chandrababu

09:40 - November 17, 2018

హైదరాబాద్: నందమూరి సుహాసిని తన కూతురితో సమానమని, ఆమెని గెలిపించడం తన బాధ్యత అని టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి అన్నారు. కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా సుహాసిని బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాబాయ్ బాలకృష్ణ, కుటుంబసభ్యలతో కలిసి ఆమె ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. సుహాసిని వెంట పెద్దిరెడ్డి కూడా ఉన్నారు.
తానెప్పుడూ కూకట్‌పల్లి అభ్యర్థిని అని చెప్పలేదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నారాయన. బరిలో ఎవరున్నా గెలిపించడం తమ బాధ్యత అన్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తామని, సుహాసిని విజయానికి కృషి చేస్తామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. నందమూరి సుహాసినికి ఎలాంటి స్వార్ధం లేదని, ప్రజాసేవ కోసమే ఆమె రాజకీయాల్లోకి వచ్చారని పెద్దిరెడ్డి వెల్లడించారు. కొత్త వాళ్లకు కూడా అవకాశం కల్పించే చర్యలో భాగంగా సుహాసినికి టికెట్ ఇచ్చినట్టు పెద్దిరెడ్డి పేర్కొన్నారు. బరిలో ఎవరున్నా గెలిపిస్తానని చెప్పారు. సుహాసినిని గెలిపించడమే కాకుండా కూకట్‌పల్లి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు. ప్రజలు మెచ్చుకునే విధంగా పాలన అందిస్తామన్నారు. ఈ నెల 22 తర్వాత ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుందని, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రచారానికి వస్తారని పెద్దిరెడ్డి వెల్లడించారు.

18:31 - November 16, 2018

హైదరాబాద్ : అనుకోకుండా అదృష్టం వరించి రావటమంటే ఇదే. ఏమాత్రం రాజకీయ అనుభవం లేదు..అసలు ఆమె ఎవరో ప్రజలకు తెలీదు. ఎన్నికల్లో సీట్ కోసం నేతలు నానా పాట్లు పడుతుంటే  రాత్రికి రాత్రే ఎమ్మెల్యే అభ్యర్థిగా అవతంరించింది దివంగత నేత, టీడీపీ మాజీ ఎంపీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వయానా బావమరిది అయిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని. చంద్రబాబు ఆమెను కుకట్ పల్లి సీట్ కేటాయించటంతో సుహాసిని ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ ప్రతినిధులు ఆమెకు నామినేషన్ పత్రాలను అందించారు. రేపు ఉదయం తాత ఎన్టీఆర్, నాన్న హరికృష్ణలకు నివాళి అర్పించిన అనంతరం ఆమె నామినేషన్ వేయనున్నారు. మరోవైపు, సుహాసిని సడన్ ఎంట్రీతో కూకట్ పల్లి నియోజకర్గ ఎన్నికల పర్వం వేడెక్కింది. టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఆమె తరపున ప్రచారానికి ఆమె సోదరులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు కూడా వచ్చే అవకాశం ఉంది. 
 

19:46 - November 14, 2018

కాకినాడ: పార్టీలు చేసే కుల రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదన్నారు. తాను బతికుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుల రాజకీయాలతో పాడు చేయనివ్వని పవన్ హామీ ఇచ్చారు. జనసేన దృష్టిలో అన్ని కులాలు, మతాలు ఒక్కటే అని పవన్ స్పష్టం చేశారు. అవసరమైతే ఓటమిని అయినా అంగీకరిస్తాను కానీ నా సిద్దాంతాన్ని మాత్రం మార్చుకోనని పవన్ తేల్చి చెప్పారు. ఆఖరికి సీఎం చంద్రబాబు కూడా తన సామాజికవర్గాన్ని ఒక్కమాట కూడా అనే ధైర్యం లేదన్నారు. తాను మాత్రం అలా కాదని, తన సామాజికవర్గంలో జరిగే తప్పుల గురించి బలంగా మాట్లాడగలనని పవన్ చెప్పారు. బీజేపీ హిందువుల పార్టీ కాదని పక్కా పొలిటికల్ పార్టీ అని పవన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పవన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

21:48 - November 13, 2018

తూర్పుగోదావరి: రాష్ట్ర విభజనతో తీవ్ర మనస్తాపం చెందానని, అందుకే పార్టీ పెట్టానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల వల్లే రాష్ట్ర విభజన జరిగిందని పవన్ ఆరోపించారు. రామచంద్రాపురంలో బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని పవన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై పవన్ ఫైర్ అయ్యారు. ఎన్నో త్యాగాలు చేసి చంద్రబాబుకి సాయం చేస్తే, ఆయనేమో కాంగ్రెస్ వాళ్లతో చేతులు కలపడం బాధేసిందన్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని పవన్ ధ్వజమెత్తారురు. టీడీపీ నేతలు కులాలను కించపరుస్తున్నారని పవన్ మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్‌పైనా పవన్ విమర్శలు గుప్పించారు. తన ఇంటి ఆడవాళ్లని తిట్టే ధైర్యం ఉంది కానీ తెలంగాణలో మాత్రం తిరగలేరా? అని జగన్‌ను ప్రశ్నించారు.

