balka suman

12:24 - September 28, 2018

హైదరాబాద్ : ఆదాయాలకు మించి అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టి.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. రేవంత్ నివాసం..ఆయన బంధువుల నివాసాలపై ఐటీ సోదాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. సుమారు వేయి కోట్ల రూపాయల మేర అక్రమార్జన చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. అడ్డంగా దొరికిపోయినా కూడా రేవంత్‌ను వెనుకొసుకావడం సిగ్గు చేటన్నారు. చోటా షకీల్..విజయ్ మాల్యాకు ఏ మాత్రం తీసిపోని వ్యక్తి అని, వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని...హావాలా మార్గం ద్వారా విదేశాల్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారని ప్రశ్నించారు. బంధువుల..ఇతర స్నేహితుల ద్వారా అక్రమాలు చేశారని ఆరోపించారు. ఇతడిని దేశద్రోహిగా గుర్తించాలని...రేవంత్ రెడ్డిని ఈసీ అనర్హులుగా ప్రకటించాలని, ప్రజాజీవితంలో ఉండేందుకు వీలు లేదని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన రేవంత్ అనర్హుడని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఇతను ఉండడటానికి వీలు లేదని, చంచల్ గూడలోనే ఉండాలన్నారు. 

చంద్రబాబు అండదండలతో..టిడిపి పార్టీ సపోర్టుతో రేవంత్ ఎదగారని, మూడు సంవత్సరాల క్రితం ఓటుకు నోటు కేసులో రేవంత్ అడ్డంగా దొరికాడని గుర్తు చేశారు. వంద కోట్ల రూపాయల మేర రుణాలు తీసుకుని, రుణాలు ఎగ్గొట్టారని, వరంగల్, ఉప్పల్, గోపన్ పల్లి, కోకాపేట, నాగర్ కర్నూలు ఇలాంటి అనేకం కబ్జాలు..అక్రమాలు చేశారని పేర్కొన్నారు. నారాయాణగూడలో కేవలం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్న రేవంత్ కోట్ల రూపాయలు ఎలా కూడబెట్టారని ప్రశ్నించారు. ప్రజల ఆదరణతో మరలా అధికారంలోకి వస్తామని బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు.

08:17 - September 14, 2018

మంచిర్యాల : ముందస్తుకు ముందువరుసలో ఉన్న టీఆర్‌ఎస్‌.. అసమ్మతిలోనూ మొదటి స్థానంలో ఉంది. రాష్ర్టవ్యాప్తంగా ఆ పార్టీలో అసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ఓదెలు అనుచరుడి ఆత్మహత్యాయత్నం ఇందుకు పరాకాష్ట. చెన్నూరులో ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న వివాదానికి కేసీఆర్‌ చెక్‌ పెట్టారు. అసంతృప్త నేతలనూ ఆయన బుజ్జగించే పనిలో పడ్డారు. టీఆర్ఎస్‌ ముందస్తు ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడంతో.. రాష్ర్టవ్యాప్తంగా ఆ పార్టీలో అసమ్మతి భగ్గుమంటోంది. టికెట్‌ ఆశించి భంగపడ్డ టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. కొంతమందైతే బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అక్కడక్కడా నిరసనలకు దిగుతున్నారు. సమస్య అంతటితో అంతమవ్వలేదు...  ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు.. అనుచరుడైతే.. ఏకంగా ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. దీంతో నల్లాల ఓదెలు, బాల్క సుమన్‌ మధ్య వివాదం తలెత్తింది. నేతలు బహిరంగ విమర్శలకు దిగారు. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు ఆందోళనలో పడ్డారు. 

ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించి బంగపడ్డవారంతా నిరసన తెలుపుతుండడంతో గులాబీ బాస్‌ అలర్ట్‌ అయ్యారు. వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. కేసీఆర్‌ ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత తనదేనని.. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలకు చెప్పినట్లు సమాచారం. పార్టీలో అసమ్మతి గురించి పట్టించుకోకుండా... ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీఎం కేసీఆర్‌ అభ్యర్థులకు సూచించినట్లు తెలుస్తోంది. 

కేసీఆర్‌ అన్నంత పనిచేస్తున్నారు. అసంతృప్త నేత మాజీ ఎమ్మెల్యే ఓదెలుతో మాట్లాడి దారికి తెచ్చారు. ప్రగతి భవన్‌లో  కేసీఆర్‌ను కలుసుకున్నాక ఓదెలు కాస్త మెత్తబడ్డారు. మాటతీరులోనూ మార్పు వచ్చింది. కేసీఆర్‌ మాటే తనకు శిరోధార్యమన్న ఓదెలు. బాల్కసుమన్‌ విజయానికి కృషి చేస్తానన్నారు. తొందరపాటు చర్యలు తీసుకోకుండా.. పార్టీ వెంటే నడవాలని కార్యకర్తలను కోరారు ఓదేలు. 

బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్‌..  టికెట్లు కేటాయించిన అభ్యర్థులకు గురువారం ఫోన్‌ చేసి మాట్లాడినట్లు సమాచారం. ముఖ్యంగా ఓటర్ల నమోదుపై సీరియస్‌గా దృష్టి సారించాలని సూచించినట్లు తెలుస్తోంది. బూత్ కమిటీల నియామకాలు, పార్టీ నేతల సమన్వయంతోపాటు.. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ చెప్పినట్లు తలాడించిన ఓదెలుకు కార్యకర్తలనుంచి వ్యతిరేకత ఎదురైంది. ఆయనకు మద్ధతుగా ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్ళిన ఓదెలును అడ్డుకున్నారు.  గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. 

19:12 - September 12, 2018

మంచిర్యాల : తనపై నల్లాల ఓదేలు వర్గం హత్యాయత్నానికి పాల్పడిందని ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన తనపై హత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గ టిక్కెట్ ను కేసీఆర్ తనకు కేటాయించారని ఎవరూ అడ్డుపడినా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ఓదేలు వర్గం ఎన్నికుట్రలు పన్నినా తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని స్పష్టం చేశారు. చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా బాల్క సుమన్ టీఆర్ ఎస్ ఇటీవలే ప్రకటించిన విషయం విధితమే. దీన్నితాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తీవ్రంగా ఖండించారు. తనకు చెన్నూరు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిన్న ఓదేలు స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. దీంతో ఓదేలు వర్గ బాల్క సుమన్ పై ఆగ్రహంతో ఉన్నారు.

ఇవాళ నియోజకవర్గంలోని ఇందారం గ్రామంలో పర్యటించేందుకు వెళ్లిన బాల్క సుమన్‌ను ఓదేలు వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్య కిరోసిన్‌ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనను బాల్క సుమన్‌ తీవ్రంగా ఖండించారు. 

 

12:56 - September 12, 2018

తమ నేతకు ఎందుకు టికెట్ కేటాయించలేదంటూ తెలంగాణ రాష్ట్రంలో పలువురు అనుచరులు ఆందోళనలు..నిరసనలు చేపడుతున్నారు. ఇది కాస్తా తారాస్థాయికి చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం...105 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో టికెట్ ఆశించిన పలువురు ఆశావాహులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పలువురు ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి మార్గాలు వెతుకుతుండగా మరికొందరు టికెట్ ఇవ్వాలంటూ టీఆర్ఎస్ అధిష్టానంపై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు టికెట్ ను ఎంపీ బాల్క సుమన్ కు కేసీఆర్ ఖరారు చేశారు. దీనితో తాజా, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆగ్రహానికి గురయ్యారు. తనకు టికెట్ కేటాయించాలంటూ అభ్యర్థించారు. ఆయన అనుచరులు కూడా ఆందోళనలు..నిరసనలు కొనసాగించారు. బాల్క సుమన్ కు మద్దతిచ్చేది లేదని..తనకు టికెట్ కేటాయించే వరకు ఇంట్లోనే ఉంటానంటూ గృహనిర్భందం చేసుకున్నారు. 

బుధవారం ఎంపీ బాల్క సుమన్ ఇందారంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయం నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్యకు తెలిసింది. అక్కడకు వెళ్లిన అతను ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకున్నాడు. ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. మంటలు ఇతరులకు కూడా అంటుకున్నాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

08:03 - June 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సంఘానికి... తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య పోరు తీవ్రమైంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలను ముప్పు తిప్పలు పెట్టిన గులాబి దళం.. ఇప్పుడు ఉద్యమ సంఘంపై విరుచుకు పడుతోంది. తెలంగాణ జేఏసీ ఎత్తేసిన దుకాణమంటూ టీఆర్ఎస్‌ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ టీ జాక్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శలు చేస్తున్నారు. ఆమధ్య రైతుల ఆత్మహత్యలపై జిల్లాల పర్యటనలు చేసిన కోదండరాం.. ఇటీవల ఇదే అంశంపై హైకోర్టులో స్క్వాష్‌ పిటిషన్‌ వేసి సర్కారు తీరును తప్పుబట్టారు. తాజాగా ప్రభుత్వ రెండేళ్ల పాలన ప్రజాహితంగా లేదని.. చేతకాకపోతే దిగిపొమ్మని వ్యాఖ్యానించడం ప్రభుత్వాన్ని బాగా ఇరుకున పెట్టింది.

టీజాక్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న టీ.సర్కార్...
ఇప్పటి వరకు విపక్ష పార్టీల విమర్శలను లైట్ గా తీసుకున్న గులాబీ దళం... టీజాక్ వ్యాఖ్యలను మాత్రం సీరియస్‌గా తీసుకుంటోంది. తెలంగాణ సాధన కోసం అంతా కలిసి పనిచేసినా..... రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీజాక్ అస్థిత్వం ఎక్కడుందని గులాబి దళం ప్రశ్నిస్తోంది. లక్ష్యం పూర్తి కావడంతోనే అందులో ఉన్న రాజకీయ పార్టీలు ఎవరి దారి వారు చూసుకున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.

