BV Raghavulu

13:33 - July 19, 2018

ఢిల్లీ : పార్లమెంట్ లో టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీజేపీ అంగీకరించటం మంచిదనీ..ఈ అవకాశాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు, బీజేపీ అవలంభిస్తున్న తీరును ఎత్తి చూపేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు సీపీఎం తప్పకుండా సిద్ధపడుతుందని సీసీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తెలిపారు. ఏపీకి ఇవ్వాల్సిన హక్కుల కోసం, విభజన చట్టంలోని అంశాల కోసం సీపీఎం ఎప్పుడు పోరాడుతుందనీ..టీడీపీ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం విషయంలో సీపీఎం ప్రశ్నిస్తుందని రాఘవులు తెలిపారు. గతంలో ఎన్ని పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం అంగీకరించలేదన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి ఏపీ అన్యాయం గురించి ప్రశ్నించే హక్కును కోల్పోయారన్నారు. బైట వుండి వారు పోరాడాదేమిటో అర్థం కాదన్నారు. కాగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్నాయం, విభజన హామీల విషయంలో అవలంభిస్తున్న వైఖరిని ప్రశ్నించేందుకు పార్లమెంట్ వేదికగా చేసుకున్న టీడీపీ నిన్న లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన విషయం తెలిసందే.ఈ నేపథ్యంలో టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం బీజేపీ పార్టీ తీరును ప్రశ్నించేందుకు ఒక అవకాశంగా వినయోగించుకోవాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘువులు తెలిపారు. 

16:38 - May 6, 2018

విజయవాడ : ఏళ్లు గడిచేకొద్దీ మార్క్స్‌ సిద్దాంతాలకు ఆదరణ పెరుగుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్క్స్‌ సిద్ధాంతాలపై నేడు ఆసక్తికర చర్చ జరుగుతోందన్నారు. మార్క్స్‌ ద్విశతజయంతి సభను పురస్కరించుకుని విజయవాడలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుల్లో పాల్గొన్న ఆయన.... యువత ఈ మధ్య మార్క్సిజంపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. పెట్టుబడిదారి వ్యవస్థను వ్యతిరేకించేందుకు మార్క్సిజంలో దారులు వెతుకుతున్నారని తెలిపారు. ఇదే సదస్సుల్లో పాల్గొన్న సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు.. రానున్న రోజుల్లో వామపక్షాలకు మంచిరోజులు వస్తాయన్నారు. రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా ఉన్నాయని... పెట్టుబడిదారి విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

16:36 - May 6, 2018

నల్గొండ : అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ వృధాకావని... వారి ఆశయసాధన కోసం ఎర్రజెండా నీడన పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని పాములపాడ్‌లో కామ్రేడ్‌ నంద్యాల లింగయ్య స్మారకస్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. నిజాం నిరంకుశత్వం, దొరలు- రజాకార్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ఘనత ఎర్రజెండాదేనన్నారు. నాటి వీరతెలంగాణ సాయుధ పోరాటంలో నంద్యాల లింగయ్య పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. 

18:40 - May 5, 2018

నల్లగొండ : దోపిడీ సమాజం పోయి.. అసమానతలు లేని సమసమాజం ఏర్పడే దాకా కమ్యూనిజం అజేయంగా ముందుకు సాగుతూనే ఉంటుందన్నారు సీపీఎం రాష్ట కమిటీ సభ్యులు.. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సీపీఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్ల్ మార్క్స్ రెండో శత జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్ల్‌ మార్క్ల్‌ను ప్రపంచమంతా చీడపురుగాలా చూసినా... తినడానికి తిండి లేకపోయినా... చివరిదాకా తన భావాలను వీడలేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడీదారులు ఏకమై అనుసరిస్తున్న వ్యూహాలతో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా అంతిమ విజయం మాత్రం కమ్యూనిజానిదే అన్నారు. 

13:52 - May 5, 2018

హైదరాబాద్‌ : ఎంబీభవన్‌లో కార్ల్‌మార్క్స్‌ ద్విశత జయంతి వేడుకలను సీపీఎం నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్క్స్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మార్క్స్‌ సిద్ధాంతాలను సీపీఎం నేతలు గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో కొనసాగుతోన్న అణచివేతకు వ్యతిరేకంగా సీపీఎం చేస్తున్న కృషిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతిజ్ఞ తీసుకున్నామన్నారు. 20వ శతబ్దాన్ని ఒక కుదుపు కుదిపి, మరో మార్గం పట్టించి ప్రపంచం స్వరూపాన్ని మార్చేసిన ఘనత మార్క్సిజందే అని సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు కొనియాడారు. 

