Bus

21:11 - November 16, 2018

హరారే: జింబాబ్వేలో ఒక బస్సులో గ్యాస్ ట్యాంక్ పేలి 42 మంది సజీవ దహనం అయ్యారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వీరిలో కొందరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. జింబాబ్వే రాజధాని హరారేకి 550 కిలోమీటర్ల దూరంలోని గ్వాండా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బస్సులోని ప్రయాణికుడు తీసుకు వెళుతున్న గ్యాస్ ట్యాంక్ పేలటం వల్లే ఈప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

11:14 - November 7, 2018

పాకిస్థాన్ : పాకిస్థాన్, భారతదేశాల మధ్య వుండే నిబంధలను ఉల్లంఘింటం పాకిస్థాన్ కు పరిపాటిగా మారిపోయింది. పలుమార్లు కాల్పుల ఒప్పందాలను ఉల్లంఘించిన పాకిస్థాన్ ఇప్పుడు మరో ఉల్లంగనకు పాల్పడింది. భారత్ అభ్యంతరాలను తోసిపుచ్చి పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనా, పాకిస్థాన్ మధ్య సోమవారం రాత్రి బస్సు సర్వీసు ప్రారంభమైంది. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న గుల్బర్గ్ ప్రాంతం నుంచి పీవోకే మీదుగా చైనా జిన్‌జియాంగ్ రాష్ట్రం కష్ఘర్ నగరానికి తొలి బస్సు సర్వీసు నడిచింది. చైనా- పాకిస్థాన్ ఎనకమిక్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా పాక్, చైనా ఈ బస్సు సర్వీసును నడుపుతున్నాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం నాడే బస్సు సర్వీసు ప్రారంభించాల్సి ఉంది. కానీ దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న మహిళ అసియా బీబీని పాక్ సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో దేశమంతటా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో సదరు బస్సు సర్వీసును సోమవారం రాత్రి ప్రారంభించారు. పాక్ ఎకనమిక్ ఫొరం చైర్మన్ ఇక్బాల్ షమీ ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు దేశాల సంబంధాల్లో ఇది చాలా మంచి రోజని పేర్కొన్నారు. పీవోకే మీదుగా పాక్- చైనా మధ్య బస్సు సర్వీసు నిర్వహించడంపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది.
 

16:53 - September 12, 2018

హైదరాబాద్ : కొండగట్టు బస్సు ప్రమాదంపై మానవ హక్కుల కమిషన్(హెచ్ ఆర్ సీ)లో ఫిర్యాదు నమోదు అయింది. బస్సు ప్రమాదంపై హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ హెచ్ ఆర్ సీలో పిటిషన్ వేశారు. ప్రమాదంలో 57 మంది చనిపోవడానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల బస్ డిపో మేనేజర్, సూపర్ వైజర్, ఆర్టీవోపై కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. అధికారులపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ డీజీపికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలని మానవ హక్కుల కమిషన్ ను అరుణ్ కుమార్ కోరారు.

జగిత్యాల జిల్లాలో కొండగట్టు వద్ద ఘాట్‌రోడ్డులో బ్రేక్ లు ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ప్రమాదంలో 57 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల్లో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 

 

20:44 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 58 కు చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పలువురికి గాయాలు అయ్యాయి. ఘాట్‌రోడ్డులో బ్రేక్ లు ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎక్కువ మంది ఊపిరాకడ చనిపోయినట్లు తెలుస్తోంది.

ప్రమాద ఘటనపై తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఏపీ మంత్రి నారా లోకేశ్‌  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని గవర్నర్‌ నరసింహన్‌, అద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

15:05 - December 24, 2017

జనగామ : జిల్లా కొడకండ్ల మండలం వెలిశాల వద్ద ఇల్లందు ఎమ్మెల్యే కోర కనకయ్య కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:12 - December 4, 2017

అనంతపురం : నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతి చెందారు. ప్రైవేట్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తోంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. మార్గంమధ్యలో అనంతపురం జిల్లా రుద్రంపేట బైపాస్‌రోడ్డు సమీపంలో తెల్లవారుజామున 4.30గంటలకు ఒక్కసారిగా లారీ టైర్‌ పంచరైంది. దీంతో అదుపుతప్పిన లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ గణేశ్‌, లారీ క్లీనర్‌ రావత్ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 20 మంది గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా లారీ టైర్‌ పంచరైందని.. దీంతో అదుపుతప్పిన లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

22:01 - November 8, 2017

పంజాబ్‌ : పొగమంచు కారణంగా పంజాబ్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భటిండా జిల్లా బుచోమండి వద్ద రోడ్డుపక్కన ఉన్న విద్యార్థులపైకి అతివేగంగా వచ్చిన ట్రక్ దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కళాశాల, కోచింగ్‌ క్లాస్‌లకు వెళ్తున్న విద్యార్థుల బస్సు సాంకేతికలోపం తలెత్తడంతో ఆగిపోయింది. దీంతో దాదాపు 14 మంది విద్యార్థులు బస్సు దిగి భటిండా- ఛండీగఢ్‌ హైవే రోడ్డు పక్కన నిలబడ్డారు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న లారీ వేగంగా వారిపైకి దూసుకు రావడంతో 9 మంది విద్యార్థులు మృతి చెందారు. దట్టంగా అలుముకున్న పొగమంచు కారణంగా రోడ్డుపై ఉన్న విద్యార్థులు డ్రైవర్‌కు కనిపించలేదని పోలీసులు చెప్పారు. 

 

19:32 - October 7, 2017

కర్నూలు : చిన్న చిన్న దొంగతనాలు చేస్తే ఏం వస్తుందిలే అనుకున్నాడు ఓ దొంగ. అందుకే ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లేందుకు యత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరు బస్సు డిపో నుంచి బస్సును ఎత్తుకెళ్లేందుకు యత్నించాడు. దీన్ని గమనించిన అధికారులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.... 10 కిలోమీటర్లు వెంబడించి దొంగ శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. ఈ క్రమంలో హెడ్‌కానిస్టేబుల్‌ రమణకు గాయాలయ్యాయి. 

18:35 - July 5, 2017

మహారాష్ట్ర : నడుస్తున్న బస్సులో ఓ మహిళను బలవంతంగా ముద్దుపెట్టుకున్న స్థానిక బీజేపీ నేతను గడ్చిరోలి పోలీసులు అరెస్టు చేశారు. లగ్జరీ బస్సులో అతను మహిళకు బలవంతంగా ముద్దు పెడుతున్న దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో అనైతిక చర్యకు పాల్పడిన స్థానిక బీజేపీ నేత రవీంద్ర బవన్‌థాడేను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నాగ్‌పూర్‌ నుంచి గడ్చిరోలి వస్తున్న బస్సులో రవీంద్ర మహిళను ముద్దు పెట్టుకోవడమే కాకుండా ఆమెను బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. దీనిపై బాధితురాలు రేప్‌ కేసు పెట్టింది. ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని రవీంద్ర తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

 

12:33 - June 30, 2017

సిద్ధిపేట : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ఢీకొని ఆర్ ఎంపీ డాక్టర్ సిద్ధి రాముడు మృతి చెందారు. రాముడి భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. రాముడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - Bus