18:59 - November 13, 2018

విజయవాడ: అమరావతిలో టీడీపీ వ్యూహ కమిటీ ప్రతినిధులతో భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన నమ్మక ద్రోహాన్ని ఇంటింటికీ తిరిగి వివరించాలని చంద్రబాబు సూచించారు. కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలన్నారు. పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, ఎలక్షన్-2019 మిషన్‌పైనా చంద్రబాబు సమీక్షించారు. ఇక అభ్యర్థులకు టికెట్లు విషయంపైనా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలపై ప్రజామోదం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని చెప్పిన చంద్రబాబు ఈసారి గెలిచే వారికి, ప్రజామోదం ఉన్న వారికే టికెట్లు కేటాయిస్తామన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండే వారికే పార్టీ తరపున ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని, ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ జరపాలని సూచించారు.

ఈ నెల 20న నెల్లూరులో, 27న విజయనగరంలో ధర్మపోరాట సభలు ఉంటాయన్నారు. ఆ తర్వాత శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో నిర్వహిస్తామని చెప్పారు. చివరగా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉమ్మడి ధర్మపోరాట సభను నిర్వహిస్తామని, ఈ సభకు జాతీయ పార్టీల నేతలు హాజరవుతారని చంద్రబాబు తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న ‘జయహో బీసీ’ కార్యశాలను జయప్రదం చేయాలని, కార్యశాలలో వివిధ బీసీ కులాల నేతలు హాజరై చర్చించాలని చంద్రబాబు సూచించారు.

16:16 - November 11, 2018

నిజామాబాద్: ఓవైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన టీఆర్ఎస్.. మరోవైపు మహాకూటమిని టార్గెట్ చేశారు. సందర్భం వచ్చినప్పుడల్లా మహాకూటమిపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అమరాతిలో కాంగ్రెస్ జాబితా ఫైనల్ కావడం కాంగ్రెసోళ్ల దురదృష్టమని టీఆర్ఎస్ ఎంపీ కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కనీసం తమ అభ్యర్థులను కూడా ఖరారు చేసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను అమరావతి తీసుకెళ్లి చంద్రబాబుతో ఆమోద ముద్ర వేయించుకోవడం కాంగ్రెస్ దయనీయ దుస్థితికి అద్దం పడుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోరలో దళితుల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. తెలంగాణలో చంద్రబాబు బ్యాక్‌డోర్ రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో మహాకూటమికి ఓటమి తప్పదని, ఆ కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారని కవిత వ్యాఖ్యానించారు. గత 40ఏళ్లలో రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఈ నాలుగేళ్లలోనే జరిగిందని కవిత చెప్పారు. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను నిలుపుదామని కవిత పిలుపునిచ్చారు. ఎంపీ కవిత సమక్షంలో జగిత్యాలకు చెందిన ప్రముఖ వైద్యుడు శైలేందర్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు.

21:49 - November 10, 2018

రంగారెడ్డి: రాష్ట్రంలో సాగు, తాగునీరు రావాలంటే మరోసారి టీఆర్‌ఎస్‌నే గెలిపించాలని మంత్రి హరీష్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఒకవైపు విస్తృతంగా ప్రచారం చేస్తూనే మరోవైపు మహాకూటమిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. శనివారం మంత్రి హరీష్‌రావు ఇబ్రహీంపట్నంలో రైతు సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాకూటమి నేతలపై విమర్శనాస్త్రాలను సంధించారు. మహాకూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆగిపోవడం ఖాయమన్నారాయన. గతంలో జలయజ్ఞం అని చెప్పి కేవలం నాలుగు లక్షల ఎకరాలకే నీరిచ్చారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో ఈ నాలుగేళ్లలోనే 25లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామన్నారు.
డిసెంబర్ 7 తర్వాత తెలంగాణలో టీడీపీ ఉండదని హరీష్‌రావు జోస్యం చెప్పారు. తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు... ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఓట్లు ఎలా అడుగుతారని నిలదీశారు. చంద్రబాబు తెలంగాణలో ఒక మాట...ఏపీలో మరో మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మహాకూటమికి ఓటేస్తే తెలంగాణ అస్తిత్వాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టాల్సి వస్తుందని హరీష్ హెచ్చరించారు. డిండి ప్రాజెక్టు కోసం కష్టపడ్డానని అంటున్న కాంగ్రెస్ నేత జానారెడ్డి... ఆ ప్రాజెక్టుకు అడ్డుచెబుతున్న టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. సంక్షేమం కావాలంటే టీఆర్ఎస్‌కు... సంక్షోభం కావాలంటే మహాకూటమికి ఓటు వేయాలని హరీష్ అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీకి... టీడీపీకీ ఓటేస్తే అమరావతికి వెళతాయని ఆయన చెప్పారు.

