబూరావుప‌ట్ల ప్రజ‌ల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న నేరథ్యంలో... ఉగ్రన‌ర‌సింహారెడ్డిని చేర్చుకునేందుకు సిద్దమౌవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీనుంచి వెళ్లిన దాడి వీర‌భ‌ద్రరావు లాంటి నేత‌ల‌ను కూడా తిరిగి చేర్చుకునేందుకు టీడీపీ సిద్దంగా ఉంది.  ఈ మేరకు దాడి వీరభద్రరావు టీడీపీలోని తన స‌న్నిహితుల‌తో సంప్రదింపులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. 
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2 ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో?  
పరిమితంగానే ఉండబోయే చేరికలతో.. సొంత‌పార్టీ నేత‌ల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని టీడీపీ సీనియ‌ర్లు బావిస్తున్నారు. బలమైన నేతలను చేర్చుకుని.. ప్రతిపక్షాలకు చెక్‌ పెట్టాలని చూస్తున్నారు టీడీపీ అధినేత. చంద్రబాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2 ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 

 

12:54 - August 13, 2018

గుంటూరు : పల్నాడులో ఉద్రిక్త  వాతావరణం నెలకొంది. అక్రమ మైనింగ్‌ను సందర్శించేందుకు సిద్ధమైన వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్ చేశారు. నర్సారావుపేటలో కాసు మహేష్‌రెడ్డి, మాచర్లలో రామకృష్ణారెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పల్నాడు, దాచేపల్లి, గురజాలలో 144 సెక్షన్‌ను విధించారు.

 

12:34 - August 13, 2018

గుంటూరు : పల్నాడులో ఉద్రిక్త  వాతావరణం నెలకొంది. అక్రమ మైనింగ్‌ను సందర్శించేందుకు సిద్ధమైన వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్ చేశారు. నర్సారావుపేటలో కాసు మహేష్‌రెడ్డి, మాచర్లలో రామకృష్ణారెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పల్నాడు, దాచేపల్లి, గురజాలలో 144 సెక్షన్‌ను విధించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:51 - August 12, 2018

విజయవాడ : విజయవాడ : వెట్టిచాకిరి నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని పాలకులు చెబుతున్నా.. అది అందని ద్రాక్షగానే కనిపిస్తోంది. చట్టాలను పరిరక్షించాల్సిన చోటే... కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా సర్కార్‌ కళ్లులేని కబోదిలా వ్యవహరిస్తోంది. ఈ శ్రమదోపిడీ ఎక్కడో కాదు... సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలోనే జరగడం దారుణం.

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో దాదాపు 130 మంది కార్మికులు హౌజ్‌ కీపింగ్‌ పనులు చేస్తున్నారు. అయితే వీరిలో చాలా వరకు రాజధాని అమరావతి నిర్మాణానికి పంటపొలాలు కోల్పోయిన రైతులు, రైతు కూలీలు ఉన్నారు. దీంతో రైతు కూలీలలో కొందరికి సచివాలయంలో హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగాలు ఇచ్చారు. అయితే సచివాలయంలో హౌస్‌కీపింగ్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఎస్‌కె ఎంటర్‌ప్రైజేస్‌ సంస్థ.. వీరితో పనులు చేయిస్తోంది. కూలీ పనులు లేకపోవడంతో ఈ పనులు చేసేందుకు వచ్చిన కార్మికులతో ఆ సంస్థ వెట్టిచాకిరి చేయిస్తోంది. లేబర్‌యాక్ట్‌ ప్రకారం కార్మికులతో రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేయించాల్సిన సంస్థ.. వారితో 10 గంటలు శ్రమదోపిడీ చేస్తోంది. అంతేగాక నెలకు ఎనిమిది వేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పి.. ఫీఎఫ్‌ కటింగ్‌ పేరుతో 6,400 రూపాయలు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుంటోంది. పీఎఫ్‌ నెంబర్‌ చెప్పమని ఎవరైనా కార్మికులు అడిగితే వారిని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు. మరోవైపు ఇచ్చే జీతం కూడా సరిగ్గా ఇవ్వకుండా రెండు, మూడు నెలలకోసారి ఇస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక ఎస్‌.కె. ఎంటర్‌ ప్రైజెస్‌ ఉద్యోగులు మహిళలపై వేధింపులకు పాల్పడిన ఘటనలు కూడా కోకొల్లలు ఉన్నాయి. వారి వేధింపులు తట్టుకోలేక బాధిత మహిళలు జర్నలిస్టుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్టులు ఈ అంశాన్ని... ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్‌ దృష్టికి వెళ్లటంతో... ఇంటెలిజెన్స్‌ రిపోర్టు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. నివేదికలోనూ మహిళలపై ఆరోపణలు నిజమేనని తేలడంతో... ఎస్‌కే ఎంటర్‌ప్రైజెస్‌ ఇన్‌చార్జ్‌ రావ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.
పేదవాడి కోసం పెదవికి చేటు అన్నట్టు రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చి ఉపాధి కోల్పోయిన వారిని మాత్రమే సచివాలయంలో హౌస్‌కీపింగ్‌లో నియమించాలి. కానీ... కాంట్రాక్ట్‌ సంస్థ మాత్రం వారితో రోడ్లను సైతం ఊడిపిస్తున్నారు. చేసే పనులు అలవాటు లేక.. మరోవైపు ఉపాధి లేకపోవడంతో... వారు చీపుర్లు పట్టుకుని కిలోమీటర్ల రోడ్లను ఊడుస్తున్నారు. ఇదిలావుంటే.. మరోవైపు హౌస్‌కీపింగ్‌ కార్మికులకు సచివాలయ క్యాంటీన్‌లో వివక్ష కొనసాగుతోంది. ఉద్యోగులకు ఇచ్చే సబ్సిడీ భోజనం సైతం వీరికి పెట్టడం లేదు. పాలకులు ఉండే సచివాలయంలోనే కార్మికులను దోపిడీ గురి చేస్తుంటే... మరి ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని పలువురంటున్నారు. 

