benefits

11:09 - September 12, 2018

వంటల్లో కరివేపాకు కీలకం. ప్రతి కూరగాయి..ఇతర ఆహార పదార్థాల్లో దీనిని వాడుతుంటారు. కానీ చాలా మంది కరివేపాకును తీసి పారేస్తుంటారు. దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. మరి ఒకసారి ఉపయోగాలు...తెలుసుకోండి...

 • కరివేపాకు శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకొనే వారు విరివిగా దీనిని ఆహారపదార్థంలో తీసుకుని చూడండి. అంతేగాకుండా ఆకులను నమిలి మింగినా ఫలితం ఉంటుందంట. 
 • ఇందులో విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది. కళ్లకు సంబంధించిన సమస్యలను పొగొడుతుంది. కంటిచూపును కూడా మెరుగుపరచడంతో పాటు రేచీకటి సమస్యను దూరం చేస్తుంది. 
 • ఇక వెంట్రుకలు రాలడం...పలచబడడం..తదితర సమస్యలను చాలా మంది ఎదుర్కొంటుంటారు. వీరికి కరివేపాకు మంచి ఔషధం అని చెప్పవచ్చు. వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు కరివెపాకు సహాయ పడుతుంది. 
 • ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించేందుకు కృషి చేస్తుంది. చక్కెర నియంత్రణలో ఉంటుంది. మూత్రసంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది.
15:46 - December 4, 2016

బొప్పాయి పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎన్నో రకాల పోషకాలకు బొప్పాయి పండు నిలయంగా ఉంటుంది. నిత్యం దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.

 • డెంగీ జ్వరం వచ్చిన వారికి ప్లేట్ లెట్లను పెంచేందుకు బొప్పాయి పండు ఎంతో సహాయ పడుతుంది.
 • బొప్పాయి పువ్వును బాగా నలిపి పేను కొరికిన చోట రుద్దాలి. ఇలా చేయడం వల్ల మళ్లీ వెంట్రుకలు వస్తాయి.
 • బొప్పాయి చెట్టు కాండం నుండి వచ్చే పాలను చర్మపై రాస్తే తామర, గజ్జి వంటి చర్మ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.
 • బొప్పాయి పాలను ఒక టీ స్పూన్ మోతాదులో నిత్యం తాగడం వల్ల లివర్ శుభ్ర పడుతుంది.
 • బాలింతలు బొప్పాయి పచ్చికాయను వండుకుని తినడం వల్ల వారిలో పాలు బాగా పడుతాయి.
 • బొప్పాయి ఆకును బాగా నూరి పేస్టులా చేయాలి. బోదకాలు ఉన్న చోట కట్టాలి.
 • మాసం వండుకొనే సమయంలో బొప్పాయి కాయ ముక్కలు వేయడం వల్ల మాంసం త్వరగా ఉడుకుతుంది.
 • బొప్పాయిలో విటమిన్ ఏ లభిస్తుంది. దీనితో పాటు బి1, బి2, బి3, సి విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలు సమృద్ధిగా లభిస్తాయి.
 • నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. బొప్పాయి గుజ్జును మొహానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది.
 • బొప్పాయి ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది.
 • బొప్పాయి పండు తినడం వల్ల హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు దరిచేరవు. బీటా కెరోటిన్ క్యాన్సర్ ను రాకుండా నిరోధిస్తుంది.
12:15 - September 28, 2016

