boycott

19:34 - September 12, 2018

విశాఖ : రైల్వే డీఆర్ ఎం మీటింగ్ ను ఉత్తరాంధ్ర ఎంపీలు బాయ్ కాట్ చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర అనుసరిస్తున్నవైఖరికి నిరసనగా సమావేశాన్నిఉత్తరాంధ్ర ఎంపీలు బహిష్కరించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో చత్తీస్ గఢ్, ఒడిషా ఎంపీలతో డీఆర్ ఎం సమావేశం అయ్యారు. 

 

21:36 - January 1, 2018

కర్నూలు : జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నెలో దళితులను అగ్రకులస్తులు గ్రామం నుంచి బహిష్కరించారు. వారికి విద్యుత్‌, నీటితోపాటు నిత్యావసరాలపైనా ఆంక్షలు విధించారు. దళితులతో ఎవరు మాట్లాడవద్దని హుకుం జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే 5వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అగ్రకులస్తుల్లో ఒకరు చనిపోతే అంత్యక్రియల ఏర్పాట్లు చేయలేదని ఆరోపిస్తూ దళితులపై కక్ష కట్టారు. దళిత కాలనీకి వచ్చే మంచినీటి పైపులైనును సైతం పగలగొట్టారు. దీంతో వాళ్లు నానా ఇక్కట్లుపడ్డారు. మరోవైపు దళితులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని కేవీపీఎస్‌ డిమాండ్‌ చేసింది. 

14:46 - January 1, 2018
12:50 - January 1, 2018

కర్నూలు : శాస్త్రసాంకేతికపరంగా ఎంత అభివృద్ధి చెందినా దళితులపై వివక్ష, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 60 ఏళ్ల స్వాతంత్య్రంలో దళితులు అడుగడుగునా అవమానాలకు గురవుతూనే ఉన్నారు. అగ్రకులాలు దళితులను అసలు మనుషులుగానే చూడడం లేదు. రోజు రోజుకూ వారి వికృత చేష్టలు మితిమీరిపోతున్నాయి. ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ దళితుడు, ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దళితుడు. రాష్ట్రపతిగా ఒక దళితుడు ఉన్నా సరే... గ్రామాలు, పట్టణాల్లో దళితులపై వివక్ష, దాడులు, బహిష్కరణ వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. న్యూఇయర్ లోనూ దళితులకు అవమానం తప్పలేదు. కర్నూలు జిల్లాలో ఆటవికన్యాయం రాజ్యమేలుతోంది. అగ్రకులాలు దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. జిల్లాలోని రుద్రవరం మండలంలోని నక్కలదిన్నెలలో అగ్రకులాలకు చెందిన ఒక వ్యక్తి మరణించాడు. అతని దహన సంస్కారాలు కోసం గుంత తీయాలని దళితులను అడిగారు. అయితే తాము ఇద్దరమే ఉన్నామని.. తమకు ఆరోగ్యం బాగా లేదని...గుంత తవ్వడం తమ వల్ల కాదని చెప్పారు. దీంతో ఆగ్రహించిన అగ్రకులస్తులు దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. వారికి విద్యుత్‌, నీరుతోపాటు నిత్యావసరాలపైనా ఆంక్షలు విధించారు. దళితులతో ఎవరు మాట్లాడవద్దని హుకుం జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే 5వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. బాధితులు రుద్రవరం పోలీస్ స్టేషన్ లో చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:29 - April 11, 2017

గుంటూరు: ఏపీని సీఎం చంద్రబాబు నాయుడు నాలెడ్జ్ హబ్ గా తయారు చేస్తానని చెప్తున్నారని... కానీ ఏపీ ని నారాయణ హబ్ గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గుంటూరు లో అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ ను ఆపేసి ఆందోళన చేపట్టాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా విద్యార్థి, ఉపాధ్యాయ మౌలిక సమస్యల పరిష్కరించలేదని ఆరోపించారు. సిపీఎస్ ను రద్దు చేయాలని, వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలని, పెర్ఫార్మెన్స్ ర్యాంకుల విధానాన్ని రద్దు చేయాలని, పీఆర్సీ, ఎరియర్ ఇవ్వాలి. హెల్త్ కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని ప్యాప్టో, జాక్టో ఉపాధ్యాయ సంఘాలు నేతలు మండిపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.. 