కోదండరాంపై విరుచుకు పడుతున్న గులాబీ దళం...
ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యక్తిగత వ్యతిరేకత కారణంగానే విమర్శలు తీవ్రం చేస్తున్నారని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రులు, ఎంపీలు ఎవరి స్థాయిలో వారు కోదండరాంపై విరుచుకు పడుతున్నారు.

ప్రాధాన్యం సంతరించుకున్న కోదండరాం విమర్శలు...
ఉద్యమ సమయం నుంచే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కోదండరామ్‌కు విబేధాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు నేరుగా కేసీఆర్ ప్రభుత్వంపైనే కోదండరాం విమర్శనాస్త్రాలు సంధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండేళ్లుగా జాక్ ను పట్టించుకోని టీఆర్ఎస్.... ఇప్పుడు కోదండరామ్‌పై విమర్శలు చేయడం రాజకీయంగా చర్చనీయంశమైంది.
టీఆరెస్ లీడర్లు చేసిన కామెంట్స్ వీడియోలో చూడండి..

21:14 - June 6, 2016

హైదరాబాద్ : ప్రొఫెసర్‌ కోదండరాం కుబుసం విడిచిన నాగుపాము వంటి వారని పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్‌ అన్నారు. ఈమేరకు సుమన్ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఆయన మండిపడ్డారు.  

 

15:34 - April 1, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన జల దృశ్యాన్ని కాంగ్రెస్, టిడిపి పార్టీలు తప్పుబట్టడాన్ని ఎంపీ బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలు దద్దమ్మ పార్టీలని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని, తెలంగాణ ద్రోహులుగా ముద్ర పడ్డారని విమర్శించారు. అవగాహన రాహిత్యంతోనే మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పై అవాక్కులు చవాక్కులు పేలితే ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. ఆ పార్టీలు ఆత్మ విమర్శ చేసుకోవాలని ఎంపీ బాల్క సుమన్ హితవు పలికారు. 

16:09 - February 11, 2016

హైదరాబాద్ : ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపు ఉన్నందునే అన్ని పార్టీల నేతలు.. తమ పార్టీలోకి వస్తున్నారని ఎంపీ బాల్కసుమన్‌ స్పష్టం చేశారు. ఆయప గురువారం మీడియాతో మాట్లాడుతూ... రేవంత్‌రెడ్డి తొందరపడనక్కర్లేదని.. ఎటూ భవిష్యత్‌లో ఆయన కూడా టీఆర్‌ఎస్‌ గూటికి చేరాల్సిందేనని సుమన్‌ సెటైర్‌ వేశారు.

15:22 - January 13, 2016

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ ను విమర్శించడం కంటే చేసిన సవాల్ ను స్వీకరించాలని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, విపక్ష సభ్యులు సవాళ్లు విసురుకుంటున్నారు. గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ చేజిక్కించుకోకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ చేసిన సవాల్ పై ప్రతిపక్షాలు ప్రతి సవాల్ విసురుతున్నాయి. ఈ అంశంపై ఎంపీ సుమన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ లో మేయర్ పదవిని టీఆర్ఎస్ గెలుచుకోకపోతే మంత్రి కేటీఆర్ చేస్తారని పేర్కొనడం జరిగిందని దమ్ముంటే ఆ సవాల్ ను స్వీకరించాలన్నారు. విపక్ష నేతలు గెలవకపోతే కనీసం పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని ఒక్క మాట చెప్పాలని టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పక్షాలకు ఎంపీ సుమన్ డిమాండ్ చేశారు. పనిలో పని గా దిగ్విజయ్ సింగ్ పై కూడా పలు విమర్శలు గుప్పించారు. ఆయన అడుగు పెట్టిన చోట్ల అపజయం ఎదురౌతోందని దిగ్విజయ్ ను ఉద్ధేశించి సుమన్ వ్యాఖ్యానించారు. దిగ్విజయ్ సింగ్ ను పేరు మార్చుకోవాలని, అపజయసింగ్ పేరు పెట్టుకోవాలని ఎంపీ సుమన్ ఏద్దవా చేశారు. 

14:29 - July 7, 2015

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర ఎంపీ సుమన్ మండిపడ్డారు. సోమవారం పవన్ కళ్యాణ్ పలు అంశాలపై స్పందించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియాలో సుమన్ మాట్లాడారు. ఆయన పవన్ కళ్యాణ్ కాదని..ప్యాకేజీ కళ్యాణ్ అంటూ విమర్శించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదని సూటిగా ప్రశ్నించారు. ఒక్క అంశానికి సంబంధించిన దానిపై స్పష్టత ఇవ్వలేదని, బాబును ప్రశ్నించాల్సింది పోయి ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇంకో అంశం లేవనెత్తారంటూ సుమన్ ఎద్దేవా చేశారు. 

Don't Miss

Subscribe to RSS - balka suman