కాలానికనుగుణంగా పండ్లు వస్తుంటాయి. కొన్ని పండ్లు సంవత్సరమంతా దొరుకుతుంటాయి. ఆరోగ్యం బాగులంటే ఆహారంతో పాటు పండ్లు కూడా భుజించాలి. పండ్లలో దొరికే పోషకాలు మన శరీరానికి దొరుకుతాయి. దీనితో అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. మరి ఏ పండు తింటే ఏ లాభం అనేది చూద్దాం..
మామిడి : పలు రకాల క్యాన్సర్లను రానివ్వదు. రెచీకటిని దూరం చేస్తుంది కళ్ళు పొడిబారకుండా సహాయపడుతుంది. అంతేగాకుండా శరీరానికి చలువ.
అరటి పండు : తక్షణ శక్తిని అందిస్తుంది.
బత్తాయి : చర్మ సంరక్షణ, కంటి చూపు మెరుగుపడుతుంది. జ్వరపీడితులకు మంచిది.
పైనాపిల్ : ఎముకలను పటిష్టపరచడమే కాకుండా ఆర్తరైటిస్ దరి చేరనివ్వదు.
ఉసిరి : వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తం లోని చకెర నిల్వను తగిస్తుంది, కిళ్ళ వాతాన్ని తగిస్తుంది అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది
దానిమ్మ : మెదడు ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది.
స్టాబెర్రీ : క్యాన్సర్ మీద పోరాడే గుణం ఎక్కువగా ఉంటుంది.
పుచ్చకాయ : హృదయ స్పందనల రేటను సక్రమంగా ఉంచుతుంది. బాడీ లోని ఫ్యాట్ ను తగిస్తుంది, హై బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది.
ఆపిల్ : రక్తహీనతను దూరం చేస్తుంది. హై బీపీని తగ్గిస్తుంది. మలబద్ధకం తగ్గిస్తుంది.
ఖర్జూరం : మత్తును దూరం చేస్తుంది. గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది.

15:53 - September 1, 2016

ఉల్లికాడలు..మార్కెట్ లో ప్రస్తుతం విరివిగా దొరుకుతుంటాయి. ఇవి కొంతమంది తినడానికి మక్కువ చూపరు. కానీ వీటిని ఆహారంలో తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే చదవండి...

ఉల్లికాడలతో వివిధ రకాలైన వంటలు చేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది.
సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రించడానికి, తగ్గించడానికి దోహద పడుతుంది.
గుండె, రక్తనాళాలకు మంచిది. కొలెస్ట్రాల్ ఆక్సీకరణనను తగ్గించడమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఉల్లికాడల్లో నీటిలో కరిగే కొల్లాయిడల్‌ కార్బోహైడ్రేట్‌ ఉంటుంది. దీని వల్ల పెద్దపేగుకు కేన్సర్‌ సోకే అవకాశాలు ఉండవు.
ఉల్లికాడల్లో వ్యాధి నిరోధక లక్షణాలు ఉండడంతో జలుబు, జ్వరం త్వరగా సోకవు. ఆహారం త్వరగా జీర్ణం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఇవి ఒక ఔషధంగా పనిచేస్తాయి.
ఉల్లికాడలలో క్వర్సేటిన్ బాధనివారక, యాంటి హిస్టమైన్ ప్రయోజనాలను అందిస్తుంది.

16:47 - August 15, 2016

శరీరానికి కొన్ని విటమిన్స్ తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. ఈ విటమిన్లు ఉండే ఆహారం తీసుకోకపోతే పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. విటమిన్లలో ఎ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. ముఖ్యంగా కంటి చూపును సవ్యంగా ఉండదానికి దోహ పడుతుంది. వ్యాధి నిరోధక చర్యలు, చర్మ దృఢత్వానికి ఇది దోహదం చేస్తుంది.
సాధారణ కంటి చూపునకు విటమిన్ - ఎ అత్యవసరం. ఇది లోపిస్తే రేచీకటి, ఇతర చిక్కులకు దారితీస్తుంది.
మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు, అంతకన్నాముందు కూడా విటమిన్ ఎ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని నివారించవచ్చు.
ఆకుకూరలు, పసుపురంగు, నారింజ పండ్లు, కాయగూరల్లో బీటా-కెరోటిన్ (విటమిన్ ఎ మూలకం) సమృద్ధిగా ఉంటుంది.
బీటా-కెరోటిన్ విటమిన్ ఎ గా మారుతుంది. ముఖ్యంగా మాంసాహారంలోనే ఇది లభిస్తుంది.
పాలు, పాలతో చేసే పదార్ధాలు, గుడ్డులోని పచ్చని సొన, ఎర్రపామాయిల్, చేపలు, చేపనూనెల్లో కూడా విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.
క్యాల్షియం మన శరీరానికి అత్యవసరం. ఇందుకోసం మునగాకు, ఆకుకూరలు, వెన్న, కోడిగుడ్డు పచ్చసొన, చేపలనూనె వంటివి తీసుకోవాలి.