07:25 - August 30, 2016

ఖమ్మం : ఏడు పదుల స్వతంత్ర భారతావనిలో.. నేటికీ కుల దురహంకారం రాజ్యమేలుతోంది. అగ్రకుల అహంకారం.. నిమ్నకులాలను బతకనివ్వని దౌర్భాగ్యం పల్లెసీమల్లో నేటికీ కనిపిస్తోంది. ఏదో ఒక కారణంతో దళితులపై వేధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ అగ్రకుల దురహంకారం

ఉత్సవాల్లో చల్లగూడ పట్టలేదంటూ పది రజక కుటుంబాల వెలి..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో దారుణం..ఆరెగూడెంలో బయటపడ్డ అగ్రకుల దురహంకారం..ఉత్సవాల్లో చల్లగూడ పట్టలేదంటూ పది రజక కుటుంబాల వెలి..

టెక్నాలజీ దూసుకుపోతున్న కాలంలోనూ కుల దురహంకారాలు
శాస్త్ర సాంకేతిక రంగాల్లో నింగే లక్ష్యంగా దూసుకు వెళుతున్న సమాజంలోనూ.. అధోగతిలో సాగుతున్న దురహంకారాలూ వెలుగు చూస్తున్నాయి. దీనికి నిదర్శనమే ఈ దురాగతం. శ్రావణమాసం సందర్భంగా ఆరెగూడెంలో ముత్యాలమ్మ బోనాలు నిర్వహించారు. రజకులు, కుమ్మరులు, దళితులు ప్రధాన పాత్ర పోషించే ఈ వేడుకల్లో.. మొదట రజకులు ఇంటింటికి తిరిగి చల్లగూడును ఎత్తడం ఆనవాయితీ. అలాగే దొడ్డి ముత్యాలమ్మ, ముత్యాలమ్మల పేరిట కోళ్లు, మేకల పీకలు కోయడమూ వీరి వంతుగా వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన వేడుకల్లో చల్లగూడు ఎత్తలేమని రజకులు గ్రామపెద్దలకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన గ్రామపెద్దలు, అగ్రకులస్తులు కచ్చితంగా చల్లగూడు ఎత్తాలని హుకుం జారీ చేశారు. అయినా తమ వల్ల కాదని రజకులు తేల్చి చెప్పడంతో .. అగ్రకుల దురహంకార గ్రామ పెద్దలు.. కోపోద్రిక్తులై రజకులను ఎవరూ పనికి పిలవొద్దని, పిలిచిన వారికి 1000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామంలో టముకు వేయించారు. అంతటితో ఆగకుండా రజకులను బోనాల వద్దకు రాకుండా అడ్డుకున్నారు. రజకులు చేయాల్సిన పనులు పక్క గ్రామాల కూలీల చేత పూర్తి చేయించారు.

కుల బహిష్కరణపై మండి పడుతున్న ప్రజాసంఘాలు
జిల్లా కేంద్రానికి కేవలం 29కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో కుల బహిష్కరణ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఘటనపై ప్రజాసంఘాలు, మేధావులు తీవ్రంగా మండిపడుతున్నారు. రజకుల చేత వెట్టిచాకిరి చేయించుకోవడమే కాకుండా.. తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారని బాధితుల ఆవేదన
గ్రామంలో అగ్రకుల పెత్తందారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని, తరచూ తమపై పెత్తనాన్ని రుద్దుతూ తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. వయస్సు పై బడుతున్నందున సాంప్రదాయంగా వస్తున్న కొన్ని పనులను చేయలేకపోతున్నామని రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులం పేరుతో బహిష్కరించడం, జరిమానాలు విధించడం సిగ్గుచేటని, రజకుల ఆత్మగౌరవాన్ని కించపరిచిన వారిపై పోలీసులు, ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు, మేధావులు డిమాండ్‌ చేస్తున్నారు.

13:15 - March 15, 2016

పశ్చిమగోదావరి : ఉపాధ్యాయుడు అంటే నలుగురికి జ్ఞానాన్ని పంచేవారు. గ్రామానికి దివిటీలాంటి వాడు. కానీ..పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ టీచర్‌..గ్రామంలో ఓ అనాగరిక చర్యకు కారకుడయ్యాడు. నాలుగు కుటుంబాలకు గ్రామ బహిష్కరణ విధించడంలో తనదైన పాత్రను పోషించాడు. తమ గ్రామ బహిష్కరణకు..సదరు ఉపాధ్యాయుడే కారకుడంటూ..బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన..సమాజాన్ని విస్మయపరుస్తోంది. నిరక్షరాస్య సమాజాన్ని తన అక్షర జ్ఞానంతో చైతన్యపర్చాల్సిన ఉపాధ్యాయుడే మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తున్నాడు. తన కులానికి చెందిన గ్రామపెద్దల్ని గుప్పిట్లో పెట్టుకొని ఆడిందే ఆట పాడిందే పాటగా శాసనాలు చేస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వంకతళ్లచెరువు గ్రామానికి చెందిన కేతా వెంకటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సింది పోయి.. కుట్రలు, కుతంత్రాలతో పగ, ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నాడు. గ్రామంలో తను చెప్పిందే వేదం అన్నట్లుగా కులపెద్దల చేత ఇష్టమెచ్చినట్లుగా తీర్పులిప్పిస్తూ తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు.

