bus accident

11:31 - November 25, 2018

చిత్తూరు : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆర్టీసీ బస్సు కొండను ఢీకొంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 25వ తేదీ ఆదివారం ఉదయం తిరుపతి నుండి తిరుమలకు ఏపీ03జెడ్ 5428 నెంబర్ గల బస్సు బయలుదేరింది. ఈ బస్సులో 25మంది భక్తులతో పాటు, స్థానికులు, టిటిడి సిబ్బంది ఉన్నారు. రెండో ఘాట్ రోడ్డు వద్దకు రాగానే బస్సు కొండను ఢీకొంది. దీనితో బస్సులో ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బస్సులో ఉన్న వారికి గాయాలయ్యాయి.Image result for Tirumala Ghat Road Accidentప్రమాదం జరగడంతో ఘాట్ రోడ్డుపై అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నలుగురు భక్తులకు తీవ్రగాయాలు కావడంతో వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 
డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని..అతివేగంగా..నిర్లక్ష్యంగా నడిపాడని..రెండు సార్లు ప్రమాదం నుండి తప్పించుకున్నామని..కానీ మూడో సారి మాత్రం ప్రమాదం ఎదురైందని భక్తులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. బస్సు స్టీరింగ్ లాక్ కావడంతో..ఇతరత్రా కారణాలతో ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ పేర్కొంటునట్లు సమాచారం. ఇదిలా ఉంటే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అచ్చెన్న నాయుడు ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలను తెలియచేయాలని అధికారులను ఆదేశించారు. 

21:01 - September 12, 2018

జగిత్యాల : కొండగట్టు బస్సు ప్రమాద ఘటనతో మూడు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడి 57 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. బస్సు ప్రమాదంలో  డబ్బుతిమ్మాయిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. వీరి మృతితో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తలు అంటున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాల్లో ఒక్కొరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. లేని ఎడల మూడు గ్రామాల ప్రజలందరం ధర్నా చేపడతామని హెచ్చరించారు. డొక్కు బస్సులు వేసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు.

జగిత్యాల జిల్లాలో కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 57 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల్లో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘాట్‌రోడ్డులో బ్రేక్ లు ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. 

08:54 - September 12, 2018

కరీంనగర్ : ఎన్నో ఏళ్ల అనుభవం...ప్రమాదమన్న సంగతే ఎరుగని డ్రైవర్.. దీనితో ఆర్టీసీ సంస్థ నుండి ఎన్నో రివార్డులు..అవార్డులు అందుకున్నాడు. ఇటీవలే ఆగస్టు 15వ తేదీన ఉత్తమ అవార్డు అందుకున్నాడు. కానీ కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ ఇతనే. 

కొండగట్టు ప్రమాదంలో 57 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదం తరువాత డ్రైవర్ అతి వేగంగా నడపడం..అజాగ్రత్తగా నడిపారనే ఆరోపణలు వినిపించాయి. కానీ ఆ బస్సు నడిపింది ఉత్తమ డ్రైవర్ శ్రీనివాస్. ఉత్తమ డ్రైవర్ గా ఇటీవలే అవార్డు కూడా అందుకున్నట్లు అతని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనలో అతను కూడా మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ధన పొదుపులో ఎన్నాళ్లుగానో ఉత్తమ డ్రైవర్ గా శ్రీనివాస్ ప్రతిభ చూపించాడని స్వయంగా ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. కానీ పని ఒత్తిడి, అధిక గంటలు పనిచేయడం వల్లే బస్సుపై నియంత్రణ కోల్పోయాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా పాత బస్సు కావడం...అధిక లోడ్ కావడం..దీనితో అదుపులోకి రాకపోవడంతో నియంత్రణ కోల్పోయాడని తెలుస్తోంది. ఏది ఏమైనా కొండగట్టు ప్రమాదం అందరినీ కలిచివేసింది. 

19:05 - July 18, 2018

యాదాద్రి భువనగిరి : జిల్లా బీబీనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. యువకుడిని తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సును రాంగ్‌ రూట్‌లోకి తీసుకెళ్లాడు. ఆ బస్సుకు ఎదురుగా ఎలాంటి వాహనం రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

 

09:19 - June 6, 2018

ప్రకాశం: జిల్లాలోని త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కర్నూలు నుంచి విజయవాడకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలతో సహా నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

08:46 - June 6, 2018

జగిత్యాల : అతి వేగం ప్రమాదకరమనీ..అది మీ కుటుంబాలకే కాక పలువురి కుటుంబాలలో విషాదాలను నింపుతుందనీ ఎంతగా చెప్పినా వినని వాహనదారులు వేగంగా నడిపి ప్రాణాలను కోల్పోతున్నారు. అంతేకాదు పలువురి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు. అతి వేగంగా వాహనాలను నడిపి ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన కుటుంబంలో తీరని శోకం మిగిల్చింది. గొల్లపల్లి మండలం చిల్లకూడూరులో జరిగిన రోడ్డు ప్రమాదంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం బైక్ పై వెళ్తున్న ముగ్గురిని వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. స్థానికులు అందించిన సమచారంతో సంఘనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం రోడ్డు ప్రక్కల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి గల కారాణాలను తెలుసుకునే యత్నం చేస్తున్నారు. మృతులు నిన్న అర్థరాత్రి ఓ పుట్టిన రోజు వేడుకకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు చిప్ప రాములు, చిప్ప సందీప్, చిప్ప వినోద్ లుగా గుర్తించారు. కాగా ప్రమాదం జరిగిన తీరు చూస్తే అతి ప్రమాదమే కారణంగా స్థానికులు పేర్కొంటున్నారు.

08:43 - May 26, 2018

నెల్లూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లకూరు సమీపంలో రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తుఫాను జీపును ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో మూడు సంవత్సరాల చిన్నారి కూడా ఉంది. గుంటూరుజిల్లా వినుకొండకు చెందిన వారు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని నాయుడు పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

08:23 - May 26, 2018

నల్లగొండ : ట్రాఫిక్ సమస్యలు పాటించకపోవటంతో పలు ప్రమాదాలకు లోనవుతున్న సందర్బాలు అనేకం జరుగుతున్నాయి. రోడ్డుపై వాహనదాలరు పాటించాల్సిన నిబంధలను ఖాతరు చేయకపోవటంతోవారితో పాటు పరుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు కొందరు. దీంతో చాలా సందర్భాలలో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న దారుణమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ప్రమాదానికి కారణమయ్యింది. కట్టంగూరు మండలం ఐటిపాముల సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. కోళ్లలోడుతో వస్తున్న వోల్వో వ్యాన్ ఇసుక లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం క్యాబిన్ లో ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోయారు. నాలుగు గంటలు శ్రమించి క్రేన్ సహాయంతో పోలీసులు బైటికి తీసారు. వీరిలో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషయంగా వుంది. దీంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి వినాయక ట్రావెల్ బస్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 

19:23 - April 1, 2018

విశాఖ : జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో 30మందికి గాయాలయ్యాయి. ముంచంగిపుట్టు మండలం జోలపుట్ పంచాయతీ వద్ద గిరిజనులు ట్రాక్టర్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో.. 30మందికి గాయాలయ్యాయి. వీరిలో 10మంది పరిస్థితి విషమంగా ఉంది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. 

21:11 - January 29, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - bus accident