17:24 - July 22, 2016

తమలపాకు..తాంబూళం..పూజలకు మాత్రమే ఉపయోగించరు. ఇది ఔషధంగా కూడా పనిచేస్తుంది. నిత్య జీవితంలో తమలపాకును ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం..
తమలపాకు రసాన్ని 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి. ప్రతి రోజూ కొన్ని తమల పాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.
ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.
తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది. తమలపాకు జ్యూస్ ను తీసుకుంటే బలహీనత దూరమవుతుంది. తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.
తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది.
తమలపాకు రసం తీసుకుంటే కంఠం పెగులుతుంది. మాట స్పష్టతను సంతరించుకోవడమే కాకుండా కఫం తెగి వెలుపలకు వచ్చేస్తుంది.
జలుబు చేసి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్న సమయంలో తమలపాకును వేడి చేసి కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతి మీద వేసి కడితే ఫలితం ఉంటుంది.
తమలపాకులను ముద్దగా చేసి తలకు పట్టించాలి. ఓ గంట సేపు అనంతరం తలస్నానం చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది.

10:04 - May 18, 2016

కామన్‌గా కనిపించే కలబందంతో అందం, ఆరోగ్యం చేకూరుతుంది. అందుకే కలబందను సబ్బులు, మాయిశ్చరైజర్‌ క్రీముల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మంచి సన్‌స్క్రీన్‌ లోషన్‌ కూడా! ముడతలను నివారించడమే కాదు... ఎలర్జీలను దరిచేరనివ్వదు. కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కలబంద రసాన్ని ముఖానికి అప్లైచేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. కాలిన గాయాలపై కలబంద రసం పూతలా పూస్తే గాయాలు మాయమవుతాయి. కలబంద రసంలో ముల్తానీ మట్టి లేదా చందనం పౌడర్‌ కలిపి ముఖంపై రాస్తే మృతకణాలు తొలగి చర్మం నిగనిగలాడుతుంది.
కలబంద ఆకుల రసంలో కాసింత కొబ్బరి నూనె పోసి కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న ప్రాంతాల్లో ప్యాక్‌లా వేస్తే.. చర్మంపై ఉన్న నల్లని మచ్చలు తగ్గుతాయి.
రోజ్‌ వాటర్‌లో కలబంద రసాన్ని కలిపి ముఖానికి మర్దన చేయాలి. పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుంది. కలబంద గుజ్జులో మోతాదుకు సరిపడా పసుపు జోడించి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుంది.

15:18 - April 1, 2016

ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది. పెరుగు సేవిస్తే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మనం తెలుగులో దీనిని "పెరుగు" అంటాం. ఆంగ్లంలో "యోగర్ట్" అనీ హిందీలో "దహీ" అని అంటారు. పాలని పులవబెట్టడం వలన పెరుగవుతోందనేది అందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు. విదేశాల్లో అయితే ఆవు పాలతోనే పెరుగు తయారుచేస్తారు. మన దేశంలో మాత్రం గేదె పాలతోనూ పెరుగు తయారుచెయ్యటం పరిపాటి. రష్యాలో గొర్రెలు,మేకలు పాలనించి కూడా పెరుగు తయారుచేస్తారు. పెరుగు మనిషికి బలాన్నిచ్చే వాటిలో అత్యున్నతమైనది. ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. మనం తీసుకున్న తర్వాత 1 గంటలో పెరుగు 91 శాతం జీర్ణం అయితే అదే సమయంలో పాలు 32 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం వంటిది. ముఖంగా పిల్లలు, వయసు మళ్లిన వారిలో పెరుగు వారి జీర్ణ శక్తిని అనుసరించి పనిచేస్తుంది.