06:43 - November 9, 2018

హైదరాబాద్ : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు మారే నేతల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే జంపింగ్ జిలానీలు తమ గూడుకు చేరుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్య సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె ఏపీ సీఎం చంద్రబాబును కలిసి టీడీపీలో చేరే అంశాన్ని ప్రతిపాదించారు.
గతంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రమ్య ఆ పార్టీ నేతల వైఖరితో మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. దీంతోనే ఆమె సైకిల్ జర్నీకి సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని టీటీడీపీ నేతలతో చర్చించిన చంద్రబాబు ఈ సమయంలో రమ్యను పార్టీలోకి తీసుకుంటే రెచ్చగొట్టినట్టవుతుందేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలతో టీటీడీపీ నేతలు కూడా ఏకీభవించినట్టు తెలుస్తోంది.
 

07:27 - November 8, 2018

అమరావతి : రాహుల్‌ను కలిసి అధికార ఎన్డీయేలో గుబులు రేపిన టీడీపీ అధినేత చంద్రబాబు విపక్షాలను ఏకం చేసే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం బెంగళూరు వెళ్తున్నారు. దేవెగౌడ, కుమారస్వామిలను కలిసి భవిష్యత్‌ రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. 

Image result for chandrababu mamata banerjeeరాష్ట్రానికి హామీలు ఇచ్చి.. మాట నిలబెట్టుకోకుండా మోసం చేసిన కేంద్రంపై చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు రావడం, అనంతరం బీజేపీ-టీడీపీ నేతల మాటల యుద్దం కొనసాగడం, ఆ తర్వాత టీడీపీ నేతల ఇళ్లపై ఏసీబీ దాడులు జరగడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో చంద్రబాబు బీజేపీయేతర కూటమిని బలోపేతం చేసేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలను కలిసిన చంద్రబాబు.. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ను కలిసి సంచలనం లేపారు. ఇప్పటివరకు ఉత్తరాది రాష్ట్రాల నేతలను కలిసిన చంద్రబాబు.. ఇప్పుడు దక్షిణాది నేతలను కలిసే పనిలో పడ్డారు .ఇందులో భాగంగా ఇవాళ బెంగళూరు వెళ్తున్నారు. కర్నాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడలతో సమావేశమవుతున్నారు. జేడీఎస్‌ నేతల సమావేశం అనంతరం... బెంగళూరు నుంచి నేరుగా చెన్నై వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్‌ను కూడా కలిసే అవకాశం ఉంది. ఇక కర్నాటక, తమిళనాడు పర్యటన అనంతరం చంద్రబాబు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని కూడా కలవనున్నారు. కర్నాటక ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభావం ఎదురుకావడంతో బీజీపీయేతర శక్తులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలను చంద్రబాబు ముమ్మరం చేశారు. 

Image result for chandrababu kumaraswamyడిసెంబర్ నాటికి మోడీకి వ్యతిరేకంగా ఉన్న నాయకులను నేరుగా కలిసి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు. డిసెంబర్‌లో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఫలితాలు వచ్చిన త‌ర్వాత జ‌న‌వ‌రిలో బీజేపీయేతర కూటమి నేతలతో మరోసారి హ‌స్తిన‌లో ఒక స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని చంద్రబాబు యోచిస్తున్నారు. జ‌న‌వ‌రి స‌మావేశం త‌రువాత ఆయా రాష్ట్రాల్లో నిర‌స‌న ర్యాలీలు, స‌భ‌ల్లో విపక్ష నేతలు పాల్గోనేలా ఒక ప్రణాళిక‌ను రూపొందిస్తున్నారు.
ఏదిఏమైనా తాజాగా వెలువడ్డ కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ వ్యతిరేకంగా రావడంతో.. బీజేపీయేతర శక్తులను ఏకం చేసేందుకు కసరత్తు చేస్తున్న చంద్రబాబుకు మరింత బలం చేకూరింది. మరి ఈ స్పీడ్‌ ఇలాగే కొనసాగుతుందా ? లేదా ? చూడాలి. 
 

15:12 - November 6, 2018

హైదరాబాద్: తిత్లీ తుఫాను విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు తనపై చేసిన విమర్శలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. తిత్లీ తుఫాను విధ్వంసం గురించి తెలియజేస్తూ కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయలేదన్న చంద్రబాబు ఆరోపణలను పవన్ కొట్టిపారేశారు. తిత్లీ తుఫాను కారణంగా జరిగిన నష్టం గురించి తాను కేంద్రానికి లేఖ రాశానని పవన్ చెప్పారు. అందుకు ఇదే సాక్ష్యం అంటూ తాను రాసిన లేఖను పవన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ లెటర్ మీద అక్టోబర్ 26 అనే తేదీని చూడొచ్చు. తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవాలని పవన్ ఆ లేఖలో ప్రధానిని కోరారు. కాగా, ప్రజల్లో తనకు లభిస్తున్న ఆదరాభిమానాలు చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేశారని పవన్ మండిపడ్డారు.

Pages

Don't Miss

Subscribe to RSS - chandrababu