గ్రామ బహిష్కరణ..
ఆచంట మండలం వంకతళ్ళచెరువు అనే గ్రామానికి చెందిన వారిని ఇటీవలే ఈ గ్రామపెద్దలు వెలివేశారు. ఫలితంగా పసిపిల్లలకు పాలు కావాలన్నా..ఇంట్లోకి కిరణాసామాను తెచ్చుకోవాలన్నా వీరికి అవకాశం లేకుండా చేశారు. అంతేకాదు ఈ నాలుగు కుటుంబాలలో ఏ శుభకార్యం జరిగినా ఇతరులెవరూ వెళ్లడానికి వీల్లేకుండా గ్రామ బహిష్కారం విధించారు. గ్రామ బహిష్కరణ తీర్పు ఇచ్చింది కులపెద్దలే అయినా..వారి వెనకాల మాత్రం ఉపాధ్యాయుడు కేతే వెంకటేశ్వరావు పాత్ర ఉందని గ్రామ బహిష్కరణకు గురైన బాధితులు చెప్తున్నారు. కుల సంఘం పెద్దలు విధించిన జరిమానా చెల్లించకపోవడంతో, ఎన్నో తరాలుగా వస్తున్న భూములను సంఘానికి ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని..అయితే దానికి అంగీకరించకపోవడమే వెలికి ప్రధాన కారణం అని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. మారు మూల పల్లెల్లో నేటికీ ఇలాంటి అసాంఘిక చర్యలు కొనసాగుతుండడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురి చేస్తోంది. ఇలాంటి అకృత్యాలకు గురుస్థానంలో ఉన్న వ్యక్తే కారణం కావడం విచారకరం. ఉన్నతాధికారులు ఇప్పటికైనా గ్రామంలోని పరిస్థితిని చక్కదిద్ది, బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

07:55 - February 8, 2016

ఒడిశా : సమాజాంలో వేళ్లూనుకున్న కుల వివక్షను అంతం చేయాలి అని ఉద్యమాలు జరుగుతుంటే ఎక్కడో ఒక చోట కులం పేరిట వివక్ష కొనసాగుతూనే ఉంది. కులం పేరిట..పలువురిని వెలి వేసే ఘటనలను మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇందులో ఓ మంత్రిని కూడా కులం పేరిట ఊరు..కులం నుండి వెలివేశారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. అగ్రకులం వరునితో కుమార్తె వివాహం జరిపించిన దానికి ఈ శిక్ష వేశారు. ఈ పెళ్లి విషయంలో ఆ మంత్రికి అండగా నిలిచిన వారికి కూడా 'వెలి' శిక్ష విధించారు. సాక్షత్తూ మంత్రినే వెలివేసిన ఘటన వెలుగు చూడడంతో సంచలనం సృష్టిస్తోంది.

మంత్రి కుమార్తె వివాహం..
ఒడిశా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, అభివృద్ధి, క్రీడలు, యూత్ సర్వీసు శాఖ మంత్రిగా సుదమ్ మురాండీ నిర్వహిస్తున్నారు. ఇతను సంతాన్ గిరిజన తెగకు చెందిన వారు. ఆయన కుమార్తె సంజీవిని, బిజూ జనతాదళ్ స్టూడెంట్ నాయకుడు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సునీల్ సరంగి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వివాహానికి నో చెప్పని మంత్రి మురాండి జనవరి 31న వైభవంగా పెళ్లి జరిపించారు. ఈ వివాహ మహోత్సవానికి ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు ఇతరులు హాజరయ్యారు. ఈ సమాచారం కుల పెద్దలు తెలుసుకున్నారు. పట్టణంలో ఏకంగా పంచాయతీ పెట్టి సంతాల్ తెగ (గిరిజన) కులాంతర వివాహాలకు తావులేదని తేల్చారు. అంతేగాకుండా మంత్రి సుదమ్ నియమాలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనను కులం నుండి..ఊరి నుండి వెలి వేస్తున్నట్లు ప్రకటించారు. 

Don't Miss

Subscribe to RSS - boycott