పెరుగులో వాము కలుపుకుని సేవిస్తే మలబద్ధకం తగ్గి ఉపశమనం కలుగుతుంది. వేసవి కాలంలో పెరుగుతో చేసిన మజ్జిగ లేదా పెరుగులో చక్కెర కలుపుకుని లస్సీలాగా సేవిస్తే శరీరంలో వేడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఎండల్లో తిరిగేవారు లస్సీని సేవిస్తుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్య నిపుణులు.

పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ప్రతిరోజు పెరుగును సేవించడం వలన ఉదరసంబంధిత జబ్బులు మటు మాయమౌతాయి. జలుబు, శ్వాసకోశ సంబంధిత జబ్బులతో బాధపడేవారికి పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది.

అల్సర్‌తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. నోట్లో పొక్కులు ఏర్పడి నోరుపుండైతే పెరుగును నోట్లో పోసుకుని పుక్కిలిస్తుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు..

చర్మం నిగనిగలాడుతూ కనిపించేలా కూడా పెరుగు ఉపయోగపడుతుంది.

ఎండ వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుంది.

పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై పూతగా పూస్తే చర్మం పై ఉండే మలినాలు త్వరగా కరిగిపోతాయి. చర్మంపై తేమ శాతం పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది.

ముఖంపై మొటిమలున్నవారికి పెరుగులో కొంచెం శనగ పిండి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి.

పెరుగు తలకి రాస్తే మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. తలస్నానానికి ముందుగా పెరుగుని తలకి మర్థించి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.

చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

పెరుగు ప్రతి రోజు ముఖానికి రాసి ఒక పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మృదువుగా అందంగా కాంతివంతంగా అవుతుంది.

పెరుగులో పోషకపదార్థాలు

నీటిశాతం 89.1%

ప్రోటీన్ 3.1%

క్రొవ్వులు 4%

మినరల్స్ 0.8%

కార్బొహైడ్రేట్స్ 3%

కాల్షియం 149 మి.గ్రా

ఫాస్పరస్ 93 మి.గ్రా

ఇనుము 0.2 మి.గ్రా

విటమిన్ - ఎ 102 ఐ.యు

విటమిన్ - సి 1 మి.గ్రా

12:44 - February 5, 2016

రాత్రిపూట ద్రాక్ష పండ్లు తింటే హాయిగా నిద్రపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ద్రాక్షలో నిద్రకు సహాయపడే మెలటోనిన్‌ అనే హార్మోన్‌ ఉంటుంది. అలాగే ద్రాక్ష పండ్లలో గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు పాలీఫినోల్స్‌, ఫ్లెవనాయిడ్స్‌ అధిక మొత్తంలో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పాలకూరలో అధికంగా ఉండే పోటాషియం, క్యాల్షియం రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి సహకరిస్తాయి. అంతేకాదు, ప్రతిరోజూ పాలకూర తినే వాళ్లకు ఒత్తిడి, తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పి దరిచేరవు. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖంగా నిద్రపోవచ్చు. ఒక కప్పు నీటిలో రెండు పాలకూర ఆకులు వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారేదాకా ఉంచి తర్వాత వడగట్టి చక్కెర కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నిద్రపోవడానికి అరగంట ముందు తాగితే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