 

11:41 - May 5, 2018

హైదరాబాద్ : మానవ పరిణామ క్రమంలో శ్రమ పాత్ర కీలకమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఎంబీ భవన్ లో నిర్వహించిన కారల్ మార్క్స్ 200వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. భావాల్లో సంఘర్షణ జరుగుతుందని ఎగెల్ చెబితే.. భౌతిక పరిస్థితుల్లో సంఘర్షణ జరుగుతుందని కారల్ మార్క్స్ తెలిపారని చెప్పారు. శ్రమ వల్లే మానవులు అభివృద్ధి సాధించారని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో శ్రమ అంటే హేయభావం ఉందన్నారు.

 

14:20 - April 24, 2018

హైదరాబాద్ : తమ మహాసభల తీర్మానాలు బీజేపీని కలవర పెట్టాయని...అందుకే ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తాము బీజేపీపై రాజకీయ విమర్శలు చేశామని తెలిపారు. బూజు పట్టిన సీపీఎం గురించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. మహాసభ కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుందని..20 మంది కొత్త కార్యకర్తలను తీసుకుందన్నారు. 95 మంది కేంద్రకమిటీ, 17 మందితో పొలిట్ బ్యూరో ఎన్నుకుందని తెలిపారు. మతోన్మాదాన్ని ఓడించేందుకు అందరూ కలిసిన రావాలని పిలుపునిచ్చారు.

 

14:14 - April 21, 2018

హైదరాబాద్‌ : నగరంలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో సీపీఎం 22వ జాతీయ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 22న భారీ బహిరంగ సభ జరగనుంది. అదే రోజున మహాసభలు ముగియనున్నాయి. మహాసభల ముగింపు రోజున హైదరాబాద్‌లో సీపీఎం కవాతు నిర్వహించనుంది. సుమారు 25 వేల మంది రెడ్‌షర్ట్‌ వాలంటీర్స్‌ ఈ కవాతులో పాల్గొననున్నారు. మహాసభల సందర్భంగా సీపీఎం చేపట్టనున్న కవాతుపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 

 

13:36 - April 21, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌తో ఎలాంటి రాజకీయ పొత్తు ఉండబోదని మహాసభలో తీర్మానం చేసినట్లు సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మరోసారి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడటంలో అన్ని లౌకిక శక్తులను కలుపుకొని వెళ్తామని అన్నారు. మతోన్మాద పార్టీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యమంటున్న బీవీ రాఘవులుతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌తో కలిసి పోరాటం చేస్తామన్నారు. మతోన్మాద సమస్యలు వచ్చినప్పుడు లౌకికవాద పార్టీలతో కలిసి పోరాడుతామని చెప్పారు.

 

21:27 - April 8, 2018

హైదరాబాద్ : జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌కు సీపీఎం మాత్రమే ప్రత్యామ్నాయం అన్నారు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. ఈ నెల 18 నుంచి 22 వరకు సీపీఎం అఖిల భారత మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభల్లో దేశంలో పలు అంశాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, అభివృద్ధి నమూనాలపై చర్చిస్తామన్నారు. మతోన్మాద, కార్పొరేట్ అనుకూల వైఖరితో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా.. వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఏకం కావాలన్నారు. ఇవే అంశాలపై ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే సీపీఎం అఖిల భారత మహా సభల్లో చర్చిస్తామని చెప్పారు. ఈ మహా సభల ఉద్దేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు సహకరించాలని హైదరాబాద్‌లో జరిగిన మీడియా ఎడిటర్స్‌ మీట్‌లో కోరారు.

ప్రజా వ్యతిరేక విధానాల్లో కాంగ్రెస్ కన్నా బీజేపీ ప్రభుత్వం దూకుడును ప్రదర్శిస్తుందని.. బీవీ రాఘవులు అన్నారు. కుల, మత వైషమ్యాలతో సమగ్రత, అభివృద్దికి ఆటంకం కలిగించేలా మోదీ చర్యలు ఉన్నాయని విమర్శించారు.. అమెరికా జోక్యంతో మేకిన్ ఇండియాకు అర్ధమే లేకుండా పోయిందన్నారు.

రాష్ర్టంలో అనేక అంశాలపై పోరు సలుపుతున్న తరుణంలో సీపీఎం మహాసభలు జరగడం... ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా అమలు కావాలంటే రాజకీయ జోక్యం తప్పనిసరన్నారు. అందుకోసమే ఆ కోణంలో నుంచే బీఎల్ఎఫ్ పుట్టుకొచ్చిందని తెలిపారు. గొర్రెలు, బర్రెలు ఇవ్వడం సామాజిక సహాయం అవుతుందే కానీ సమాజిక న్యాయం కాదని తమ్మినేని అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభతో పాటు.. 25 వేల మంది రెడ్ షర్ట్ వాలంటీర్లతో కవాతు నిర్వహిస్తామని తమ్మినేని అన్నారు. కోదండరాం, పవన్‌ కళ్యాణ్‌లతో కలిసి పని చేసే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - BV Raghavulu