15:09 - August 12, 2018

ప్రకాశం : ఈడీ ఛార్జీషీట్ లో వైఎస్ భారతి పేరు చేర్చడం...దానిపై తీవ్రస్థాయిలో స్పందించిన వైసీసీ అధ్యక్షుడు జగన్ బహిరంగంగా ప్రజలకు లేఖ రాయడం..దీనిపై ఏపీ టిడిపి మంత్రులు విమర్శలు చేయడం..ప్రతిగా వైసీపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. తాజాగా రోజా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై దుమ్మెత్తిపోశారు. టిడిపి మంత్రులు దిగజారి వైఎస్ భారతిపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఏడేళ్లుగా సీబీఐ విచారణలో లేని భారతి పేరు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. జగన్ సతీమణి భారతిని రాజకీయ వివాదాల్లోకి లాగడం సరికాదని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా కుటుంబసభ్యులున్నారని పేర్కొన్నారు. కుటుంబసభ్యులను వివాదలోకి లాగడం నీచమని, తప్పు చేయని కుటుంబాన్ని రాజకీయంగా కుంగదీయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. ఒక రోజు వస్తుందని రోజా పేర్కొన్నారు.

08:25 - August 11, 2018

ఈడీ ఛార్జీషీట్ లో భారతి పేరుందని వచ్చిన కథనాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. రఘురాం సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదులో జగన్ సతీమణి వైఎస్ భారతిని 5వ నిందితురాలిగా పేర్కొంది. దీనిపై శుక్రవారం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఛార్జీషీట్ ను సీబీఐ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకముందే పత్రికల్లో వార్తలు ఎలా ప్రచురిస్తారని ప్రశ్నించారు. సీబీఐ విచారణలో లేని అంశాలు ఇన్నేళ్ల తరువాత ఈడీ ఛార్జీషీట్ లోకి ఎందుకొచ్చాయని, వైఎస్ భారతికి ఈ కేసులతో సంబంధం ఏంటీ ? ప్రశ్నించారు. ఇదే అంశంపై నిర్వహించిన 
చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత కొండారాఘవరెడ్డి, టీడీపీ నేత పట్టాభి రామ్ పాల్గొని, మాట్లాడారు. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

15:18 - August 9, 2018

గుంటూరు : తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బిజెపికి టిడిపి తాకట్టుపెట్టిందని వైసీపీ పేర్కొంది. గుంటూరు జిల్లాలో గురువారం వంచనపై గర్జన కార్యక్రమం నిర్శహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు టిడిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎంగా చంద్రబాబు ఉన్నంతకాలం ఏపీకి హోదా రాదని, జగన్ తో విభజన హామీలు అమలవుతాయన్నారు.

బాబు అనుభవం అప్పుల పాలు..
చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల అనుభవం అప్పుల పాలు చేసిందని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ప్రజల కోసం జగన్ అలుపెరుగని పోరాటం చేస్తుంటే జగన్ ను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తిపై కుట్రలు పన్నడం ధర్మం కాదన్నారు. 

19:14 - August 1, 2018

ఢిల్లీ : టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం స్పీకర్‌ను పావులా వాడుకోవలనుకోవడం బాధకరమన్నారు కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ. ప్రభుత్వం ప్రజలను, ప్రతిపక్షాలను, మిత్రపక్షాలను తప్పుదోవ పట్టించినట్లే స్పీకర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం వివరాలు తెలిసిన వారి ముందు స్పీకర్‌ను దోషిగా నిలబేట్టిందని మండిపడ్డారు. తప్పుడు ప్రసంగం చేయించిన వారిపై స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వంచే శ్వేతపత్రం విడుదల చేయించాలని కేవీపీ డిమాండ్ చేశారు.

21:39 - July 31, 2018

ఢిల్లీ : విశాఖ రైల్వేజోన్ ఇక లాంఛనమేనని.. త్వరలోనే రైల్వే జోన్‌పై అధికారిక ప్రకటన వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తెలిపారు. రైల్వే జోన్‌పై స్వలాభం కోసం దీక్షలు, కాగడాల ప్రదర్శన వంటి కార్యక్రమాలు చేయవద్దని రాజకీయ పార్టీలను కోరారు. ప్రజల్లో లేని పోని అనుమానాలు కల్పించవద్దని.. రైల్వేజోన్‌ బీజేపీ తీసుకువస్తుందని విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు. రైల్వే జోన్ కోసం అన్నీ విధాలా తాము ప్రయత్నిస్తున్నామని.. రైల్వేజోన్‌ పై పియూష్‌గోయాల్‌ హామీ ఇచ్చారని పీవీయన్‌ మాధవ్‌ అన్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - chandrababu government