12:10 - January 20, 2016

ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు కాస్త బెల్లం తిని వెళ్తే మంచి శ‌కునమ‌ని పెద్ద‌వాళ్లు కూడా చెబుతుంటారు. భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. బెల్లం (Jaggery)ఒక తియ్యటి ఆహార పదార్థం.. అంతే ఔషధాల గని అని కూడా చెప్పవచ్చు. బెల్లం తినాలంటే ఎక్కువ ప్ర‌యాస ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. బెల్లం కోసం ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చుపెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. మార్కెట్లో ఇత‌ర ధ‌ర‌ల‌తో పోలిస్తే బెల్లం రేటు కాస్తంత త‌క్కువే. ఏదో పండ‌గ సంద‌ర్భంలో త‌ప్ప బెల్లం జోలికి వెళ్ల‌డం చాలా త‌క్కువ‌. ఆ బెల్ల‌మే క‌దా అని తీసి పారేయ‌కండి. బెల్లంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా చ‌లికాలంలో బెల్లం తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ట‌. ముఖ్యంగా దీంతో శ‌రీరానికి కావాలసిన వేడి అందుతుంద‌ని చెబుతారు. అంతేకాదు ఎన్నోర‌కాల రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తి అయిన స్త్రీలు బెల్లాన్ని సేవిస్తే ఎంతో మంచిద‌ట‌.ఆయుర్వేదంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. చ‌లికాలంలో ద‌గ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. రోజంతా ఆఫీసుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్ గా గ‌డిపేవాళ్ల‌కు ఇది ఎంతో మంచిద‌ట‌.

చెరకు నుండి...

దీనిని సాధారణంగా చెరకు నుండి తయారు చేస్తారు. సాధారణంగా చెరకు రసము నుంచి కొలాసిస్ ను వెలికితీసి బెల్లము తయారు చేస్తారు. తాటికల్లు, ఈతకల్లు, ఖర్జూరము నుంచి బెల్లం తయారుచేస్తారు . బెల్లం తయారిలో వివిధ రాకలు ఉన్నాయి. చెరకు బెల్లం, ఖర్జూర బెల్లం, తాటి బెల్లం, ఈతబెల్లం, కొబ్బరి బెల్లం ఇలా వివిధ రకాలుగా తయారు చేస్తారు. అయితే ఇళ్ళలో వాడేరకం చెరకు బెల్లం. ఇది భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన పదార్థం. చెరకు బెల్లము గోల్డ్ బ్రౌన్‌ కలర్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది . ఈ బెల్లంను చెరకు రసాన్నిబాగా కాయడం ద్వారా తయారుచేస్తారు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను వుంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి.

బెల్లంలో ఎలాంటి రసాయ‌న ప‌దార్థాల వాడ‌కం ఉండ‌దు. చూశారా బెల్లానికి ఎంత ప్రాధాన్య‌త ఉందో.. ఇక నుంచి ఆ బెల్ల‌మే క‌దా అని లైట్ తీసుకోకండి.. కాస్త అప్పుడ‌ప్పుడు చిటికెడు బెల్లాన్ని నోట్లో వేసుకుందాం...

ఉపయోగాలు..

ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు.

పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే .. గ్లాసు బెల్లం పానకం లో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఉపసయనం కలుగుతుంది .

అజీర్తి సమస్యతో విసిగిపోయిన వారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది . అజీర్తి సమస్యలుండవు .జీవ క్రియ ను వేగవంతం చేస్తుంది .

కాకర ఆకులు , నాలుగు వెల్లుల్లి రెబ్బలు (రెక్కలు) , మూడు మిరియాల గింజలు , చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజు రెండుపుతల వారం రోజులు తీసుకున్నా , లేదా గ్లాసు పాలలో పంచధరకి బదులు బెల్లం వేసి రోజు త్రాగిన ... నెలసరి సమస్యలు ఉండవు.

నేయ్యి తో బెల్లం వేడిచేసి నొప్పి ఉన్నా చోట పట్టు వేస్తె భాధ నివారణ అవుతుంది .

ముక్కు కారడము తో బాధపడుతున్న వారికి ... పెరుగు , బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది .

బెల్లం , నెయ్యి .. సమపాళ్ళలో కలిపి తింటే 5 -6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది .

కడుపులో మంటగా ఉన్నప్పుడు బెల్లం చిట్కాను ప్రయోగించవచ్చని పోషణ నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో పొటాసియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది. భోజనం చేసిన తర్వాత ప్రతిసారీ చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు. ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వల్లే బెల్లాన్ని 'మెడిసినల్‌ సుగర్‌'గా వ్యవహరిస్తారు.

Pages

Don't Miss

Subscribe to RSS - benefits